
పంజాగుట్టలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘జోయాలుక్కాస్’ జూలై 30న పంజాగుట్టలో హైదరాబాద్‌లోనే అతిపెద్ద జువెలరీ షోరూమ్‌ను ప్రారంభించనున్నది. ఇందులో వినూత్న డిజైన్లతో కూడిన పలు బంగారు, వజ్రాభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. షోరూమ్ ప్రారంభోత్సవానికి సంస్థ చైర్మన్, ఎండీ జోయ్ ఆలుక్కాస్ సహా పలువురు తారలు విచ్చేయనున్నారు.