సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్‌రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం.
కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్‌ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.
ఇటీవలే ఈ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కీలకనేత హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్‌షీట్: హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment