గిఫ్ట్ పట్టేసేదాన్ని.. | i could have got gifts if i have boyfriends, says diksha panth | Sakshi
Sakshi News home page

గిఫ్ట్ పట్టేసేదాన్ని..

Published Mon, Feb 16 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

i could have got gifts if i have boyfriends, says diksha panth

‘బాయ్‌ఫ్రెండ్ లేడు. ఉంటే వాలెంటైన్స్‌డేకి మంచి గిఫ్ట్ పట్టేసేదాన్ని’ అంటూ కొంటెగా కామెంట్ చేసింది గ్లామరస్ యాక్ట్రెస్ దీక్షాపంత్. పంజగుట్టలోని జోయాలుక్కాస్ షోరూంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శనను ఆమె ఆదివారం ప్రారంభించింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రదర్శనలో కొలువుదీరిన దుబాయ్, టర్కీ, సింగపూర్,మలేషియా, యూరప్ దేశాలకు చెందిన జ్యువెలరీ తనకెంతో నచ్చాయంది. తనకే బాయ్‌ఫ్రెండ్ ఉంటే వాలెంటైన్స్‌డే గ్రీటింగ్స్‌తో పాటు గిఫ్ట్ కూడా అందుకునేదాన్నేమో అంది. తనకు బాయ్‌ఫ్రెండ్  కాబోయే వాడికి ఈ అర్హతలు ఉండాలంటూ ప్రత్యేకంగా ఏమీ అనుకోవడం లేదని, తనకు సరైన సమయంలో తగిన జోడీ వస్తాడనే నమ్మకం ఉందంది.

తెలుగులో కవ్వింత అనే సినిమాలో చేస్తున్నానన్న దీక్ష.. గోపాల గోపాల సినిమా తనకు మంచి పేరు తెచ్చిందని చెప్పింది. తాను నటిస్తున్న బాలీవుడ్ మూవీ నెల రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపింది. ఏ భాషలో అవకాశం వచ్చినా... టాలీవుడ్‌కే తన తొలి ప్రిఫరెన్స్ అని చెప్పింది.
 
- సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement