Diksapant
-
కవ్వించే ప్రేమ
‘‘ఫేక్ కరెన్సీ నేపథ్యంలో ఓ అందమైన ఊరిలో జరిగే ప్రేమకథే ఈ సినిమా. ఫొటోగ్రఫీ, సంగీతం ఇందులో హైలైట్’’ అన్నారు దర్శకుడు త్రిపురనేని విజయ్ చౌదరి. అంజనీ మూవీస్‌పై విజయ్ దాట్ల, దీక్షాపంత్ జంటగా పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన ‘కవ్వింత’ ఈ నెల 8న విడుదల కానుంది. ‘‘ప్రాంతాల వారీగా ఈ చిత్రాన్ని సేల్ చేశారు. లాభనష్టాలను అందరూ సమానంగా పంచుకోవాలనే నూతన పద్ధతిని అనుసరిస్తుండటం మంచిదే’’ అని మల్టీ డెమైన్షన్ వాసు అన్నారు. హీరో విజయ్, త్రిపురనేని చిట్టి, ధన్‌రాజ్, అంబటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, శ్యాం తుమ్మలపల్లి, సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరిప్రకాష్ నంది, సహ నిర్మాత: తెంటు లక్ష్ము నాయుడు. -
గిఫ్ట్ పట్టేసేదాన్ని..
‘బాయ్‌ఫ్రెండ్ లేడు. ఉంటే వాలెంటైన్స్‌డేకి మంచి గిఫ్ట్ పట్టేసేదాన్ని’ అంటూ కొంటెగా కామెంట్ చేసింది గ్లామరస్ యాక్ట్రెస్ దీక్షాపంత్. పంజగుట్టలోని జోయాలుక్కాస్ షోరూంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శనను ఆమె ఆదివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రదర్శనలో కొలువుదీరిన దుబాయ్, టర్కీ, సింగపూర్,మలేషియా, యూరప్ దేశాలకు చెందిన జ్యువెలరీ తనకెంతో నచ్చాయంది. తనకే బాయ్‌ఫ్రెండ్ ఉంటే వాలెంటైన్స్‌డే గ్రీటింగ్స్‌తో పాటు గిఫ్ట్ కూడా అందుకునేదాన్నేమో అంది. తనకు బాయ్‌ఫ్రెండ్ కాబోయే వాడికి ఈ అర్హతలు ఉండాలంటూ ప్రత్యేకంగా ఏమీ అనుకోవడం లేదని, తనకు సరైన సమయంలో తగిన జోడీ వస్తాడనే నమ్మకం ఉందంది. తెలుగులో కవ్వింత అనే సినిమాలో చేస్తున్నానన్న దీక్ష.. గోపాల గోపాల సినిమా తనకు మంచి పేరు తెచ్చిందని చెప్పింది. తాను నటిస్తున్న బాలీవుడ్ మూవీ నెల రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపింది. ఏ భాషలో అవకాశం వచ్చినా... టాలీవుడ్‌కే తన తొలి ప్రిఫరెన్స్ అని చెప్పింది. - సిటీప్లస్