జోయాలుక్కాస్ హ్యాపీ జువెల్లరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ‘ఎవ్రీ డే హ్యాపీ జువెల్లరీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ పంజాగుట్ట షోరూంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సినీనటుడు, జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హ్యాపీ జువెల్లరీలో భాగంగా అందుబాటు ధరలో, నూతన డిజైన్లలో తయారు చేసిన ఆభరణాలను కంపెనీ పరిచయం చేసింది.
వజ్రాలు తొడిగిన ఉంగరాలు రూ.5 వేల నుంచి, పెండెంట్లు రూ.10 వేల నుంచి లభిస్తాయి. సామాన్యులకూ విభిన్న బంగారు, వజ్రాభరణాలను అందించడమే కార్యక్రమ ముఖ్యోద్దేశమని జోయాలుక్కాస్ ఆర్‌ఎం రెజిష్ ఓఎస్ తెలిపారు. పుత్తడి ధర తగ్గడంతో అక్టోబర్ నుంచి ఆభరణాల అమ్మకాలు పుంజుకున్నాయని వివరించారు.
మార్చికల్లా రెండు షోరూంలు..
మార్కెట్ వృద్ధి రేటు బంగారు ఆభరణాలు 15-20 శాతముంటే, వజ్రాభరణాలు 25 శాతంపైగా ఉందని రెజిష్ చెప్పారు. జోయాలుక్కాస్ మొత్తం అమ్మకాల్లో వజ్రాభరణాల వాటా ప్రస్తుతం 30 శాతముందని అన్నారు. నూతన డిజైన్లను ఆస్వాదించడంలో హైదరాబాదీయులు ఎప్పుడూ ముందుంటారని వివరించారు. మార్చికల్లా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లితోపాటు కరీంనగర్‌లో జోయాలుక్కాస్ షోరూం ఏర్పాటవుతోందని వెల్లడించారు. సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 14 షోరూంలు ఉన్నాయి. 2015-16లో భారత్‌లో 10, యూఎస్‌ఏ, యూరప్, శ్రీలంకలో 20 షోరూంలను తెరవాలని సంస్థ భావిస్తోంది.