
జాయ్ అలూక్కాస్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ సీఎండీ జాయ్ అలూక్కాస్ క్షేమంగా ఉన్నారని ఆ గ్రూప్ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రచారమవుతోన్న తప్పుడు వార్తలను ఖండించింది. దుబాయ్‌లో మరణించిన ఒక వ్యాపారి పేరు సంస్థ సీఎండీ పేరుకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో పొరపాటున అసత్య కథనాలను పలు వార్తా సంస్థలు ప్రచారం చేశాయని వెల్లడించింది. మరణించిన వ్యాపారి పేరు జాయ్ అరక్కల్ అని, ఆయనకు జాయ్ అలూక్కాస్‌కు సంబంధం లేదని స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment