జోయాలుక్కాస్ 95వ షోరూం తిరుపతిలో..
తిరుపతి: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ తాజాగా తిరుపతిలో మరో జువెలరీ షోరూంను ఏర్పాటు చేసింది. సినీ నటుడు అల్లు అర్జున్ శుక్రవారం దీన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన, నాణ్యమైన బంగారు అభరణాలను అందించే జోయాలుక్కాస్ షోరూంను ప్రజలందరూ ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
మరోవైపు, సంస్థ అధినేత జోయాలుక్కాస్ మాట్లాడుతూ సింగపూర్, లండన్, యుఏఈ, మలేషియా, సౌదీ తదితర దేశాల్లో తమ షోరూంలు ఉన్నాయని వివరించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 95వ షోరూం ప్రారంభించడం సంతోషకరమన్నారు.