
బన్నీకి ఊపిరాడలేదు
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో స్టైలిష్ హీరో అల్లు అర్జున్ శుక్రవారం హల్చల్ చేశారు. ప్రముఖ జ్యూవెల్లరీ షాపు జాయ్ అలుకాస్ శాఖను అర్జున్ ప్రారంభించారు. అర్జున్ను చూసేందుకు అధిక సంఖ్యలో ఆయన అభిమానులు షాపు వద్దకు తరలివచ్చారు. ఆ క్రమంలో అల్లు అర్జున్తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దాంతో హీరో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
దాంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి అభిమానుల మధ్య ఉన్న అల్లు అర్జున్ ను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర తోపులాట జరిగింది. ఓ దశలో మహిళ కానిస్టేబులు పద్మ కిందపడిపోయారు. దాంతో ఆమెకు గాయాలయ్యాయి. పోలీసులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులు అల్లు అభిమానులపై లాఠీచార్జ్ చేశారు.