jewellery show room
-
విజయవాడ : నగల దుకాణంలో బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ సందడి (ఫొటోలు)
-
ఐ లవ్ హైదరాబాద్
కాచిగూడ:పీఎంజె జ్యూవెల్స్ ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్‌ను నటి తాప్సీ పన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. గురువారం హిమాయత్‌నగర్‌లోని పీఎంజె జ్యూవెల్స్లో సందడి చేసింది. ఢిల్లీ తరువాత ఎక్కువగా హైదరాబాద్‌నే ఇష్టపడతాను. వజ్రాభరణాలు చూడముచ్చడగా ఉన్నాయని హొయలుపోయింది. తమ వినియోగదారులకు ఆసాధారణ వజ్రాను భూతులను పీఎంజె జ్యూవెల్స్ అందిస్తుందని పీఎంజే జ్యూవెల్స్ ఛైర్మన్ కుషాల్ కుమార్ తెలిపారు. ప్రెసిడెంట్ సచిన్ జైన్ పాల్గొన్నారు. -
అల్లు అర్జున్ వచ్చాడంటే..
-
బన్నీకి ఊపిరాడలేదు
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో స్టైలిష్ హీరో అల్లు అర్జున్ శుక్రవారం హల్చల్ చేశారు. ప్రముఖ జ్యూవెల్లరీ షాపు జాయ్ అలుకాస్ శాఖను అర్జున్ ప్రారంభించారు. అర్జున్ను చూసేందుకు అధిక సంఖ్యలో ఆయన అభిమానులు షాపు వద్దకు తరలివచ్చారు. ఆ క్రమంలో అల్లు అర్జున్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దాంతో హీరో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి అభిమానుల మధ్య ఉన్న అల్లు అర్జున్ ను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర తోపులాట జరిగింది. ఓ దశలో మహిళ కానిస్టేబులు పద్మ కిందపడిపోయారు. దాంతో ఆమెకు గాయాలయ్యాయి. పోలీసులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులు అల్లు అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. -
ఆటోడ్రైవర్ నిజాయితీ
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : పోగొట్టుకున్న రూ.50 వేలను సొంతదారునికి అప్పగించి ఓ ఆటోడ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నారు. చెన్నై ఎంసీ రోడ్డులో నగల దుకాణం ఉంది. ఈ దుకాణం ముందు నూతన సంవత్సరం రోజున ఒక సంచి పడి ఉంది. ఆ మార్గంగా వచ్చిన అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ రమేష్ సంచిని తీసి నగల దుకాణం మేనేజర్‌కు అప్పగించాడు. అతను దానిని విప్పి చూడగా అందులో రూ.50 వేల నగదు ఉంది. వెంటనే దీని గురించి చాకలిపేట పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఏళుకినరు ప్రాంతానికి చెందిన కాజామొయిద్దీన్ (40) గురువారం నగల దుకాణం ముందు ఏదో వెతుకుతున్నట్టు కనబడ్డాడు. ఇది చూసిన స్థానికులు కాజామొయిద్దీన్ కలిసి నగల దుకాణం మేనేజర్ వద్ద విచారణ చేశారు. మేనేజర్ అక్కడికి వచ్చి కాజామొయిద్దీన్ను విచారణ చేయగా సిమెంటు ఏజెంటుగా పని చేస్తున్నాడని కలెక్షన్ చేసిన రూ.50 వేలు తీసుకుని వెళుతుండగా కింద పడి పోయినట్టు తెలిపారు. దీంతో నగల దుకాణం ముందు ఏర్పాటుచేసిన సీసీ కెమెరా తనిఖీ చేయగా నగదు పోగొట్టుకున్న వ్యక్తి కాజా మొయిద్దీన్ అని తెలిసింది. అతనికి రూ.50 వేలను అప్పగించారు. ఆటో డ్రైవర్‌ను అందరూ అభినందించారు.