
జోయాలుక్కాస్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
త్రిసూర్: ప్రముఖ జువెలరీ సంస్థ ‘జోయాలుక్కాస్’ తాజాగా బంగారు ఆభరణాల కొనుగోలుపై 3 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. జూలై 12 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జోయాలుక్కాస్ షోరూమ్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
‘యూఏఈలో ఒక్క షోరూమ్‌తో ప్రారంభమై ఇప్పుడు 11 దేశాల్లో 130 షోరూమ్‌లను ఏర్పాటు చేశాం. ఈ వృద్ధికి కారణమైన కస్టమర్లకు కూడా ఏదైనా తిరిగివ్వాలనుకున్నాం. అందుకే సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ప్రకటించాం’ అని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు.