IPO plans
-
వావ్.. ఓయో...ఐపీవోకు ముందు లాభాలే లాభాలు!
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి అర్ధభాగం ఫలితాలు ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉన్న కంపెనీ ఏప్రిల్-సెప్టెంబర్‌లో రూ. 63 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 280 కోట్ల ఇబిటా నష్టం ప్రకటించింది. (హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?) మొత్తం ఆదాయం 24శాతం ఎగసి రూ. 2,905 కోట్లను తాకింది. ఫలితాలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. తాజా సమీక్షా కాలంలో సర్దుబాటు తదుపరి రూ. 63 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఇవీ చదవండి: ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? -
సిగ్నేచర్ గ్లోబల్ రెడీ: వెయ్యికోట్ల ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ సర్వప్రియా సెక్యూరిటీస్, ఇన్వెస్టర్ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడిగా రూ. 125 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉంది. మధ్యస్థాయి, చౌక గృహ విభాగంపై దృష్టిపెట్టిన కంపెనీ.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, భూముల కొనుగోలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన సిగ్నేచర్ గ్లోబల్ ఐపీవో చేపట్టేందుకు జులైలోనే సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ ప్రధానంగా హర్యానాలో కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించింది. థర్మజ్ క్రాప్‌నకు ఓకే: ఆగ్రోకెమికల్ కంపెనీ థర్మజ్ క్రాప్ గార్డ్ పబ్లిక్ ఇష్యూ తొలి రోజు సోమవారానికల్లా 1.8 రెట్లు అధికంగా స్పందన లభించింది. రూ. 216–237 ధరలో చేపట్టిన ఇ ష్యూ ద్వారా కంపెనీ రూ. 251 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా 80, 12,990 షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 1.44 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.6 రె ట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 35 శాతం స్పందన నమోదైంది. కంపెనీ విభిన్న ఆగ్రో కెమికల్ ఫార్ములేషన్ల తయారీ, పంపిణీలను నిర్వహిస్తోంది. -
దేశంలో తగ్గని ఐపీవో జోరు.. ఐపీవోకి సిద్దంగా దిగ్గజ జ్యుయలరీ కంపెనీ!
న్యూఢిల్లీ: రిటైల్ జ్యుయలరీ సంస్థ జోయాలుక్కాస్ ఇండియా తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 2,300 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయనున్నామని, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండబోదని సంస్థ తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.1,400 కోట్ల మొత్తాన్ని.. ఇతరత్రా రుణాల తిరిగి చెల్లింపునకు, రూ.464 కోట్లు కొత్తగా ఎనిమిది షోరూమ్‌ల ఏర్పాటు కోసం, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు వివరించింది. జోయాలుక్కాస్ సంస్థ బంగారం, ప్లాటినం, వజ్రాభరణాలు మొదలైన వాటిని విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 8,066 కోట్ల ఆదాయంపై రూ. 472 కోట్ల మేర లాభం నమోదు చేసింది. 90 శాతం ఆదాయం దక్షిణాది ప్రాంతాల నుంచి లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కొత్తగా 8 షోరూమ్‌లు ప్రారంభించాలని యోచిస్తోంది. (చదవండి: పెరిగిన కేంద్ర ప్రభుత్వ రుణ భారం.. అప్పు ఎన్ని లక్షల కోట్లు తెలుసా?) -
సరి కొత్త రూటులో అన్అకాడమీ
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ రానున్న రెండేళ్లలోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. కంపెనీకి కీలకమైన టెస్ట్ పేపర్ ప్రిపరేషన్ విభాగాన్ని రానున్న 12 నెలల్లోగా లాభాల్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు అన్అకాడమీ గ్రూప్ సహవ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజాల్ వెల్లడించారు. ప్రయివేట్ రంగ ఉద్యోగాలకు టెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా వినియోగించే రీలెవెల్ డివిజన్‌ను గ్లోబల్ మార్కెట్లకు విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ తొలి ప్రయోగాత్మక కేంద్రం అన్అకాడమీ స్టోర్ ప్రారంభం సందర్భంగా టెస్ట్ పేపర్ విభాగాన్ని లాభాల్లోకి మళ్లించే చర్యలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ బాటలో రెండేళ్లలో ఐపీవోకు రానున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల స్పందన ఆధారంగా మరిన్ని అన్అకాడమీ స్టోర్లను ప్రధానంగా కోటా, జైపూర్, లక్నోలలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: ఎల్ఐసీ ఐపీవోపై ప్రభుత్వం దృష్టి -
రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తమ ఆన్లైన్ పేమెంట్స్ వ్యాపారాన్ని కొత్త అనుబంధ సంస్థకు బదలాయించాలని భావిస్తోంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు దీన్ని బదిలీ చేయడానికి షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకునేందుకు సెప్టెంబర్ 23న అసాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్హోల్డర్లకు ఈజీఎం నోటీసు పంపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం తెలిపింది. కొత్త సంస్థ బుక్ వేల్యు సుమారు రూ. 275–350 కోట్లుగా ఉంటుందని, ఈ నిధులను అయిదేళ్ల పాటు వార్షిక చెల్లింపుల కింద మాతృసంస్థ వన్9 కమ్యూనికేషన్స్‌కు చెల్లించనున్నట్లు వివరించింది. అక్టోబర్‌లో రూ. 16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు పేటీఎం కసరత్తు చేస్తోంది. -
పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా, ఐపీవోలు ఖుషీ
ముంబై: కొద్ది నెలలుగా దూకుడు చూపుతున్న ప్రైమరీ మార్కెట్‌కు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు దన్నునిస్తున్నారు. దీంతో పలు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీవోలు చేపట్టేం దుకు సెబీ వద్ద క్యూ కడుతున్నాయి. మరోపక్క లిస్టింగ్‌లోనూ భారీ లాభాలను సాధిస్తుండటంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తొలిసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే రిటైల్ ఇన్వెస్టర్లు లక్షల సంఖ్యలో జత కలుస్తున్నారు. ఇది ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో రిటైలర్ల వాటా సరికొత్త గరిష్టాన్ని తాకేందుకు దోహదం చేసింది. జూన్ చివరికల్లా మార్కెట్ల చరిత్రలోనే తొలిసారి రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతానికి ఎగసింది. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 16.18 లక్షల కోట్లు! 40 కొత్త లిస్టింగ్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను సాధించాయి. తద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో పలు ఇష్యూలకు 100 రెట్లు, ఆపై సబ్స్క్రిప్షన్ లభించడం విశేషం. మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇకపైనా ప్రైమరీ మార్కెట్ మరింత జోరు చూపనుంది. వెరసి మరో రూ. 75,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందువల్లనే ఇటీవల ఒక బులెటిన్‌లో ఆర్బీఐ.. 2021ను ఐపీవో నామసంవత్సరంగా పేర్కొన్నట్లు తెలియజేశారు. చదవండి : దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్ మార్చిలో మహాజోరు ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం 2020 మార్చిలో 3 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచారు. ఈ బాటలో 2021 జూన్ చివరికల్లా వీటి సంఖ్య 8 కోట్లకు చేరింది. గతేడాది మార్చిలో 35 శాతం పతనమైన మార్కెట్ తదుపరి బౌన్స్‌బ్యాక్‌ను సాధించింది. ఈ జనవరిలో 50,000 పాయింట్ల మైలురాయికి చేరిన సెన్సెక్స్ సరికొత్త చరిత్రను లిఖిస్తూ తాజాగా ఇంట్రాడేలో 56,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. రిటైల్ స్పీడ్ ఇటీవలే లిస్టయిన దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోకు రిటైలర్ల నుంచి 40 రెట్లు, క్రిస్నా డయాగ్నోస్టిక్స్‌కు 42 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఈ బాటలో చిన్న ఇష్యూ అయిన తత్వ చింతన్‌కు మరింత అధికంగా 59 రెట్లు ఎక్కువగా బిడ్స్ లభించాయి. అయితే క్లీన్ సైన్స్ టెక్నాలజీకి 9 రెట్లు, భారీ ఇష్యూ జొమాటోకు 7.5 రెట్లు అధికంగా మాత్రమే రిటైలర్లు దరఖాస్తు చేయడం గమనార్హం! ప్రీమియంతో.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి డైరెక్టుగా ప్రవేశిస్తున్నట్లు ట్రస్ట్‌ప్లస్ వెల్త్ సీఈవో సమీర్ కౌల్ తెలియజేశారు. ఇందువల్లనే ఇటీవల పలు ఐపీవోలు భారీగా సక్సెస్ అవుతున్నట్లు వివరించారు. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఇష్యూకి 3.9 మిలియన్ దరఖాస్తులు లభించాయి. దీంతో గతంలో 4.2 మిలియన్లతో రికార్డు నెలకొల్పిన రిలయన్స్ పవర్ తదుపరి నిలిచింది. అయితే ఆర్‌పవర్‌కు రిటైల్ విభాగంలో 83 రెట్లు స్పందన లభించగా.. గ్లెన్‌మార్క్ 15 రెట్లు మాత్రమే సాధించింది. భారీ లిక్విడిటీ పరిస్థితులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఈక్విటీ బ్రోకింగ్ హెడ్ అరుణ్ జైన్ తెలియజేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం కారణంగా పలు కంపెనీలు భారీ లాభాలతో లిస్టవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా తత్వ చింతన్, జొమా టో, జీఆర్ ఇన్ఫ్రా 97–78 శాతం మధ్య ప్రీమియంతో లిస్టయిన విషయాన్ని ప్రస్తావించారు. -
ఐపీవోకి కల్యాణ్ జ్యుయలర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ తాజాగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 1,175 కోట్లు సమీకరించనుంది. షేరు ధరల శ్రేణిని రూ. 86-87గా నిర్ణయించారు. లాట్ సైజు 172 షేర్లుగా ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మార్చి 16న ప్రారంభమయ్యే ఇష్యూ 18న ముగుస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు టీఎస్ కల్యాణరామన్ వివరించారు. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ మార్చి 15నే ప్రారంభమవుతుంది. ఐపీవోలో భాగంగా కొత్తగా రూ.800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు రూ. 375 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటరు టీఎస్ కల్యాణరామన్ రూ. 125 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన వార్బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ హైడెల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నాయి. ఈ ఏడాది మార్చి 9 నాటికి సంస్థలో ప్రమోటరు, ప్రమోటరు గ్రూప్‌నకు 67.99 శాతం వాటాలున్నాయి. నిర్వహణ మూలధన అవసరాలకు... ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్, కంపెనీకి సంబంధించిన ఇతరత్రా అవసరాల కోసం వినియోగించనున్నట్లు కల్యాణరామన్ పేర్కొన్నారు. ఇష్యూలో సగభాగాన్ని అర్హత పొందిన సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం భాగాన్ని సంస్థాగతయేతర బిడ్డర్లకు కేటాయించారు. దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే షేర్లను తమ ఉద్యోగులకు కల్యాణ్ జ్యుయలర్స్ కేటాయించింది. గతేడాది ఆగస్టులోనే ఐపీవోకి సంబంధించిన పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కంపెనీ దాఖలు చేయగా, అక్టోబర్‌లో అనుమతులు లభించాయి. యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థలు ఈ ఐపీవోకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 1993లో ప్రారంభమైన కల్యాణ్ జ్యుయలర్స్‌కి.. 2020 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 107 షోరూమ్‌లు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో 30 స్టోర్స్ ఉన్నాయి. -
మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ- ఐపీవోకు రెడీ
రియల్టీ సంస్థ కే రహేజా గ్రూప్‌నకు చెందిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ముంబై సంస్థ రహేజా గ్రూప్ ప్రమోట్ చేసిన మైండ్‌స్పేస్ బిజినెస్‌లో పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ సైతం ఇన్వెస్ట్ చేసింది. ఈ నెలాఖరుకల్లా మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కే రహేజా గ్రూప్ ఆఫర్ డాక్యుమెంట్‌ను దాఖలు చేసింది. చివరి వారంలో తాజాగా అందిన వివరాల ప్రకారం మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 4,500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కే రహేజా గ్రూప్‌తోపాటు బ్లాక్‌స్టోన్ రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్స్‌ను విక్రయించనున్నాయి. అంతేకాకుండా రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను సైతం అదనంగా జారీ చేయనున్నాయి. పలు సంస్థలు మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్‌లో క్యాపిటల్ ఇన్కమ్ బిల్డర్, అమెరికన్ ఫండ్స్ ఇన్సూరెన్స్ సిరీస్, జీఐసీ ప్రయివేట్ లిమిటెడ్ తదితర పలు సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆఫర్ డాక్యుమెంట్లో కంపెనీ పేర్కొంది. యూనిట్‌కు రూ. 275 ధరలో 4.09 కోట్ల యూనిట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూలో ఇది 25 శాతం వాటాకు సమానంకాగా.. తద్వారా రూ. 1125 కోట్లను సమకూర్చుకోనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. రెండో కంపెనీ ఐపీవో ద్వారా మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన రెండో ఆర్ఈఐటీగా నిలవనుంది. గతంలో పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్‌చేసిన ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఆర్ఈఐటీ రూ. 4,750 కోట్లను సమీకరించడం ద్వారా 2019 ఏప్రిల్‌లో లిస్టయ్యింది. కాగా.. వివిధ సంస్థల ద్వారా మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీలో ప్రస్తుతం బ్లాక్‌స్టోన్ 15 శాతం వాటాను కలిగి ఉంది. ముంబై, పుణే, హైదరాబాద్, చెన్నైలలో 29.5 మిలియన్ చదరపు అడుగుల లీజబుల్ ఏరియాను మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ కలిగి ఉన్నట్లు కే రహేజా కార్ప్ పేర్కొంది. వీటి విలువ రూ. 23,675 కోట్లుగా అంచనా. హైదరాబాద్‌లో మైండ్‌స్పేస్ మాధాపూర్, మైండ్‌స్పేస్ పోచారం ఆస్తులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. డివిడెండ్ల ఆదాయం ఆర్ఈఐటీలు సాధారణంగా నికర లాభాల నుంచి వాటాదారులకు అధిక మొత్తంలో డివిడెండ్లను పంచుతుంటాయి. అయితే గత బడ్జెట్లో కంపెనీలపై విధించే డివిడెండ్ పంపిణీ పన్ను(డీడీటీ) స్థానే వ్యక్తిగత(డివిడెండ్ అందుకునే వారిపై) పన్నులను ప్రతిపాదించిన విషయం విదితమే. కాగా.. కోవిడ్-19 కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితులతో పదేళ్ల కాలావధి గల జీసెక్యూరిటీల రేటు కనిష్టానికి చేరినట్లు రియల్టీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మైండ్‌స్పేస్ ఐపీవోకు రావడం ద్వారా పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు పలు అవకాశాలు లభించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కంపెనీ ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల కంపెనీల నుంచి అధికంగా ఆదాయం పొందుతుండటం సానుకూల అంశమని తెలియజేశారు. -
2020 నాటికి జియో మరో సంచలనం
సాక్షి, ముంబై : దేశీయ టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్ జియో ఐపీవోకి రానుందన్న ఊహాగానాలు మార్కెట్ వర్గాల్లో మరోసారి వ్యాపించాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి రడీ అవుతోంది. వచ్చే ఏడాదికల్లా ఐపీవోకు రావాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దఫాలుగా వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం 2020 ఏడాది అర్థభాగం నాటికి జియోను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికోసం బ్యాంక్‌లు, కన్సల్టెంట్లతో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పలు సమావేశాలు నిర్వహించారని పేర్కొంది. దీంతో ఐపీవో ప్రక్రియ మరింత వేగం పుంజుకుందని తెలిపింది. ప్రస్తుత 4జి నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, 5జి స్పెక్ట్రమ్ కొనుగోలు అలాగే తన మౌలిక సదుపాయాలను తదుపరి తరం ఇంటర్నెట్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయడం కూడా పెద్ద సవాల్ అని వ్యాఖ్యానించింది. వినియోగదారులపరంగా, సేవలపరంగా టాప్ బ్రాండ్‌గా నిలిచిన రిలయన్స్ జియో మార్చి త్రైమాసికంలో లాభాలను నివేదించిన ఏకైక టెల్కో. 2019 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో 840 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని నమోదు చేసింది. నికర లాభం 64.7 శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 510 కోట్ల రూపాయలు నమోదయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ .2,964 కోట్లు అని రిలయన్స్ జియో తెలిపింది. గత సంవత్సరం పోలిస్తే ఆదాయం 65శాతం పెరిగింది. కాగా జియో ఐపీవో వార్తలు గతంలో కూడా మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేశాయి. అయతే ఈ వార్తలను జియో కొట్టిపారేసింది. తాజా అంచనాలపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి వుంది. -
జియో ఐపీవోపై రిలయన్స్ స్పందన
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్జియో ఐపీవోకు రానుందన్న వార్తలను రిలయన్స్ కొట్టిపారేసింది. త్వరలోనే జియో ఐపీవోకు సిద్ధమవుతోందన్నవార్తలపై స్పందించిన రిలయన్స్ ఇవి ఊహాజనితమని, ఇదంతా మీడియా సృష్టిఅని తేల్చి పారేసింది. టెలికాం రంగంలోకి ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్ జియో ఐపీవోకి రానుందన్న ఊహాగానాలు మార్కెట్ వర్గాల్లో బాగా వ్యాపించాయి. రిలయన్స అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో భారీ ప్రణాళికలతో ఐపీవోకి రానుందని అంచనా భారీగా నెలకొంది. దీంతో సమీప భవిష్యత్తులో అలాంటి ప్రణాళికలు ఏవీ లేవని క్లారిటీ ఇచ్చింది. అలాగే రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్ విస్తరణపై దృష్టిపెట్టినట్లు కంపెనీ సీనియర్ అధికారులు తెలిపారు. కాగా రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు సన్నాహాలు మొదలుపెట్టిందనీ, దీనిపై అంతర్గతంగా దీనిపై చర్చలు కూడా జరుపుతున్నట్లు ‘బ్లూంబర్గ్’ వార్త సంస్థ నివేదించింది. వచ్చే ఏడాది ఆఖరికల్లా లేదా 2019 తొలినాళ్లలో జియోను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించిందిన సంగతి తెలిసిందే. -
లాభదాయక పీఎస్‌యూల్లో వాటా విక్రయంపై దృష్టి
ఐపీఓ ప్రణాళికలు ఇవ్వాల్సిందిగా కంపెనీలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ: లాభాల్లో ఉన్న అన్‌లిస్టెడ్ ప్రభుత్వ రంగ కంపెనీలు(పీఎస్‌యూ), వాటి అనుబంధ సంస్థల్లో వాటా విక్రయాలపై కేంద్రం దృష్టిసారించింది. వార్షిక పనితీరు నివేదికలతో పాటు పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) ప్రణాళికలను కూడా సమర్పించాల్సిందిగా ఆయా కంపెనీలకు సూచించింది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ(డీపీఈ)కు ఇటీవలే ఆర్థిక శాఖ ఈ మేరకు సమాచారం పంపినట్లు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దాదాపు 160 లాభదాయక కేంద్ర పీఎస్‌యూల్లో కేవలం 43 మాత్రమే ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. లాభాల్లో ఉండి లిస్టింగ్‌కాని జాబితాలో వైజాగ్ స్టీల్(ఆర్ఐఎన్ఎల్), ఓఎన్జీసీ విదేశ్, కోల్ ఇండియా అనుబంధ సంస్థలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రధానంగా ఉన్నాయి. దీంతో పీఎస్‌యూలతో వార్షిక పనితీరుపై ఎంఓయూల్లో లిస్టింగ్ ప్రణాళికలను ఇకపై తప్పనిసరి చేయాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం డీపీఈకి స్పష్టం చేసింది. గడిచిన ఐదేళ్లుగా కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతూ వస్తోంది. ఈ ఏడాది(2015-16) పీఎస్‌యూల్లో వాటా అమ్మకాల ద్వారా రూ.69,500 కోట్లను సమీకరించాలనేది కేంద్రం లక్ష్యం.