న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ సర్వప్రియా సెక్యూరిటీస్, ఇన్వెస్టర్ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడిగా రూ. 125 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి.
తద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉంది. మధ్యస్థాయి, చౌక గృహ విభాగంపై దృష్టిపెట్టిన కంపెనీ.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, భూముల కొనుగోలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన సిగ్నేచర్ గ్లోబల్ ఐపీవో చేపట్టేందుకు జులైలోనే సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ ప్రధానంగా హర్యానాలో కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించింది.
థర్మజ్ క్రాప్‌నకు ఓకే: ఆగ్రోకెమికల్ కంపెనీ థర్మజ్ క్రాప్ గార్డ్ పబ్లిక్ ఇష్యూ తొలి రోజు సోమవారానికల్లా 1.8 రెట్లు అధికంగా స్పందన లభించింది. రూ. 216–237 ధరలో చేపట్టిన ఇ ష్యూ ద్వారా కంపెనీ రూ. 251 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా 80, 12,990 షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 1.44 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.6 రె ట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 35 శాతం స్పందన నమోదైంది. కంపెనీ విభిన్న ఆగ్రో కెమికల్ ఫార్ములేషన్ల తయారీ, పంపిణీలను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment