న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తమ ఆన్‌లైన్ పేమెంట్స్ వ్యాపారాన్ని కొత్త అనుబంధ సంస్థకు బదలాయించాలని భావిస్తోంది.
పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు దీన్ని బదిలీ చేయడానికి షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకునేందుకు సెప్టెంబర్ 23న అసాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్‌హోల్డర్లకు ఈజీఎం నోటీసు పంపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం తెలిపింది.
కొత్త సంస్థ బుక్ వేల్యు సుమారు రూ. 275–350 కోట్లుగా ఉంటుందని, ఈ నిధులను అయిదేళ్ల పాటు వార్షిక చెల్లింపుల కింద మాతృసంస్థ వన్9 కమ్యూనికేషన్స్‌కు చెల్లించనున్నట్లు వివరించింది. అక్టోబర్‌లో రూ. 16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు పేటీఎం కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment