ఫార్మా రంగానికి ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో(IPO) తొలిరోజు 13.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆఫర్‌లో 2.08 కోట్ల షేర్లకు గాను 27.75 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. గ్రే మార్కెట్‌లో షేర్లు రూ.97 ప్రీమియంతో ట్రేడయ్యాయి. సేల్‌ను ప్రారంభించిన నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్(Subscribe) కావడం విశేషం.
బిడ్డింగ్ రౌండ్‌లో ముందున్న నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) విభాగం 25.43 రెట్లు, రిటైల్(Retail) ఇన్వెస్టర్స్ 14.46, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIB) విభాగం 1.82 రెట్లు సబ్‌స్రైబ్ అయింది. షేర్లను జనవరి 13న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేయనున్నారు. ఇష్యూ జనవరి 8న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133–140 మధ్య నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1.42 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. ఇన్వెస్టర్లు కనీసం 107 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.123 కోట్లు అందుకుంది.
ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!
క్వాడ్రంట్ ఫ్యూచర్‌కు యాంకర్ నిధులు
రైల్వే సిగ్నలింగ్, రక్షణ(కవచ్) వ్యవస్థలకు సేవలందించే కంపెనీ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ యాంకర్ ఇన్వెస్టర్లకు 45 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా దాదాపు రూ.131 కోట్లు అందుకుంది. ఎంఎఫ్ సంస్థలు వైట్‌ఓక్ క్యాపిటల్, కొటక్, ఎల్‌ఐసీ, బీవోఐసహా సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ తదితర 22 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ.290 ధరలో షేర్లను జారీ చేయనుంది. రూ.275–290 ధరల శ్రేణిలో నేడు ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ.290 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అభివృద్ధి, రుణ చెల్లింపులు తదితరాలకు వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment