న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ గ్రీవ్స్(Greaves) ఎలక్ట్రిక్ మొబిలిటీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ.1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
మరో 18.9 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ప్రమోటర్ గ్రీవ్స్ కాటన్ 5.1 కోట్ల షేర్లను, ఏఎల్‌జే గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ డీఎంసీసీ 13.8 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. కంపెనీ యాంపియర్ బ్రాండుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు(EV Scooters), మరో బ్రాండుతో త్రిచక్ర ఈవీలను రూపొందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.375 కోట్లు బెంగళూరు టెక్నాలజీ కేంద్రంలో ప్రొడక్ట్, సాంకేతిక అభివృద్ధికి, రూ.83 కోట్లు సొంత బ్యాటరీ అసెంబ్లీ సామర్థ్యాలకు, రూ.38 కోట్లు ఎంఎల్‌ఆర్ ఆటో తయారీ సామర్థ్య పెంపునకు, బెస్ట్‌వే ఏజెన్సీస్ ప్రయివేట్ తయారీ విస్తరణకు మరో రూ.20 కోట్లు చొప్పున వెచ్చించనుంది.
ఇదీ చదవండి: గగనతలంలో 1.42 కోట్ల మంది
కంపెనీ తెలంగాణ(తూప్రాన్), తమిళనాడు(రాణీపేట్), ఉత్తరప్రదేశ్(గ్రేటర్ నోయిడా)లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. గతేడాది(2023–24) రూ.612 కోట్ల ఆదాయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment