IPO funding
-
ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..
రెనెవబుల్ ఎనర్జీ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి రూ.275–289 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.2,395 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.505 కోట్ల విలువైన షేర్లను ఆక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ.2,900 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(5న) షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.1,795 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సోలార్ పవర్ ప్రాజెక్టుల కంపెనీ సమీకృత పునరుత్పాదక ఇంధన సంస్థగా ఆవిర్భవించింది. 2024 జూన్‌కల్లా నిర్వహణలోని 28 ప్రాజెక్టులను కలిగి ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్‌లలోనే 18 ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుత సామర్థ్యం 1,320 మెగావాట్లుకాగా.. 1,650 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. గతేడాది రూ. 1,319 కోట్ల ఆదాయం, రూ. 698 కోట్ల నికర లాభం సాధించింది.ధర శ్రేణి: రూ. 275–289రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 51 షేర్లు లిస్టింగ్: 13ననివా బూపాఆరోగ్య బీమా రంగ కంపెనీ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ గురువారం(7న) ప్రారంభంకానుంది. 11న ముగియనున్న ఇష్యూకి రూ.70–74 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.1,400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ.2,200 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రేపు(6న) షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో 62.19 శాతం వాటాగల బూపా సింగపూర్ హోల్డింగ్స్ రూ.350 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. 26.8 శాతం వాటా కలిగిన ఫెటల్ టోన్ ఎల్ఎల్పీ రూ.1,050 కోట్ల విలువైన వాటాను విక్రయించనుంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ మార్కెట్లో స్టార్ హెల్త్ తదుపరి స్టాండెలోన్ కంపెనీగా లిస్ట్‌కానుంది. గతేడాది మొత్తం ప్రీమియం ఆదాయం 38 శాతం జంప్‌చేసి రూ.5,608 కోట్లకు చేరింది. రూ.82 కోట్ల నికర లాభం ఆర్జించింది.ధర శ్రేణి: రూ. 70–74 రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 200 షేర్లు లిస్టింగ్: 14నఇదీ చదవండి: బేర్ ఎటాక్..!కార్దేఖోఆటో క్లాసిఫైడ్స్ పోర్టల్ కార్దేఖో పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లను నియమించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో 2021 ఆగస్ట్‌లో వెలువడిన కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్ ఐపీవో తదుపరి రెండో ఆటో క్లాసిఫైడ్ లిస్టెడ్ సంస్థగా కార్దేఖో నిలవనుంది. -
IPO: నెలలో రూ.15వేల కోట్లు సమీకరించే కంపెనీలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబరులో దాదాపు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి ద్వారా వచ్చే నెల రోజుల్లో దాదాపు రూ.15,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ డజన్ కంపెనీల్లో ఇప్పటికే బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ ప్రారంభం అయింది. సెల్లో వరల్డ్ ఇష్యూ తేదీలను ప్రకటించింది. టాటా టెక్నాలజీస్, మామాఎర్త్, ఏఎస్కే ఆటోమోటివ్, ప్రోటీన్ ఈగవ్ టెక్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ పబ్లిక్ ఆఫర్లు నవంబరులో రానున్నాయి. వీటితో మొత్తం దాదాపు రూ.15వేలకోట్లు సమీకరించే వీలుంది. రూ.1,900 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న సెల్లో వరల్డ్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.617-648గా నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ అక్టోబర్ 27 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ రూ.840 కోట్లు సమీకరించనుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ రెండు లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇరవయ్యేళ్లలో టాటా గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇది. దీని ఒక్కో షేరు ధర శ్రేణి రూ.400 నుంచి రూ.500 మధ్య ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. చివరగా 2004లో టాటా సంస్థల నుంచి టీసీఎస్ ఐపీఓగా వచ్చింది. హొనాస కన్జ్యూమర్(మామాఎర్త్ మాతృసంస్థ) పబ్లిక్ ఇష్యూకు త్వరలో రాబోతోంది. దాదాపు రూ.1,650 కోట్ల సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఫెడరల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు రానుంది. రూ.1,200 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రోటీన్ ఇగవ్ టెక్, రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఏఎస్కే ఆటోమోటివ్ సైతం నవంబర్లోనే ఐపీఓ (IPO)కి రానున్నాయి. వచ్చే నెలలోనే రూ.1,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకి సిద్ధ అవుతుంది. రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో 70.3 మిలియన్ల షేర్లు ఓఎఫ్ఎస్ కింద జారీ చేయనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓకు వచ్చిన 36 కంపెనీలు దాదాపు రూ.28,330 కోట్లు సమీకరించాయి. గతేడాది మొత్తం 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. ఫలితంగా రూ.59వేలకోట్ల నిధులు కూడగట్టాయి. కంపెనీలు సమీకరించనున్న మొత్తం టాటా టెక్నాలజీస్: రూ.2500 కోట్లు సెల్లోవరల్డ్: రూ.1900 కోట్లు హొనాస కన్జ్యూమర్:రూ.1650 కోట్లు ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్సియల్: రూ.1400 కోట్లు ప్రొటీన్ ఈగోవ్టెక్: రూ.1300 కోట్లు డీఓఎంఎస్ ఇండస్ట్రీస్:రూ.1200 కోట్లు ఏఎస్కే ఆటోమోటివ్:రూ.1000 కోట్లు జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.1000 కోట్లు ఫిన్‌కేర్ మైక్రోఫైనాన్స్: రూ.900 కోట్లు బ్లూజెట్ హెల్త్‌కేర్: రూ.840 కోట్లు ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్: రూ.800 కోట్లు ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.630 కోట్లు -
రెడీగా ఉండండి.. త్వరలో బడా సంస్థ నుంచి మరో ఐపీఓ!
ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీఓకి రానుంది. 2024 కల్లా బ్యాంకింగేతర సంస్థ అయిన ‘అదానీ క్యాపిటల్’ను పబ్లిక్ ఆఫర్‌కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ ఎండీ సీఈఓ గౌరవ్ గుప్తా వెల్లడించారు. అందుకోసం అదానీ క్యాపిటల్ నుంచి 10 శాతం వాటా విక్రయించడం ద్వారా 1500 కోట్ల నిధులను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో ఈ గ్రూప్ నుంచి అదానీ విల్మర్ ఐపీఓకి వచ్చిన సంగతి తెలసిందే. అదానీ క్యాపిటల్ 2017 ఏప్రిల్‌లో ఎన్బీఎఫ్సీ విభాగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి వ్యాపారం రిటైల్, గ్రామీణ ఫైనాన్సింగ్ విభాగంపై దృష్టి పెట్టింది. వ్యవసాయ పరికరాలు, చిన్న వాణిజ్య వాహనాలు, 3-వీలర్లు, వ్యవసాయ రుణాలను అందిస్తూ వస్తోంది. వీటితో పాటు ఎంఎస్ఎంఈ( MSME) వ్యాపార రుణాలను కూడా ఇస్తుంది. అదానీ క్యాపిటల్‌కు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో 154 బ్రాంచీలు ఉన్నాయి. 60,000 మంది రుణగ్రహీతలు ఉన్నారు. ప్రస్తుతం, కంపెనీ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ & మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. చదవండి: Passport: పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకపోయినా 60 దేశాలు చుట్టేయచ్చు! -
51 ఐపీవోలు.. లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ వారం మరో రెండు సంస్థలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి వస్తున్నాయి. వీటిలో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవి రెండు కలిసి సుమారు రూ. 7,868 కోట్లు సమీకరించనున్నాయి. స్టార్ హెల్త్ ఐపీవో నవంబర్ 30న మొ దలై డిసెంబర్ 2న ముగుస్తుంది. అటు టెగా ఇండస్ట్రీస్ ఇష్యూ డిసెంబర్ 1–3 మధ్య ఉంటుంది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ షేరు ధర శ్రేణిని రూ. 870–900గా నిర్ణయించింది. సుమారు రూ. 7,249 కోట్లు సమీకరిస్తోంది.అటు టెగా ఇండస్ట్రీస్ రూ. 619 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూ తలపెట్టింది. షేరు ధర శ్రేణి రూ. 443–453. ఇప్పటిదాకా 51 కంపెనీలు.. ఈ ఏడాది ఇప్పటిదాకా 51 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 1 లక్ష కోట్ల పైగా సమీకరించాయి. నవంబర్లోనే 10 సంస్థలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. ఈ స్థాయిలో చివరిగా 2017లో ఐపీవోల సందడి కనిపించింది. అప్పట్లో 36 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రాగా రూ. 67,147 కోట్ల నిధులు దక్కించుకున్నాయి. చదవండి: ప్రపంచంలో అతి పెద్ద ఐపీవో -
స్టార్ హెల్త్ ఐపీవో.. రూ.7,249 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఆరోగ్య బీమా దిగ్గజం స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 7,249 కోట్ల నిధులు సమీకరించనుంది. ఇందుకోసం షేర్ల ధర శ్రేణిని రూ. 870–900గా నిర్ణయించింది. నవంబర్ 30న ప్రారంభమయ్యే ఇష్యూ డిసెంబర్ 2తో ముగుస్తుంది. కనీసం 16 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను రిజర్వ్ చేశారు. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వంటి దిగ్గజ ఇన్వెస్టర్లకు ఇందులో పెట్టుబడులు ఉన్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ రూ. 6,252 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: స్పోర్ట్స్ టెక్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్ తాజాగా 84 కోట్ల డాలర్లు(రూ. 6,252 కోట్లు) సమీకరించింది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో ఫాల్కన్ ఎడ్జ్, డీఎస్టీ గ్లోబల్, డీ1 క్యాపిటల్, రెడ్‌బర్డ్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్ తదితరాలున్నాయి. దీంతో కంపెనీ విలువ 8 బిలియన్ డాలర్లను తాకింది. అంతేకాకుండా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన టీపీజీ, పుట్‌పాత్ వెంచర్స్ తదితరాలు సైతం నిధులను సమకూర్చాయి. -
మార్కెట్ రన్.. ఐపీఓలు ధనాధన్!
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్ రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. దీంతో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 61,000 పాయింట్ల మైలురాయినీ అధిగమించింది. ఈ ప్రభావంతో మరోపక్క ప్రైమరీ మార్కెట్ సైతం స్పీడందుకుంది. ఇప్పటికే ఈ ఏడాది పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. మరిన్ని సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు సై అంటున్నాయి. వెరసి 2017లో ప్రైమరీ మార్కెట్ సాధించిన నిధుల సమీకరణ రికార్డ్ తుడిచిపెట్టుకుపోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముంబై: గతేడాదిని మించుతూ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనూ పలు సుప్రసిద్ధ కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటోసహా పలు కంపెనీలు విజయవంతంగా లిస్ట్‌కాగా.. ఇకపైనా మరిన్ని సంస్థలు ప్రైమరీ మార్కెట్ తలుపు తట్టనున్నాయి. తద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్నాయి. సుమారు 35 కంపెనీలు క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూలకు రానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడిగా ఈ కంపెనీలు రూ. 80,000 కోట్లను సమకూర్చుకోనున్నట్లు అంచనా వేశారు. ఫలితంగా 2017లో ఐపీవోల ద్వారా 35 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 67,147 కోట్ల రికార్డు మరుగున పడనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ సైతం ఈ ఏడాదిలో లిస్టింగ్‌ను సాధిస్తే చరిత్రాత్మక రికార్డు నమోదవుతుందని తెలియజేశారు. పేటీఎమ్ భారీగా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో పలు ప్రయివేట్ కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్‌గా ఆవిర్భవించనున్నాయి. మార్కెట్లు నిలకడగా కొనసాగితే డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా 35 కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. క్యూ3లో ఐపీవోకు రానున్న జాబితాలో రూ. 16,600 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించిన పేటీఎమ్ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అధిక స్థాయిలో నిధులను ఆశిస్తున్న ఇతర కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 7,300 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్(రూ.7,000 కోట్లు), పాలసీ బజార్ (రూ. 6,000 కోట్లు), ఎమ్క్యూర్ ఫార్మా(రూ. 5,000 కోట్లు), వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్(రూ. 4,500 కోట్లు), బ్యూటీ ప్రొడక్టుల సంస్థ నైకా(రూ. 4,000 కోట్లు), పెన్నా సిమెంట్స్ తదితరాలున్నాయి. 14 కంపెనీలు రెడీ క్యూ3లో లిస్టింగ్ బాట పట్టనున్న ఇతర సంస్థలలో పారదీప్ ఫాస్ఫేట్స్, వేదాంత్ ఫ్యాషన్స్, సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్, నార్తర్న్ ఆర్క్ సైతం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు రూ. 2,000–2,500 కోట్ల స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టే వీలున్నట్లు తెలియజేశాయి. ఇప్పటికే 14 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. వీటిలో పారదీప్ ఫాస్ఫేట్స్, గో ఎయిర్‌లైన్స్, రుచీ సోయా ఇండస్ట్రీస్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ చేరాయి. ఇవి రూ. 22,000 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఈ బాటలో ఇప్పటికే మరో 64 కంపెనీలు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడం గమనార్హం! నాణ్యమైన కంపెనీలు చేపట్టే ఐపీవోల కోసం కొంతమంది ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్ఐసీ వంటి భారీ ఇష్యూల సమయంలో సెకండరీ మార్కెట్లో కొంతమేర లిక్విడిటీ కొరత నెలకొనవచ్చని వివరించారు. 6 కంపెనీలకు సెబీ ఓకే పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆరు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. జాబితాలో నైకా, అదానీ విల్మర్, స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్, లేటెంట్ వ్యూ అనలిటిక్స్, సిగాచీ ఇండస్ట్రీస్ చేరాయి. ఈ కంపెనీలన్నీ ఐపీవో ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతించమంటూ సెబీకి ఈ ఏడాది మే– ఆగస్ట్ మధ్యకాలంలో దరఖాస్తు చేశాయి. వీటికి ఈ నెల 11–14 మధ్య అనుమతులు మంజూరయ్యాయి. మరోవైపు ఐఎల్ఎస్ హాస్పిటల్స్ నిర్వాహక సంస్థ జీపీటీ హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 450–500 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పెన్నా సిమెంట్స్ రూ1,300 కోట్లు... పబ్లిక్ ఇష్యూలో భాగంగా హైదరాబాద్ కంపెనీ పెన్నా సిమెంట్స్ రూ. 1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. కాగా.. ఐపీవోలో భాగంగా లేటెంట్ వ్యూ అనలిటిక్స్ రూ. 474 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో రూ. 126 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఈ బాటలో సెల్యులోజ్ ఆధారిత ప్రొడక్ట్ తయారీ కంపెనీ సిగాచీ ఇండస్ట్రీస్ ఐపీవోకింద 76.95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
ఐపీవోలకు ‘బీమా’ సంస్థల క్యూ
ముంబై: ఇప్పటికే కిక్కిరిసిపోయిన పబ్లిక్ ఇష్యూల మార్కెట్లో కొత్తగా బీమా రంగానికి సంబంధించిన మరో మూడు సంస్థలు ఐపీవోకి సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి రూ. 10,000 కోట్లు పైగా సమీకరించనున్నాయి. ఇన్సూరెన్స్ బ్రోకరేజి సంస్థ పాలసీబజార్ని నిర్వహించే పీబీ ఫిన్‌టెక్, ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీస్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 40 పైగా కంపెనీలు ఐపీవోకి రాగా .. సుమారు రూ. 70,000 కోట్ల పైగా నిధులు సమీకరించాయి. ఆగస్టులో ఇప్పటిదాకా 24 పైగా సంస్థలు ఐపీవోకి సంబంధించి పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాదిలో ఏకంగా 100 పైగా పబ్లిక్ ఇష్యూలు రాగలవని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. రెండో భారీ ఇష్యూగా పీబీ ఫిన్‌టెక్.. పీబీ ఫిన్‌టెక్ సుమారు రూ. 6,017 కోట్లు సమీకరించనుంది. టైగర్ గ్లోబల్, టెన్సెంట్ హోల్డింగ్స్ వంటి దిగ్గజాలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాదిలో జొమాటో తర్వాత పీబీ ఫిన్టెక్ది రెండో అతి భారీ ఇష్యూ కానుంది. జొమాటో రూ. 9,375 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు స్టాండెలోన్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన స్టార్ హెల్త్ దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉంది. అటు దేశీయంగా అతి పెద్ద థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న మెడి అసిస్ట్ సుమారు రూ. 840–1,000 కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించనున్నట్లు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ల (డీఆర్‌హెచ్‌పీ) ద్వారా తెలుస్తోంది. పీబీ ఫిన్‌టెక్ ఆగస్టు 4న, స్టార్ హెల్త్ జులై 28న, మెడి అసిస్ట్ మే 11న సెబీకి డీఆర్‌హెచ్‌పీలు సమర్పించాయి. ఒక్కో ఇష్యూ ఇలా.. దేశీయంగా ప్రైవేట్ రంగంలో స్టార్ హెల్త్ అతి పెద్ద స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థగా ఉంది. దీనికి సుమారు 15.8 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాతో పాటు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ వంటి దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 2,000 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, వాటాదారులు 6 కోట్ల పైచిలుకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.06 కోట్ల షేర్లు, ఎపిస్ గ్రోత్ 76 లక్షల షేర్లు విక్రయించనున్నాయి. మరోవైపు, పాలసీబజార్, ఆన్లైన్ రుణాల ప్లాట్‌ఫాం పైసాబజార్‌లను పీబీ ఫిన్‌టెక్ నిర్వహిస్తోంది. పరిమాణంపరంగా ప్రస్తుతం ఆన్లైన్లో పాలసీ విక్రయాలకు సంబంధించి పాలసీబజార్‌కు 93.4 శాతం మార్కెట్ వాటా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిజిటల్ ఇన్సూరెన్స్ విక్రయాల పరిమాణంలో సుమారు 65.3 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరిగాయి. పాలసీబజార్ కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత వాటాదారులు సుమా రు రూ. 2,267 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఇక మెడిఅసిస్ట్ విషయం తీసుకుంటే.. ఆదాయాలు, ప్రీమియం వసూళ్ల సేవలు తదితర అంశాలపరంగా దేశంలోనే అతిపెద్ద థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేటరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. దేశవ్యాప్తంగా 722 నగరాలు, పట్టణాల్లో 11,000 పైచిలుకు ఆస్పత్రులతో భారీ నెట్వర్క్ ఉంది. అపోలో హాస్పిటల్స్ మణిపాల్ హాస్పిటల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నారాయణ హృదయాలయ, మ్యాక్స్ హెల్త్‌కేర్ వంటి పేరొందిన హాస్పిటల్ చెయిన్లకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటరుగా (టీపీఏ) వ్యవహరిస్తోంది. పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రమ్‌జిత్ సింగ్ చత్వాల్, మెడిమ్యాటర్ హెల్త్ మేనేజ్మెంట్, బెస్సీమర్ హెల్త్ క్యాపిటల్, ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 1 మొదలైన ఇన్వెస్టర్లు 25,39,092 షేర్లను విక్రయిస్తున్నాయి. -
రూ.8,430 కోట్లకు ఓయో ఐపీవో
న్యూఢిల్లీ: హోటల్ బుకింగుల స్టార్టప్ దిగ్గజం ఓయో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో సాఫ్ట్‌బ్యాంక్, ఏ1 హోల్డింగ్స్, చైనా లాడ్జింగ్ హాలిడేస్(హెచ్‌కే) తదితరాలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. 2013లో ఏర్పాటైన ఓయో ప్రపంచవ్యాప్తంగా 5,130 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో 71 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! నష్టాలలోనే...: కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటివరకూ ప్రతీ ఏడాది నష్టాలనే నమోదు చేస్తున్నట్లు ఒరావెల్ స్టేస్ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. కొద్ది నెలలుగా కరోనా మహమ్మారి సవాళ్లు విసరడంతో బిజినెస్ మరింత డీలాపడినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ఓయోకు రూ. 3,944 కోట్ల నష్టాలు వాటిల్లగా.. అంతక్రితం ఏడాది(2019–20)లో రూ. 13,123 కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2018–19లో దాదాపు రూ. 2,365 కోట్ల నష్టం ప్రకటించింది. జూలైకల్లా కంపెనీ రుణ భారం రూ. 4,891 కోట్లకు చేరింది. ఐపీవో నిధుల్లో కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు సెబీకి దాఖలు చేసిన దరఖాస్తులో ఓయో తెలియజేసింది. ఓయోలో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వ్యక్తిగత హోదాలో 8.21 శాతం, హోల్డింగ్ కంపెనీ ఆర్ఏ హాస్పిటాలిటీ ద్వారా మరో 24.94 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ మరింత అధికంగా 46.62 శాతం వాటాను పొందింది. నిధుల వినియోగం ఇలా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధుల్లో అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు రూ. 2,441 కోట్లను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఓయో వెల్లడించింది. మరో రూ. 2,900 కోట్లను కంపెనీ విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. మిగిలిన పెట్టుబడులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కాగా.. ఇటీవల కొద్ది రోజులుగా యూనికార్న్ హోదా(బిలియన్ డాలర్ల విలువ) పొందిన పలు స్టార్టప్‌లు స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్ బాట పడుతున్నాయి. ఇప్పటికే జొమాటో లాభాలతో లిస్ట్‌కాగా.. డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎమ్, బ్యూటీ ప్రొడక్టుల ఆన్లైన్ రిటైలర్ నైకా, ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ సైతం పబ్లిక్ ఇష్యూకి రానున్న సంగతి తెలిసిందే. వివిధ చర్యల ద్వారా స్థూల లాభ మార్జిన్లను 2020లో నమోదైన 9.7 శాతం నుంచి 2021 మార్చికల్లా 33.2 శాతానికి మెరుగుపరచుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్ -
రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తమ ఆన్లైన్ పేమెంట్స్ వ్యాపారాన్ని కొత్త అనుబంధ సంస్థకు బదలాయించాలని భావిస్తోంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు దీన్ని బదిలీ చేయడానికి షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకునేందుకు సెప్టెంబర్ 23న అసాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్హోల్డర్లకు ఈజీఎం నోటీసు పంపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం తెలిపింది. కొత్త సంస్థ బుక్ వేల్యు సుమారు రూ. 275–350 కోట్లుగా ఉంటుందని, ఈ నిధులను అయిదేళ్ల పాటు వార్షిక చెల్లింపుల కింద మాతృసంస్థ వన్9 కమ్యూనికేషన్స్‌కు చెల్లించనున్నట్లు వివరించింది. అక్టోబర్‌లో రూ. 16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు పేటీఎం కసరత్తు చేస్తోంది. -
ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు
ట్యాక్సీ సేవల దిగ్గజం ఓలా పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. తద్వారా రూ. 7,000–11,000 కోట్ల మధ్య నిధుల సమీకరణ చేపట్టాలని ఓలా మాతృ సంస్ధ ఏఎన్ఐ టెక్నాలజీస్ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ నిర్వహణకు సిటీగ్రూప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర ఎంపిక చేసిన సంస్థలతో చర్చలు చేపట్టింది. ఆస్టిన్ జీఐఎస్‌లో టెక్‌మహీంద్రా పెట్టుబడులు న్యూఢిల్లీ: ఆస్టిన్ జీఐఎస్‌లో 13.8 శాతం వాటాను టెక్ మహీంద్రా తన యూఎస్ సబ్సిడరీ (టెక్‌మహీంద్రా ఐఎన్‌సీ) రూపంలో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 1.25 మిలియన్ డాలర్లు (రూ.9.37కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఐవోటీ/5జీ విభాగంలో సేవల విస్తరణకు ఈ కొనుగోలు తోడ్పడనుందని కంపెనీ ప్రకటించింది. -
ఐపీవోల జాతర.. ప్రజల నుంచి 70 వేల కోట్లు సమీకరణ
ముంబై: తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం కంపెనీల్లో ఆత్రుత పెరుగుతోంది. ఒకదాని వెంట ఒకటి ఐపీవోకు దరఖాస్తులు దాఖలు చేస్తూనే ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల వద్ద స్థిరంగా కొనసాగుతుండడం కంపెనీలను ఐపీవో వైపు వేగంగా అడుగులు వేయిస్తున్నాయి. దాదాపు అన్ని ఐపీవోలు అధిక స్పందన అందుకుంటుండడంతో.. ఇంతకుమించిన అనుకూలత ఉండదన్న ధోరణి కంపెనీల్లో కనిపిస్తోంది. ఆగస్ట్‌లో మొదటి 20 రోజుల్లోనే ఐపీవోలకు అనుమతి కోరుతూ 23 దరఖాస్తులు సెబీ వద్ద దాఖలయ్యాయి. అంతేకాదు ఈనెల్లో ఇప్పటికే 18 కంపెనీలు ఇష్యూలను పూర్తి చేసుకుని రూ.18,200 కోట్లను ప్రజల నుంచి సమీకరించేశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఇవి రూ.70,000 కోట్లను ప్రజల నుంచి సమీకరించాయి. ప్రతీ ఐపీవోలోనూ రిటైల్ ఇన్వెస్టర్లు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 100 రెట్లకు పైగా బిడ్లు అందుకున్న ఐపీవోలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీవోల సంఖ్య సెంచరీ (100) దాటుతుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు.. ఈ నెలలో ఐపీవోకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన వాటిల్లో ఢిల్లీలోకి చెందిన పీబీ ఇన్ఫోటెక్ (పాలసీబజార్) ముఖ్యమైనది. రూ.6,000 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించే ప్రణాళికతో ఈ సంస్థ ఉంది. పుణెకు చెందిన ఎమ్క్యూర్ ఫార్మా సైతం రూ.5,000 కోట్ల ఇష్యూను చేపట్టాలనుకుంటోంది. ఈ సంస్థ కూడా దరఖాస్తు సమర్పించింది. అలాగే, ఇతర ప్రముఖ సంస్థల్లో ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ (రూ.4,500 కోట్లు), ఆన్లైన్ ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ నైకా (రూ.4,000 కోట్లు) కూడా ఉన్నాయి. ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ఇక్సిగో మాతృసంస్థ లీట్రావెన్యూస్ టెక్నాలజీ సైతం రూ.1,800 కోట్ల సమీకరణకు ఐపీవో దరఖాస్తు దాఖలు చేసింది. ఎస్ఏఏఎస్ కంపెనీ రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ కూడా రూ.1,500 కోట్ల సమీకరణకు ఐపీవోకు రానుంది. ఈ జాబితాలో ఇంకా టార్సన్స్ ప్రొడక్ట్స్, వీఎల్సీసీ, సాఫైర్ ఫుడ్స్, గోఫ్యాషన్ ఇండియా, ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఇటీవలే ఐపీవో పూర్తి చేసుకున్న సిమెంట్ తయారీ కంపెనీ నువోకో విస్టా కార్పొరేషన్ వచ్చే సోమవారం లిస్ట్ కానుంది. ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన ఐపీవోల్లో జొమాటో, తత్వచింతన్ ఫార్మా, జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తదితర కంపెనీలుండడం గమనార్హం. -
పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా, ఐపీవోలు ఖుషీ
ముంబై: కొద్ది నెలలుగా దూకుడు చూపుతున్న ప్రైమరీ మార్కెట్‌కు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు దన్నునిస్తున్నారు. దీంతో పలు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీవోలు చేపట్టేం దుకు సెబీ వద్ద క్యూ కడుతున్నాయి. మరోపక్క లిస్టింగ్‌లోనూ భారీ లాభాలను సాధిస్తుండటంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తొలిసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే రిటైల్ ఇన్వెస్టర్లు లక్షల సంఖ్యలో జత కలుస్తున్నారు. ఇది ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో రిటైలర్ల వాటా సరికొత్త గరిష్టాన్ని తాకేందుకు దోహదం చేసింది. జూన్ చివరికల్లా మార్కెట్ల చరిత్రలోనే తొలిసారి రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతానికి ఎగసింది. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 16.18 లక్షల కోట్లు! 40 కొత్త లిస్టింగ్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను సాధించాయి. తద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో పలు ఇష్యూలకు 100 రెట్లు, ఆపై సబ్స్క్రిప్షన్ లభించడం విశేషం. మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇకపైనా ప్రైమరీ మార్కెట్ మరింత జోరు చూపనుంది. వెరసి మరో రూ. 75,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందువల్లనే ఇటీవల ఒక బులెటిన్‌లో ఆర్బీఐ.. 2021ను ఐపీవో నామసంవత్సరంగా పేర్కొన్నట్లు తెలియజేశారు. చదవండి : దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్ మార్చిలో మహాజోరు ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం 2020 మార్చిలో 3 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచారు. ఈ బాటలో 2021 జూన్ చివరికల్లా వీటి సంఖ్య 8 కోట్లకు చేరింది. గతేడాది మార్చిలో 35 శాతం పతనమైన మార్కెట్ తదుపరి బౌన్స్‌బ్యాక్‌ను సాధించింది. ఈ జనవరిలో 50,000 పాయింట్ల మైలురాయికి చేరిన సెన్సెక్స్ సరికొత్త చరిత్రను లిఖిస్తూ తాజాగా ఇంట్రాడేలో 56,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. రిటైల్ స్పీడ్ ఇటీవలే లిస్టయిన దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోకు రిటైలర్ల నుంచి 40 రెట్లు, క్రిస్నా డయాగ్నోస్టిక్స్‌కు 42 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఈ బాటలో చిన్న ఇష్యూ అయిన తత్వ చింతన్‌కు మరింత అధికంగా 59 రెట్లు ఎక్కువగా బిడ్స్ లభించాయి. అయితే క్లీన్ సైన్స్ టెక్నాలజీకి 9 రెట్లు, భారీ ఇష్యూ జొమాటోకు 7.5 రెట్లు అధికంగా మాత్రమే రిటైలర్లు దరఖాస్తు చేయడం గమనార్హం! ప్రీమియంతో.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి డైరెక్టుగా ప్రవేశిస్తున్నట్లు ట్రస్ట్‌ప్లస్ వెల్త్ సీఈవో సమీర్ కౌల్ తెలియజేశారు. ఇందువల్లనే ఇటీవల పలు ఐపీవోలు భారీగా సక్సెస్ అవుతున్నట్లు వివరించారు. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఇష్యూకి 3.9 మిలియన్ దరఖాస్తులు లభించాయి. దీంతో గతంలో 4.2 మిలియన్లతో రికార్డు నెలకొల్పిన రిలయన్స్ పవర్ తదుపరి నిలిచింది. అయితే ఆర్‌పవర్‌కు రిటైల్ విభాగంలో 83 రెట్లు స్పందన లభించగా.. గ్లెన్‌మార్క్ 15 రెట్లు మాత్రమే సాధించింది. భారీ లిక్విడిటీ పరిస్థితులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఈక్విటీ బ్రోకింగ్ హెడ్ అరుణ్ జైన్ తెలియజేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం కారణంగా పలు కంపెనీలు భారీ లాభాలతో లిస్టవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా తత్వ చింతన్, జొమా టో, జీఆర్ ఇన్ఫ్రా 97–78 శాతం మధ్య ప్రీమియంతో లిస్టయిన విషయాన్ని ప్రస్తావించారు. -
ఐపీవో జోరు.. మరో నాలుగు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల సరికొత్త రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ప్రైమరీ మార్కెట్‌కు సైతం జోష్ నిస్తున్నాయి. దీంతో కొద్ది నెలలుగా పలు కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) వెళ్తున్నాయి. ప్రస్తుత కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటికే ఐపీవోల ద్వారా వివిధ సంస్థలు భారీ స్థాయిలో నిధులు సైతం సమీకరించాయి. ఈ బాటలో తాజా గా మరో 4 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తలుపు తట్టాయి. వివరాలు ఇలా.. గో ఫ్యాషన్ ఇండియా ఐపీవోకు అనుమతించమంటూ గో కలర్స్ బ్రాండుతో మహిళల దుస్తులను రూపొందిస్తున్న గో ఫ్యాషన్ ఇండియా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1,28,78,389 షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీలో ప్రస్తుతం పీకేఎస్, వీకేఎస్ కుటుంబ ట్రస్ట్‌లకు విడిగా 28.74 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. సమీకరించిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా మహిళలు ధరించే చుడీదార్లు, లెగ్గింగ్స్, ధోతీలు, ట్రౌజర్లు తయారు చేస్తోంది. వీఎల్సీసీ హెల్త్‌కేర్ వెల్నెస్, బ్యూటీ ప్రొడక్టుల దేశీ కంపెనీ వీఎల్సీసీ హెల్త్‌కేర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లతోపాటు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 89.22 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాంతంతోపాటు దేశీయంగా మరిన్ని వెల్నెస్ క్లినిక్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. హాట్‌న్యూస్: మస్త్ ఫీచర్లతో మడత ఫోన్లు.. చూసేయండి పారదీప్ ఫాస్ఫేట్స్ ఐపీవోకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ ఫెర్టిలైజర్ కంపెనీ పారదీప్ ఫాస్ఫేట్స్ సెబీకి దరఖాస్తు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,255 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 12 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో జువారీ మారోక్ ఫాస్ఫేట్స్ 75,46,800 షేర్లు ఆఫర్ చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం 11.24 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో జువారీ మారోక్కు 80.45 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం 19.55 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను గోవాలోని ఎరువుల తయారీ యూనిట్ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఐటీ సొల్యూషన్లు అందించే ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ ఇండియా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ప్రకాష్ జైన్‌తోపాటు, మంజులా జైన్, ప్రకాష్ జైన్ కుటుంబ ట్రస్ట్‌లు విక్రయానికి ఉంచనున్నాయి. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వ్యక్తిగతంగా ప్రకాష్ జైన్ రూ. 131 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుండగా.. ట్రస్ట్ తరఫున రూ. 277 కోట్లు, మంజులా జైన్ ట్రస్ట్ రూ. 92 కోట్లు చొప్పున ఈక్విటీని విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను రుణ చెల్లింపులతోపాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
జొమాటో ఐపీవోకు రిటైలర్ల క్యూ
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభిస్తోంది. బుధవారం(14న) తొలిరోజే ఇష్యూకి పూర్తి స్థాయిలో సబ్స్క్రిప్షన్ లభించింది. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఐపీవోలో భాగంగా కంపెనీ 71.92 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 75.6 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 12.95 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 34.88 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. వెరసి 2.7 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 13 శాతమే స్పందన లభించగా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో దాదాపు పూర్తిస్థాయిలో బిడ్స్ నమోదయ్యాయి. ఉద్యోగులకు కేటాయించిన విభాగంలో 18% దరఖాస్తులే వచ్చాయి. షేరుకి రూ.72–76 ధరలో ప్రారంభమైన ఇష్యూ శుక్రవారం (16న) ముగియనుంది. ఇష్యూ ద్వారా రూ.9,375 కోట్లు సమీకరించనుంది. చదవండి : Apple pay in 4: ఇప్పుడు కొనుక్కోండి తర్వాతే పే చేయండి -
లక్ష కోట్ల ఐపీవోలకు రెడీ
దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు ఇటీవల పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. జాబితాలో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, హెచ్డీబీ ఫైనాన్షియల్, ఆధార్ హౌసింగ్, డెలివరీ, సెంబ్‌కార్ప్ ఎనర్జీ తదితరాలున్నాయి. పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీని పక్కనపెడితే.. రూ. లక్ష కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు ప్రకటించాయి. దీంతో ఈ కేలండర్ ఏడాది(2021)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులకు వేదికయ్యే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం... ముంబై: కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను కోవిడ్–19 వణికిస్తున్నప్పటికీ దేశీయంగా స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా భారీగా నిధులను సమీకరించాలని ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది(2021)లో ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. లక్ష కోట్లకుపైగా నిధులను సమీకరించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పబ్లిక్ ఇష్యూ బాటలో సాగనున్న ప్రధాన సంస్థలలో ఎన్ఎస్ఈ(రూ. 10,000 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్(రూ. 9,000 కోట్లు), ఆధార్ హౌసింగ్(రూ. 7,300 కోట్లు), డెల్హివరీ(రూ. 6,000 కోట్లు), సెంబ్‌కార్ప్ ఎనర్జీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్(రూ. 5,000 కోట్లు), జొమాటో(రూ. 4,000 కోట్లు) తదితరాలను ప్రస్తావించవచ్చు. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లో 2017లో నమోదైన చరిత్రాత్మక రికార్డులు బ్రేకయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రూ. 13,000 కోట్లు... ఈ ఏడాది ఇప్పటికే 9 కంపెనీలు ఐపీవోలను చేపట్టాయి. తద్వారా రూ. 13,000 కోట్లు సమకూర్చుకున్నాయి. గత వారం ఎంటార్ టెక్నాలజీస్ రూ. 597 కోట్లు, తాజాగా ఈజీ ట్రిప్ ప్లానర్స్ రూ. 510 కోట్లు చొప్పున సమీకరించాయి. ఈ బాటలో మరిన్ని కంపెనీలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. వెరసి మరో రూ. 90,000 కోట్లకుపైగా సమీకరించే వీలుంది. ప్రస్తుత బుల్ రన్ నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ ద్వారా నైకా, పాలసీ బజార్, మాక్రోటెక్ డెవలపర్స్, సంహీ హోటల్స్, ఆరోహణ్ ఫైనాన్షియల్, కళ్యాణ్ జ్యువెలర్స్, పెన్నా సిమెంట్స్ తదితరాలు రూ. 3,500–1,500 కోట్ల మధ్య నిధులను సమకూర్చుకునే సన్నాహాల్లో ఉన్నాయి. ఈ బాటలో తాజాగా ఐపీవోకు అనుమతించమంటూ పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ సైతం ఈ ఏడాది లిస్టింగ్ యోచనలో ఉంది. ఎల్ఐసీ ఒక్కటే రూ. లక్ష కోట్ల ఐపీవోను చేపట్టే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతక్రితం ఐపీవోల ద్వారా 2017లో 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను సమీకరించాయి. ఇది మార్కెట్ చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కొత్త రికార్డులు నమోదయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. బుల్ జోష్ కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో 2020 మార్చి నుంచీ లిక్విడిటీ వెల్లువెత్తింది. వెరసి విదేశీ నిధులు అటు స్టాక్స్, ఇటు పసిడి తదితరాలలోకి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా 2020 ఆగస్ట్‌లో దేశీయంగా పసిడి 10 గ్రాములు రూ. 56,000ను అధిగమించగా.. విదేశీ మార్కెట్లో ఔన్స్ 2,070 డాలర్లను తాకింది. 2021లో సెన్సెక్స్ 52,000కు చేరింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌పై దృష్టిసారించాయి. వివిధ రంగాలకు చెందిన బార్బిక్యు నేషన్, శ్రీరామ్ ప్రాపర్టీస్, కిమ్స్ హాస్పిటల్స్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్, లావా ఇంటర్నేషనల్, తదితర పలు సంస్థలు ఐపీవోల ద్వారా రూ.1,000–3,000 కోట్ల మధ్య సమీకరించే సన్నాహాల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో మరో మూడు ఇష్యూలు ♦క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్ ♦లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ అనుపమ్ రసాయన్ ఈ నెలలో మరో మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. శుక్రవారం(12) నుంచి అనుపమ్ రసాయన్ ఐపీవో ప్రారంభంకానుంది. షేరుకి రూ. 553–555 ధరలో ఇష్యూకి వస్తోంది. తద్వారా రూ. 760 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇదే విధంగా సోమవారం(15) నుంచి క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. క్రాఫ్ట్స్‌మ్యాన్ షేరుకి రూ. 1488–1490 ధరలో ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇష్యూ ద్వారా రూ. 824 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇక లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ షేరుకి రూ. 129–130 ధరలో పబ్లిక్ ఇష్యూని చేపడుతోంది. తద్వారా రూ. 600 కోట్లు సమీకరిస్తోంది. ఈ బాటలో కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలు రాను న్నాయి. వెరసి ఈ నెలలో రూ. 10,000– 12,000 కోట్ల నిధులను సమీకరించే వీలుంది. -
జొమాటో నిధుల సమీకరణ జోరు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టనుంది. ఈ ఏడాది జూన్‌కల్లా ఐపీవోకు వచ్చే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన పీఈ సంస్థలు మరోసారి వాటాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్ జొమాటోలో వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ఇటు పీఈ సంస్థల తాజా పెట్టుబడులు, అటు యాంట్ గ్రూప్ వాటా విక్రయం ద్వారా కంపెనీ 50 కోట్ల డాలర్ల(రూ. 3,650 కోట్లు) వరకూ సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. కాగా.. చెల్లించిన మూలధనాన్ని జొమాటో మూడు రెట్లు పెంచుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా 880 కోట్ల షేర్లను జారీ చేసినట్లు తెలుస్తోంది. వెరసి పెయిడప్ క్యాపిటల్ రూ. 535 కోట్ల నుంచి రూ. 1,448 కోట్లకు ఎగసినట్లు తెలియజేశాయి. తాజా పెట్టుబడుల నేపథ్యంలో జొమాటో విలువ 6 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 44,000 కోట్లు) చేరినట్లు అంచనా వేశాయి. వాటా విక్రయం జొమాటోలో కొంత వాటా విక్రయం ద్వారా యాంట్ గ్రూప్ 25 కోట్లడాలర్లను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జొమాటోలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన పీఈ సంస్థలు ఐపీవోకు ముందే మరోసారి నిధులను అందించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా జొమాటో 25 కోట్ల డాలర్లను(రూ. 1825 కోట్లు) సమకూర్చుకోనున్నట్లు చెబుతున్నాయి. ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీల జాబితాలో టైగర్ గ్లోబల్, కోరా ఇన్వెస్ట్మెంట్స్, ఫిడిలిటీ, స్టెడ్‌వ్యూ తదితరాలున్నాయి. దీంతో ఐపీవోకు ముందు కంపెనీ చేతిలో రూ. 7,300 కోట్ల నగదు చేరనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. జొమాటోలో దేశీ కంపెనీ ఇన్ఫోఎడ్జ్, యాంట్ గ్రూప్ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటాలు కలిగి ఉన్నాయి. ఐపీవో ద్వారా యాంట్ గ్రూప్ వాటాను విక్రయిస్తే.. కంపెనీలో ఇన్ఫోఎడ్జ్ అతిపెద్ద వాటాదారుగా నిలిచే వీలున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఏంజెల్ బ్రోకింగ్‌కు యాంకర్ నిధులు
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూ నేటి నుంచి ప్రారంభమైంది. గురువారం(24న) ముగియనున్న ఇష్యూలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 305-306 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 300 కోట్ల విలువైన వాటాను విక్రయించనున్నాయి. దీనికి అదనంగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఏంజెల్ బ్రోకింగ్ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. ఏంజెల్ బ్రోకింగ్ ఐపీవోకు కనీస లాట్ 49 షేర్లు. అంటే ఆసక్తి కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 49 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ పెట్టుబడులు ఐపీవోలో భాగంగా ఏంజెల్ బ్రోకింగ్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 306 ధరలో 58.8 లక్షల షేర్లను 12 సంస్థలకు కేటాయింంచింది. ఏంజెల్ బ్రోకింగ్‌లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, మెక్వారీ ఫండ్ సొల్యూషన్స్, ఇన్వెస్కో ట్రస్టీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితరాలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న 8వ కంపెనీ కావడం గమనార్హం! -
రూట్ మొబైల్ ఐపీవోకు యాంకర్ నిధులు
ఐపీవోలో భాగంగా ఓమ్నిచానల్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ రూట్ మొబైల్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 350 ధరలో 15 సంస్థలకు దాదాపు 51.43 లక్షల షేర్లను జారీ చేసింది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తదితరాలున్నాయి. లాట్ 40 షేర్లు రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమైంది. శుక్రవారం(11న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 345-350. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షలకు మించకుండా బిడ్స్ దాఖలు చేయవచ్చు. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు సందీప్ కుమార్ గుప్తా, రాజ్‌దీప్ కుమార్ గుప్తా రూ. 360 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. వీటికి అదనంగా మరో రూ. 240 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని రూట్ మొబైల్ భావిస్తోంది. చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ వివరాలు రూట్ మొబైల్ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్ప్రైజెస్, మొబైల్ ఆపరేటర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్ టు పీర్(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్, ఓటీటీ బిజినెస్ మెసేజింగ్, వాయిస్, ఓమ్ని చానల్ కమ్యూనికేషన్ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటికే లిస్టయిన అఫ్లే ఇండియాతో రూట్ మొబైల్ కార్యకలాపాలను పోల్చవచ్చని విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. -
మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ లిస్టింగ్ భేష్
గత నెలాఖరున పబ్లిక్ ఇష్యూకి వచ్చిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ(రీట్) ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 275కాగా.. బీఎస్ఈలో రూ. 29 లాభంతో రూ. 304 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 309 వరకూ ఎగసింది. ఇది 12 శాతం వృద్ధికాగా.. ఒక దశలో రూ. 299 వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 10 శాతం జంప్‌చేసి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. జులై 27న ముగిసిన ఇష్యూకి 13 రెట్లు అధికంగా స్పందన లభించిన విషయం విదితమే. రహేజా గ్రూప్ కె.రహేజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ గత నెలలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించింది. తద్వారా 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ తదుపరి వచ్చిన రెండో రీట్ ఇష్యూగా నిలిచింది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు మైండ్‌స్పేస్ సెబీకి దాకలు చేసిన ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కాగా.. ఐపీవో ద్వారా ఇంతక్రితం ఎంబసీ ఆఫీస్ రీట్ రూ. 4,750 కోట్లు సమీకరించింది. బ్యాక్‌గ్రౌండ్ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఏర్పాటులో ప్రమోటర్లు రహేజా గ్రూప్‌తోపాటు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. సెబీ వద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సంస్థగా రిజిస్టర్ అయిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్.. మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ ప్రాపర్టీలను కలిగి ఉంది. మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల మార్కెట్ విలువను 2020 మార్చికల్లా రూ. 23,675 కోట్లుగా మదింపు చేసినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా లీజుల(అద్దెలు) రూపంలో ఆదాయాన్ని పొందుతుంటుంది. యూనిట్ హొల్డర్లకు డివిడెండ్ల రూపంలో ఆదాయం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ప్రైమరీ మార్కెట్ నుంచి రూ.1.50లక్షల కోట్ల సమీకరణ
ప్రాథమిక మార్కెట్లో అనూహ్యంగా యాక్టివిటీ పెరగడంతో కంపెనీలు కేవలం 5రోజుల్లో ఆయా మార్గాల్లో దాదాపు రూ.26వేల కోట్ల నిధులను సమీకరించాయి. డెట్ విభాగంలో దేశీయ కంపెనీలు భారత్ బాండ్ ఈటీఎఫ్ ఇష్యూ ద్వారా రూ.11వేల కోట్లను సమీకరించాయి. ఈక్విటీ విభాగంలో యస్‌బ్యాంక్ ఎఫ్‌పీఓ ఇష్యూ ద్వారా రూ.14750 కోట్ల సేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. అలాగే ఐపీఓ ప్రక్రియ ద్వారా కెమికల్స్ తయారీ సంస్థ రోసారీ బయోటెక్ దాదాపు రూ.500 కోట్లను సమీకరించింది. మైండ్‌స్పేస్ పార్క్స్ ఆర్ఈఐటీ ఐపీఓ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.4,500 కోట్లను సమీరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వ్యూహాత్మక, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.2644 కోట్ల నిధులను సమీకరించింది. వచ్చే 4క్వార్టర్లో రూ.1.50లక్షల కోట్ల సమీకరణ: వచ్చే 4క్వార్టర్లో ప్రైమరీ మార్కెట్ నుంచి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు దాదాపు రూ.1.50లక్షల కోట్ల నిధుల సమీకరణ జరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం తర్వాత మార్కెట్లో సానుకూల వాతావరణం పరిస్థితులను వినయోగించుకొని నిధుల సమీకరణ చేపట్టాలని అగ్రశ్రేణి బ్యాంకులు భావిస్తున్నాయి. టైర్-1 మూలధన అవసరాలను తీర్చుకోవడం, తగినంత లిక్విడిటీ ఏర్పాటు చేసుకోవడంతో పాటు స్వల్పంగా నెలకొన్న ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోనేందుకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్, యాక్సిస్ బ్యాంక్‌లు రూ.80వేల కోట్ల నిధుల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని ప్రైమ్ డాటాబేస్ ఛైర్మన్ పృథ్వీ హాల్దియా తెలిపారు. యస్‌బ్యాంక్ ఎఫ్‌పీఓ, రోసారి బయోటెక్ ఐపీఓకు లీడ్ మేనేజ్ సంస్థగా వ్యవహరించే యాక్సిస్ క్యాపిటల్ ఛైర్మన్ సలీల్ పాటిల్ మాట్లాడుతూ ‘‘ క్యాపిటల్ మార్కెట్లో ఊహించని విధంగా లిక్విడిటీ పెరిగింది. ఇది ఇష్యూయర్లకు మూలధన్ని పెంచుకునేందుకు, బ్యాలెన్స్ షీట్‌ను బలపరుచుకునేందుకు మంచి అవకాశంగా మారింది.’’ అని తెలిపారు. మార్కెట్ల ర్యాలీ కంటే నిధుల సమీకరణే ముఖ్యం: ఇటీవల సెబీ నిధుల సమీకరణ నియమాలను మరింత సరళతరం చేయడంతో రియలన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, పీవీఆర్ కంపెనీలు రైట్స్ ఇష్యూల మార్గాన్ని ఎంచుకున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ నుంచి యాక్టవిటీ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు విశ్వసిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల ర్యాలీ కంటే మూలధన నిధుల సమీకరణ అవసరమని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. ప్రాథమిక మార్కెట్లో దాదాపు 4నెలల విరామం తర్వాత ఈ ఇష్యూలు వచ్చాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న బలహీనతల కారణంగా కొందరు ఇన్వెస్టర్లు ఇప్పటికీ జాగ్రత్త వహిస్తున్నారు. వ్యవస్థలో తగినంత ద్రవ్యత్య లభ్యత ఉన్నందున సెకండరీ మార్కెట్లో షేర్లు ర్యాలీ చేస్తాయి. ద్రవ్య లభ్యత తగినంత లభిస్తున్నందున మూలధన నిధుల సమీకరణకు వచ్చిన ఇష్యూలు విజవంతం అవుతున్నాయి. ఉదాహరణకు రోసారి బయోటెక్ ఐపీఓ 79రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 15వేల కోట్ల లక్ష్యంగా ప్రాథమిక మార్కెట్లోకి రాగా, రూ.11వేలను సమీకరించింది. దేశంలో అతిపెద్ద ఎఫ్‌పీఓ ఇష్యూ 95శాతం సబ్‌స్కైబ్ అయ్యింది. -
ఈ ఏడాది ఐపీఓల హల్చల్
సాక్షి, బిజినెస్ విభాగం: పబ్లిక్ ఇష్యూల జోరు ఈ ఏడాదీ కొనసాగనుంది. గతేడాది పలు కంపెనీలు ఐపీఓల ద్వారా రికార్డ్ స్థాయిలో నిధులు సమీకరించాయి. మొత్తంగా 36 ప్రధాన కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్లు సమీకరించాయి. ఇది ఇప్పటివరకూ రికార్డ్. గత ఏడాది లిస్టయిన 36 కంపెనీల్లో 27 ఇన్వెస్టర్లకు మంచి రాబడులే ఇచ్చాయి. ఈ ఏడాది ఆ రికార్డు బద్దలయ్యే అవకాశాలున్నాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పదికి పైగా కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.12,000 కోట్ల మేర నిధులు సమీకరించడానికి సెబీ నుంచి ఆమోదం పొందాయి. రూ.19,000 కోట్ల సమీకరణ కోసం మరో 10 కంపెనీలు సెబీకి దరఖాస్తులు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను చూసుకున్నా... వాటిలో సెబీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ వాటాను 75 శాతానికి పరిమితం చేసుకోవాల్సి ఉంది. దీంతో 18 సంస్థల్లో వాటాను ప్రభుత్వం తగ్గించుకోవాల్సి ఉంది. దీని కోసం ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఐపీఓల ద్వారా రూ.27,520 కోట్లు సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కాని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఓకు రానున్న ప్రధాన కంపెనీలు, వాటి వివరాలు చూస్తే... హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ ఏడాది మార్చిలోగానే ఈ కంపెనీని లిస్ట్ చేయాలని హెచ్డీఎఫ్సీ యోచిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ.2.69 లక్షల కోట్లు. ఈ ఐపీఓ ద్వారా 10% వాటాకు సమానమైన షేర్ల జారీ చేసి రూ.4,000 కోట్ల వరకూ సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో లిస్టవుతున్న రెండో మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇది. ఇప్పటికే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఎట్టకేలకు ఎన్ఎస్ఈ! గత ఏడాది బోంబే స్టాక్ ఎక్సే్ఛంజీ (బీఎస్ఈ) ఇష్యూకి మంచి స్పందన రావడంతో ఇప్పుడు అందరి కళ్లూ ఎన్ఎస్ఈపై పడ్డాయి.ఎన్ఎస్ఈ ఐపీఓ కూడా ఈ ఏడాదే వచ్చే అవకాశాలున్నాయి. దీని ద్వారా రూ.10,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఎన్ఎస్ఈలో వాటాదారులైన ఎస్బీఐ, ఎల్ఐసీ, ఐఎఫ్సీఐ, ఐడీబీఐ బ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, స్టాక్ హోల్డింగ్ కార్ప్, టైగర్ గ్లోబల్, సిటీ గ్రూప్ తదితర కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా తమ వాటాను కానీ, తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్ వస్తోంది.. గత ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రి, న్యూ ఇండియా ఎష్యూరెన్స్లు లిస్టయ్యాయి. ఈ ఏడాది మరో నేషనల్ ఇన్సూరెన్స్ ఐపీఓకు రానుంది. ఐపీఓ ద్వారా 10–15% వాటా విక్రయించే అవకాశాలున్నాయి. ఐపీఓ పరిమాణం రూ.2,000–రూ.3,000 కోట్లు ఉండొచ్చు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్.. ఐసీఐసీఐ బ్యాంక్ పూర్తి అనుబంధ కంపెనీ ఇది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఈ బ్యాంక్ 6,44,28,280 షేర్లను జారీ చేయనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ లిస్ట్ చేస్తున్న నాలుగో గ్రూప్ కంపెనీ ఇది. భారత్‌లో అతి పెద్ద బ్రోకరేజ్ సంస్థ ఇదే. రూ.5,000 కోట్లు సమీకరించొచ్చని అంచనా. ఐదు రైల్వే ఐపీఓలు కూడా! రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీ, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సీ, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), ఆర్ఐటీఈఎస్ కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్లు గతేడాది ప్రారంభంలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కానీ వివిధ రైల్వే సంస్థల మధ్య ఆర్థికాంశాలు పరిష్కారం కావలసి ఉండటంతో ఈ ఐపీఓ ప్రణాళికలు అటకెక్కాయి. ఐఆర్సీటీసీ సర్వీస్ చార్జీ అంశంపైన, ఐఆర్ఎఫ్సీ పన్ను బాధ్యతపైన స్పష్టత రావాల్సి ఉంది. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ఐపీఓకు రావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ ఐదు రైల్వే ఐపీఓల ద్వారా సుమారుగా రూ.8,000 కోట్లు సమీకరించవచ్చు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్.. రక్షణ రంగ పరికరాలు తయారు చేస్తున్న ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ ఇది. పది శాతం వాటాకు సమానమైన 3,61,50,000 షేర్లను ఆఫర్ ఫర్‌సేల్ విధానంలో కేంద్రం విక్రయించనుంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.2,000– 2,500 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.19,597 కోట్ల ఆదాయంపై రూ.2,625 కోట్ల నికర లాభం సాధించింది. లాభదాయకత విషయంలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఈ కంపెనీ సొంతం. 40 ఏళ్లుగా ఏటా డివిడెండ్లు చెల్లిస్తోంది. దీర్ఘకాలంలో పవన్ హాన్స్, ఎయిర్పోర్ట్ అ«థారిటీ ఐపీఓలనూ తెచ్చే అవకాశాలున్నాయి. -
బఫెట్ చెప్పిందే నిజమా..!
(సాక్షి, బిజినెస్ విభాగం): ‘‘ఐపీవోలకు దూరంగా ఉండాలి’’ అని విఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పిన మాటలు... మన దేశ ఐపీవో మార్కెట్లో అక్షర సత్యాలని రుజువవుతున్నాయి. ఇందుకు ఇటీవలి ఐపీవోలే పెద్ద తార్కాణం. నిన్న ఖాదిమ్ ఇండియా దానికి ముందు న్యూ ఇండియా అష్యూరెన్స్, అంతకు ముందు వచ్చిన జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్, ఎరిస్ లైఫ్ సైన్సెస్, సీఎల్ ఎడ్యుకేట్ ఒక్కటేమిటి... పదుల సంఖ్యలో కంపెనీలు ఇటీవల ప్రజల వద్ద ఐపీవో రూట్లో భారీగా నిధులు రాబట్టి, ఆ తర్వాత లిస్టింగ్‌లో ఉసూరుమనిపించాయి. చిన్న ఇన్వెస్టర్లను తలపట్టుకునేలా చేశాయి. ‘‘ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయకూడదు’’ అనేది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు పాటించే కట్టుబాటు. ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయవద్దని వారు రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా సూచిస్తుంటారు. ఇటీవలి మన ఐపీవో మార్కెట్ తీరుతెన్నులను పరికించి చూస్తే వేల్యూ ఇన్వెస్టర్లు ఎందుకు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు వచ్చిన 30 ఐపీవోల్లో సగానికిపైగా ఇష్యూలు ప్రతికూల రాబడులను ఇచ్చినవే. మొత్తం మీద 60 శాతం ఇష్యూల రాబడులు స్టాక్ మార్కెట్ల రాబడుల స్థాయిలో లేకపోవడం నేతిబీర చందాన్ని తలపిస్తోంది. మంచి రాబడులను ఇచ్చిన వాటిలో ఐదు కంపెనీలే ఉన్నాయి. అవి 100 శాతానికిపైగా రిటర్నులిచ్చాయి. వీటిలో డీమార్ట్, సీడీఎస్ఎల్ తదితర కంపెనీలున్నాయి. పైగా బోలెడన్ని రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన ఈ ఇష్యూల్లో షేర్లు అలాట్ అయిన కొద్ది మందికే ఆ లాభాలొచ్చాయి. లిస్టింగ్ తరవాత కొనుగోలు చేసినవారికి ఆ స్థాయి లాభాలు లేవు. ‘‘లిస్టింగ్ లాభాలే సామాన్య ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ఈ తరహా రాబడుల ఆకర్షణతోనే రిటైల్ ఇన్వెస్టర్లు వచ్చిన ప్రతీ ఐపీవోకు పోటీపడి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీవోలను గమనిస్తే ఇదే తెలుస్తోంది’’ అని విశ్లేషకులు చెబుతున్నారు. లిస్టింగ్ లాభాల కోసం ఐపీఓకు దరఖాస్తు చేస్తున్నారని, దీం తో అధిక ధరల వద్ద ఇరుక్కుపోయి, ఎక్కడో ఒకచోట నష్టానికి అమ్మి బయటపడుతున్నారని వారు వివరించారు. కంపెనీలకు కాదు, పెట్టుబడిదారులకు.. ఈ ఏడాది పలు కంపెనీలు ఐపీఓ మార్గంలో ఇప్పటిరకు రూ.42,000 కోట్లు సమీకరించాయి. ఓ ఏడాదిలో ఈ స్థాయిలో సమీకరణ అన్నది ఐపీవో మార్కెట్లో రికార్డే. వచ్చిన ఇష్యూల్లో దాదాపు 80 శాతం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో నిధులు సమీకరించినవే. ఈ ఏడాదే కాదు!! గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ఇష్యూలను గమనించినా ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో వచ్చినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ఇష్యూల్లో మూడింట ఒక వంతు వాటిలో ప్రమోటర్లు, పీఈ సంస్థలు ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో తమ వాటాలను విక్రయించి సొమ్ము చేసుకోవటం గమనార్హం. ఆఫర్ ఫర్ సేల్ అంటే... ఐపీవోలో ప్రమోటర్లు, అప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయానికి ఉంచడం. కంపెనీ ఈక్విటీ నుంచి వాటాల జారీ ఉండదు కనుక ఈ విధంగా సేకరించిన నిధులన్నీ ప్రమోటర్లు, పీఈ సంస్థలకే వెళతాయి. ఐపీవో నిధుల్లో కంపెనీల వృద్ధికి కేటాయిస్తున్నవి చాలా పరిమితంగా ఉండటం దురదృష్టకరం. కానీ, గతంలో కంపెనీలు తమ వ్యాపార విస్తరణ ప్రాజెక్టులకు నిధుల కోసమే ఐపీవోలకు వస్తుండటం సహజంగా జరిగేది. 2006–07 మధ్య ఐపీవోలకు వచ్చిన కంపెనీల్లో ఎక్కువగా ఇవే ఉన్నాయి. కాబట్టే అవి ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఇవ్వగలిగాయి. రెండింటికీ తేడా ఏంటి? కంపెనీలు విస్తరణ చేపట్టాలనుకుని, దానికి నిధుల్లేక ఐపీఓకు వచ్చాయనుకోండి. మనం ఇన్వెస్ట్ చేసిన సొమ్ము నేరుగా కంపెనీకి వెళుతుంది. విస్తరణపై ఆ పెట్టుబడులు పెడతారు కనక కంపెనీతో పాటు దాని విలువ కూడా పెరుగుతుంది. దాంతో ఇన్వెస్టర్ల షేర్ విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇపుడు చాలా కంపెనీలు తమ విస్తరణ కోసం పీఈ ఇన్వెస్టర్ల దగ్గరో, ఇతర సంస్థల దగ్గరో పెట్టుబడులు తీసుకుంటున్నాయి. వారు ఏదో ఒక సమయంలో బయటకు వెళ్ళాలనుకున్నపుడు... వారి వాటాలను ఐపీఓలో విక్రయిస్తున్నారు. సహజంగానే ఈ ఐపీఓ ద్వారా వారు తమ పెట్టుబడులకు లాభాలు కావాలనుకుంటారు కనక షేరు విలువను మరీ ఎక్కువగా నిర్ణయిస్తున్నారు. దీంతో సగటు ఇన్వెస్టరుకు మిగిలేది ఏమీ ఉండటం లేదు. సొమ్ము చేసుకుంటున్నారు... ఇది ఆందోళన కలిగించే ధోరణే. ఐపీవోల్లో నిధుల సమీకరణ అన్నది అధిక శాతం కొత్త ప్రాజెక్టుల కోసం, ప్లాంట్ల ఏర్పాటుకు, విస్తరణ కోసం జరగడం లేదు. కేవలం ప్రైవేటు ఈక్విటీ లేదా వెంచర్ క్యాపిటల్ లేదా ప్రమోటర్ల జేబుల్లోకే వెళుతోంది’’ – ప్రణవ్ హాల్దియా, ప్రైమ్ డేటా బేస్ ఎండీ దూరంగా ఉండండి ‘‘ఐపీఓ మార్కెట్లో బుడగలు పేరుకుపోయాయి. అవి పగిలే వరకు దూరంగా ఉండడం మేలు. తాజా పేలవ లిస్టింగ్‌లతో భవిష్యత్‌లో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చే కంపెనీలు ఇష్యూ ధరలను సరసమైన శ్రేణిలో నిర్ణయిస్తాయి. అవసరమైతే రెండు మూడు నెలల పాటు వేచి చూసి తక్కువ, లేదా సరసమైన విలువలను నిర్ణయించి ఐపీవోకు వస్తాయి’’ – రాకేశ్ జున్‌జున్‌వాలా, ప్రముఖ ఇన్వెస్టర్ వీటికి దూరంగా ఉండటమే మంచిది! నిపుణుల విశ్లేషణ ప్రకారం... ఓ కంపెనీలో అప్పటికే పెట్టుబడులు పెట్టిన ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు ఆ కంపెనీ గురించి సమస్త సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. దీంతో ఆ కంపెనీకి భవిష్యత్తు వ్యాపార వృద్ధి అవకాశాలు ఆశాజనకంగా లేకపోయినా లేదా మార్కెట్ సానుకూల పరిస్థితుల వల్ల తమ పెట్టుబడులకు అధిక విలువ లభిస్తుందని భావించినా వారు ఎగ్జిట్ అవడానికి ఐపీవోను ఎంచుకుంటున్నారు. కారణం ఏదైనా ఈ తరహా ఇష్యూలకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండటం మంచిదని విశ్లేషకుల సూచన. అన్నీ ఒక్కటే కాదు... అలాగని ఐపీఓలన్నిటినీ ఒకే గాటన కట్టడానికి లేదు. ఇప్పుడు ఐపీఓకు వచ్చిన చిన్న కంపెనీలు భవిష్యత్తు ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ తరహా కంపెనీలుగా ఎదగటానికి అవకాశాలు లేకపోలేదు. కానీ అలాంటివి అరుదుగా వస్తుంటాయి. నిజానికి ఇలాంటి కంపెనీలు కూడా ఐపీఓలో అధిక ధరలకే షేర్లు జారీ చేసే పోకడ ప్రస్తుతం కనుక ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల షేర్ల ధరలు తక్కువకు అందుబాటులోకి వచ్చే వరకు ఓపికగా వేచి ఉండి క్యాచ్ చేయాలన్నది నిపుణుల సూచన. -
ఐపీవో నిధుల దుర్వినియోగంపై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: నిబంధనలపరమైన లొసుగులను ఉపయోగించుకుని ఐపీవో నిధులను కొన్ని కంపెనీల ప్రమోటర్లు దుర్వినియోగం చేస్తుండటంపై సెబీ దృష్టి సారించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా నిబంధనలు కఠినతరం చేయనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను నిర్దేశిత లక్ష్యానికి వినియోగించే దాకా బ్యాంకుల్లోనే తప్పనిసరిగా డిపాజిట్ చేసి ఉంచేలా నిర్దేశించాలని సెబీ బోర్డు నిర్ణయించింది. ఐపీవో నిధులను కొన్ని సంస్థల ప్రమోటర్లు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లు (ఐసీడీ)గా మార్చుకోవడాన్ని గుర్తించిన సెబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.