న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభిస్తోంది. బుధవారం(14న) తొలిరోజే ఇష్యూకి పూర్తి స్థాయిలో సబ్‌స్క్రిప్షన్ లభించింది. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఐపీవోలో భాగంగా కంపెనీ 71.92 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 75.6 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 12.95 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 34.88 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. వెరసి 2.7 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి.
సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 13 శాతమే స్పందన లభించగా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో దాదాపు పూర్తిస్థాయిలో బిడ్స్ నమోదయ్యాయి. ఉద్యోగులకు కేటాయించిన విభాగంలో 18% దరఖాస్తులే వచ్చాయి. షేరుకి రూ.72–76 ధరలో ప్రారంభమైన ఇష్యూ శుక్రవారం (16న) ముగియనుంది. ఇష్యూ ద్వారా రూ.9,375 కోట్లు సమీకరించనుంది.
చదవండి : Apple pay in 4: ఇప్పుడు కొనుక్కోండి తర్వాతే పే చేయండి
Comments
Please login to add a commentAdd a comment