బెంగళూరుకు చెందిన సీఆర్‌డీఎం(కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్) సేవలందిస్తున్న యాంథెమ్ బయోసైన్సెస్ తాజాగా ఐపీవో(IPO) ద్వారా రూ.3,395 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు గణేష్ సాంబశివం, రవీంద్ర చంద్రప్పతో పాటు ఇతర ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను విక్రయించనున్నారు.
ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..
ఇష్యూ పూర్తిగా ఓఎఫ్‌ఎస్ విధానంలో ఉంటుంది. సమీకరించిన నిధులన్నీ విక్రయదార్లకు చెందుతాయి. 2006లో ఏర్పాటైన యాంథెమ్ సంస్థ బెంగళూరు కేంద్రంగా కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, తయారీ సంస్థగా (CRDMO) కార్యకలాపాలు సాగిస్తోంది. కర్ణాటకలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్ 2025 ప్రథమార్ధంలో అందుబాటులోకి రానుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.1,419 కోట్ల ఆదాయంపై రూ.367 కోట్ల లాభం నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment