IPO Fund Raising
-
తొలిరోజే ఫుల్ సబ్‌స్క్రైబ్ అయిన ఐపీవో
ఫార్మా రంగానికి ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో(IPO) తొలిరోజు 13.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆఫర్లో 2.08 కోట్ల షేర్లకు గాను 27.75 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. గ్రే మార్కెట్లో షేర్లు రూ.97 ప్రీమియంతో ట్రేడయ్యాయి. సేల్‌ను ప్రారంభించిన నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్(Subscribe) కావడం విశేషం.బిడ్డింగ్ రౌండ్లో ముందున్న నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) విభాగం 25.43 రెట్లు, రిటైల్(Retail) ఇన్వెస్టర్స్ 14.46, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIB) విభాగం 1.82 రెట్లు సబ్‌స్రైబ్ అయింది. షేర్లను జనవరి 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయనున్నారు. ఇష్యూ జనవరి 8న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133–140 మధ్య నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1.42 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. ఇన్వెస్టర్లు కనీసం 107 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.123 కోట్లు అందుకుంది.ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!క్వాడ్రంట్ ఫ్యూచర్‌కు యాంకర్ నిధులురైల్వే సిగ్నలింగ్, రక్షణ(కవచ్) వ్యవస్థలకు సేవలందించే కంపెనీ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ యాంకర్ ఇన్వెస్టర్లకు 45 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా దాదాపు రూ.131 కోట్లు అందుకుంది. ఎంఎఫ్ సంస్థలు వైట్ఓక్ క్యాపిటల్, కొటక్, ఎల్ఐసీ, బీవోఐసహా సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ తదితర 22 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ.290 ధరలో షేర్లను జారీ చేయనుంది. రూ.275–290 ధరల శ్రేణిలో నేడు ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ.290 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అభివృద్ధి, రుణ చెల్లింపులు తదితరాలకు వినియోగించనుంది. -
ఐపీవో బాటలో మరో కంపెనీ
స్టీల్ తయారీలో సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏవన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల(Cpaital Market) నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వాటిలోని వివరాల ప్రకారం ఐపీవో(IPO) కింద రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ.50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు సందీప్ కుమార్, సునీల్ జలాన్, క్రిషన్ కుమార్ జలన్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ.650 కోట్లు అందుకునే యోచనలో కంపెనీ ఉంది.ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 85.56 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ అనుబంధ సంస్థ వినయ స్టీల్స్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. సంస్థ విస్తరణకు వీలైన మెషీనరీ కొనుగోలు, సొంత అవసరాల కోసం సోలార్ ఎనర్జీ(Solar Energy)ని సమకూర్చుకోవడం తదితరాలు చేపట్టనుంది. దాంతోపాటు మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: 1,673 కోట్ల యూపీఐ లావాదేవీలుఆంధ్రప్రదేశ్లోనూ..బెంగళూరు కంపెనీ ఏవన్ స్టీల్స్ ఇండియా విభిన్న ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ముడిస్టీల్ సామర్థ్యంరీత్యా దక్షిణాదిలోని టాప్–5 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని యూనిట్‌తోపాటు కర్ణాటకలో మరో 5 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా స్టీల్ తయారీలో వినియోగించే లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టులుసహా ఇండ్రస్టియల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2024 జూన్30కల్లా వార్షికంగా 14.97 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ ప్రొడక్టుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంఎస్పీ స్టీల్ అండ్ పవర్, బాలాజీ ఇండస్ట్రీస్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీతో పోటీ పడుతోంది. -
రూ.3,395 కోట్ల ఐపీవోకు రంగం సిద్ధం
బెంగళూరుకు చెందిన సీఆర్‌డీఎం(కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్) సేవలందిస్తున్న యాంథెమ్ బయోసైన్సెస్ తాజాగా ఐపీవో(IPO) ద్వారా రూ.3,395 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు గణేష్ సాంబశివం, రవీంద్ర చంద్రప్పతో పాటు ఇతర ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను విక్రయించనున్నారు.ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ విధానంలో ఉంటుంది. సమీకరించిన నిధులన్నీ విక్రయదార్లకు చెందుతాయి. 2006లో ఏర్పాటైన యాంథెమ్ సంస్థ బెంగళూరు కేంద్రంగా కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, తయారీ సంస్థగా (CRDMO) కార్యకలాపాలు సాగిస్తోంది. కర్ణాటకలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్ 2025 ప్రథమార్ధంలో అందుబాటులోకి రానుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.1,419 కోట్ల ఆదాయంపై రూ.367 కోట్ల లాభం నమోదు చేసింది. -
ఐపీఓకు సిద్ధమవుతున్న మరిన్ని కంపెనీలు
ఐపీఓల పర్వం కొనసాగుతున్న తరుణంలో కొత్తగా మరికొన్ని కంపెనీలు నిధులు సమీకరణకు పూనుకుంటున్నాయి. ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ అనే వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.850 కోట్లు నిధులు సమీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ముసాయిదా పత్రాలను(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్-DRHP)దాఖలు చేసింది. ఇందుకు సెబీ(SEBI) అనుమతిస్తే ఐపీఓకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు, మరో రూ.100 కోట్లు ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులు సమీకరించనున్నారు. ఇలా వచ్చిన నిధులను మూలధన వ్యయాలకు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త కేంద్రాల ఏర్పాటుకు రూ.462.6 కోట్లు, రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ట్యాక్సీ సేవల యాప్స్‌పై విచారణకు ఆదేశంఇండో ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఐపీఓ(IPO)కు రానున్నట్లు ప్రకటించింది. తాజా ఇష్యూ ద్వారా రూ.260.15 కోట్ల నిధులను సమీకరిచనున్నట్లు తెలిపింది. ఈ ఇష్యూ 2024 డిసెంబర్ 31 మంగళవారం ప్రారంభం కానుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.204 నుంచి రూ.215 మధ్య ఉంటుంది. ఇందులో 86 లక్షల షేర్లతో ఐపీఓ ద్వారా రూ.184.9 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.75.25 కోట్ల విలువైన 35 లక్షల షేర్లను విక్రయించనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు 69 షేర్లకు కనీస పెట్టుబడి రూ.14,835 కలిగి ఉండాలని తెలిపింది. స్మాల్ నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (SNII) 966 షేర్లకు కనీస పెట్టుబడి రూ.2,07,690 అవసరం అవుతుంది. బిగ్ నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (BNII) 4,692 షేర్లకు కనీస పెట్టుబడి రూ.10,08,780 కలిగి ఉండాలి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ లిస్టింగ్ తేదీ జనవరి 7, 2025గా నిర్ణయించారు. ఐపీఓ జనవరి 2న ముగియనుండగా, తుది కేటాయింపు 2025 జనవరి 3న జరగనుంది. -
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ రూ.1,000 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ గ్రీవ్స్(Greaves) ఎలక్ట్రిక్ మొబిలిటీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ.1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.మరో 18.9 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ప్రమోటర్ గ్రీవ్స్ కాటన్ 5.1 కోట్ల షేర్లను, ఏఎల్‌జే గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ డీఎంసీసీ 13.8 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. కంపెనీ యాంపియర్ బ్రాండుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు(EV Scooters), మరో బ్రాండుతో త్రిచక్ర ఈవీలను రూపొందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.375 కోట్లు బెంగళూరు టెక్నాలజీ కేంద్రంలో ప్రొడక్ట్, సాంకేతిక అభివృద్ధికి, రూ.83 కోట్లు సొంత బ్యాటరీ అసెంబ్లీ సామర్థ్యాలకు, రూ.38 కోట్లు ఎంఎల్ఆర్ ఆటో తయారీ సామర్థ్య పెంపునకు, బెస్ట్‌వే ఏజెన్సీస్ ప్రయివేట్ తయారీ విస్తరణకు మరో రూ.20 కోట్లు చొప్పున వెచ్చించనుంది.ఇదీ చదవండి: గగనతలంలో 1.42 కోట్ల మందికంపెనీ తెలంగాణ(తూప్రాన్), తమిళనాడు(రాణీపేట్), ఉత్తరప్రదేశ్(గ్రేటర్ నోయిడా)లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. గతేడాది(2023–24) రూ.612 కోట్ల ఆదాయం సాధించింది. -
మార్కెట్లోకి మరో కొత్త ఐపీఓ
మమతా మెషినరీ లిమిటెడ్ స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. డిసెంబర్ 19 గురువారం రోజున కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రారంభం అవుతుందని సంస్థ తెలిపింది. ఈ ఐపీవో ధర కంపెనీ రూ.179 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. అందుకు ఒక్కో షేరుకు రూ.230-243 ధర నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 23, 2024న ముగుస్తుంది.ఈ సంస్థ ప్రధానంగా ప్యాకేజింగ్ యంత్రాల తయారీ, ఎగుమతి, వాటికి సర్వీస్ అందిస్తోంది. ప్లాస్టిక్ సంచులు, పౌచ్‌లు, ఎక్స్‌ట్రూషన్ పరికరాలను తయారు చేసే యంత్రాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ప్యాకేజింగ్ పరిశ్రమలో ఎండ్-టు-ఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ), ఫుడ్ & బెవరేజ్ పరిశ్రమలకు సర్వీస్ చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే యంత్రాలను ‘వెగా’, ‘విన్’ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్నారు. 75కి పైగా దేశాలకు ఈ సంస్థ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?ఐపీఓ అలాట్ అవ్వాలంటే..ఒకటికి మించిన పాన్ కార్డుల ద్వారా ఐపీఓ దరఖాస్తు చేసుకుంటే షేర్ల అలాట్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు వేస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమర్పించడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచ్చితంగా మెరుగుపడతాయి. -
రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
రియల్టీ సంస్థ కల్పతరు లిమిటెడ్‌తోపాటు, హైప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో కల్పతరు పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. యూనిమెక్ ఏరోస్పేస్ తాజాగా ఈక్విటీ జారీసహా ప్రమోటర్లు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రెండు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి.రూ.1,590 కోట్లపై దృష్టికల్పతరు కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం సంస్థ ఐపీవోలో భాగంగా రూ.1,590 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో దాదాపు రూ.1,193 కోట్లు కల్పతరు గ్రూప్ కంపెనీ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కల్పతరు గ్రూప్‌లో కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, ప్రాపర్టీ సొల్యూషన్స్(ఇండియా), శ్రీ శుభం లాజిస్టిక్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..రూ.500 కోట్ల సమీకరణఐపీవోలో భాగంగా యూనిమెక్ ఏరోస్పేస్ రూ.250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర మెషీనరీ, పరికరాల కొనుగోలు ద్వారా విస్తరణకు వినియోగించనుంది. ఈ బాటలో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు తదితరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. -
ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..
రెనెవబుల్ ఎనర్జీ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి రూ.275–289 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.2,395 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.505 కోట్ల విలువైన షేర్లను ఆక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ.2,900 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(5న) షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.1,795 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సోలార్ పవర్ ప్రాజెక్టుల కంపెనీ సమీకృత పునరుత్పాదక ఇంధన సంస్థగా ఆవిర్భవించింది. 2024 జూన్‌కల్లా నిర్వహణలోని 28 ప్రాజెక్టులను కలిగి ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్‌లలోనే 18 ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుత సామర్థ్యం 1,320 మెగావాట్లుకాగా.. 1,650 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. గతేడాది రూ. 1,319 కోట్ల ఆదాయం, రూ. 698 కోట్ల నికర లాభం సాధించింది.ధర శ్రేణి: రూ. 275–289రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 51 షేర్లు లిస్టింగ్: 13ననివా బూపాఆరోగ్య బీమా రంగ కంపెనీ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ గురువారం(7న) ప్రారంభంకానుంది. 11న ముగియనున్న ఇష్యూకి రూ.70–74 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.1,400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ.2,200 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రేపు(6న) షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో 62.19 శాతం వాటాగల బూపా సింగపూర్ హోల్డింగ్స్ రూ.350 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. 26.8 శాతం వాటా కలిగిన ఫెటల్ టోన్ ఎల్ఎల్పీ రూ.1,050 కోట్ల విలువైన వాటాను విక్రయించనుంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ మార్కెట్లో స్టార్ హెల్త్ తదుపరి స్టాండెలోన్ కంపెనీగా లిస్ట్‌కానుంది. గతేడాది మొత్తం ప్రీమియం ఆదాయం 38 శాతం జంప్‌చేసి రూ.5,608 కోట్లకు చేరింది. రూ.82 కోట్ల నికర లాభం ఆర్జించింది.ధర శ్రేణి: రూ. 70–74 రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 200 షేర్లు లిస్టింగ్: 14నఇదీ చదవండి: బేర్ ఎటాక్..!కార్దేఖోఆటో క్లాసిఫైడ్స్ పోర్టల్ కార్దేఖో పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లను నియమించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో 2021 ఆగస్ట్‌లో వెలువడిన కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్ ఐపీవో తదుపరి రెండో ఆటో క్లాసిఫైడ్ లిస్టెడ్ సంస్థగా కార్దేఖో నిలవనుంది. -
IPO: నెలలో రూ.15వేల కోట్లు సమీకరించే కంపెనీలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబరులో దాదాపు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి ద్వారా వచ్చే నెల రోజుల్లో దాదాపు రూ.15,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ డజన్ కంపెనీల్లో ఇప్పటికే బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ ప్రారంభం అయింది. సెల్లో వరల్డ్ ఇష్యూ తేదీలను ప్రకటించింది. టాటా టెక్నాలజీస్, మామాఎర్త్, ఏఎస్కే ఆటోమోటివ్, ప్రోటీన్ ఈగవ్ టెక్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ పబ్లిక్ ఆఫర్లు నవంబరులో రానున్నాయి. వీటితో మొత్తం దాదాపు రూ.15వేలకోట్లు సమీకరించే వీలుంది. రూ.1,900 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న సెల్లో వరల్డ్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.617-648గా నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ అక్టోబర్ 27 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ రూ.840 కోట్లు సమీకరించనుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ రెండు లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇరవయ్యేళ్లలో టాటా గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇది. దీని ఒక్కో షేరు ధర శ్రేణి రూ.400 నుంచి రూ.500 మధ్య ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. చివరగా 2004లో టాటా సంస్థల నుంచి టీసీఎస్ ఐపీఓగా వచ్చింది. హొనాస కన్జ్యూమర్(మామాఎర్త్ మాతృసంస్థ) పబ్లిక్ ఇష్యూకు త్వరలో రాబోతోంది. దాదాపు రూ.1,650 కోట్ల సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఫెడరల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు రానుంది. రూ.1,200 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రోటీన్ ఇగవ్ టెక్, రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఏఎస్కే ఆటోమోటివ్ సైతం నవంబర్లోనే ఐపీఓ (IPO)కి రానున్నాయి. వచ్చే నెలలోనే రూ.1,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకి సిద్ధ అవుతుంది. రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో 70.3 మిలియన్ల షేర్లు ఓఎఫ్ఎస్ కింద జారీ చేయనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓకు వచ్చిన 36 కంపెనీలు దాదాపు రూ.28,330 కోట్లు సమీకరించాయి. గతేడాది మొత్తం 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. ఫలితంగా రూ.59వేలకోట్ల నిధులు కూడగట్టాయి. కంపెనీలు సమీకరించనున్న మొత్తం టాటా టెక్నాలజీస్: రూ.2500 కోట్లు సెల్లోవరల్డ్: రూ.1900 కోట్లు హొనాస కన్జ్యూమర్:రూ.1650 కోట్లు ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్సియల్: రూ.1400 కోట్లు ప్రొటీన్ ఈగోవ్టెక్: రూ.1300 కోట్లు డీఓఎంఎస్ ఇండస్ట్రీస్:రూ.1200 కోట్లు ఏఎస్కే ఆటోమోటివ్:రూ.1000 కోట్లు జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.1000 కోట్లు ఫిన్‌కేర్ మైక్రోఫైనాన్స్: రూ.900 కోట్లు బ్లూజెట్ హెల్త్‌కేర్: రూ.840 కోట్లు ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్: రూ.800 కోట్లు ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.630 కోట్లు -
ఐపీవో జోరు.. మరో నాలుగు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల సరికొత్త రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ప్రైమరీ మార్కెట్‌కు సైతం జోష్ నిస్తున్నాయి. దీంతో కొద్ది నెలలుగా పలు కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) వెళ్తున్నాయి. ప్రస్తుత కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటికే ఐపీవోల ద్వారా వివిధ సంస్థలు భారీ స్థాయిలో నిధులు సైతం సమీకరించాయి. ఈ బాటలో తాజా గా మరో 4 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తలుపు తట్టాయి. వివరాలు ఇలా.. గో ఫ్యాషన్ ఇండియా ఐపీవోకు అనుమతించమంటూ గో కలర్స్ బ్రాండుతో మహిళల దుస్తులను రూపొందిస్తున్న గో ఫ్యాషన్ ఇండియా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1,28,78,389 షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీలో ప్రస్తుతం పీకేఎస్, వీకేఎస్ కుటుంబ ట్రస్ట్‌లకు విడిగా 28.74 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. సమీకరించిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా మహిళలు ధరించే చుడీదార్లు, లెగ్గింగ్స్, ధోతీలు, ట్రౌజర్లు తయారు చేస్తోంది. వీఎల్సీసీ హెల్త్‌కేర్ వెల్నెస్, బ్యూటీ ప్రొడక్టుల దేశీ కంపెనీ వీఎల్సీసీ హెల్త్‌కేర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లతోపాటు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 89.22 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాంతంతోపాటు దేశీయంగా మరిన్ని వెల్నెస్ క్లినిక్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. హాట్‌న్యూస్: మస్త్ ఫీచర్లతో మడత ఫోన్లు.. చూసేయండి పారదీప్ ఫాస్ఫేట్స్ ఐపీవోకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ ఫెర్టిలైజర్ కంపెనీ పారదీప్ ఫాస్ఫేట్స్ సెబీకి దరఖాస్తు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,255 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 12 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో జువారీ మారోక్ ఫాస్ఫేట్స్ 75,46,800 షేర్లు ఆఫర్ చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం 11.24 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో జువారీ మారోక్కు 80.45 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం 19.55 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను గోవాలోని ఎరువుల తయారీ యూనిట్ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఐటీ సొల్యూషన్లు అందించే ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ ఇండియా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ప్రకాష్ జైన్‌తోపాటు, మంజులా జైన్, ప్రకాష్ జైన్ కుటుంబ ట్రస్ట్‌లు విక్రయానికి ఉంచనున్నాయి. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వ్యక్తిగతంగా ప్రకాష్ జైన్ రూ. 131 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుండగా.. ట్రస్ట్ తరఫున రూ. 277 కోట్లు, మంజులా జైన్ ట్రస్ట్ రూ. 92 కోట్లు చొప్పున ఈక్విటీని విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను రుణ చెల్లింపులతోపాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
పబ్లిక్ ఇష్యూలు పండలేదు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది(2013) దేశీయ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా కేవలం రూ. 1,619 కోట్లను సమీకరించాయి. గత 12 ఏళ్లలోనే ఇది అతి తక్కువ మొత్తం కాగా, ఇందుకు మార్కెట్లలో ఏర్పడిన ఒడిదొడుకులు కారణంగా నిలిచాయి. ప్రైమ్‌డేటా బేస్ గణాంకాల ప్రకారం 2012లో 11 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 6,835 కోట్లను సమీకరించాయి. అయితే 2013లో మూడు కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూలను చేపట్టి రూ. 1,619 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇంతక్రితం 2001లో మాత్రమే కంపెనీలు ఐపీవోల ద్వారా అతితక్కువగా రూ. 296 కోట్లను సమీకరించాయి. కాగా, 2010లో ఐపీవోల ద్వారా అత్యధికంగా రూ. 37,535 కోట్లను సమీకరించడం విశేషం! సమీపకాలంలో కష్టమే: సమీప కాలంలో ఐపీవో మార్కెట్ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా అభిప్రాయపడ్డారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులలో అనిశ్చితి కొనసాగడంతోపాటు, సెకండరీ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతుండటం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నదని వివరించారు. అయితే 915 కంపెనీలు భవిష్యత్‌లో ఐపీవో ద్వారా నిధులు సమీకరించాలనే ఆసక్తిని ప్రదర్శిస్తుండటం విశేషమని చెప్పారు. ఈ బాటలో ఇప్పటికే 14 సంస్థలు రూ. 3,635 కోట్లను సమీకరించేందుకు సెబీ అనుమతిని పొందినట్లు వెల్లడించారు. ఇదే విధంగా మరో 10 కంపెనీలు రూ. 3,100 కోట్ల సమీకరణకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. జస్ట్ డయల్ సక్సెస్ ఐపీవో ద్వారా 2013లో జస్ట్ డయల్ రూ. 919 కోట్లను సమీకరించడంలో విజయవంతంకాగా, రెప్కో హోమ్ ఫైనాన్స్ రూ. 270 కోట్లు, వీమార్ట్ రిటైల్ రూ. 94 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇక మరోవైపు ఇదే కాలంలో 35 చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎస్ఎంఈలు) ఐపీవోల ద్వారా రూ. 335 కోట్లను వసూలు చేయగలిగాయి. సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, ప్రధాన ఇండెక్స్‌లు ఒడిదొడుకులను చవిచూడటం, ప్రమోటర్ల వాటాలకు సరైన ధర లభించకపోవడం తదితర అంశాల నేపథ్యంలో నిజానికి గత మూడేళ్లలో ఐపీవోలకు మార్కెట్లు సహకరించలేదని ప్రణవ్ పేర్కొన్నారు. దీంతో అటు ప్రభుత్వం సైతం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోయిందని చెప్పారు. 35 ఎస్ఎంఈల పబ్లిక్ ఇష్యూలు అందుబాటులో లేకపోవడం, కేవలం మూడు ఇష్యూలే మార్కెట్లను తాకడం వంటి అంశాలు చిన్న ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేశాయని తెలిపారు.