ఐపీఓల పర్వం కొనసాగుతున్న తరుణంలో కొత్తగా మరికొన్ని కంపెనీలు నిధులు సమీకరణకు పూనుకుంటున్నాయి. ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ అనే వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.850 కోట్లు నిధులు సమీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ముసాయిదా పత్రాలను(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్-DRHP)దాఖలు చేసింది. ఇందుకు సెబీ(SEBI) అనుమతిస్తే ఐపీఓకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.
ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు, మరో రూ.100 కోట్లు ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులు సమీకరించనున్నారు. ఇలా వచ్చిన నిధులను మూలధన వ్యయాలకు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త కేంద్రాల ఏర్పాటుకు రూ.462.6 కోట్లు, రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ట్యాక్సీ సేవల యాప్స్‌పై విచారణకు ఆదేశం
ఇండో ఫామ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్
ఇండో ఫామ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ ఐపీఓ(IPO)కు రానున్నట్లు ప్రకటించింది. తాజా ఇష్యూ ద్వారా రూ.260.15 కోట్ల నిధులను సమీకరిచనున్నట్లు తెలిపింది. ఈ ఇష్యూ 2024 డిసెంబర్ 31 మంగళవారం ప్రారంభం కానుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.204 నుంచి రూ.215 మధ్య ఉంటుంది. ఇందులో 86 లక్షల షేర్లతో ఐపీఓ ద్వారా రూ.184.9 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.75.25 కోట్ల విలువైన 35 లక్షల షేర్లను విక్రయించనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు 69 షేర్లకు కనీస పెట్టుబడి రూ.14,835 కలిగి ఉండాలని తెలిపింది. స్మాల్ నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (SNII) 966 షేర్లకు కనీస పెట్టుబడి రూ.2,07,690 అవసరం అవుతుంది. బిగ్ నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (BNII) 4,692 షేర్లకు కనీస పెట్టుబడి రూ.10,08,780 కలిగి ఉండాలి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ లిస్టింగ్ తేదీ జనవరి 7, 2025గా నిర్ణయించారు. ఐపీఓ జనవరి 2న ముగియనుండగా, తుది కేటాయింపు 2025 జనవరి 3న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment