IPO Price Band
-
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్‌అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్‌లో టాప్‌లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్‌లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్‌తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..!
ఎన్నో ఆశల మధ్య భారత్‌లోనే అతి పెద్ద ఐపీవోగా వచ్చిన పేటీఎంకు మార్కెట్లలో చుక్కెదురైంది. గణనీయమైన నష్టాలను పేటీఎం చవిచూసింది. పేటీఎం ఐపీవో ధర రూ. 2,150 ప్రారంభం కాగా....సుమారు పేటీఎం షేర్లు సుమారు 27 శాతం రూ. 585కు పడిపోయి చివరికి షేర్ విలువ రూ.1564 కు చేరుకుంది. ఇన్వెస్టర్లు సుమారు రూ. 38 వేల కోట్ల మేర నష్టపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం రోజున మరోసారి కంపెనీ షేర్లు మరోసారి 10.35 శాతం మేర క్షీణించి రూ. 1402కు చేరుకుంది. చదవండి: పేటీఎంలో లావాదేవీలు రెట్టింపు మీరే కారణం..మీరే బాధ్యత వహించాలి..! పేటీఎం ఐపీవో అట్టర్‌ఫ్లాప్ కావడంతో తాజాగా ట్విటర్లో నెటిజన్లు ఒక వ్యక్తిపై విరుచుకుపడుతున్నారు. పేటీఎం ఒక్కో షేర్ ధరను తప్పుడు ప్రైజింగ్ ఇష్యూ చేసినందుకు మీరే బాధ్యత వహించాలని హర్షద్ షా అనే నెటిజన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్‌ను ట్విటర్లో ట్యాగ్ చేశారు. సుమారు రూ. 38 వేల కోట్లకు పైగా నష్టపోయినా ఇన్వెస్టర్లకు మీరే పరిహారం చెల్లించాలని కోరారు. దీంతో నెటిజన్లు ఉదయ్ కోటక్‌ను నిందిస్తూనే...ఈ గందరగోళానికి కోటక్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. స్పందించిన ఉదయ్ కోటక్..! పేటీఎం ఐపీవో అట్టర్‌ఫ్లాప్ కావడం ఉదయ్ కోటక్ అనే భావనతో ట్విటర్లో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు. కాగా ఈ విషయంపై ఉదయ్ కోటక్ ట్విటర్లో స్పందించారు. ఉదయ్ కోటక్ తన ట్విట్లో...మిస్టర్ షా దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. పేటీఎం ఇష్యూ ధరను కోటక్ నిర్థారించలేదంటూ అన్నారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఐపీవోకు వచ్చిన జోమాటో, నైకా కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లీడ్ మేనేజర్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. ఉదయ్ కోటక్ జొమాటో షేర్ ఇష్యూ ధర రూ. 76గా నిర్ణయించగా ఇప్పుడు అది రూ. 150 ఉందని, నైకా షేర్ ఇష్యూ ధరను రూ.1125ను నిర్ణయించగా అది రూ.2100 చేరిందని ఉదయ్ కోటక్ బదులిచ్చారు. ఈ విషయంలో ఉదయ్ కోటక్‌కు హర్షద్ షా వారిని క్షమాపణలను కోరారు. Mr. Shah please get your facts right. Kotak did not lead manage Paytm. Kotak did lead manage Zomato at issue price 76( current market price 150), Nykaa at issue price 1125(current market price 2100). https://t.co/0G5SJeslkz — Uday Kotak (@udaykotak) November 22, 2021 చదవండి: పేటీఎం అట్టర్ ప్లాప్‌షో.. 63 వేల కోట్లు మటాష్! ఇన్వెస్టర్లు లబోదిబో -
హైదరాబాద్‌లో యాడ్‌ల్యాబ్స్ ఎమ్యూజ్మెంట్ పార్క్
ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ రూ. 221-230 ముంబై: యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ త్వరలో హైదరాబాద్, ఎన్‌సీఆర్‌ల్లో ఎమ్యూజ్మెంట్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నది. ముంబై సమీపంలో ఇమేజిక ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ ఈ నెల 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.221-230గా నిర్ణయించామని యాడ్‌ల్యాబ్స్ చైర్మన్ మన్మోహన్ శెట్టి చెప్పారు. షేర్ ముఖ విలువ రూ.10 అని, 2 కోట్లకు పైగా షేర్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. కనీసం 65 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌పై రూ.12 డిస్కౌంట్‌ను ఇస్తామని కూడా ఆయన వెల్లడించారు.