హైదరాబాద్‌లో యాడ్‌ల్యాబ్స్ ఎమ్యూజ్‌మెంట్ పార్క్
ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ రూ. 221-230
ముంబై: యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ త్వరలో హైదరాబాద్, ఎన్‌సీఆర్‌ల్లో ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నది. ముంబై సమీపంలో ఇమేజిక ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ ఈ నెల 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.221-230గా నిర్ణయించామని యాడ్‌ల్యాబ్స్ చైర్మన్ మన్మోహన్ శెట్టి చెప్పారు.
షేర్ ముఖ విలువ రూ.10 అని, 2 కోట్లకు పైగా షేర్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. కనీసం 65 షేర్లకు బిడ్‌లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌పై రూ.12 డిస్కౌంట్‌ను ఇస్తామని కూడా ఆయన వెల్లడించారు.