స్టీల్ తయారీలో సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏవన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల(Cpaital Market) నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వాటిలోని వివరాల ప్రకారం ఐపీవో(IPO) కింద రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ.50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు సందీప్ కుమార్, సునీల్ జలాన్, క్రిషన్ కుమార్ జలన్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ.650 కోట్లు అందుకునే యోచనలో కంపెనీ ఉంది.
ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 85.56 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ అనుబంధ సంస్థ వినయ స్టీల్స్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. సంస్థ విస్తరణకు వీలైన మెషీనరీ కొనుగోలు, సొంత అవసరాల కోసం సోలార్ ఎనర్జీ(Solar Energy)ని సమకూర్చుకోవడం తదితరాలు చేపట్టనుంది. దాంతోపాటు మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.
ఇదీ చదవండి: 1,673 కోట్ల యూపీఐ లావాదేవీలు
ఆంధ్రప్రదేశ్‌లోనూ..
బెంగళూరు కంపెనీ ఏవన్ స్టీల్స్ ఇండియా విభిన్న ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ముడిస్టీల్ సామర్థ్యంరీత్యా దక్షిణాదిలోని టాప్–5 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని యూనిట్‌తోపాటు కర్ణాటకలో మరో 5 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా స్టీల్ తయారీలో వినియోగించే లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టులుసహా ఇండ్రస్టియల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2024 జూన్30కల్లా వార్షికంగా 14.97 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ ప్రొడక్టుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంఎస్‌పీ స్టీల్ అండ్ పవర్, బాలాజీ ఇండస్ట్రీస్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీతో పోటీ పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment