ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌లో మంచి స్కోర్‌ రావాలంటే కష్టమే.. | B-ready Report Is The World Bank New Flagship Report That Benchmarks The Business Environment And Investment, See Details | Sakshi
Sakshi News home page

‘బీ-రెడీ’లో మంచి స్కోర్‌ రావాలంటే కష్టమే..

Published Wed, Jan 1 2025 8:05 AM | Last Updated on Wed, Jan 1 2025 10:06 AM

B-Ready report is the World Bank new flagship report that benchmarks the business environment and investment

వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల ఆధారంగా ప్రపంచ బ్యాంకు రూపొందించే బీ–రెడీ రిపోర్ట్‌(Report)లో మంచి స్కోరు దక్కించుకోవాలంటే భారత్‌కి కాస్త సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని మేధావుల సంఘం జీటీఆర్‌ఐ ఒక నివేదికలో పేర్కొంది. బిజినెస్‌ ఎంట్రీ, కార్మిక చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాల విషయంలో ప్రపంచ బ్యాంకు(World Bank) అంచనాలకు భారత్‌ దూరంగా ఉందని వివరించింది.

ఈ నేపథ్యంలో బీ–రెడీలో (బిజినెస్‌ రెడీ) చోటు కోసం భారత్, ప్రధానంగా దేశీయంగా సంస్కరణలతో పాటు అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను కూడా అధ్యయనం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తెలిపింది. సాధారణంగా డూయింగ్‌ బిజినెస్‌ రిపోర్ట్‌ పేరిట వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులపై ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ .. ర్యాంకింగ్‌లు ఇస్తూ వస్తోంది. కానీ, దీని రూపకల్పనలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో 2020 నుంచి దాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దాని స్థానంలో కొత్త విధానాలతో బీ–రెడీ రిపోర్ట్‌ను రూపొందిస్తోంది. వ్యాపారాల విషయంలో అవరోధాలు  ఈ రిపోర్ట్‌లో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!

బీ-రెడీ నివేదిక ప్రపంచ బ్యాంకు కొత్త ఫ్లాగ్ షిప్ రిపోర్ట్‌. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపార, పెట్టుబడి వాతావరణాన్ని అంచనా వేస్తోంది. ఇది గతంలో ఉన్న ‘డూయింగ్ బిజినెస్ ఇండెక్స్’ను భర్తీ చేస్తుంది. దేశంలోని వ్యాపార అనుకూలతలు, కార్మిక నిబంధనలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి ఎన్నో అంశాలను పరిగణిస్తుంది. బీ-రెడీ ఫ్రేమ్‌వర్క్‌లో చేరడానికి భారత్‌ సిద్ధమవుతుంది. అయితే ఇందులో మంచి స్కోర్‌ సంపాదించడం కొంత కష్టమని జీటీఆర్ఐ తెలిపింది. భారత్‌ చాలా రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ, డిజిటల్ ఇంటిగ్రేషన్, కస్టమ్స్(Customs) చెల్లింపుల్లో ఆలస్యం, కొన్ని విభాగాల్లో స్థిరమైన నిర్ణయాలు అమలు చేయడంలేదనే వాదనలున్నట్లు హైలైట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement