
ఐపీవో నిధుల దుర్వినియోగంపై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: నిబంధనలపరమైన లొసుగులను ఉపయోగించుకుని ఐపీవో నిధులను కొన్ని కంపెనీల ప్రమోటర్లు దుర్వినియోగం చేస్తుండటంపై సెబీ దృష్టి సారించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా నిబంధనలు కఠినతరం చేయనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను నిర్దేశిత లక్ష్యానికి వినియోగించే దాకా బ్యాంకుల్లోనే తప్పనిసరిగా డిపాజిట్ చేసి ఉంచేలా నిర్దేశించాలని సెబీ బోర్డు నిర్ణయించింది. ఐపీవో నిధులను కొన్ని సంస్థల ప్రమోటర్లు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లు (ఐసీడీ)గా మార్చుకోవడాన్ని గుర్తించిన సెబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.