న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ వినిర్ ఇంజినీరింగ్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించింది. దీని ప్రకారం ఐపీవోలో భాగంగా 5,33,00,000 షేర్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్ నితేష్ గుప్తా వీటిని ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు. షేర్ల ముఖవిలువ రూ.2గా ఉంటుంది.
ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు
ఆనంద్ రాఠీకి సెబీ చెక్
ఐపీవో ప్రాస్పెక్టస్ వెనక్కి
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా బ్రోకింగ్ కంపెనీ ఆనంద్ రాఠీ(Anand Rati) గ్రూప్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలకు చెక్ పెట్టింది. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2024 డిసెంబర్‌లో దాఖలు చేసిన ఐపీవో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తిప్పి పంపింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ద్వారా ఆనంద్ రాఠీ షేర్ రూ. 745 కోట్లు సమీకరించాలని భావించింది. ఇందుకు ఈక్విటీని తాజాగా జారీ చేయాలని ప్రతిపాదించింది. అయితే కారణాలు వెల్లడించకుండా సెబీ ప్రాస్పెక్టస్‌ను రిటర్న్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment