IPO documents
-
కార్పొరేట్ వ్యవహారాలపై సెబీ నిర్ణయం
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ వినిర్ ఇంజినీరింగ్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించింది. దీని ప్రకారం ఐపీవోలో భాగంగా 5,33,00,000 షేర్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్ నితేష్ గుప్తా వీటిని ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు. షేర్ల ముఖవిలువ రూ.2గా ఉంటుంది.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుఆనంద్ రాఠీకి సెబీ చెక్ఐపీవో ప్రాస్పెక్టస్ వెనక్కిన్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా బ్రోకింగ్ కంపెనీ ఆనంద్ రాఠీ(Anand Rati) గ్రూప్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలకు చెక్ పెట్టింది. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2024 డిసెంబర్లో దాఖలు చేసిన ఐపీవో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తిప్పి పంపింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ద్వారా ఆనంద్ రాఠీ షేర్ రూ. 745 కోట్లు సమీకరించాలని భావించింది. ఇందుకు ఈక్విటీని తాజాగా జారీ చేయాలని ప్రతిపాదించింది. అయితే కారణాలు వెల్లడించకుండా సెబీ ప్రాస్పెక్టస్‌ను రిటర్న్ చేసింది. -
మార్కెట్లోకి మరో కొత్త ఐపీఓ
మమతా మెషినరీ లిమిటెడ్ స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. డిసెంబర్ 19 గురువారం రోజున కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రారంభం అవుతుందని సంస్థ తెలిపింది. ఈ ఐపీవో ధర కంపెనీ రూ.179 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. అందుకు ఒక్కో షేరుకు రూ.230-243 ధర నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 23, 2024న ముగుస్తుంది.ఈ సంస్థ ప్రధానంగా ప్యాకేజింగ్ యంత్రాల తయారీ, ఎగుమతి, వాటికి సర్వీస్ అందిస్తోంది. ప్లాస్టిక్ సంచులు, పౌచ్‌లు, ఎక్స్‌ట్రూషన్ పరికరాలను తయారు చేసే యంత్రాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ప్యాకేజింగ్ పరిశ్రమలో ఎండ్-టు-ఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ), ఫుడ్ & బెవరేజ్ పరిశ్రమలకు సర్వీస్ చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే యంత్రాలను ‘వెగా’, ‘విన్’ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్నారు. 75కి పైగా దేశాలకు ఈ సంస్థ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?ఐపీఓ అలాట్ అవ్వాలంటే..ఒకటికి మించిన పాన్ కార్డుల ద్వారా ఐపీఓ దరఖాస్తు చేసుకుంటే షేర్ల అలాట్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు వేస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమర్పించడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచ్చితంగా మెరుగుపడతాయి. -
లాజిస్టిక్స్ ఐపీవోకు స్పందన ఎలా ఉందంటే..
ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవలందించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్రమే స్పందన లభించింది. ఐపీవో దరఖాస్తు చివరి రోజు సోమవారానికల్లా 1.9 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ 2.25 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 4.19 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 2.76 రెట్లు బిడ్స్ నమోదుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.65 రెట్లు దరఖాస్తులు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 24 శాతానికే దరఖాస్తులు అందాయి.ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.501 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వెరసి షేరుకి రూ.259–273 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,115 కోట్లు సమీకరించింది. ఐపీవో ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.565 కోట్ల విలువైన 2.06 కోట్ల షేర్లను విక్రయించగా.. రూ.550 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ కొత్తగా జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.200 కోట్లు మార్కెటింగ్‌కు, రూ.140 కోట్లు బ్లాక్‌బక్ ఫిన్సర్వ్ మూలధన పెట్టుబడులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళఏరిస్ఇన్ఫ్రా ఐపీవోకు రెడీనిర్మాణ రంగ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్లో టెక్నాలజీ ఆధారిత బీ2బీ సేవలందించే ఏరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ తాజాగా అనుమతులు పొందింది. కాగా.. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్మెక్స్ ఇన్ఫ్రాలో పెట్టుబడులకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్‌లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్‌ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుసురక్షా డయాగ్నోస్టిక్ రెడీసమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది. -
ఇండిగో పెయింట్స్ ఐపీవో బాట
ముంబై: పీఈ దిగ్గజం సీక్వోయయా క్యాపిటల్ అండగా దేశీ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించిన ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవోలో భాగంగా సీక్వోయా క్యాపిటల్ 58.4 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువచేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రమోటర్ హేమంత్ జలాన్ సైతం కొంతమేర వాటాను విక్రయించనున్నారు. తద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. చదవండి: చదవండి: (ఐపీవోలకు తొందరపడుతున్న కంపెనీలు) ప్రాస్పెక్టస్ ప్రకారం ఇండిగో పెయింట్స్ ఐపీవో నిధులను కంపెనీకున్న తయారీ ప్లాంట్ల విస్తరణకు ప్రధానంగా వినియోగించనుంది. తమళినాడులోని పుదుకొట్టాయ్‌లోగల ప్లాంటు తయారీ సామర్థ్యాన్ని పెంచనుంది. మరికొన్ని నిధులను రుణ చెల్లింపులకూ వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. పుణేకు చెందిన ఇండిగో పెయింట్స్ ప్రధానంగా వివిధ డెకొరేటివ్ పెయింట్లను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కంపెనీకి తమిళనాడు, రాజస్తాన్, కేరళలలో మొత్తం మూడు తయారీ యూనిట్లు ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూకి కొటక్ మహీంద్రా క్యాపిటల్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుక్‌రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరించనున్నాయి. చదవండి:(గ్లాండ్ ఫార్మా ఐపీవో సోమవారమే) -
ఐపీవోలకు అచ్ఛేదిన్!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల ర్యాలీ (సెకండరీ మార్కెట్)తో ప్రైమరీ మార్కెట్లో ఐపీవో ఇష్యూల సందడి మళ్లీ మొదలవుతోంది. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు ఎంతో అనిశ్చి తులను చవిచూశాయి. ఫలితంగా మొదటి పది నెలల కాలంలో వచ్చిన పేరున్న ఐపీవో ఇష్యూలు 20లోపునకే పరిమితమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఇష్యూలు పూర్తిగా సబ్స్క్రయిబ్ అవుతాయన్న నమ్మకం ఉన్న కంపెనీలే వాటిని చేపట్టాయి. చాలా కంపెనీలు ఐపీవో ఇష్యూ చేపట్టాలని అనుకుంటున్నా, సానుకూల వాతావరణం కోసం వేచి చూస్తున్నాయి. కొన్ని ఆఫర్ పత్రాలను దాఖలు చేసినా ముందుకు వెళ్లలేకపోయాయి. సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను భారీ తగ్గింపు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో పడ్డాయి. దీంతో ఐపీవో ఇష్యూలతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గత రెండు నెలల్లో రూట్ మొబైల్, మాంటే కార్లో, మజ్గాన్ డాక్ షిప్‌బిల్డర్స్, ఇండియన్ రెన్యువబుల్ డెవలప్మెంట్ ఎనర్జీ, ముంబైకి చెందిన పురానిక్ బిల్డర్స్ సంస్థలు సెబీ వద్ద ఐపీవో ఆఫర్ పత్రాలను మరోసారి దాఖలు చేశాయి. తాజాగా ఎస్బీఐకి చెందిన ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (క్రెడిట్‌కార్డు కంపెనీ) కూడా ఆఫర్ పత్రాలను దాఖలు చేసింది. వచ్చే కొన్ని నెలల్లో ఐపీవో కోసం యూటీఐ మ్యూచువల్ ఫండ్, పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఐపీవో పత్రాలను సెబీ ముందు దాఖలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. 27 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్... ఇప్పటి వరకు సెబీ నుంచి ఐపీవో కోసం 27 కంపెనీలు అనుమతి పొందాయి. ఇవి ఐపీవో ఇష్యూల ద్వారా రూ.18,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బజాజ్ ఎనర్జీ, శ్రీరామ్ ప్రాపర్టీస్, పెన్నా సిమెంట్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మరో ఏడు సంస్థల వరకు ఆఫర్ పత్రాలను దాఖలు చేసి, అనుమతి కోసం వేచి ఉన్నాయి. ఈ ఏడాది 14 కంపెనీలు కలసి సుమారు రూ.15,000 కోట్ల వరకు నిధులను ఐపీవో ద్వారా సమీకరించాయి. వీటిల్లో ఒక్కటి మినహా (స్టెర్లింగ్ అండ్ విల్సన్) అన్నీ ఇష్యూ ధర కంటే ఎక్కువలోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో ఐఆర్సీటీసీ, యాఫిల్ ఇండియా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ మాత్రం ఇష్యూ ధర కంటే నూరు శాతం మించి పెరిగాయి. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో మార్కెట్లో రూ.లక్ష కోట్లకు పైగా నిధుల సమీకరణ జరిగింది. స్థిరమైన ర్యాలీ ఉంటేనే... సెకండరీ మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటే తప్ప, ప్రైమరీ మార్కెట్లో (ఐపీవోలు) వాతావరణం మారకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా రివకరీ సంకేతాలు ఇవ్వలేదని, కేంద్రం కార్పొరేట్ పన్ను తగ్గింపుతో లిక్విడిటీ (నిధుల రాక) ఆధారంగా జరుగుతున్న ప్రస్తుత మార్కెట్ల ర్యాలీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నది బ్రోకరేజీల అభిప్రాయం. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం మేర పెరిగింది. ‘‘ఈ ఏడాది పలు ఐపీవోలకు అనుమతుల గడువు కూడా తీరిపోయింది. తాము ఆశిస్తున్న ధరకు తగినంత డిమాండ్ లేని పరిస్థితుల్లో ఇదే వాతావరణం కొనసాగొచ్చు’’ అని ప్రైమ్ డేటా బేస్ ఎండీ ప్రణవ్ హల్దియా పేర్కొన్నారు. ‘‘మార్కెట్లో ఇప్పటికీ ఎంతో అనిశ్చితి ఉంది. తిరిగి ఆఫర్ పత్రాలను దాఖలు చేయడం వల్ల ఈ వాతావరణం మెరుగుపడిన వెంటనే ఐపీవోలకు వచ్చేందుకు కంపెనీలకు వీలు కలుగుతుంది’’ అని పీఎల్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్ దారా కల్యాణి వాలా చెప్పారు. మంచి ఇష్యూలకు భారీ డిమాండ్ ఈ ఏడాది మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. మంచి వ్యాపార నమూనాలు కలిగిన కంపెనీలు, ఆకర్షణీయమైన ధరలతో వచ్చిన ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణే దక్కింది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ, యాఫిల్ ఇండియా, ఇండియామార్ట్, పాలీక్యాబ్, నియోజన్ కెమికల్స్, సీఎస్బీ బ్యాంకు ఇష్యూలకు భారీ స్పందనే లభించింది. లిస్టింగ్‌లోనూ లాభాలు కురిపించాయి. ఐఆర్సీటీసీ షేరు ఇష్యూ ధర రూ.320 కాగా, లిస్టింగ్‌లోనే వాటాదారులకు 100% లాభాలిచ్చింది. యాఫ్లే ఇండియా కూడా ఇష్యూ ధర నుంచి చూస్తే ఇప్పటికే 119% ర్యాలీ చేసింది. కేరళకు చెందిన సీఎస్బీ బ్యాంకు ఇష్యూ ఈ నెల 27న ముగియగా 87 రెట్లు అధికంగా బిడ్లు రావడం గమనార్హం. వచ్చే వారం మొదలయ్యే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోకు, త్వరలో రానున్న ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూకు సైతం మంచి స్పందన ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. త్వరలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో... ఇష్యూ సైజు రూ.9,500 కోట్ల రేంజ్లో... ముంబై: ఎస్బీఐకు చెందిన దేశంలోనే రెండో అతి పెద్ద క్రెడిట్ కార్డ్ కంపెనీ... ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో పత్రాలను సెబీకి బుధవారం సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో ఎస్బీఐ, కార్లైల్ గ్రూప్‌నకు చెందిన సీఏ రోవర్ హోల్డింగ్స్ సంస్థలు 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తాయి. మొత్తం మీద ఈ ఐపీవో సైజు రూ.8,000–9,500 కోట్ల రేంజ్లో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీ విలువ రూ.65,000 కోట్ల మేర ఉండగలదని అంచనా. సెబీ ఆమోదం లభిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుంది. వచ్చే ఏడాది మార్చిలోనే మార్కెట్లో లిస్టింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. -
వచ్చే వారంలో ఎన్ఎస్ఈ ఐపీఓ పత్రాలు దాఖలు!
ఓఎఫ్ఎస్ మార్గంలో షేర్ల జారీ న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి వచ్చే వారంలో సమర్పించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఎన్ఎస్ఈ అధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద ఐపీఓ అన్న అంచనాలున్నాయి. ఈ ఐపీఓలో భాగంగా ఎన్ఎస్ఈలో వాటాలున్న పలు కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో తమ వాటాను విక్రయించనున్నాయి. ఎన్ఎస్ఈ ఐపీఓ సన్నాహాల నేపథ్యంలో ఆశ్చర్యకరంగా ఎన్ఎస్ఈ సీఈఓ చిత్ర రామకృష్ణన్ తన పదవికి ఈ మధ్యే రాజీనామా చేశారు. కాగా ఈ ఐపీఓ కోసం ఎన్ఎస్ఈ ఇప్పటికే లిస్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి, మర్చంట్ బ్యాంకర్లను కూడా నియమించింది. సిటిగ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీలు ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్ ల్లో లిస్టింగ్ కానున్నామని ఈ ఏడాది జూన్‌లోనే ఎన్ఎస్ఈ ప్రకటించింది. మరో స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ కూడా ఐపీఓకు రానుంది. -
లిస్టింగ్‌కు ఎన్ఎస్ఈ రెడీ...
♦ వచ్చే జనవరి కల్లా ఐపీఓ పత్రాల దాఖలు ♦ విదేశీ ఎక్స్ఛేంజీల్లోనూ లిస్టింగ్‌కు అవకాశం... ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు రానుంది. భారత్‌తో పాటు విదేశాల్లోని స్టాక్ మార్కెట్లలో కూడా లిస్టింగ్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దేశీయ లిస్టింగ్ కోసం ఐపీఓ ముసాయిదా పత్రాలను వచ్చే ఏడాది జనవరి కల్లా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పిస్తామని తెలియజేసింది. విదేశాల్లో లిస్టింగ్ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా సంబంధిత పత్రాలను సమర్పిస్తామని, లిస్టింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం ప్రస్తుతమున్న లిస్టింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించామని, ఈ కమిటీ నిర్దేశిత గడువులో నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది. అయితే సెల్ఫ్ లిస్టింగ్ ఆప్షన్, క్రాస్-లిస్టింగ్ ఆప్షన్లకు సంబంధించిన స్పష్టతను ఎన్ఎస్ఈ ఇవ్వలేదు. ఈ విషయాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఎన్ఎస్ఈ బోర్డ్ కమిటీ మదింపు చేస్తుందని పేర్కొంది. మరోవైపు ఎన్ఎస్ఈ వ్యాపార పునర్వ్యస్థీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. నియంత్రణలో లేని పోర్ట్‌ఫోలియో వ్యాపారం కోసం ఒక ప్రత్యేకమైన కంపెనీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడం వల్ల ఎక్స్ఛేంజ్ విలువలో పారదర్శకత చోటుచేసుకుంటుందని అంచనా. మరో స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ ఇప్పటికే ఐపీఓ ప్రక్రియ మొదలు పెట్టింది. త్వరలో ఐపీఓ ముసాయిదా పత్రాల(డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్)ను సెబీకి సమర్పించనుంది.