వచ్చే వారంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలు దాఖలు! | NSE to file for IPO by Dec 20 | Sakshi
Sakshi News home page

వచ్చే వారంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలు దాఖలు!

Published Thu, Dec 15 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

వచ్చే వారంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలు దాఖలు!

వచ్చే వారంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలు దాఖలు!

ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో షేర్ల జారీ   
న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ ముసాయిదా పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి వచ్చే వారంలో సమర్పించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఎన్‌ఎస్‌ఈ అధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద ఐపీఓ అన్న అంచనాలున్నాయి. ఈ ఐపీఓలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో వాటాలున్న పలు కంపెనీలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో తమ వాటాను విక్రయించనున్నాయి.

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సన్నాహాల నేపథ్యంలో ఆశ్చర్యకరంగా ఎన్‌ఎస్‌ఈ సీఈఓ చిత్ర రామకృష్ణన్‌ తన పదవికి ఈ మధ్యే రాజీనామా చేశారు. కాగా ఈ ఐపీఓ కోసం ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే లిస్టింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి, మర్చంట్‌  బ్యాంకర్లను కూడా నియమించింది. సిటిగ్రూప్, మోర్గాన్‌ స్టాన్లీ, జేఎం ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ సెక్యూరిటీస్, కోటక్‌  మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీలు ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. స్టాక్‌ ఎక్స్చేంజ్ ల్లో లిస్టింగ్‌ కానున్నామని ఈ ఏడాది జూన్‌లోనే ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. మరో స్టాక్‌ ఎక్స్చేంజ్ బీఎస్‌ఈ కూడా ఐపీఓకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement