నిఫ్టీ ఇండెక్సులలో ఈ ఏడాది మార్చి31 నుంచి సవరణలు చేపడుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్సులలో ప్రయివేట్ రంగ కంపెనీలు అదానీ విల్మర్, అదానీ పవర్‌తోపాటు పలు ఇతర కంపెనీలకు చోటు లభించనుంది. అదానీ విల్మర్ నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇక అదానీ పవర్‌కు నిఫ్టీ 500, 200లతోపాటు నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, 150, లార్జ్‌మిడ్ క్యాప్ 250, మిడ్‌స్మాల్ క్యాప్ 400లలో చోటు లభించనుంది.
ఇండెక్సుల నిర్వహణ సబ్‌కమిటీ షేర్ల జాబితాలో సవరణలను నిర్ణయించినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది. అయితే ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎలాంటి మార్పులూ చేపట్టడంలేదని ఎన్‌ఎస్‌ఈ స్పష్టం చేసింది. కాగా.. నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌లో ఏబీబీ ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ సైతం ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, ఎంఫసిస్, వన్ 97 కమ్యూనికేషన్స్‌లను నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment