న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్‌ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్‌లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్‌ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.
ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు
సురక్షా డయాగ్నోస్టిక్ రెడీ
సమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment