న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడమీ రానున్న రెండేళ్లలోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. కంపెనీకి కీలకమైన టెస్ట్ పేపర్ ప్రిపరేషన్ విభాగాన్ని రానున్న 12 నెలల్లోగా లాభాల్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు అన్‌అకాడమీ గ్రూప్ సహవ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజాల్ వెల్లడించారు.
ప్రయివేట్ రంగ ఉద్యోగాలకు టెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా వినియోగించే రీలెవెల్ డివిజన్‌ను గ్లోబల్ మార్కెట్లకు విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ తొలి ప్రయోగాత్మక కేంద్రం అన్‌అకాడమీ స్టోర్ ప్రారంభం సందర్భంగా టెస్ట్ పేపర్ విభాగాన్ని లాభాల్లోకి మళ్లించే చర్యలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ బాటలో రెండేళ్లలో ఐపీవోకు రానున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల స్పందన ఆధారంగా మరిన్ని అన్‌అకాడమీ స్టోర్లను ప్రధానంగా కోటా, జైపూర్, లక్నోలలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
చదవండి: ఎల్‌ఐసీ ఐపీవోపై ప్రభుత్వం దృష్టి
Comments
Please login to add a commentAdd a comment