ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ ఎడ్యూటెక్ (ఆన్‌లైన్ ఎడ్యుకేషన్) విభాగంలో అడుగు పెట్టనుంది. కోవిడ్ మహమ్మారితో క్లాస్ రూమ్‌లో జరగాల్సిన క్లాసులు.. ఆన్‌లైన్ బాట పట్టాయి. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన స్టార్టప్ కంపెనీల ఆన్‌లైన్ కోర్స్‌ల పేరుతో భారీ ఎత్తున లాభాలు గడించాయి. ఇప్పుడు అదే విభాగంపై కన్నేసిన గూగుల్ తన వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌లో సైతం ఆన్‌లైన్ కోర్స్‌లను అందించేందుకు సిద్ధమైంది.
ఈ తరుణంలో యూట్యూబ్ ఎడ్యూటెక్ మార్కెట్‌లో ఎంటర్ కాబోతుందని..మాతృ సంస్థ గూగుల్ తెలిపింది. ‘యూట్యూబ్ లెర్నింగ్’ ప్లాట్ ఫామ్ పేరుతో తెచ్చే విభాగంలో అన్నీ రకాల కోర్సులను అందుబాటులోకి తెస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇందులో నెల, ఏడాది సబ్ స్క్రిప్షన్ ప్లాన్ వినియోగించుకునే అవకాశం ఉందని అన్నారు.
ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పిన పిచాయ్.. మరో 6,7 నెలల్లో ఆన్‌లైన్ కోర్స్‌లను అందిస్తామన్నారు. ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఉన్న ఈ సేవలు భారత్, సౌత్ కొరియా, అమెరికాల్లో అందుబాటులోకి రానున్నాయి. యూట్యూబ్‌లో ఎడ్యూ టెక్ విభాగంలో వీక్షకులను ఆకట్టుకుంటే ఇతర స్టార్టప్‌కు గడ్డు కాలమేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment