న్యూఢిల్లీ: ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 480 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ. 330 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ పేర్కొంది.
డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ప్రమోటర్లయిన వాజిద్ అహ్మద్ రూ. 120 కోట్లు విలువ చేసే షేర్లు, గుల్జార్ అహ్మద్, మెహ్మూద్ ఖురేషి తదితరులు తలో రూ. 49 కోట్లు విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 135 కోట్లను .. వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ దాదాపు 40 దేశాలకు మాంసం ఎగుమతి చేస్తోంది. ఆదాయంలో 90 శాతం వాటా ఎగుమతులదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,720 కోట్లు కాగా రూ. 73 కోట్ల లాభం నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment