ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఐపీఓలో పాల్గొనే పాలసీదారులకు ఎల్ఐసీ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఐపీఓ కింద అందించే మొత్తం షేర్లలో 10% వరకు ఎల్ఐసీ పాలసీదారులకు రిజర్వ్ చేయనున్నారు. అలాగే, ఈ ప్రభుత్వ-ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్(IPO)లో పాలసీదారులకు షేర్లను తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంది అని గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపం) సెక్రటరీ తుహిన్ కాంత పాండే అన్నారు.
అయితే, ఈ ఐపీఓలో అనేక మంది పాలసీదారులు పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఇందులో పాల్గొన్న ప్రతి పాలసీదారుడికి రాయితీ లభించే అవకాశం లేదు. కొందరికి మాత్రమే షేర్ల మీద రాయితీ లభించే అవకాశం ఉంది. ఎల్ఐసీ ఐపీఓలో ఎవరు, రాయితీ గల షేర్లను పొందలేరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- ఒకవేళ మీ జీవిత భాగస్వామి & మీ పేరిట ఉమ్మడి డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్లయితే(ఇద్దరూ పాలసీదారులైనప్పటికి) ఆ జాయింట్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు ఆఫర్ పొందలేరు. సెబీ ఐసీడీఆర్ నిబంధనల ప్రకారం.. ఉమ్మడి డీమ్యాట్ ఖాతా గల లబ్ధిదారులలో ప్రాథమిక లబ్ధిదారుడు మాత్రమే రాయితీ పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మొదటి/ప్రాథమిక లబ్ధిదారుని పేరును మాత్రమే ఉపయోగించవచ్చు.
- ప్రస్తుతం యాన్యుటీలను పొందుతున్న యాన్యుటీ పాలసీదారు(ఇప్పుడు మరణించిన) జీవిత భాగస్వామి ఎల్ఐసీ ఐపీఓలో ఈక్విటీ షేర్లకు దరఖాస్తు చేయడానికి అర్హత కలిగి లేరు.
- పాలసీదారుడు అతడి/ఆమె పేరిట డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండాలి. పాలసీదారుడు తన జీవిత భాగస్వామి లేదా కుమారుడు లేదా బంధువు డీమ్యాట్ ఖాతా నుంచి దరఖాస్తు చేసుకోలేరు.
- పాలసీదారు రిజర్వేషన్ పోర్షన్ ద్వారా ఎన్ఆర్ఐలు ఐపీఓ కోసం దరఖాస్తు చేయలేరు. బిడ్ లేదా ఆఫర్ కాలంలో భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి మాత్రమే ఆఫర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
- ఏదైనా ఒక పాలసీకి నామినీ గల వ్యక్తులు తమ పేరుతో ఈక్విటీ షేర్లకు బిడ్ చేయడానికి అర్హత లేదు. అర్హత కలిగిన పాలసీదారుడు(లు) మాత్రమే పాలసీదారు రిజర్వేషన్ పోర్షన్ కింద బిడ్ చేయడానికి అర్హులు.
- గ్రూపు పాలసీలు కాకుండా ఇతర పాలసీలు పాలసీదారుడు రిజర్వేషన్ పోర్షన్లో బిడ్డింగ్ వేయడానికి అర్హత కలిగి ఉంటారు.
- పాలసీదారు రిజర్వేషన్ పోర్షన్ కింద వేలం వేయడానికి ఎల్ఐసీ పాలసీదారులు మాత్రమే అర్హులు. అయితే, రిబ్ లేదా నాన్ ఇన్ స్టిట్యూషనల్ బిడ్డర్'గా దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment