ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు వద్ద తమ దగ్గర ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించుకునేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి మొదలవుతుందని ఆర్‌బీఐ ప్రకటించింది.
ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు వేల కోట్లలో పేరుకుపోయాయని వాటిని ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు.
తాజాగా, ఆర్‌బీఐ బ్యాంకుల్లో మూలుగుతున్న వేలకోట్ల డిపాజిట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా బ్యాంక్‌లు తమ దగ్గర అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్న టాప్–100 డిపాజిట్లను ఖాళీ చేయడంపై (తిరిగి చెల్లించడం/క్లియరెన్స్) దృష్టి పెడతాయని వెల్లడించింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని సేవింగ్స్/కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లు, గడువు ముగిసిపోయి పదేళ్లు అయినా తీసుకోకుండా ఉండిపోయిన టర్మ్ డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంక్‌లు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటాయి.
పదేళ్లు ముగిసిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను బ్యాంక్‌లు ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు ప్రతీ జిల్లా పరిధిలో టాప్–100 అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సంబంధీకులను గుర్తించి చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపడతాయని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
రూ.35వేల కోట్లు..
ఏదైనా బ్యాంకు ఖాతాలోని నగదు పదేళ్లుగా లేదా అంతకు ముందు నుంచీ వాడుకలో లేకుండాపోతే, దాన్ని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అటువంటి 10.24 కోట్ల ఖాతాలకు చెందిన రూ.35,012 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులు ఆర్‌బీఐకు మరలించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎస్‌బీఐవే అత్యధికంగా రూ.8,086 కోట్లు ఉండగా.. రూ.5,340 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది.
చదవండి👉 కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ!
Comments
Please login to add a commentAdd a comment