100 Days 100 Pays
-
బ్యాంకుల్లో 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా!
ఈ ఏడాది 2023-24కు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాక మే నెలలో తొలి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి(ఎఫ్ఎస్డీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ క్లయిమ్ డిపాజిట్లపై మాట్లాడారు. వీలైనంత త్వరగా బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసి మరిచి పోయినా, లేదంటే అన్వేక కారణాల వల్ల తీసుకోలేకపోయిన ఖాతాదారులకు లేదంటే వారి కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ సైతం అన్ క్లయిమ్ డిపాజిట్ల యుద్ధప్రాతిపదికన లబ్ధి దారులకు చేరేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్‌కు సంబంధించిన సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు దాచి మరచిపోయిన సొమ్మును లబ్ధిదారులకు అందించేలా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1నుంచి మొదలవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. దీంతో పలు బ్యాంక్‌లు 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్'లను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశాయి. క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు అంటే ఏమిటి ? బ్యాంక్‌కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ , ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు దాచి మరచిపోయిన వారెందరో. అయితే ఇలా వివిధ బ్యాంక్‌లలో మర్చిపోయిన సొమ్ము మొత్తం దాదాపు రూ.35 వేల కోట్ల మేర ఉందని ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది. ఆ భారీ మొత్తాన్ని లబ్ధి దారులకు చేరేలా బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక వేళ అన్వేక కారణాల వల్ల మనకు తెలియకుండా కుటుంబ సభ్యులు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు దాచారో? లేదో? తెలుసుకోవచ్చు. వాటిని తిరిగి తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి ఎలా తిరిగి తీసుకోవాలో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఇలా తనిఖీ చేయండి ►ముందుగా ఇక్కడ పేర్కొన్న (https://leads.hdfcbank.com/applications/webforms/apply/HDFC_Inoperative_acc/HDFC_Inoperative_acc.aspx) లింక్ ను క్లిక్ చేయాలి. ► ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అనే సెర్చ్ బార్ కనిపిస్తుంది. ►ఆ సెర్చ్ బార్లో మీ పేరు ఎంటర్ చేయాలి. ట్యాప్ చేస్తే మీరు ఏ బ్రాంచ్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారో తెలుపుతుంది. ఒకవేళ మీ అన్ క్లయిమ్డ్ డిపాజిట్లు ఉంటే బ్యాంకుల్ని సందర్శించాలి. అకౌంట్లో ఉన్న డబ్బుల్ని డ్రా చేసుకోవాలి. ఇందుకోసం ఆయా బ్యాంకుల నిబంధనలు పాటించాలి. ►కస్టమర్లు వ్యక్తిగతంగా సమీప బ్రాంచ్ని సందర్శించాలి. ►అక్కడ మీరు డబ్బుల్ని ఎందుకు క్లయిమ్ చేసుకోలేదో లేఖ రాయాలి. పర్సనల్ అకౌంట్స్‌లో డబ్బుల్ని పొందాలంటే ►అడ్రస్ ప్రూఫ్‌తో పాటు ఇతర బ్యాంకుకు కావాల్సిన వ్యక్తిగత వివరాల్ని అందించాలి ► వీటితో పాటు ఆయా బ్యాంకుల రూల్స్‌కు అనుగుణంగా అప్లయి చేయాలి. పర్సనల్ అకౌంట్లు కాకపోతే ► ఆయా బ్యాంక్‌లకు రిక్వెస్ట్ లెటర్లు రాయాలి. ఉపయోగంలో ఉన్న ఐడీ కార్డులతో పాటు సంతకాలు చేయాలి ► అడ్రస్ ప్రూఫ్‌లను సబ్మిట్ చేయాలి. అనంతరం బ్యాంక్ అధికారులు ఆయా ఖాతాలను క్షణ్ణంగా పరిశీలించి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు. చదవండి👉 ఊహించని విధంగా వందల కోట్ల నష్టం.. 50 స్క్రీన్లను మూసేస్తున్న పీవీఆర్? -
ఆర్బీఐ కీలక నిర్ణయం..బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక!
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు వద్ద తమ దగ్గర ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించుకునేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి మొదలవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు వేల కోట్లలో పేరుకుపోయాయని వాటిని ఆర్బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు. తాజాగా, ఆర్బీఐ బ్యాంకుల్లో మూలుగుతున్న వేలకోట్ల డిపాజిట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా బ్యాంక్‌లు తమ దగ్గర అన్క్లెయిమ్డ్గా ఉన్న టాప్–100 డిపాజిట్లను ఖాళీ చేయడంపై (తిరిగి చెల్లించడం/క్లియరెన్స్) దృష్టి పెడతాయని వెల్లడించింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని సేవింగ్స్/కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లు, గడువు ముగిసిపోయి పదేళ్లు అయినా తీసుకోకుండా ఉండిపోయిన టర్మ్ డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంక్‌లు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటాయి. పదేళ్లు ముగిసిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను బ్యాంక్‌లు ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు ప్రతీ జిల్లా పరిధిలో టాప్–100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సంబంధీకులను గుర్తించి చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపడతాయని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. రూ.35వేల కోట్లు.. ఏదైనా బ్యాంకు ఖాతాలోని నగదు పదేళ్లుగా లేదా అంతకు ముందు నుంచీ వాడుకలో లేకుండాపోతే, దాన్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అటువంటి 10.24 కోట్ల ఖాతాలకు చెందిన రూ.35,012 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులు ఆర్బీఐకు మరలించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎస్బీఐవే అత్యధికంగా రూ.8,086 కోట్లు ఉండగా.. రూ.5,340 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. చదవండి👉 కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ!