Unclaimed Money In Savings Account, Bank Fixed Deposits: Check Here - Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో 'అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్​ చేసుకోండిలా!

Published Tue, May 16 2023 11:47 AM | Last Updated on Tue, May 16 2023 1:19 PM

How To Check Unclaimed Money In Savings Account, Bank Fixed Deposits  - Sakshi

ఈ ఏడాది 2023-24కు వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాక మే నెలలో తొలి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి(ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ క్లయిమ్‌ డిపాజిట్లపై మాట్లాడారు. 

వీలైనంత త్వరగా బ్యాంక్‌ అకౌంట‍్లలో డిపాజిట్‌ చేసి మరిచి పోయినా, లేదంటే అన్వేక కారణాల వల్ల తీసుకోలేకపోయిన ఖాతాదారులకు లేదంటే వారి కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ సైతం అన్‌ క్లయిమ్‌ డిపాజిట్ల యుద్ధప్రాతిపదికన లబ‍్ధి దారులకు చేరేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. 

ఈ నేపథ్యంలో బ్యాంక్​కు సంబంధించిన సేవింగ్‌ అకౌంట్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్​లలో డబ్బులు దాచి మరచిపోయిన సొమ్మును లబ్ధిదారులకు అందించేలా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్‌ 1నుంచి మొదలవుతుందని ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో  పలు బ్యాంక్‌లు 'అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌'లను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశాయి. 

క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు అంటే ఏమిటి ?
బ్యాంక్​కు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్స్‌ , ఫిక్స్‌డ్‌ డిపాజిట్​లలో డబ్బులు దాచి మరచిపోయిన వారెందరో. అయితే ఇలా వివిధ బ్యాంక్​లలో మర్చిపోయిన సొమ్ము మొత్తం దాదాపు రూ.35 వేల కోట్ల మేర ఉందని ఆర్‌బీఐ ఇటీవల ప్రకటించింది. ఆ భారీ మొత్తాన్ని లబ్ధి దారులకు చేరేలా బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక వేళ అన్వేక కారణాల వల్ల మనకు తెలియకుండా కుటుంబ సభ్యులు బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు దాచారో? లేదో? తెలుసుకోవచ్చు. వాటిని తిరిగి తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి ఎలా తిరిగి తీసుకోవాలో తెలుసుకుందాం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను ఇలా తనిఖీ చేయండి

ముందుగా ఇక్కడ పేర్కొన్న  

(https://leads.hdfcbank.com/applications/webforms/apply/HDFC_Inoperative_acc/HDFC_Inoperative_acc.aspx) లింక్‌ ను క్లిక్‌ చేయాలి.

ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే మీకు అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌ అనే సెర్చ్‌ బార్‌ కనిపిస్తుంది. 

ఆ సెర్చ్‌ బార్‌లో మీ పేరు ఎంటర్‌ చేయాలి. ట్యాప్‌ చేస్తే మీరు ఏ బ్రాంచ్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్‌ చేశారో తెలుపుతుంది. ఒకవేళ మీ అన్‌ క్లయిమ్డ్‌ డిపాజిట్లు ఉంటే బ్యాంకుల్ని సందర్శించాలి. అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని డ్రా చేసుకోవాలి. ఇందుకోసం ఆయా బ్యాంకుల నిబంధనలు పాటించాలి. 

కస్టమర్‌లు వ్యక్తిగతంగా సమీప బ్రాంచ్‌ని సందర్శించాలి. 

అక్కడ మీరు డబ్బుల్ని ఎందుకు క్లయిమ్‌ చేసుకోలేదో లేఖ రాయాలి. 

 పర్సనల్‌ అకౌంట్స్‌లో డబ్బుల్ని పొందాలంటే 

అడ్రస్‌ ప్రూఫ్‌తో పాటు ఇతర బ్యాంకుకు కావాల్సిన వ్యక్తిగత వివరాల్ని అందించాలి

వీటితో పాటు ఆయా బ్యాంకుల రూల్స్‌కు అనుగుణంగా అప్లయి చేయాలి. 

పర్సనల్‌ అకౌంట్లు కాకపోతే 

► ఆయా బ్యాంక్‌లకు రిక్వెస్ట్‌ లెటర్లు రాయాలి. ఉపయోగంలో ఉన్న ఐడీ కార్డులతో పాటు సంతకాలు చేయాలి

► అడ్రస్‌ ప్రూఫ్‌లను సబ్మిట్‌ చేయాలి. అనంతరం బ్యాంక్‌ అధికారులు ఆయా ఖాతాలను క్షణ్ణంగా పరిశీలించి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు. 

చదవండి👉 ఊహించని విధంగా వందల కోట్ల నష్టం.. 50 స్క్రీన్లను మూసేస్తున్న పీవీఆర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement