దేశంలోని వివిధ బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకుల వద్ద ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు 2024 మార్చి చివరి నాటికి 26 శాతం పెరిగి రూ .78,213 కోట్లకు చేరుకున్నాయి.
సహకార బ్యాంకులతో సహా వివిధ బ్యాంకుల్లో 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాల్లోని సొమ్మును అన్‌క్లెయిమ్డ్‌గా పరిగణించి ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధికి బదిలీ చేస్తాయి. ఇలా 2023 మార్చి నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌లో ఉన్న మొత్తం రూ.62,225 కోట్లు.
ఖాతాదారులకు సహాయపడటానికి మరియు ఇన్‌యాక్టివ్ ఖాతాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను క్రమబద్ధీకరించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది ప్రారంభంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాలు, డిపాజిట్లను ఇన్ యాక్టివ్ లేదా అన్ క్లెయిమ్డ్ గా వర్గీకరించడంతోపాటు బ్యాంకులు అమలు చేయాల్సిన చర్యలను ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
నవీకరించిన మార్గదర్శకాలు అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా), సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను కేంద్రీకృత పద్ధతిలో వెతికే ప్రక్రియను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఉడ్గామ్ (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) అనే వెబ్ పోర్టల్‌ను రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment