క్లెయిమ్‌ల పరిష్కారంలో ఎల్‌ఐసీ భేష్: ఐఆర్‌డీఏ | LIC’s claim settlement better than private insurers: IRDA | Sakshi
Sakshi News home page

క్లెయిమ్‌ల పరిష్కారంలో ఎల్‌ఐసీ భేష్: ఐఆర్‌డీఏ

Published Fri, Jan 3 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

LIC’s claim settlement better than private insurers: IRDA

న్యూఢిల్లీ: ప్రైవేటు బీమా కంపెనీలతో పోల్చితే ‘డెత్ క్లెయిమ్’ల విషయంలో జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పనితీరు అత్యుత్తమంగా ఉందని ఈ రంగ నియంత్రణ సంస్థ- ఐఆర్‌డీఏ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు... గతేడాది (2012-13)లో ఎల్‌ఐసీ క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తి 97.73%. 2011-12లో ఈ నిష్పత్తి 97.42%. అయితే ప్రైవేటు బీమా సంస్థల విషయంలో ఈ రేట్లు వరుసగా 88.65%, 89.34%గా ఉన్నాయి.   ఏడాది ముగింపునాటికి ప్రైవేటు బీమా కంపెనీల వద్ద పెండింగులో ఉన్న (పరిష్కరించాల్సిన) క్లెయిమ్‌లు 3.47శాతం. ఎల్‌ఐసీ విషయంలో ఈ రేటు 1.04 శాతం.  2012-13లో జీవిత బీమా పరిశ్రమల ప్రీమియం ఆదాయం రూ.2.87 లక్షల కోట్లు. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 0.05% అధికం. ప్రీమియం వసూళ్ల విషయంలో ప్రైవేటు రంగంలో 2012-13లో (2011-12తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 6.87% క్షీణత నమోదయ్యింది. అయితే ఈ విషయంలో ఎల్‌ఐసీ 2.92% వృద్ధిని సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement