విప్రో లాభాలు డౌన్‌: బోర్డులోకి అరుంధతీ భట్టాచార్య | Wipro Q2 PAT at Rs 1,890 crore, Arundhati Bhattacharya as Independent Director | Sakshi
Sakshi News home page

విప్రో లాభాలు డౌన్‌: బోర్డులోకి అరుంధతీ భట్టాచార్య

Published Wed, Oct 24 2018 4:33 PM | Last Updated on Wed, Oct 24 2018 4:33 PM

Wipro Q2 PAT at Rs 1,890 crore, Arundhati Bhattacharya as Independent Director - Sakshi

సాక్షి,ముంబై:  ఐటీ సేవల సంస్థ విప్రో  క్యూ 2 ఫలితాల్లో నీరసపడింది.  ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో నికర లాభాలు క్షీణించాయి.  గత క్వార్టర్‌లో రూ. 2,121 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్‌లో 1890 కోట్ల  రూపాయల లాభాలను మాత్రమే నమోదు చేసింది.

ఇదే సమయంలో సంస్థ ఆదాయం 2.3 శాతం పెరిగి రూ .14,567.9 కోట్లకు చేరింది. అలాగే సెప్టెంబరు 2018 ముగిసిన రెండవ త్రైమాసికానికి కంపెనీ ఐటీ సేవల ఆదాయం 5 శాతం పెరిగి రూ .14,377.3 కోట్లకు చేరింది.

మరోవైపు  ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య విప్రో బోర్డులో ఇండిపెండెంట్‌  డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం లభించిందని ఫలితాల సందర్భంగా విప్రో వెల్లడించింది.  జనవరి 1, 2019 నుంచి 5 సంవత్సరాల పాటు ఆమె ఈ పదవిలో ఉంటారని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement