Arundhati Bhattacharya
-
మనకన్ని ప్రభుత్వ బ్యాంకులు ఎందుకండి: ఎస్బీఐ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశీయంగా పటిష్టమైన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొన్ని ఉన్నా సరిపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య అభిప్రాయపడ్డారు. చిన్నా చితకా పీఎస్‌బీలను విలీనమో లేదా ప్రైవేటీకరించడమో చేయొచ్చని తెలిపారు. అయితే, అలాగని వాటి సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే మందు కాదని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రైవేటీకరణ ద్వారా ఏ లక్ష్యాలను ఆశిస్తున్నారో వాటిని సాధించగలిగేలా పీఎస్బీలకు సాధికారత ఇవ్వాలని, సమాన స్థాయిలో అవకాశాలు కల్పించాలని భట్టాచార్య చెప్పారు. అన్ని పీఎస్‌బీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం 10 ఏళ్ల మార్గదర్శ ప్రణాళిక రూపొందించుకోవాలంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇటీవల సూచించిన నేపథ్యంలో భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఇన్ని పీఎస్‌బీల అవసరం ఉందని నేను కూడా అనుకోను. వాటి సంఖ్యను తగ్గించుకోవచ్చు. కొన్నింటిని ప్రైవేటీకరించవచ్చు. పటిష్టమైన వాటిని అలాగే కొనసాగించవచ్చు. కానీ అన్ని సమస్యలకూ ప్రైవేటీకరణ ఒక్కటే మాత్రం పరిష్కారమార్గం కాబోదు‘ అని ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్ ఇండియా సంస్థ చైర్‌పర్సన్‌గా ఉన్న భట్టాచార్య చెప్పారు. 2020లో 10 పీఎస్‌బీలను విలీనం చేయడంతో నాలుగు పెద్ద బ్యాంకులు ఏర్పడ్డాయి. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. డిజిటల్ బ్యాంకులు అనివార్యం.. మరోవైపు, కొత్తగా వస్తున్న డిజిటల్ బ్యాంకులపై స్పందిస్తూ కస్టమర్లు కోరుకుంటున్న పక్షంలో వాటిని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. డిజిటల్ బ్యాంకులతో రిస్కులు ఉన్నప్పటికీ .. మార్పు అనివార్యమని, వాటిని కొన్నాళ్ల పాటు ఆపగలిగినా పూర్తిగా ఆపలేమని చెప్పారు. ఈ తరహా బ్యాంకు లైసెన్సు కోసం 2010లోనే తాను ఆర్బీఐని సంప్రదించానని, కానీ అలాంటి ప్రతిపాదనేదీ లేదంటూ అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆర్బీఐ ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడుతూ ఇది చాలా కీలకమైన ముందడుగు కాగలదని భట్టాచార్య చెప్పారు. వినియోగించే వారిలో భరోసా కలిగించగలిగేలా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఉండగలదని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
స్త్రీలోక సంచారం
చెన్నైలోని అంబూర్‌లో హనీఫా జారా అనే ఏళ్ల బాలిక తన తండ్రి మరుగుదొడ్డి కట్టించడం లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ‘‘మా నాన్నగారు రెండేళ్ల క్రితమే ఇంట్లో టాయ్‌లెట్ కట్టిస్తానని నాకు మాట ఇచ్చారు. ఇప్పటికీ కట్టించలేదు. నేను పెద్దదాన్ని అవుతున్నాను. ఆరు బయటికి వెళ్లాలంటే సిగ్గుగా ఉంటోంది’’ అని హనీఫా తన ఫిర్యాదులో రాసింది. ప్రస్తుతం ఆ బాలిక రెండో తరగతి చదువుతోంది. ఎల్.కె.జి.లో ఉన్నప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే టాయ్‌లెట్ కట్టిస్తానని తన తండ్రి మాట ఇచ్చి మోసం చేశాడని, మాట తప్పినందుకు ఆయన్ని అరెస్ట్ చెయ్యడం గానీ, టాయ్‌లెట్ కట్టిస్తానని లిఖితపూర్వకమైన హామీ ఇప్పించడం గానీ చెయ్యాలని హనీఫా పోలీసులకు కోరింది. అంబూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చెయ్యడం కోసం వెళ్లినప్పుడు హనీఫా తనతోపాటు స్కూల్లోను, ఆటల్లోనూ తనకు వచ్చిన 20 పతకాలను, సర్టిఫికెట్లను తన ప్రతిభకు రుజువుగా తీసుకెళ్లింది. హనీఫా సంకల్పబలానికి ముగ్ధురాలైన ఎస్సై ఎ.వలమర్తి పారిశుద్ధ్య అధికారులతో మాట్లాడి టాయ్‌లెట్ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హనీఫా తండ్రి ఎసానుల్లా (31)కి సోమవారం మధ్యాహ్నం 3.30కి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో ఆందోళనగా బయల్దేరి వెళ్లాడు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఇది ఊపిరి పీల్చుకునే విషయం కాదని ఎస్సై అతడిని సున్నితంగా మందలించారు. ఇదిలా ఉంటే ఈ వార్త తెలియగానే అంబూరు మున్సిపాలిటీ హనీఫాను ‘స్వచ్ఛ భారత్’ స్కీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది! ‘ఫియర్లెస్ గర్ల్’గా ప్రఖ్యాతి చెందిన కాంస్య విగ్రహాన్ని న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్ నుంచి న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజి భవనం ఆవరణకు తరలించారు. స్త్రీ సాధికారతకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని ‘స్టేట్ స్ట్రీట్ గ్లోబర్ అడ్వైజర్స్’ సంస్థ 2017 మార్చి 7న మహిళా దినోత్సవానికి ముందు రోజు వాల్‌స్ట్రీట్‌లో ‘చార్జింగ్ బుల్’ విగ్రహానికి అభిముఖంగా ఆ బుల్‌ని సవాల్ చేస్తున్నట్లుగా ప్రతిష్టించింది. స్టాక్ మార్కెట్లో మహిళా భాగస్వామికి, నాయకత్వానికి సూచికగా ఉంచిన ఈ విగ్రహం కింద ఫలకంపై ‘‘స్త్రీల నాయకత్వపు శక్తిని తెలుసుకోండి. తనేమిటో చూపించగలదు’’ అని రాసి ఉంటుంది. విగ్రహాన్ని అక్కడ ఉంచేందుకు మొదట 30 రోజుల వ్యవధిని మాత్రమే అనుమతి ఇచ్చిన నగరపాలక సంస్థ, ఆ తర్వాత ఆ ‘ఫియర్లెస్ గర్ల్’కు విశేష ఆదరణ లభించడంతో ప్రముఖుల అభ్యర్థనపై వ్యవధి గడువును పెంచుతూ వచ్చింది. అది కూడా ముగియడంతో చివరికి అక్కడి నుంచి తొలగించి, స్టాక్ ఎక్చ్సేంజి భవనం దగ్గరికి చేర్చారు. విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలో బాలిక పాదాల జాడల్ని మాత్రం అలాగే ఉంచుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ‘స్విఫ్ట్ ఇండియా’ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ‘సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్’ (స్విఫ్ట్)కు ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ఎం.వి.నాయర్ ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావస్తుండడంతో అరుంధతిని బోర్డ్ చైర్మన్‌గా ఎంపిక చేసుకున్నట్లు స్విఫ్ట్ ఇండియా సీఈవో కిరణ్ శెట్టి తెలిపారు. 62 ఏళ్ల అరుంధతి ఎస్.బి.ఐ. తొలి మహిళా చైర్మన్‌గా గుర్తింపు పొందారు. 2016 ఫోర్బ్స్ ‘100 మోస్ట్ పవర్ఫుల్ ఉమన్ ఇన్ ది వరల్డ్’జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. -
విప్రో లాభాలు డౌన్: బోర్డులోకి అరుంధతీ భట్టాచార్య
సాక్షి,ముంబై: ఐటీ సేవల సంస్థ విప్రో క్యూ 2 ఫలితాల్లో నీరసపడింది. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో నికర లాభాలు క్షీణించాయి. గత క్వార్టర్లో రూ. 2,121 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్లో 1890 కోట్ల రూపాయల లాభాలను మాత్రమే నమోదు చేసింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 2.3 శాతం పెరిగి రూ .14,567.9 కోట్లకు చేరింది. అలాగే సెప్టెంబరు 2018 ముగిసిన రెండవ త్రైమాసికానికి కంపెనీ ఐటీ సేవల ఆదాయం 5 శాతం పెరిగి రూ .14,377.3 కోట్లకు చేరింది. మరోవైపు ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య విప్రో బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం లభించిందని ఫలితాల సందర్భంగా విప్రో వెల్లడించింది. జనవరి 1, 2019 నుంచి 5 సంవత్సరాల పాటు ఆమె ఈ పదవిలో ఉంటారని తెలిపింది. -
అరుంధతీ భట్టాచార్యకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షురాలు అరుంధతీ భట్టాచార్య బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా సేవలందించిన ఆమె త్వరలోనే మరో దిగ్గజ కంపెనీలో బోర్డులో చోటు దక్కించుకున్నారు. ఎస్బీ ఐఅత్యున్నత పదవినుంచి అక్టోబరు 6, 2017 పదవీ విరమణ చేసిన అరుంధతీ తొలుత క్రిస్ క్యాపిటల్, పిరమల్ ఎంటర్ప్రైసెస్లో ఆర్ధిక సేవల విభాగంలో ఆమె చేరనున్నారని వార్తలు వచ్చాయి. చివరకు ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా సంపాదించిన దాని కంటే 5 రెట్లు ఎక్కువ వేతనం ఆమెకు లభించనుందట. ఎస్బీఐకి సారధ్యం వహించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పిన అరుంధతీ భట్టాచార్య తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. రిలయన్స్‌లో రెండో మహిళా డైరెక్టర్‌గా (ఇండిపెండెంట్ అడిషనల్) చేరడం ద్వారా ఇప్పటికే రిలయన్స్ లో మహిళా డైరెక్టర్‌గా నీతా అంబానీ సరసన చేరనున్నారు. 5 ఏళ్ళపాటు రిలయన్స్ బోర్డ్‌లో అరుంధతి కొనసాగుతారు. ఇందుకు గాను కంపెనీ బోర్డ్ , షేర్ హోల్డర్స్ ఆమోదం తెలిపారని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. -
వివాదాల్లో చిక్కుకున్న బ్యాంకింగ్ రాణులు
-
ఆర్థిక రంగం ఆణిముత్యాలు
‘‘సుదీర్ఘ కాలంగా ఆర్థికరంగం అంటే కేవలం పురుషులకే పరిమితమైన రంగంగా ఉంటూ వచ్చింది. అది బ్యాంకింగ్ రంగమైనా, బీమా, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు ఇలా ఏ రంగమైనా అది మహిళలకు సంబంధించింది కాదనే భావన. దాదాపు మహిళలందరూ ఈ భావనతోనే ఈ రంగాలవైపు (ఆసక్తి వున్నా) వెనకడుగు వేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత ఈ పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. వివిధ రంగాలతోపాటు ఆర్థిక రంగంలో కూడా మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం మొదలు పెట్టారు. ‘‘విత్తం అంటే కేవలం పురుషుల సొత్తే’’ కాదంటూ తమ సత్తా చాటడం మొదలు పెట్టారు. వారిలో ప్రముఖమైన మహిళల్ని ఇపుడు చూద్దాం’’. చందా కొచ్చర్ జోధ్ పూర్లో జన్మించిన చందా కొచ్చర్ భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈవోగా తన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 1984 లో ట్రైనీగా ప్రారంభమైన ఆమె ప్రయాణం బ్యాంకు అత్యున్నత అధికారిగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయబావుటా ఎగరేస్తూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంతో దెబ్బతిన్న సమయంలో ఆమె బ్యాంకును విజయపథంలో నడిపించారు. ఆమె నాయకత్వంలోనే ఐసీఐసీఐ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటిగా నిలవడం గమనించాల్సిన విషయం. దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు. ఆర్థిక రంగంలో ఆమె చేసిన విశేష సేవలకు గాను 2010లో ఆమెకు పద్మభూషణ్ దక్కంది. అలా మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి ఎండీదాకా సాగిన చందా కొచ్చర్ ప్రస్థానం బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే అనేకమంది యువతులకు ప్రేరణ. ఉషా అనంతసుబ్రమణియన్ 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉషా అనంత సుబ్రమణియన్ సొంతం. స్టాటస్టిక్స్ లో దిట్ట. ప్రస్తుతం, అలహాబాద్ బ్యాంక్ సీఎండీగా ఉన్న ఉషా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారతీయ మహిళా బ్యాంక్ లాంటి బ్యాంకులకు సారధ్యం వహించారు.అనంత సుబ్రమణియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ)తో యాక్ట్యుయేరియల్ డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించారు. స్టాటస్టిక్స్‌లో ఆమెకున్న పట్టుతో తన సామర్ధ్యాలకు మరింత పదును పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్తులు క్షీణిస్తూ....దయనీయ పరిస్థితుల్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) పరిశీలనలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారధ్య బాధ్యతలు ఆమెకు అప్పగించారు. తన అనుభవం, ప్రతిభతో బ్యాంకును కష్టాలనుంచి గట్టెక్కిండచడంతోపాటు.. లాభాల బాట పట్టించిన ఘనతను సాధించారామె. ముఖ్యంగా మొట్టమొదటి భారతీయ మహిళా బ్యాంకు స్థాపనలో ఆమె కృషి ప్రధానంగా చెప్పుకోదగ్గది. (భారతీయ మహిళా బ్యాంకు ఇపుడు ఎస్బీఐలో విలీనమైంది). శిఖా శర్మ భారతదేశంలో మూడవ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ. 1980 లో ఐసిఐసిఐ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ రిటైల్ ఫైనాన్స్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. ఆర్ధిక రంగంలో మూడు దశాబ్దాల విశేష అనుభవంతో యాక్సిస్ బ్యాంకు సారధ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ విభాగంలో తనదైన ముద్రతో యాక్సిస్ బ్యాంకును అగ్రభాగంలో నిలిపే లక్ష్యంతో సాగుతున్నారు. అరుంధతి భట్టాచార్య దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగబ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 208 సంవత్సరాల ఎస్బీఐచరిత్రలో, ఈ ఘనతను సాధించిన మొదటి మహిళగా భట్టాచార్య గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ 'మోస్ట్ పవర్ఫుల్ వుమెన్’ 2016 లో 25వ స్థానంలో నిలిచారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు రెండేళ్ల సెబాటికల్ లీవ్ విధానాన్ని ఆమె పరిచయం చేశారు. దీన్నిమహిళలు ప్రసూతి సెలవు లేదా పెద్దల సంరక్షణల బాధ్యతల సందర్భంగా వినియోగించుకోవచ్చు.అలాగే సర్వైకల్ క్యాన్సర్ టీకాను మహిళా ఉద్యోగులందరు ఉచితంగా పొందే సౌకర్యాన్ని కల్పించారు. చిత్ర రామకృష్ణ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారిలో చిత్రా రామకృష్ణ ప్రముఖులు. అంతేకాదు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) కు బలమైన పోటీదారుగా ఎన్ఎస్ఈని నిలపడంలో ఆమె కృషి చాలా ఉంది. మార్కేట్ రెగ్యులేటరీ సెబీకి కూడా ఆమె తన సేవలనందించారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా కెరియర్ ను ప్రారంభించిన చిత్ర ఐడీబీఐ బ్యాంకులో ప్రాజెక్ట్ ఫైనాన్స్ విభాగంలో పనిచేశారు. 1992లో ఎన్ఎస్ఈ ఏర్పడినప్పటినుంచి వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె 2013లో (20 ఏళ్ల తరువాత) సీఈవో, ఎండీగా నియమితులయ్యారు. అదే సంవత్సరం ఫోర్బ్స్ ఇండియన్ విమెన్ లీడర్ పురస్కారం గెలుచుకున్నారు. డిసెంబరు 2, 2016 న ఆమె పదవికి రాజీనామా చేశారు. ఉషా సంగ్వాన్ దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కి మొట్టమొదటి మహిళా ఎండీ ఉషా సంగ్వాన్. సాధారణంగా ఎల్ఐసీకి టెక్నికల్‌గా నలుగురు ఎండీలు సారధ్యం వహిస్తారు. అయితే నలుగురు ఎండీలు కంపెనీని వీడిన అనంతరం ఎండీ పదవిన చేపట్టిన ఉషా సంస్థను ఆరునెలలపాటు ఒంటి చేత్తో నడిపించడం విశేషం. ఈ కాలంలో ఎల్ఐసి మార్కెట్ వాటా 70 శాతంనుంచి 71శాతానికి పెరిగింది. క్లెయియ్ పరిష్కార నిష్పత్తి 99.6 శాతం వద్ద ఉంది. వాణి కోలా బెంగళూరు ఆధారిత కోలారి క్యాపిటల్ వ్యవస్థాపకురాలు, ఎండీ వాణి కోలా. కోలారి క్యాపిటల్‌ను నెలకొల్పినప్పటినుంచీ విజయపథంలో నడిపించారు. తద్వారా దేశంలో వెంచర్ పెట్టుబడి సంస్థలలో ఒకటిగా నిలిపారు. 22 ఏళ్లపాటు సిలికాన్ వ్యాలీలో, 10సంవత్సరాలు వెంచర్ క్యాపిటలిస్టుగా సేవలనందించారు. సిలికాన్ వ్యాలీలో సర్టస్ సంస్థకు వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా ఉన్నారు. అంతకుముందు ఇ- ప్రొక్యూర్ మెంట్ కంపెనీ రైట్ వర్క్స్‌కు సీఈవోగా పనిచేశారు.2005 లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆరు నెలలకాలంలోనే 210 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సహా దాదాపు 60 స్టార్టప్ కంపెనీల్లో 650 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను సాధించిన ఘనత ఆమె సొంతం. 1964లో హైదరాబాద్‌లో జన్మించిన వాణి కోలా ఉస్మానియా యూనివర్శిటీలో, అరిజోనా యూనివర్శిటీలో విద్యనభ్యసించారు. ఇంద్రనూయి 1955లో తమిళనాడులోని మద్రాసులో జన్మించిన ఇంద్రనూయి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆహార, పానీయాల కంపెనీ పెప్సీకోకు సీయీవోగా ఎదిగారు. ఫోర్బ్స్ వారు ప్రకటించిన ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో 13వ స్థానంలో నిలిచారు. 2001లో ఆమె పెప్సీకో కంపెనీలో చేరినప్పుడు సంస్థ నికర లాభం 2.7బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం అది 6.5బిలియన్ డాలర్లకు చేరుకోవడంలో ఆమె చేసిన కృషి అమోఘం. ఆమె కృషికి తగ్గ ఫలితంగా ఆమె ప్రస్తుతం సంవత్సరానికి 18.6మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకుంటున్నారు. కావేరి కళానిధి మారన్ సన్ టీవీ మానేజింగ్ డైరెక్టర్‌గా సంవత్సరానికి 18మిలియన్ డాలర్ల వేతనాన్ని పొందుతున్నారు. ఇన్ఫోసిస్ సీయీవో వేతనం కంటే కూడా ఇది అధికం. 2010 నుంచి 2015 వరకూ స్పైస్‌జెట్ చైర్మన్‌గా పనిచేశారు. కిరణ్ మజుందార్ షా బెంగెళూరులో బయోకాన్ బయోటెక్నాలజీ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం సంస్థ మానేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సంవత్సరానికి రూ.16కోట్ల వేతనం పొందుతూ దేశంలో అత్యంత ధనవంతురాలుగా గుర్తింపు పొందుతున్న మహిళ. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రాలలో ఆమె చేసిన రచనలకు గాను 2014లో ఒత్మేర్ గోల్డమెడల్ పొందారు. ఐఐఎమ్ బెంగుళూరుకు చైరపర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉర్వి పిరమాల్ సంవత్సరానికి రూ.10కోట్ల వేతనం పొందుతూ నాల్గో స్థానంలో నిలిచారు ఉర్వి పిరమాల్, అశోక్ పిరమాల్ సంస్థ అధినేత్రి. తన 32వ ఏట భర్తను కోల్పొయారు. తదనంతరం కుటుంబ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. కుటుంబ వ్యాపారం విడిపోయిన తర్వాత ఉర్వి పిరమాల్‌కు తన వాటాగా ఒక టెక్సటైల్ మిల్, రెండు ఇంజనీరింగ్ సంస్థలు లభించాయి. పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను ఆమె తిరిగి లాభాల బాట పట్టించారు. ప్రస్తుతం ఈ సంస్థల సంవత్సర ఆదాయం రూ.1600కోట్లు. ఆర్తీ సుబ్రమణియన్ ‘‘ఉత్తమమైనది తప్ప మరేమి వద్దు’’ ఇదే ఆర్తీ సుబ్రమణియన్ పాటించే సూత్రం. అదే ఆమెను టీసీఎస్ లాంటి టాప్ కంపెనీకి ఎక్సిక్యూటీవ్ డైరెక్టరుగా ఎదిగేలా చేసింది. ఆమె ఈడీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సాధించిన అతి గొప్ప విజయం పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టు. పాస్‌పోర్టు జారీ ప్రక్రియను పూర్తిగా మార్చి డిజిటైజేషన్ చేశారు. టీసీఎస్ చరిత్రలోనే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలైన తొలి మహిళ. ఆమె తోటి ఉద్యోగులు ఆమెను ప్రేమగా ‘మిస్.ఫిక్సిట్’ అని పిలుచుకుంటారు. వనిత నారయానణ్ టెక్ దిగ్గజం ఐబీఎమ్ గురించి మనలో చాలా మందికి తెలుసు. బీటెక్ చదివిన ప్రతి విద్యార్ధి ఐబీఎమ్‌లో ఉద్యోగం గురించి కలలు కంటుంటారు. వనితా నారయానణ్ కూడా అలానే అనుకుంది, అనుకోవడమే కాకుండా అందులో ఉద్యోగం కూడా సంపాదించారు. 1985లో ఐబీఎమ్‌లో సాధరణ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 2013లో ఐబీఎమ్ ఇండియాకు మానేజింగ్ డైరెక్టర్‌గా, ఇండియా/సౌత్ ఆసియాకు రిజనల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 25 సంవత్సరాల నుంచి వివిధ దేశాల్లో పర్యటిస్తూ, వేర్వేరు రకాల వ్యక్తులతో పనిచేస్తున్నారు. 2013-14లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో సభ్యురాలిగా పనిచేశారు. నీలమ్ ధావన్ హెచ్‌పీ కంప్యూటర్లు, ప్రింటర్లకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అంత గొప్ప పేరు ఉన్న కంపెనీకి ఇండియాలో మానేజింగ్ డైరెక్టరుగా నియమితులయ్యారు నీలం ధావన్. కేవలం కంప్యూటర్లు, ప్రిటింగ్ పరికరాలకే పరిమితమైన కంపేని సేవలను బీపీవో, సాఫ్ట్వేర్, పరిశోధన - సేవలకు కూడా విస్తరించి ప్రస్తుతం హెచ్‌పీ కంపెనీని దేశంలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీగా నిలబెట్టారు. హెచ్‌పీలో చేరడానికంటే ముంది నీలం 2005నుంచి 2008వరకూ మైక్రోసాఫ్ట్ ఇండియాకు మానేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్‌సీఎల్, ఐబీఎమ్ కంపెనీల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అరుణ జయంతి 2011 సెప్టెంబరులో కాప్జెమిని సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన అరుణ జయంతిది ఈ రంగలో రెండు దశాబ్దల అనుభవం. సీయీవోగా చేయడానికి కంటే ముంది అరుణ కాప్ జెమినిలో ఔవుట్ సోర్సింగ్ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఔవుట్సోర్సింగ్ సేవల విలువలను గణనీయంగా పెంచారు. సీయీవోగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే భారతీయ వ్యాపార రంగంలో తన ఉనికిని చాటుకున్నారు. 2013లో ఇండియా టుడే వారు ప్రకటించిన ఇండియన్ వుమేన్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. క్రితిగా రెడ్డి సామాజిక మాధ్యమం ఫేస్బుక్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా తన శాఖలను విస్తరించింది ఈ కంపెనీ. ఇంతపెద్ద కంపెనీలో భారతదేశం నుంచి ఉద్యోగంలో చేరిన తొలి మహిళ క్రితిగా రెడ్డి. 2010లో ఉద్యోగంలో చేరిన క్రితిగా రెడ్డి ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో తన సేవలను విస్తరించేందుకుగాను హైదరాబాదులో ప్రారంభించిన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫార్చున్ పత్రిక ప్రకటించే టాప్ 50 మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ ఇన్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. పిల్లలు, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. కుముద్ శ్రీనివాసన్ 1987లో ఇంటెల్ కంపెనీలో చేరిన కుముద్ శ్రీనివాసన్ బిజినేస్, ఇనఫర్మేషన్ సిస్టమ్స్‌లో వేర్వేరు బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం భారత్‌లో ఇంటెల్‌కు జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరులోని ఐఐఐటీ గవర్నింగ్ బాడీలో సభ్యురాలిగా పనిచేశారు. తన్యా దుబాష్ గోద్రెజ్ ఉత్పత్తులకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో తెలిసిన విషయమే. సబ్బుల దగ్గర నుంచి లాకర్ల వరకూ ఎనో ఉత్పత్తులను తయారుచేస్తుంది ఈ కంపెనీ. కానీ ఒకానొక సందర్భంలో కంపెనీలో మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని ముందు గుర్తించి నష్టం వాటిల్లకుండా చూసి కంపెనీని తిరిగి పుంజుకునేలా చేసిన ఘనత తన్యా దుబాష్ది. తన్యా దుబాష్, ఆది గోద్రెజ్ పెద్ద కుమార్తే. తన్యా దుబాష్ భారతీయ మహిళ బ్యాంకు బోర్డు మెంబరు. సునితా రెడ్డి వైద్యరంగంలో అపోలో ఆసుపత్రులది విశిష్ట స్థానం. 2014లో సునితా రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆరోగ్యసేవలను విస్తరస్తూ పోతు ఉన్నారు. ప్రస్తుతం అపోలో ఆరోగ్య సేవలను గ్రామాలకూ కూడా విస్తరించారు. ఆమె హర్వర్డ్ బిజినేస్ స్కూల్ ఇండియా అడ్వైసరీ బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు. శాంతి ఏకాంబరం ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఎంతటి పోటి ఉందో అందరికి తెలిసిన విషయమే. ఇంత తీవ్ర పోటిని తట్టుకుని నిలబడాలంటే ఎంతో ముందు చూపు ఉన్న నాయకత్వం అవసరం. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తే శాంతి ఏకాంబరం, ప్రముఖ కోటాక్ మహింద్ర బ్యాంక్ ప్రెసిడెంట్. 2014లో ఆమె బాధ్యతలు తీసుకున్న వెంటనే డిజిటల్ ఉత్పత్తుల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగానే వేర్వేరు భాషల్లో బ్యాంక్ సర్వీసులను అందిచడం, అల్ఫా సేవింగ్స్ అకౌంట్స్, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా డబ్బులను పంపిచడం వంటి నూతన విధానాలను ప్రవేశపెట్టారు. ఆమె చేసిన మార్పుల వల్ల 2015లో రూ.21,113గా ఉన్న ఖాతాదారుల ద్రవ్య నిల్వలు 2016 మార్చి నాటికి రూ.32,987 కోట్లకు చేరుకున్నాయి. చౌహన్ సాలుజా పార్లే-జీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది బిస్కెట్లు. అంతా ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ ఒకానొక సమయంలో అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల కంపెనీల నుంచి తీవ్ర పోటిని ఎదుర్కొవాల్సి వచ్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీ పగ్గాలు చేపట్టింది చౌహాన్ సాలుజా, కంపెనీ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సాలుజా పెద్ద కుమార్తే. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధించిన అతిపెద్ద విజయం కంపెనీ తయారి సంస్థను ఉత్తారాఖండ్‌లో నెలకొల్పడం. రోశిని నాడార్ హెచ్‌సీఎల్ అంటే ఐటీ సేవలు అందించే సంస్థగానే గుర్తింపు ఉంది. కానీ రోశిని నాడార్ కంపెనీ సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2014లో రోశిని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐటీ సేవలకే పరిమతమయిన కంపెనీ ఆరోగ్యరంగంలో అడుగు పెట్టింది, నైపుణ్య శిక్షణ కోసం హెచ్‌సీఎల్ టాలెంట్ కేర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇవి విజయవంతంగా పనిచేస్తున్నాయి. రేఖ మీనన్ అక్సెంచర్ కంపెనీకి 2000 సంవత్సరంలో భారతదేశంలో కేవలం 300మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరి ప్రస్తుతం...? 1,40,000మంది అవును అక్షరాల లక్షానలబై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ సాధించిన ఈ అభివృద్ధి వెనక రేఖా మీనన్ క్రమశిక్షణ, కృషి, అంకితభావం ఉన్నాయి. ప్రియా నాయర్ 1995లో హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీలో మానేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం కంపెనీలో ముఖ్య విభాగమైన హోమ్ కేర్ డివిజన్‌కు ఎగ్సిక్యూటీవ్ డైరెక్టరుగా ఎదిగారు. మార్కెట్లో వస్తున్న పోటి కంపెనీ ఉత్పత్తులకు ధీటుగా ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడ్తూ కంపెనీని విస్తరిస్తూ పోతు ఉన్నారు. ఏక్తా కపూర్ సగటు భారతీయ ప్రేక్షకులను ముఖ్యంగా ఆడవారిని టీవీల ముందు కట్టిపడేసి, ధారవాహికలకు భారీ హంగులు అద్దిన బుల్లితెర రాణి ఏక్తా కపూర్. బాలాజీ టెలిఫిల్మ్ అనే సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన ధారవాహికలను నిర్మిస్తూన్నారు ఏక్తా కపూర్. అంతేకాదు సిని నిర్మాణ రంగంలోనూ ప్రవేశించి తన ప్రతిభను చాటుకుంటున్నారు. నీతా అంబాని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అంబానీల ఇంట అడుగుపెట్టారు నీతా అంబాని. రిలయన్స్ సంస్థల అభివృద్ధిలో ఆమె పాత్రను మరవలేము.ఇంత పేరుప్రఖ్యాతులు వచ్చినా ఆమె తన మూలాలను మరిచిపోలేదు. అందుకే కంపెనీ లాభాల్లోంచి కొంత వాటాను తిరిగి సమాజాభివృద్ధికే కేటాయించే ఉద్ధేశంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే సవాళ్లను ముందే గుర్తించడం, అందుకు తగ్గ పరిష్కారాలను కనుక్కొవడం ఆమె ప్రత్యేకత. వీరు తమ అసమాన ప్రతిభా పాటవాలతో అటు తాము నేతృత్వం వహిస్తున్న కంపెనీలను విజయపథం వైపు నడిపించడం మాత్రమే కాదు ఫైనాన్షియల్ సెక్టార్లో గణనీయమైన కృషి చేశారు. కొన్ని పనులను, బాధ్యతలను మహిళలు నిర్వహించలేరు అనేది కేవలం అపోహ మాత్రమేనని నిరూపించారు. అవకాశాలు కల్పిస్తే..బాధ్యతలు అప్పగిస్తే ఏ రంగమైనా రాణించి తీరతామని చాటి పెట్టారు. తద్వారా యావత్ మహిళాలోకానికి ప్రేరణగా నిలిచారు. ధరణి సూర్యకుమారి -
రుణం వైపు కాదు... స్టాక్ మార్కెట్ వంక చూడాలి!
నిధుల సమీకరణపై చిన్న పరిశ్రమలకు ఎస్బీఐ చీఫ్ సూచన న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈ) తమకు అవసరమైన నిధుల సమీకరణ కోసం స్టాక్ మార్కెట్లకు వెళ్లాలి తప్ప, రుణ ఆధారితాలు కారాదని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య సూచించారు. ఆయా సంస్థలు తమ వ్యాపారాన్ని ఆరోగ్యవంతమైన రీతిన నిర్వహించుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ⇒ చిన్న తరహా పరిశ్రమలు తమ వ్యాపార తొలి దశల్లో నిధుల అవసరాలకు రుణాలపై ఆధారపడుతున్నాయి. ఇది ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్లపై ప్రభావం చూపుతోంది. ⇒ మన దేశానికి సంబంధించినంతవరకూ చిన్న పరిశ్రమలు తమ నిధుల అవసరాలకు స్టాక్ మార్కెట్ వైపు చూడవు. ఈక్విటీ ఆధారిత మూలధనం సమకూర్చుకునే అంశం పూర్తి నిర్లక్ష్యానికి గురవుతోంది. ⇒ టెక్నాలజీ సంస్థల నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. వాటి వ్యాపార అవసరాలకు కావాల్సిన మొత్తంలో అధిక భాగాన్ని ఆయా సంస్థలు ఈక్విటీ విధానం ద్వారానే సమీకరించుకుంటాయి. ⇒ మనం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీలనూ చూడొచ్చు. ఈక్విటీతో ఆయా కంపెనీలు అద్భుతాలను సృష్టించాయి. ⇒ చిన్న తరహా పరిశ్రమలకు ఈక్విటీ సాయాన్ని అందించగలిగిన పెట్టుబడిదారులు ఉన్నారు. మీ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభం వస్తుందన్న విశ్వాసాన్ని కల్పించడం ముఖ్యం. ⇒ చాలా మంది చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులు తొలుత తన కుటుంబం, స్నేహితులు, బంధువుల నుంచి సమీకరించిన నిధులతో తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. తరువాత, బ్యాంకులపై ఆధారపడతారు తప్ప, ఈక్విటీవైపు మాత్రం చూడరు. చిన్న పరిశ్రమలకు దివాలా ఫ్రేమ్‌వర్క్: సాహూ కాగా ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్ సాహూ మాట్లాడుతూ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి త్వరలో ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ దాదాపు కార్పొరేట్ దివాలా వ్యవహారాలను చక్కదిద్దడానికి ఉద్దేశించినది ఉందన్నారు. అందువల్ల చిన్న తరహా పరిశ్రమలకు రెండు దశల్లో సమగ్ర దివాలా పక్రియ విధివిధానాలను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఎన్పీఏలను నేరంగా చూస్తున్నారు
♦ ఇవి పోగయ్యేది వైఫల్యాల వల్లే ♦ వైఫల్యాలు జరుగుతుంటాయి.. ♦ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య కోల్‌కతా: దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు చేరిన తరుణంలో, ఎగవేతదారులపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన దేశంలో మొండి బకాయిలను (ఎన్పీఏ) నేరంగా పరిగణిస్తున్నారు. కానీ, వీటిని అలా చూడకూడదు. ఎన్పీఏలు తయారయ్యేది వైఫల్యాల వల్లే. వైఫల్యాలకు అనుమతి ఉండదు. ఇందుకు సమాజం కూడా అంగీకరించదు. అయినా సరే వైఫల్యాలు చోటు చేసుకుంటాయి’’ అని అరుంధతి మంగళవారం కోల్‌కతాలో చెప్పారు. ఇక్కడ ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ... ‘‘జీడీపీ 8.5% వృద్ధి చెందుతున్న సమయంలో ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారతాయని ఊహించలేదు. కానీ, జీడీపీ వృద్ధి 4%కి పడిపోవడంతో బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు భారీగా పెరిగిపోయాయి. అయితే మొత్తం రుణాల్లో ఇవి 5 శాతమేనని గుర్తుంచుకోవాలి’’ అని ఆమె చెప్పారు. మరిన్ని రిటైల్ ఉత్పత్తులు... డిజిటల్ వేదికగా మరిన్ని రిటైల్ ఉత్పత్తులను తీసుకురానున్నట్టు అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ... వినియోగదారులు ఖర్చు చేసే తీరును డిజిటల్ సాయంతో విశ్లేషించనున్నట్టు చెప్పారు. రుణ వృద్ధి 9% ఉంటే సరైనదని, కానీ అది 7% కంటే తక్కువే ఉందని చెప్పారు. -
ఆ 12 కంపెనీలు...మా లాభాలను దెబ్బతీయలేవు!
♦ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ♦ తగిన ప్రొవిజనింగ్స్ జరిగాయని వివరణ ముంబై: మొండిబకాయిలకు సంబంధించి అధిక వాటా కలిగిన 12 సంస్థల అకౌంట్లు బ్యాంకుల నికర లాభాలపై ప్రభావం చూపుతాయని వస్తున్న విశ్లేషణలను బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తోసిపుచ్చారు. దివాలా ప్రొసీడింగ్స్‌కు రిఫర్ చేసిన ఆయా అకౌంట్ల మొండిబకాయిల విషయంలో దాదాపు తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) ఇప్పటికే జరిగిపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో ‘భారీగా అదనపు ప్రొవిజనింగ్’ అనే మాటే తలెత్తబోదని అన్నారు. ఇక్కడ జరిగిన వార్షిక సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, సంబంధిత అకౌంట్లకు సంబంధించి ఏదో కొద్ది మొత్తం ప్రొవిజనింగ్స్ జరపాల్సి వస్తుంది తప్ప, ఈ మొత్తం భారీగా ఉండబోదని అన్నారు. 12 అకౌంట్లకు భారీ కేటాయింపులు జరపాల్సి రావడం బ్యాంకింగ్ లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం నాడు ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో భట్టాచార్య ఈ ప్రకటన చేశారు. డర్టీ డజన్ అకౌంట్లలో ఆరు ఎస్బీఐలో ఉండడం గమనార్హం. దివాలా ప్రక్రియకు ఆర్బీఐ రిఫర్ చేసిన 12 భారీ మొండిబకాయిల అకౌంట్లలో భూషన్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,365 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషన్ పవర్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు) తదితర కంపెనీలు ఉన్నాయి. -
బ్యాంకుల్లో ఎస్బీఐ అగ్రగామి... వేతనంలో కాదు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని 50 అగ్రగామి బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ స్థానం సంపాదించుకుంది. కానీ, దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ చీఫ్ పారితోషికం చాలా తక్కువ. బ్యాంకుల వార్షిక నివేదికల ప్రకారం చూస్తే... ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న వేతనం రూ.28.96 లక్షలు. అదే ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందాకొచర్ వేతనం రూ.2.66 కోట్లు. దీనికి అదనంగా రూ.2.2 కోట్ల పనితీరు ఆధారిత బోనస్ కూడా అందుకున్నారు. యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ బేసిక్ వేతనం రూ.2.7 కోట్లు కాగా, అలవెన్స్‌ల రూపేణా ఆమెకు మరో రూ.90 లక్షలు లభించాయి. ఇక యెస్ బ్యాంకు ఎండీ, సీఈవో రాణా కపూర్ రూ.6.8 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పురి పారితోషికం రూ.10 కోట్లు. దీనికి తోడు గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ ఆప్షన్లను విక్రయించి ఆయన రూ.57 కోట్లను సొమ్ము చేసుకున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ ఈ అంశాన్ని గతేడాది ఆగస్ట్‌లోనే ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఇంత తక్కువ వేతనాలతో ప్రతిభావంతులను ఆకర్షించడం కష్టమని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా రూ.6లక్షల కోట్ల ఎన్పీఏలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
75 లక్షల గృహ రుణంపై వడ్డీ తగ్గింపు
ఎస్బీఐ నిర్ణయం 15 నుంచీ అమలు ముంబై: భారీ గృహ రుణాలపై వడ్డీరేటును బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో మహిళలకు సంబంధించి ఈ రుణ రేటు 8.55 శాతంగా ఉంటుంది. ఇతరులకు 8.60 శాతంగా అమలవుతుంది. బుధవారంనాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండెర్ట్ లిక్విడిటీ రేషియో (తమ డిపాజిట్లలో బ్యాంకులు ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన మొత్తం)ను అరశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 20 శాతానికి చేరింది. ఇది బ్యాంకుల వద్ద మరిన్ని నిధులు సమకూరే అంశం కాగా, గృహ రుణాలపై ప్రొవిజినింగ్ను సైతం తగ్గించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ శుక్రవారం తాజా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం జూన్ 15వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో ఎస్బీఐ తెలిపింది. రిస్క్ వెయిటేజ్‌ని ఆర్బీఐ తగ్గించడం తమ నిర్ణయానికి కారణమని ప్రకటనలో ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) రజ్నీష్ కుమార్ తెలిపారు. రూ.75 లక్షల పైబడిన గృహ రుణంపై రిస్క్ వెయిటేజ్‌పై ఆర్బీఐ 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది. ఇప్పటికి తాజా మూలధనం అక్కర్లేదు ♦ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య... ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం నుంచి తాను ఏమాత్రం తాజా మూలధనం కోరుకోవడం లేదని శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ మార్గంలో ఇటీవలే ఎస్బీఐ రూ. 15,000 కోట్లు సమీకరించింది. ‘‘మా ప్రణాళికల ప్రకారం ఈ ఏడాది ప్రభుత్వ నిధులు అక్కర్లేదు. అవసరమైతే వచ్చే ఏడాది ప్రభుత్వ నిధులను కోరతాం. బాసెల్ 3 (మూలధన అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ నిబంధనలు) నిబంధనలకు అనుగుణంగా సైతం ప్రస్తు తం బ్యాంక్ మూలధనాన్ని కలిగిఉంది’’ అని ఆమె అన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాన్ని లిస్టింగ్ చేసే అంశంపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఎంసీఎల్ఆర్ తగ్గించిన ఓబీసీ 20 బేసిస్ పాయింట్లు తగ్గింపు ∙12 వతేదీ నుంచీ అమలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.20 శాతం తగ్గించింది. బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ♦ ఈ రేటు జూన్ 12వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ♦ ఓవర్‌నైట్ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గి 8.10%కి చేరింది. ♦ నెల రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.20 శాతానికి దిగింది. ♦ మూడు, ఆరు నెలల రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గి వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి దిగివచ్చింది. ♦ ఇక ఏడాది కాలానికి రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.50కి చేరింది. ♦ తనకు తాజాగా లభ్యమవుతున్న నిధుల వ్యయాల ప్రాతిపదికన, దాదాపు నెలకొకసారి ఎంసీఎల్ఆర్పై సమీక్ష ఉంటుంది. గత బేస్‌రేటు స్థానంలో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. రెపో రేటు ప్రయోజనాన్ని తక్షణం కస్టమర్లకు అందించాలన్నది ఇక్కడ ప్రధాన లక్ష్యం. ఐఓబీ కూడా... మరో ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన బేస్ రేటును ప్రస్తుత 9.50 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గించింది. జూలై 1 నుంచీ తాజా రేటు అమలవుతుందని తెలిపింది. -
‘కార్డ్’లో ఎస్బీఐ వాటా పెంపు
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డ్స్ సంస్థ ఎస్బీఐ కార్డ్‌లో జూన్ నాటికల్లా వాటాలను 74 శాతానికి పెంచుకోనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని నియంత్రణపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ’ఎస్బీఐ కార్డ్ ఉన్నతి’ని ఆవిష్కరించిన సందర్భంగా ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీతో రెండు క్రెడిట్ కార్డు జాయింట్ వెంచర్స్‌లో వాటాలను 74 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలకు ఎస్బీఐ బోర్డు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. వీటి ప్రకారం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐసీపీఎస్ఎల్), జీఈ క్యాపిటల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (జీఈసీబీపీఎంఎస్ఎల్)లో సుమారు రూ. 1,160 కోట్లతో జీఈ క్యాపిటల్ ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా ఎస్బీఐ తమ వాటాలను పెంచుకోనుంది. మిగతా 26% వాటాలపై వచ్చే నెలరోజుల్లోగా జీఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అరుంధతీ భట్టాచార్య తెలిపారు. జీఈ క్యాపిటల్ ఇండియాతో కలిసి ఎస్బీఐ 1998లో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో ప్రవేశించింది. ప్రస్తుతం ఎస్బీఐకి... ఎస్బీఐసీపీఎస్ఎల్ లో 60%, జీఈసీబీపీఎంఎస్ఎల్లో 40% వాటాలు ఉన్నాయి. ఈ రెండింట్లోనూ మిగతా వాటాలు జీఈ క్యాపిటల్ చేతిలో ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్స్ నుంచి వైదొలగాలని జీఈ క్యాపిటల్ యోచిస్తోంది. ఉన్నతి కార్డ్ ప్రత్యేకతలు.. నగదురహిత లావాదేవీల పరిధిలోకి మరింత మంది కొత్త యూజర్లను చేర్చే లక్ష్యంతో ఉన్నతి కార్డ్‌ను ఎస్బీఐ కార్డ్ ప్రవేశపెట్టింది. జన ధన ఖాతాదారులు సహా ఎస్బీఐ కస్టమర్లందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ఖాతాలో రూ. 25,000 బ్యాలెన్స్ ఉండే వారికి ఈ కార్డును జారీ చేయనున్నట్లు అరుంధతీ భట్టాచార్య తెలిపారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో నాలుగేళ్ల పాటు ఎటువంటి వార్షిక ఫీజు లేకుండా ఉచితంగా ఈ కార్డును అందించనున్నట్లు ఆమె వివరించారు. గతంలో క్రెడిట్ హిస్టరీ లేని కొత్త యూజర్ల క్రెడిట్ కార్డ్ అవసరాలను తీర్చేందుకు ’ఉన్నతి’ ఉపయోగపడగలదని భట్టాచార్య చెప్పారు. మూడు నెలల్లో విలీనం పూర్తి: ఎస్బీఐ ఎస్బీఐలో ఆరు బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కానుంది. ఆర్బీఐ నుంచి మూడు నెలల సమయం కోరామని, ఆలోపు పూర్తి చేస్తామని ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రక్రియ దశలవారీగా జరుగుతుందని, ముందు డేటాను ఒక్కటి చేయడం, ఖాతాదారులకు కొత్తగా పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు జారీ చేస్తామని పేర్కొన్నారు. విలీనం అనంతరం ఒకే ప్రాంతంలో ఒకటికి మించి ఉన్న 1,500 – 1600 శాఖలను మూసివేయడం జరుగుతుందన్నారు. చాలా ప్రాంతాల్లో ఒకటికి మించిన శాఖలున్నాయన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, భారతీయ మహిళా బ్యాంకు ఏప్రిల్ 1న కలిసిపోనున్నాయి. -
అరుంధతీ భట్టాచార్య.. ద లీడర్
ఫార్చ్యూన్ టాప్–50లో స్థానం న్యూయార్క్: దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యకు అరుదైన గౌవరం లభించింది. ఫార్చ్యూన్ ‘ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకుల’ జాబితాలో ఈమె 26వ స్థానంలో నిలిచారు. ఈమెతో పాటు భారతీయ సంతతికి చెందిన లాస్ట్‌మైల్‌హెల్త్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజ్ పంజాబి కూడా జాబితాలో ఉన్నారు. ఈయన 28వ స్థానంలో నిలిచారు. ఇక జాబితాలో షికాగో కబ్స్ బేస్‌బాల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ థియో ఎప్స్టీన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన తర్వాతి స్థానంలో వరుసగా అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా.. పోప్ ఫ్రాన్సిస్.. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కొ–చైర్మన్ మిలిందా గేట్స్.. అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ నిలిచారు. ఎస్బీఐకు సంబంధించి డీమోనిటైజేషన్, మొండిబకాయిలు వంటి పలు సమస్యలను ఎదుర్కోవడంలో భట్టాచార్య కీలకపాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది. బ్యాంక్‌ను డిజిటలైజేషన్ దిశగా నడిపిస్తున్నారని కితాబునిచ్చింది. ఇక నాన్–ఫ్రాఫిట్ సంస్థ అయిన లాస్ట్‌మైల్‌హెల్త్ 2014లో లైబీరియాలో ఎబోలా వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసిందని పేర్కొంది. కాగా జాబితాలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఫెడరల్ రిజర్వు చీఫ్ జానెట్ యెలెన్ వంటి పలువురు ప్రముఖులు స్థానం పొందారు. -
గ్రామీణం బాగుపడితేనే...వృద్ధికి ఊతం
⇒ వ్యవసాయరంగంపై మరింత దృష్టి పెట్టాలి ⇒ ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య ముంబై: గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే దాకా రుణాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటుందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఇందుకోసం ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని మెరుగుపర్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అప్పుడే నిలకడగా అధిక వృద్ధి సాధ్యపడుతుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. ఒకవైపు రుణాలకు డిమాండ్ లేకపోవడం, మరోవైపు ఇచ్చిన రుణాలు మొండిపద్దులవుతుండటం వంటి సవాళ్లను బ్యాంకులు ఎదుర్కొంటున్నాయని భట్టాచార్య వివరించారు. ఈ రెండింటికీ సంబంధించి సమీప భవిష్యత్‌లో పరిస్థితులు మెరుగుపడే సూచనలేమీ కనిపించడం లేదని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండు సార్లు సరైన వర్షపాతం లేక కుదేలయిన వ్యవసాయ రంగానికి మరింతగా తోడ్పాటునివ్వడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక పెద్ద నోట్ల రద్దు ప్రభావం.. ఉత్పత్తులు దీర్ఘకాలం నిల్వ చేసుకోలేని కూరగాయల రైతులపై ఎక్కువగా పడిందని భట్టాచార్య చెప్పారు. డీమోనిటైజేషన్ జరిగిన 50 రోజుల వ్యవధిలో తమ బ్యాంక్ 89 లక్షల జన్‌ధన్ ఖాతాలు తెరిచిందని, దీంతో ఈ అకౌంట్ల సంఖ్య మొత్తం 11 కోట్లకు చేరిందని భట్టాచార్య తెలిపారు. ఈ ఖాతాల్లో రూ. 16,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయన్నారు. వీఆర్ఎస్పై యూనియన్ల వ్యతిరేకత.. ఎస్బీఐలో విలీనం కానున్న 5 అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకం ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని బ్యాంక్ యూనియన్లు స్పష్టం చేశాయి. ‘వారు ఎప్పుడైనా వీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. సైద్ధాంతికంగా మా యూనియన్లు దీన్ని వ్యతిరేకిస్తాయి. వచ్చే రెండేళ్లలో దాదాపు 26,000 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారని గతంలో ఎస్బీఐ చైర్పర్సన్ చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా వీఆర్ఎస్ ప్రకటించాల్సిన అవసరం లేదు. బ్యాంక్ తన మాట తప్పుతోంది‘ అని స్టేట్ సెక్టర్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేఎస్ కృష్ణ చెప్పారు. వీఆర్ఎస్ అనేది అందరికీ వర్తింపచేయాలే తప్ప కేవలం అనుబంధ బ్యాంకు ఉద్యోగులకే ఎలా వర్తింపచేస్తారని ప్రశ్నించారు. -
అరుంధతి క్షమాపణ చెప్పాలి..లేదంటే..
ముంబై: రైతులకు ఇచ్చిన సాగు రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం మంచి సంప్రదాయం కాదన్న ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రతిపక్షం మండిపడింది. ఈ మేరకు ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ కార్యాలయం ముందు గురువారం ఆందోళనకు దిగింది. పంట రుణాల ప్రోత్సాహకాలు రుణాలు తిరిగి చెల్లించే తీరును దెబ్బతీసే అవకాశం ఉండడంతోపాటు, రుణాలు తిరిగి చెల్లించే అలవాటు కూడా తగ్గుతుందన్న వ్యాఖ్యలపై అరుంధతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ధర్నా నిర్వహించారు. సుమారు గంటసేపు నిర్వహించిన ఈ ఆందోళనలో శివసేన కూడా జతచేరింది. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ పెడతామని హెచ్చరించాయి. ఎస్బీఐ చైర్ పర్సన్ ప్రభుత్వ అధికారే తప్ప, విధాన రూపకర్త కాదని ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ విఖే పాటిల్ విమర్శించారు. ఆమె పరిధికి మించి వ్యాఖ్యానించడం సరైందని కాదన్నారు. విజయ్ మాల్యా లాంటి పారిశ్రామికవేత్తలకు 1.40 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసినపుడు ఆమె ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లో రుణ మాఫీ ప్రకటించినపుడు క్రెడిట్ డిసిప్లీన్ అభ్యంతరాలను అపుడెందుకు వ్యక్తం చేయలేదని దుయ్యబట్టారు. రైతులు అవమానపర్చిన అరుంధతి భట్టాచార్య తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే అసెంబ్లీలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఆయన హెచ్చరించారు. కాగా ముంబైలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా భట్టాచార్య ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
రైతు రుణమాఫీలపై ఎస్బీఐ సంచలన వ్యాఖ్యలు
-
పంట రుణాల మాఫీ సరికాదు
⇒ రుణాల చెల్లింపు తీరును దెబ్బతీస్తుంది ⇒ భవిష్యత్తులోనూ ఇదే ఆశిస్తారు ⇒ దీనివల్ల భవిష్యత్తులో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించరు ⇒ ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడాలని సూచన ముంబై: రైతులకు ఇచ్చిన సాగు రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం మంచి సంప్రదాయం కాదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలు రుణాలు తిరిగి చెల్లించే తీరును దెబ్బతీసే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ హామీని బీజేపీ ఇచ్చిన నేపథ్యంలో అరుంధతీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘రుణాలను మాఫీ చేస్తే రుణాలు తిరిగి చెల్లించే అలవాటు తగ్గుతుంది. ఎందుకంటే రుణ మాఫీ పొందిన వారు భవిష్యత్తులోనూ రుణాల మాఫీపై ఆశలు పెట్టుకుంటారు. దాంతో భవిష్యత్తులో ఇచ్చే రుణాల చెల్లింపులు నిలిచిపోతాయి. ఈ రోజు ప్రభుత్వం చెలిస్తుంది గనుక రుణాలు వసూలు అవుతాయి. రైతులకు తిరిగి రుణాలు ఇస్తే వారు మరోసారి రుణ మాఫీ కోసం వచ్చే ఎన్నికల వరకు తీర్చకుండా ఉంటారు’’ అని ముంబైలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా భట్టాచార్య పేర్కొన్నారు. ఎస్బీఐ–క్రెడాయ్ భాగస్వామ్యం రియల్టీ రంగ అభివృద్ధి కోసం కలసి పనిచేయాలని ప్రభుత్వరంగ ఎస్బీఐ, రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం క్రెడాయ్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) వచ్చాయి. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అందరికీ ఇళ్లు వంటి పలు విభాగాల్లో పరస్పర సహకారానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని, ఇది రియల్టీ రంగానికి కూడా మేలు చేస్తుందని ఎస్బీఐ పేర్కొంది. ఒప్పందంలో భాగంగా ఎస్బీఐ, క్రెడాయ్ సంయుక్తంగా సమావేశాలు, సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నాయి. -
రైతు రుణాల మాఫీపై అరుంధతి అభ్యంతరాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ రుణ మాఫీ పథకాలపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుంధతి భట్టాచార్య కొన్నిఅభ్యంతరాలను వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలను ఎత్తివేస్తే..క్రెడిట్ క్రమశిక్షణ కు భంగం కలిగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతు రుణాలకు మాఫీ కల్పించడం వల్ల బ్యాంకులకు ఖాతా సమస్య తలెత్తుతుందన్నారు. అలాగే ప్రభుత్వాలు రైతులకు కల్పించే రుణ మాఫీ వల్ల బ్యాంకుల ఆదాయం తగ్గిపోతుందని కూడా ఆమె చెప్పారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో అరుంధతీ ఈ వ్యాఖ్యలు చేశారు. రుణం తీసుకున్న రైతులు ఆ బాకీలు చెల్లించకుండా క్రెడిట్ డిసిప్లైన్‌ను దెబ్బతీస్తున్నారని అరుధంతి ఆరోపించారు. రైతులు మద్దుతు ఇవ్వడం ముఖ్యమే అయినా ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాలన్నారు. ముఖ్యంగా రైతులకు రుణ మాఫీ కల్పించడం వల్ల బ్యాంకు క్రెడిట్ ప్రక్రియ దెబ్బతింటున్నదన్న ఆమె రుణ మాఫీ పొందిన రైతులు భవిష్యత్తులోనూ అలాంటి మాఫీ కోసం ఎదురుచూస్తుంటారన్నారు. తద్వారా కొత్తగా ఇచ్చిన రుణాలకు బకాయిలు చెల్లించేందుకు రైతులు వెనుకాడుతారని చెప్పారు. రైతు రుణాల మాఫీపై ఉత్తరప్రదేశ్ నుంచి తమకు ఎటువంటి అభ్యర్థన రాలేదన్నారు. రైతులకు మద్దతు ఇవ్వడం మంచి ప్రక్రియే, కానీ ఆ పద్ధతి వల్ల క్రెడిట్ ప్రక్రియ దెబ్బతినకూడదని వ్యాఖ్యానించారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీం ద్వారా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రుణాల రికవరీకి అవకాశం ఇస్తామనీ, అయితే ట్రాక్టర్ సెగ్మెంట్లో ఈ రికవరీ చాలా బావుందని ఆమె చెప్పారు. కాగా ఇటీవల రైతుల, ట్రాక్టర్లు,ఇతర వ్యవసాయ యాంత్రీకరణ రుణాలపై రూ. 6 వేల కోట్ల మేరకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
జన్‌ధన్ భారమిది.. భరించాల్సిందే!
♦ జరిమానాల కొరడాపై ఎస్బీఐ స్పష్టీకరణ ♦ పునరాలోచనకు కేంద్రం నుంచి ఎటువంటి సూచనా అందలేదు.. ♦ వస్తే పరిశీలిస్తామని వెల్లడి ♦ జన్‌ధన్ అకౌంట్లపై భారం ఉండబోదని హామీ ముంబై: అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే జరిమానాలు విధించాలన్న నిర్ణయాన్ని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పూర్తిగా సమర్థించుకుంది. జన్‌ధన్ అకౌంట్ల నిర్వహణకు సంబంధించి బ్యాంక్‌పై భారం పెరిగిపోతోందని, ఈ నేపథ్యంలో జరిమానాల విధింపు తప్పదని స్పష్టం చేసింది. అయితే జన్‌ధన్ అకౌంట్లకు సంబంధించి మాత్రం ఇటువంటి పెనాల్టీలు ఉండబోవని వివరణ ఇచ్చింది. జరిమానాల విధింపు అంశాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నుంచి ఎటువంటి సూచనలూ తనకు ఇంకా అందలేదనీ, వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే పెనాల్టీ విధింపు పునఃప్రారంభ నిర్ణయంసహా, ఇతర కొన్ని బ్యాంకింగ్ సేవలపై సైతం చార్జీలను గత వారం ఎస్బీఐ సవరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని కూడా బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీలుసహా పలువురి నుంచి ఆయా నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఒక మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఈ సందర్భంగా తాజా చార్జీల అంశాన్ని ప్రస్తావించారు. ఆమె దీని గురించి మాట్లాడిన అంశాలను సంక్షిప్తంగా చూస్తే... తప్పలేదు... అందరికీ బ్యాంకింగ్ అకౌంట్లు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) అనండి లేదా జన్‌ధన్ అకౌంట్లు అనండి... ఇలాంటి 11 కోట్ల అకౌంట్లతో మాపై భారీ భారం ఉంది. ఈ అకౌంట్లను నిర్వహించడానికి మాకు కొన్ని చార్జీలు అవసరం. ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి మేము ఎన్నో మార్గాలను అన్వేషించాం. చివరకు చార్జీలను విధించక తప్పదన్న నిర్ణయానికి వచ్చాం. మా దగ్గరే అతి తక్కువ... అన్ని బ్యాంకులూ అకౌంట్ హోల్డర్లు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని నిర్దేశిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఎస్బీఐ మాత్రమే అతితక్కువ కనీస బ్యాలెన్స్‌ను అమలు చేస్తోంది. ఇక మా విశ్లేషణలో తేలిందేమిటంటే– మా బ్యాంకులోని అకౌంట్లలో అధికం నెలవారీగా రూ.5,000కుపైగా కనీస బ్యాలెన్స్‌ను కలిగి ఉన్నాయి. జరిమానాలకు సంబంధించి ఆయా అకౌంట్ హోల్డర్లు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. ప్రతి దశలోనూ వ్యయమే... నగదు ముద్రణ నుంచి రవాణా, లెక్కింపు, భద్రతను కల్పించడం వరకూ ఇలా ప్రతిదశలోనూ వ్యయమవుతుంటుంది. ఏటీఎంల ఏర్పాటూ వ్యయంతో కూడినదే. కనుక మేము చార్జీలు విధించడం సమంజమేనని భావిస్తున్నాం. ప్రత్యామ్నాయాలు తప్పవు... కస్టమరు తప్పనిసరిగా తమ లావాదేవీలకు ప్రత్యామ్నాయ మార్గాలవైపు వెళ్లాలి. మొబైల్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి. నిజానికి ఒక గృహస్తుడు నెలకు నాలుగుసార్లకన్నా ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం ఉంటుందని మేము భావించడం లేదు. ఇలాంటి అవసరం వ్యాపార వేత్తలకే ఉంటుంది. ఇలాంటి వారు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. చిన్న పరిశ్రమలకు భారీ రుణాలు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1.6 లక్షల కోట్ల రుణాలను బ్యాంక్ ఇప్పటివరకూ అందజేసింది. ఈ ఒక్క ఏడాదే రూ.10,000 కోట్ల రుణ మంజూరు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,000 కోట్ల ముంద్రా రుణాలను ఇవ్వాలన్నది లక్ష్యం. రిటైల్ రంగానికి ప్రాధాన్యత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో దాదాపు 55 శాతం రిటైల్ విభాగం వాటా ఉంది. రిటైల్ వైపు మొగ్గుచూపడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పెద్ద పరిశ్రమల తమ అవసరాలకు చిన్న పరిశ్రమలపై ఆధారపడే విషయం గమనార్హం. ఇక్కడ పెద్ద సంస్థలతో పాటు చిన్న సంస్థలకు రుణ అవసరాలు ఎంతో ఉంటాయి. ఎడాపెడా చార్జీల మోత... కొత్త ఖాతాదారులను రాబట్టుకునేందుకు వీలుగా నెలవారీ కనీస నగదు నిల్వల(ఎంఏబీ) వైఫల్యంపై చార్జీలు విధించడాన్ని 2012లో నిలిపివేశామని, వాటిని ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రవేశపెడుతున్నామని ఎస్బీఐ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఎంఏబీలో విఫలమైతే సేవింగ్స్ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీతోపాటు సేవా రుసుము విధింపు ఉంటుంది. కనిష్టంగా రూ.20,సేవా రుసుము విధిస్తారు. ఇక కరెంట్ ఖాతాదారులకు ఈ జరిమానా గరిష్టంగా రూ.500గా ఉంటుంది. దీంతోపాటు బ్యాంకు శాఖల్లో నెలకు మూడు నగదు డిపాజిట్లు మించినా కూడా చార్జీల వడ్డింపు తప్పదు. -
ఎన్పీఏల పరిష్కారంపై మరింత స్పష్టత కావాలి
ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య స్పష్టీకరణ ముంబై: మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి సంబంధించి మరింత స్పష్టత, ప్రణాళిక, మార్గదర్శకాలు అవసరమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ విలేకరులతో అన్నారు. ‘‘ఒత్తిడిలో ఉన్న ఆస్తుల సమస్య పరిష్కారం ఎలా అన్న అంశం కోసం మేము ఎదురుచూస్తున్నాం. ఇందుకు సంబంధించి మరింత స్పష్టత, పారదర్శకాలు అవసరం’’ అని ఆమె అన్నారు. తగిన ప్రణాళికలు, మార్గదర్శకాలు లేకుంటే, సమస్య పరిష్కారం దిశలో ముందుకు వెళ్లడం కష్టమవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. ‘మొండిబకాయిల వచ్చే నష్టాలను ఒకేసారి కాకుండా, త్రైమాసికాల వారీగా భర్తీచేసే వెసులుబాటు ఉండాలి. సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు ఒక నిర్ణయం తీసుకుంటే, దానిని తరువాత సవాలు చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ మేరకు తగిన మార్గదర్శకాలు అవసరం’ అని భట్టాచార్య చెప్పారు. ముంబైలో కొరియా డెస్క్... కొరియా డెవలప్మెంట్ బ్యాంక్ భాగస్వామ్యంతో ముంబైలో కొరియా డెస్క్‌ను ఎస్బీఐ బుధవారం ఏర్పాటు చేసింది. రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యానికి, పెట్టుబడులకు సహాయ,సహకారాలను అందించడం ఈ డెస్క్ ఏర్పాటు లక్ష్యం. రెండు దేశాల మధ్య గత ఆర్థిక సంవత్సరంలో ద్వైవార్షిక వాణిజ్యం 17 బిలియన్ డాలర్లు. -
డిపాజిట్లలో 40% మావద్దే!
• డిజిటల్ చొరవ కొనసాగితేనే ఆశించిన ప్రయోజనం • ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య దావోస్: నోట్ల రద్దు అనంతరం తమ బ్యాంకులో జమ అయిన డిపాజిట్లలో 15 నుంచి 40 శాతం వరకు ఉండిపోతాయన్న అంచనాను ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల సందర్భంగా అరుంధతి భట్టాచార్య ఓ ప్రముఖ టెలివిజన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘డిపాజిట్లలో అధిక మొత్తం వ్యాపారస్తుల నుంచి వచ్చి ఉంటే, వారు తిరిగి తమ వ్యాపార అవసరాల కోసం వెనక్కి తీసుకుంటారు. కానీ, ఒకవేళ బ్యాంకుల్లోకి వచ్చిన నగదు జమల్లో అధిక శాతం ప్రజల పొదుపు (ఇళ్లలో దాచుకున్న నగదు) అయితే అవి అలానే కొనసాగుతాయి’’ అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. నగదుకు బదులుగా డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికి చేపట్టిన చర్యలను కొనసాగించాల్సి ఉందన్నారు. ఒకవేళ తిరిగి డీమోనిటైజేషన్ ముందునాటి పరిస్థితులకు వెళ్లితే ఆశించిన ప్రయోజనాలను పొందలేమని చెప్పారు. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు చేసిన తర్వాత బ్యాంకుల్లోకి సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు వచ్చి చేరిన విషయం తెలిసిందే. ఈ భారీ నిల్వలతో బ్యాంకులు లబ్ధి పొందుతాయన్న విశ్లేషణల నేపథ్యంలో అరుంధతి భట్టాచార్య మాటలకు ప్రాధాన్యం నెలకొంది. రుణాలుగా మళ్లించడం ద్వారానే ప్రయోజనం ‘‘బ్యాంకుల్లో గరిష్ట స్థాయిలో డిపాజిట్లు కొనసాగడం అంటే వాటికి తక్కువ వ్యయానికే నిధులు అందుబాటులో ఉన్నట్టు. వీటిని రుణ వితరణ చేయడం ద్వారా బ్యాంకులు లాభపడతాయి’’ అని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ అనలిస్ట్ పాయల్ పాండ్యా తెలిపారు. బ్యాంకులు తమ దగ్గరున్న డిపాజిట్లను సాధ్యమైనంత త్వరగా రుణాలుగా మళ్లించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎస్బీఐలో డిపాజిట్లు రూ.1.4 లక్షల కోట్లు పెరగ్గా... అదే సమయంలో కంపెనీ లోన్ బుక్ సైతం తగ్గింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి రుణాల జారీ 9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు భట్టాచార్య ఈ నెలారంభంలో రుణాల రేట్ల తగ్గింపు సందర్భంగా వెల్లడించారు. డిసెంబర్ నాటికి ఇది 6.7 శాతంగా ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి మరో 1,894 కోట్లు! న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు మూలధనంగా మరో రూ.1,894 కోట్లు విడుదల కానున్నాయి. ప్రభుత్వం గత ఏడాది జూలై 19న ఒక ప్రకటన చేస్తూ... ఎస్బీఐకి రూ.7,575 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు తెలిపింది. ఇందులో 75 శాతాన్ని విడుదల చేసింది. ఎస్బీఐ, పీఎన్బీ, ఐఓబీలుసహా 13 ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి రుణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తూ... ఇప్పటివరకూ రూ.22,915 కోట్లను కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అందించింది. -
శుభవార్త చెప్పిన ఎస్బీఐ చైర్మన్
అహ్మదాబాద్: పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత కూడా డిమాండ్‌కు తగినట్టుగా కరెన్సీ అందుబాటులో రాకపోవడంతో ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు. ఇప్పటికీ చాలా ఏటీఎంలు పనిచేయడం లేదు. దీనికి తోడు బ్యాంకులు, ఏటీఎంలో 2000 రూపాయలు నోట్లు ఇస్తుండటంతో చిల్లర సమస్య ఏర్పడింది. సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరో 6 నెలల సమయం పడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య శుభవార్త చెప్పారు. మంగళవారం మీడియాతో అరుంధతి మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ‘పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్య త్వరలో తీరుతుందని నమ్ముతున్నాం. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్బీఐ ఖాతాదారులు నగదు కోసం క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉండదని వారికి హామీ ఇస్తున్నాం. సరిపడా డబ్బును బ్యాంకు బ్రాంచిలకు పంపిస్తాం. దీనివల్ల ఖాతాదారులు వారి అవసరాలకు తగినట్టు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై చర్చిస్తున్నాం. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణిలోకి వస్తాయి. ఈ విషయంలో సందేహం లేదు. కరెన్నీ అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల రద్దుకు ముందు మాదిరే బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాం’ అని అరుంధతి చెప్పారు. -
శుభవార్త చెప్పిన ఎస్బీఐ చైర్మన్
-
మార్చిలోపు విలీనం లేనట్లే!
• అనుబంధ బ్యాంకుల విలీనంపై • ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య • ప్రభుత్వ ఆమోదానికి నిరీక్షిస్తున్నట్లు వెల్లడి ముంబై: తొలుత భావించినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో దాని అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 మార్చి) ముగిసేలోపు పూర్తయ్యేట్లు కనిపించడం లేదు. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య స్వయంగా ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. విలీనం దిశలో ముందడుగుకు ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆమోదానికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ విడుదలైన తరువాతే, విలీన ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పగలుగుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం విలీనం పూర్తవుతుందనీ ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘బహుశా విలీన ప్రక్రియ ఒక త్రైమాసిక కాలం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, ఇందుకు ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. మేము ఇందుకు ఎదురుచూస్తున్నాము. ఒకవేళ ఇప్పటికిప్పుడు ప్రభుత్వ ఆమోదం వచ్చినా, చివరి త్రైమాసికంలో విలీనం పూర్తికావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఐటీ సిస్టమ్స్‌లో మార్పులు ఇందులో ప్రధానమైనవి. సాధారణంగా ఐటీ సిస్టమ్స్‌లో ఏదైనా మార్పులు చేయాల్సివస్తే, ఫిబ్రవరి మధ్య కల్లా ఈ ప్రక్రియ బ్యాంకింగ్‌లో పూర్తవుతుంది. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా పూర్తికావాలన్నది మా విధానం. విలీన పక్రియకు సంబంధించిన అడ్డంకులు ఆయా అంశాల్లో ఇప్పుడు నెలకొనకూడదని భావిస్తున్నాం’’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. రియల్టీపై దృష్టి...: రియల్టీ అభివృద్ధికి సంబంధించి తగిన చౌక ధర గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి బిల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని భట్టాచార్య తెలిపారు. ‘‘రేటు కోత నిర్ణయం తీసుకున్నంత మాత్రాన, డిమాండ్ లేదా వృద్ధి పెరిగిపోతుందని నేను విశ్వసించను. ఈ దిశలో విజయానికి మరెన్నో నిర్ణయాలు తీసుకోవాలి’ అన్నారు. కొత్త ప్రొడక్టులు: కాగా గృహ రుణ వృద్ధి లక్ష్యంగా మూడు కొత్త ప్రొడక్టులను ప్రారంభించనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ బ్రిడ్జ్ లోన్స్, ఇన్స్ట్రా హోమ్ టాప్–అప్ లోన్స్‌తో పాటు వేతన యేతర వినియోగదారులకు ఒక ప్రొడక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీరు వెల్లడించిన సమాచారం ప్రకారం, బ్రిడ్జ్ లోన్ మొదటి యేడాది వడ్డీరేటు 10.45 శాతం ఉంటుంది. రెండవ ఏడాది 11.45 శాతంగా ఉంటుంది. ఇన్స్ట్రా హోమ్ టాప్–అప్ లోన్ రుణ రేటు 9 శాతం. 8–9 శ్రేణిలో రుణ వృద్ధి రేటు లక్ష్యం... బ్యాంక్ తాజా 0.9 శాతం రేటు కోత నిర్ణయం రుణ వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నట్లు భట్టాచార్య తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ రుణ వృద్ధి రేటు 8 శాతం నుంచి 9 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు భట్టాచార్య ఈ సందర్భంగా అన్నారు. ‘‘తొలుత మేము రుణ వృద్ధి రేటు లక్ష్యాన్ని 11 నుంచి 12 శాతంగా పెట్టుకున్నాం. నవంబర్, డిసెంబర్లో భారీ క్షీణత తరువాత, రుణ వృద్ధి ఇప్పటివరకూ 6.7–6.8 శాతం శ్రేణిలోనే ఉంది. రేటు కోత నేపథ్యంలో రుణ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం కనీసం 8 నుంచి 9 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం’’ అని అన్నారు. ఆదివారం నాటి రేటు కోత విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ, ‘‘ఇది ద్రవ్య లభ్యతను పెంచే నిర్ణయం. మున్నెన్నడూ లేనంతగా ప్రస్తుతం వ్యవస్థలో ద్రవ్యపరిస్థితి ఉంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో తగ్గించినదానికన్నా ఒకటిన్నర రెట్లు రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం’’ అని అరుంధతీ భట్టాచార్య అన్నారు. డిపాజిట్ రేట్లూ కోత!? రుణ రేట్లలో 90 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు కొత్త సంవత్సర కానుకగా ప్రకటించిన ఎస్బీఐ, తదనంతరం డిపాజిట్‌దారులకు షాక్ ఇచ్చే పరిస్థితీ కనబడుతోంది. డిపాజిట్ రేట్ల మీదా త్వరలో దృష్టి సారించనున్నట్లు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంక్‌ల వద్ద పెద్ద ఎత్తున నగదు డిపాజిట్లు ఉన్నందున, డిపాజిట్ రేటు కోత యోచన చేస్తున్నట్లు తెలిపారు. ‘‘పెద్ద నోట్ల రద్దు అనంతరం తక్కువ వడ్డీకి లోబడిన డిపాజిట్లు భారీగా బ్యాంకుల వద్దకు వచ్చాయి. అయితే నిబంధనలు తొలగించిన తర్వాత వీటిలో కొంత వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. కాగా 40 శాతం పరిమాణం మాత్రం బ్యాంక్ వద్దే కొనసాగుతుందని భావిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము డిపాజిట్ రేటు కోత గురించి ఆలోచిస్తాం’’ అని భట్టాచార్య అన్నారు. -
నగదు కొరత.. మరో రెండు నెలలు !
అప్పటికి గానీ వ్యవస్థలోకి తగినన్ని నిధులు అందుబాటులోకి రావు • 500 నోట్లు పెరిగితే పరిస్థితి మెరుగవుతుంది • ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ దరిమిలా నగదు కొరత కష్టాలు ఈ నెలాఖరుతో తీరిపోతాయంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ..పరిస్థితి చక్కబడేందుకు మరింత కాలం పట్టేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య స్వయంగా ఈ విషయం చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ డబ్బును విత్‌డ్రా చేసుకునేంతగా తగినన్ని నిధులు వ్యవస్థలోకి రావాలంటే మరో రెండు నెలలు పట్టేయొచ్చని ఆమె వెల్లడించారు. గడిచిన కొద్ది రోజులుగా పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ.. వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడేందుకు రూ. 500 నోట్ల లభ్యత మరింతగా పెరగాల్సి ఉందని ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వూ్యలో ఆమె పేర్కొన్నారు. గడిచిన కొన్నాళ్లుగా సుమారు రూ. 6 లక్షల కోట్లు వ్యవస్థలోకి వచ్చాయని, ఇందులో అధికభాగం రూ.2,000, రూ. 100 నోట్లు ఉన్నాయని అరుంధతి చెప్పారు. ప్రస్తుతం మరిన్ని రూ. 500 నోట్లు అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించినట్లు వివరించారు. ‘రూ. 2,000 నోట్లు అధిక విలువ గలవి అయినప్పటికీ.. మార్పిడికి రూ. 500 నోట్లు అనువైనవి. కేవలం రూ. 2,000, రూ. 100 నోట్లతో చెల్లింపులు కొంత సమస్యాత్మకంగానే ఉంటున్న నేపథ్యంలో రూ. 500 నోట్లు కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తే సమస్య పరిష్కారం కాగలదు’ అని ఆమె చెప్పారు. వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మరికొన్ని నెలలు పట్టేయొచ్చన్న అరుంధతి.. ఏటీఎం మెషీన్ల రీక్యాలిబ్రేషన్ పూర్తయిపోయినందున.. ఈలోగా ఏటీఎం విత్‌డ్రాయల్ పరిమితులను సడలించవచ్చని అభిప్రాయపడ్డారు. ’ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే ఏటీఎంలు ప్రజలకు సౌకర్యంగా ఉంటాయి. తగినన్ని రూ. 500 నోట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏటీఎం పరిమితులు కచ్చితంగా సడలించడం జరుగుతుంది. ఈ పరిమితులను పెంచడం వచ్చే రెండు నెలల్లో జరగవచ్చు’ అని ఆమె పేర్కొన్నారు. ఎస్ఎంఈ ఖాతాలు మొండిపద్దులుగా మారొచ్చు.. త్వరలో వ్యాపారాలు మెరుగుపడకుంటే రోజువారీ కార్యకలాపాలపైనే ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) ఖాతాలు మొండిబకాయిలుగా మారే అవకాశం ఉందని అరుంధతి పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే నెలా, రెండు నెలల్లో అంతా సర్దుకుంటే.. ప్రతికూల ప్రభావాలు తాత్కాలికంగానే ఉండొచ్చని ఆమె చెప్పారు. కానీ ఆర్థిక బలం అంతగా ఉండని ఎస్ఎంఈ రంగ సంస్థలకు ఎంతో కొంత తోడ్పాటు అందించడం అవసరమని అరుంధతి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం, నియంత్రణ సంస్థ, బ్యాంకులు తమ వంతు తోడ్పాటు అందించవచ్చని పేర్కొన్నారు. సమస్యాత్మక ఎస్ఎంఈ ఖాతాలను తక్షణమే పునర్వ్యవస్థీకరణ రుణాల జాబితాలోకి వేసేయకుండా చెల్లింపు గడువును కొంత పొడిగించే వెసులుబాటు కల్పించడం మొదలైన చర్యలు తీసుకోవచ్చని ఆర్బీఐకి సిఫార్సు చేసినట్లు అరుంధతి చెప్పారు. ఉదాహరణకు ఏదైనా ఎస్ఎంఈ నిర్దేశిత 2.5 ఏళ్లలో చెల్లింపులు జరపాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పక్షంలో పునర్వ్యవస్థీకరించడం కాకుండా రుణ చెల్లింపునకు అదనంగా మరో మూడు నెలలు వ్యవధినిచ్చే అంశం పరిశీలించవచ్చు అని అరుంధతి చెప్పారు. అలాగే, సరఫరాదారులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి, డిజిటల్ లావాదేవీలు జరిపేలా ప్రోత్సహించాలంటూ పెద్ద పారిశ్రామిక ఖాతాదారులకు ఎస్బీఐ సూచిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇలాంటి సంస్థలకు బ్యాంకులు కాలక్రమేణా రుణ పరిమితులను కూడా పెంచవచ్చని చెప్పారు. ఎస్ఎంఈలను డిజిటల్ లావాదేవీలవైపు మళ్లించేలా ప్రభుత్వం పన్నులపరమైన ప్రోత్సాహకాలు, పన్ను నిబంధనలను సరళతరం చేయడం, పన్నులపరమైన ప్రోత్సాహకాలు ప్రకటించడం మొదలైన చర్యలు తీసుకోవచ్చని ఆమె సూచించారు. బ్యాంకులకు వ్యయాల దెబ్బ.. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల రీక్యాలిబ్రేషన్, మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ఫీజు రద్దు, ఏటీఎం లావాదేవీలపై చార్జీల రద్దు, సిబ్బందిపై ఖర్చులు మొదలైన వాటి కారణంగా బ్యాంకుల వ్యయాలు గణనీయంగా పెరుగుతాయని అరుంధతి చెప్పారు. వీటికి తోడు కొంత మేర వ్యాపార నష్టం కూడా తప్పదని ఆమె పేర్కొన్నారు. అయితే, డీమోనిటైజేషన్‌కి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నందున.. ఈ వ్యయాలు ఏ మేర ఉంటాయన్నదానిపై ఇంకా ఒక అంచనా లేదని అరుంధతి వివరించారు. డీమోనిటైజేషన్‌తో కుదేలైన రుణాల వ్యాపార విభాగంపై జనవరి మధ్య నుంచి మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టనున్నట్లు చెప్పారు. -
ఒకటి రెండు నెలల్లో నగదు కొరత తీరదు..
• 18 నెలల్లో ఎస్బీఐ లైఫ్ ఐపీఓ • ఐపీఓకు ముందువాటా విక్రయ యోచన లేదు • ఎస్బీఐ చీఫ్ అరుంధతి రాయ్ ముంబై: ఎస్బీఐ జీవిత బీమా విభాగం, ఎస్బీఐ లైఫ్ ఏడాది–ఏడాదిన్నర కాలంలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఎస్బీఐ లైఫ్ ఐపీఓకు వచ్చిన తర్వాత కూడా తమ వాటా 50.1 శాతంగా ఉండాలనేకోరుకుంటున్నామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. అందుకే ఐపీఓకు ముందు ఎస్బీఐ లైఫ్‌లో వాటా విక్రయ యోచనేదీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడ ఎస్బీఐ లైఫ్‌కు చెందిన సెంట్రల్ప్రాసెసింగ్ సెంటర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరత ఈ నెల 30 కల్లా పరిష్కారమవుతుందా అన్న ప్రశ్నకు ఆమె సానుకూల సమాధానం ఇవ్వలేదు. నగదు సరఫరా ఒకటి రెండు రోజుల్లో సాధారణ స్థితికి రావడంజరగదని పేర్కొన్నారు. కనీసం ఒకటి–రెండు నెలల్లో కూడా సాధారణ స్థితికి వచ్చే పరిస్థితులు లేవన్నారు. క్రమక్రమంగా నగదు సరఫరా సాధారణ స్థితికి వస్తుందని వివరించారు. వచ్చే ఏడాది మార్చికల్లా అనుబంధబ్యాంక్ల విలీనం పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఐపీఓ ద్వారా 10 శాతం వాటా విక్రయం.. ఎస్బీఐ లైఫ్ ఐపీఓ ద్వారా 10% వాటా విక్రయించాలనుకుంటున్నామని, ఫ్రాన్స్ భాగస్వామి కూడా ఇదే రేంజ్లో వాటా విక్రయించే అవకాశాలున్నాయని ఆరుంధతి భట్టాచార్య వివరించారు. ఎస్బీఐ లైఫ్‌లో ఎస్బీఐకుప్రస్తుతం 74%, ఫ్రాన్స్‌కు చెందిన బీఎన్పీ పారిబా కార్డిఫ్‌కు 26% వాటా ఉంది. మూడో అతి పెద్ద సంస్థ.... ఎస్బీఐ లైఫ్‌లో 5 శాతం వాటా విక్రయానికి ఎస్బీఐ బోర్డ్ ఆమోదం తెలిపినప్పటికీ, ఎస్బీఐ 3.9 శాతం వాటాను ఇటీవలనే విక్రయించింది. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్, సింగపూర్ సావరిన్ ఫండ్టిమసెక్ హోల్డింగ్స్ లు చెరో 1.95 శాతం చొప్పున కొనుగోలు చేశాయి. ఈ వాటాల విక్రయ విలువ రూ.1,794 కోట్లుగా ఉంది. ఈ విలువ పరంగా చూస్తే ఎస్బీఐ లైఫ్ విలువ రూ.46,000 కోట్లుగా ఉంటుంది. దేశంలో మూడోఅతి పెద్ద ప్రైవేట్ జీవిత బీమా కంపెనీ అవుతుంది. మొదటి రెండు స్థానాల్లో హెచ్డీఎఫ్సీ–మ్యాక్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్లు ఉన్నాయి. -
నల్లకుబేరులకు సహకరిస్తే డిస్మిస్
-
నల్లకుబేరులకు సహకరిస్తే డిస్మిస్
• బ్యాంకు సిబ్బందికి హెచ్చరిక • దేశవ్యాప్తంగా పీఓఎస్ సేవలు • ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య సాక్షి ప్రతినిధి, చెన్నై: రద్దరుున పెద్దనోట్ల స్థానంలో కొత్త నోట్లను పొందేలా నల్లకుబేరులకు సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య హెచ్చరించారు. కోయంబత్తూరులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏడాదికి 200 నుంచి 300 మంది క్రమశిక్షణా చర్యలకు గురవుతున్నారని చెప్పారు. నల్లధనాన్ని చట్టవిరుద్ధంగా బ్యాం కుల్లో జమచేసి కొత్త నోట్లుగా మార్చుకునేవారిపైనా, వారికి సహకరించే బ్యాంకు సిబ్బందిపైనా నిఘాపెట్టామని తెలిపారు. పట్టుబడిన వెంటనే సస్పెండ్ చేసి నేరం రుజువైన పక్షంలో డిస్మిస్ చేస్తామని ఆమె హెచ్చరించారు. నోట్లను రద్దరుున ఈనెల 8వ తేదీ నుంచి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ద్వారా ఖాతాదారుల సేవలు సక్రమంగా సాగుతున్నాయని తెలిపారు. తమ బ్యాంకు ఏటీఎంలలో 65 శాతం పూర్తిస్థారుులో పనిచేస్తున్నాయని తెలిపారు. ఖాతాదారులు శ్రమపడకుండా సొమ్మును పొందేందుకు పారుుంట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)తో కూడిన వాహనాన్ని జన సంచారం ఎక్కువగా ఉండే కూడళ్లలో పెట్టామని తెలిపారు. ఖాతాదారులు తమ ఏటీఎం, డెబిట్ కార్డులను ఈ వాహనంలోని యంత్రంలో స్వైప్ చేసి రూ.2వేలు పొందవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా 3,600 పీఓఎస్ వాహనాలు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. అంతేగాక విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, మార్కెట్, షాపింగ్ మాల్స్ ప్రాంతాల్లో 841 మొబైల్ ఏటీఎంలు పనిచేస్తున్నట్లు తెలిపారు. రెండు వారాలుగా బ్యాంకు లావాదేవీల్లో కొంత గందరగోళం, విద్య, గృహ రుణాల మంజూరులో కొద్దిపాటి స్తంభన నెలకొని ఉందని అంగీకరించారు. అరుుతే ఇది తాత్కాలికమే, కొద్ది రోజుల్లో పూర్తిగా సర్దుకుంటుందని చెప్పారు. నిజారుుతీగా సంపాదించిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసిన వారు భయపడాల్సిన అవసరం లేదని, వీరి సొమ్ముకు వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. -
మరోసారి టాప్‌లో అరుంధతీ భట్టాచార్య
-
మరోసారి టాప్‌లో ఆమె
ముంబై: ప్రభుత్వంరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. దేశీయ వ్యాపారరంగంలో అత్యంత శక్తిమంతమైన మహిళగా గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాదికిగాను ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 'టాప్ 50 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ 2016' జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో భట్టాచార్య మరోసారి అగ్రస్థానంలో నిలిచారని ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. -
త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపు
♦ ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ♦ ద్రవ్యోల్బణం దిగివస్తుందని వెల్లడి న్యూఢిల్లీ: ఆర్బీఐ రేట్ల కోత ప్రయోజనాన్ని తాము ఎప్పటికప్పుడు రుణ గ్రహీతలకు అందిస్తూనే ఉన్నామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. సమీప కాలంలోనే బ్యాంకు లెండింగ్ రేటు తగ్గించనున్నట్టు ఆమె వెల్లడించారు. దీని వల్ల ఆటో, గృహ రుణాలు తీసుకున్న వారికి లబ్ధి కలుగుతుందన్నారు. 2015 జనవరి నుంచి ఆర్బీఐ 1.75 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించగా తాము ఇప్పటి వరకు 0.95 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గింపు ప్రయోజనాలను రుణ గ్రహీతలకు బదలాయించామని భట్టాచార్య పేర్కొన్నారు. త్వరలోనే రేట్లను సవరించడం ద్వారా మరింత ప్రయోజనాన్ని బదలాయించనున్నట్టు ఓ టెలివిజన్ చానల్‌కు చెప్పారు. ఆర్బీఐ ఇటీవల రెపో, రివర్స్ రెపో రేట్లను 0.25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఎస్బీఐ ఒకేసారి భారీగా 0.25 స్థాయిలో రేట్లను తగ్గించడం కాకుండా ఒక బ్యాంకుగా క్రమానుగతంగా నెలనెలా ఆ ప్రయోజనాన్ని బదలాయిస్తామన్నారు. ద్రవ్యోల్బణం దిగి వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘ద్రవ్యోల్బణం దిగివస్తుందని మా అంతర్గత పరిశోధనలో తెలిసింది. ద్రవ్యోల్బణం తగ్గితే ఆర్బీఐ నుంచి మరోసారి రేట్ల కోత తప్పకుండా ఉంటుంది’ అని అన్నారు. తక్కువ వడ్డీ రేట్ల వల్ల అటు బడా కార్పొరేట్ సంస్థలు, ఇటు చిన్న వ్యాపార సంస్థలకు సమానంగా ప్రయోజనం చేకూరుతుందని, ఎందుకంటే ఇరు వర్గాలు సప్లయ్ చైన్‌లో భాగమేనని భట్టాచార్య వివరించారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం: జైట్లీ
ముంబై: ఒత్తిడిలో ఉన్న మొండి బకాయిల సమస్య పరిష్కరించుకునేలా త్వరలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లను బలోపేతం చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అవినీతి నిరోధక చట్ట సవరణలకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ముంబైలో జరిగిన ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో జైట్లీ మాట్లాడుతూ... పీఎస్‌బీల ఆరోగ్య స్థితి ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. ఇతరులతో పోటీపడి పని చేసేలా పీఎస్బీలకు అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎస్బీలకు ప్రభుత్వ ఉద్యోగులే అడ్డుగా పేర్కొన్నారు. అలాగే, అవినీతి నిరోధానికి సంబంధించిన ప్రస్తుత చట్టం (పీసీఏ 1988) సైతం వారిని వాణిజ్య కోణంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందని వివరించారు. చట్ట సవరణతో మార్పు వస్తుందన్నారు. గ్రామీణ భారతం, మౌలికరంగాలను పైకి తీసుకురావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రెండు రంగాల్లో పెట్టుబడుల లోటు భారీ స్థాయిలో ఉందన్నారు. బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందాకొచర్, కోటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్, అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ తదితరులు -
అరుంధతీ భట్టాచార్య పదవీ కాలం పొడిగింపు!
న్యూఢిల్లీ: ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె మూడేళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. భారతీయ మహిళా బ్యాంకుతోపాటు ఐదు అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతున్నందున భట్టాచార్యను కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్యాంకు బోర్డు బ్యూరో నుంచి ఈ విషయమై అభిప్రాయాలను స్వీకరించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే కొన్ని రోజుల్లోనే భట్టాచార్య కొనసాగింపునకు సంబంధించి ఆదేశాలు వెలువడనున్నట్టు సమాచారం. అక్టోబర్ చివరి నుంచి విలీన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళలు..భట్టాచార్య, కొచర్, శిఖా శర్మ
న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటే, ప్రైవేట్ రంగ దిగ్గజ ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. ఇక ప్రైవేట్ రంగంలోనే చాలా వేగంగా వృద్ధి చెందుతోన్న యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ జాబితాలో టాప్‌లో నిలిచారు. కాగా, అరుంధతీ భట్టాచార్య మొండి బకాయిల సమస్యకు పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫార్చ్యూన్ పేర్కొంది. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియలో ఈమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. విలీనం అనంతరం ఎస్బీఐ ఆసియాలో ఒక అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవిస్తుందని పేర్కొంది. భట్టాచార్య పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించే అవకాశముందని అభిప్రాయపడింది. రఘురామ్ రాజన్ పదవీ విరమణ తర్వాత భట్టాచార్య ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతుందని అప్పట్లో ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చందా కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారని, బ్యాంకు డిజిటలైజేషన్‌కు విశేష కృషి చేస్తున్నారని కొనియాడింది. ఇక యాక్సిస్ బ్యాంక్ వృద్ధిలో శిఖా శర్మ పాత్ర అనిర్వచనీయమని ఫార్చ్యూన్ తెలిపింది. -
పావు శాతం రేట్ల కోత చాన్స్!
ద్రవ్యోల్బణం దిగొస్తుంది... * రిటైల్ రుణాలవైపు బ్యాంకుల మొగ్గు... * ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ముంబై: బ్యాంకులు త్వరలో పావు శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం దిగిరానున్న నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోపక్క, దేశీ బ్యాంకింగ్ రంగం మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్య నుంచి కోలుకోవడం అనేది ఆర్థిక వ్యవస్థ పనితీరుతో ముడిపడి ఉంటుందన్నారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వార్తా ఏజెన్సీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశాలను ప్రస్తావించారు. ‘ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. అయితే, ఈ ప్రభావం మెల్లగా తొలగనుండటంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేందుకు వీలుంది. వెరసి బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గుదలకు దోహదం చేయనుంది’ అని భట్టాచార్య తెలిపారు. ఆర్బీఐ గత ఏడాదికాలంగా కీలక పాలసీ రేటు(రెపో)ను 1.5 శాతం మేర తగ్గించినప్పటికీ.. రుణ రేటు తగ్గింపునకు సంబంధించి ఈ మొత్తం ప్రయోజనంలో దాదాపు సగాన్ని మాత్రమే బ్యాంకులు తమ కస్టమర్లకు బదలాయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం లక్ష్యం కష్టసాధ్యమే... ప్రభుత్వం నిర్దేశించిన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం కష్టసాధ్యమైనదేనని ఎస్బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో గడిచిన 60 ఏళ్లలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం చాలా అరుదుగా మాత్రమే 6 శాతం దిగువకు వచ్చిందని, మరోపక్క, మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. వచ్చే ఐదేళ్లపాటు వార్షిక ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతం(2 శాతం అటూఇటుగా)గా ప్రభుత్వం నిర్దేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్బీఐ లక్ష్యం 5 శాతంగా ఉంది. మొండిబకాయిలపై..: ఇప్పటివరకూ పోగుపడిన మొండిబకాయిలను(ఎన్పీఏ) తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని.. అయితే, కొత్తగా ఎన్పీఏలు జతవుతూనే ఉంటాయని కూడా ఆమె పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో దాదాపు రూ.40 వేల కోట్ల ఎన్పీఏలకు ఆస్కారం ఉందని మేం ఇప్పటికే అంచనా వేశాం. ఇందులో 8,000-9,000 కోట్ల విలువైన రుణాలు ఇప్పటికే ఈ జాబితాలో చేరాయి. ఈ సమస్యనుంచి పూర్తిగా గట్టెక్కాలంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకోవాల్సి ఉంటుంది. ఇందుకు దీర్ఘకాలమే పట్టొచ్చు. అయితే, ఐదేళ్లలోపే ఎకానమీ మళ్లీ పరుగులు తీస్తుందని భావిస్తున్నా’ అని ఎస్బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ రుణాలు భారం.. కార్పొరేట్ రుణాలకు సంబంధించి ఆర్బీఐ తాజా ప్రతిపాదనలతో బ్యాంకులు రిటైల్ రుణాలవైపు అధికంగా మొగ్గుచూపే అవకాశం ఉందని భట్టాచార్య పేర్కొన్నారు. రిటైల్ రుణ విభాగంలో ఎలాంటి సమస్యలూ(బబుల్) లేవని స్పష్టంచేశారు. పెద్దస్థాయి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రుణం నిర్ధిష్ట పరిమితిదాటితే బ్యాంకులు తప్పకుండా అదనపు కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాలని ఆర్బీఐ గత నెలలో విడుదల చేసిన ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏలు 14.5 శాతానికి ఎగబాకి ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిబంధనలకు తెరతీసింది. ‘ఈ నిబంధనల కారణంగా రుణగ్రహీతలతో పాటు బ్యాంకులకు కూడా భారం పెరుగుతుంది. ఆర్బీఐ చర్యలతో బ్యాంకులు రిటైల్ రుణాలవైపు అధికంగా దృష్టిపెట్టేందుకు ఆస్కారం ఉంది. ఇక మా రిటైల్ రుణ విభాగం గతేడాది 20 శాతం మేర వృద్ధి చెందింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఇదేస్థాయి వృద్ధి నమోదైంది. మొండిబకాయిల పెరుగుదల సంకేతాలేవీ లేవు. మరోపక్క, దేశ జీడీపీతో పోలిస్తే బ్యాంకుల మొత్తం రిటైల్ రుణాలు 10 శాతం కంటే తక్కువే. ఇతర వర్ధమాన దేశాలతోపోలిస్తే ఇదే అత్యంత కనిష్టం. ఈ నేపథ్యంలో రానున్నకాలంలో ఈ విభాగంలో భారీ రుణ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి’ అని ఎస్బీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. -
బ్రాంచీలను మూసివేయం.. తరలిస్తాం..!
♦ ఐదు బ్యాంకుల విలీనానంతర స్థితిపై ♦ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ♦ అందరికీ బ్యాంకింగ్ అందుబాటు లక్ష్యమని వివరణ న్యూఢిల్లీ: భారతీయ మహిళా బ్యాంక్‌సహా అనుబంధ ఐదు బ్యాంకులు విలీనం అయిన తర్వాత ఆయా విలీన బ్యాంకుల బ్రాంచీలు కొన్నింటిని మూసివేయడం జరుగుతుందన్న పుకార్లు, ఆందోళనలకు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య తోసిపుచ్చారు. బ్యాంకు బ్రాంచీల తరలింపు ఉంటుంది తప్ప, మూసివేతలు ఉండబోవని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని ఒక వార్తా సంస్థకు తెలిపారు. ‘‘జరుగుతున్న ప్రతికూల ప్రచారంలో ఇది ఒకటి. ఏ బ్రాంచీనీ మూసివేయం. మూడు అనుబంధ బ్యాంకు బ్రాంచీలూ ఒకే బిల్డింగ్‌లో ఉంటే.. వాటిని అలానే కొనసాగించడంలో అర్థం ఉండదు. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరానికి బ్రాంచీని తరలిస్తే, బ్యాంకింగ్ సేవలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయి. ఇదే లక్ష్యంతో కొన్ని బ్రాంచీలను తరలించడం జరుగుతుంది. ఈ విషయంలోనూ ఏకపక్ష చర్యలు ఏవీ ఉండవు. ఉమ్మడి, ఏకాభిప్రాయ ప్రాతిపదికననే ఈ చర్యలు ఉంటాయి. విలీనానంతరం ఎస్బీఐ బ్రాంచీలు 24,000 ఉంటాయి. ఇదే సంఖ్య కొనసాగుతుంది. మేము తీసుకున్న నిర్ణయం వల్ల బ్యాంకింగ్ సేవలు విస్తృతం అవుతాయి’’ అని అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. 2017 మార్చినాటికి విలీన ప్రక్రియ పూర్తవుతుందన్న అభిప్రాయాన్ని సైతం ఎస్బీఐ చీఫ్ వ్యక్తం చేశారు. కాగా విలీనం తరువాత ఎస్బీఐకి సంబంధించి పెరిగే మొండిబకాయిల పరిమాణంపై చర్యలూ అవసరమని అన్నారు. బాధ్యతల పొడిగింపు వార్త వినలేదు... అక్టోబర్‌లో భట్టాచార్య పదవీ విరమణ చేయనున్నారు. ఆమె నేతృత్వంలోనే విలీనం పూర్తయ్యేలా, ఏడాది కాలం బాధ్యతల పొడిగింపు అవకాశం ఉందని వస్తున్న వార్తలపై అరుంధతీ భట్టాచార్య స్పందిస్తూ, ‘‘ నా బాధ్యతల కాలం పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనా వినలేదు. అయితే మార్పులు సహజం. దానికి మనం సిద్ధం కావల్సిందే. అయితే ఎటువంటి పరిస్థితినైనా నిర్వహించడానికి తగిన పటిష్ట టీమ్ ఎస్బీఐకి ఉంది’’అని అన్నారు. ఎస్బీఐలో విలీనం అయ్యే బ్యాంకుల్లో భారతీయ మహిళా బ్యాంక్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ) ఉన్నాయి. ఇవి లిస్టెడ్ బ్యాంకులు. ఇక వీటితోపాటు అన్‌లిస్టెడ్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా(ఎస్బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లూ విలీన బాటలో ఉన్నాయి. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ విలీన ప్రక్రియ వల్ల ఎస్బీఐ బ్యాంక్ అసెట్ బుక్ విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. 24,000 బ్రాంచీలు, 58,000 ఏటీఎం నెట్‌వర్క్‌తో కస్టమర్ల సంఖ్య 50 కోట్లకు పెరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ అవతరిస్తుంది. ప్రైవేటు దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌తో పోల్చితే అసెట్ బేస్ ఐదు రెట్లు పెరుగుతుంది. 2008లో ఎస్బీఐలో తొలిసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. అటుతర్వాత రెండేళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనం జరిగింది. -
రిటైల్ రుణాలు బబుల్ కాదు: ఎస్ బీఐ
ముంబై: రిటైల్ రుణాలు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న బబుల్లా ఉన్నాయనడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. రిటైల్ రుణాలు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న బబుల్లాగా ఉన్నాయంటూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించి రోజులు గడవకముందే అరుంధతి ఆయనతో విభేదించటం గమనార్హం. వినియోగదారుల రుణాలకు సంంధించి బబుల్ లాంటి పరిస్థితులు లేవన్నారు. డిజిటల్ సాధనాల తోడ్పాటుతో ఉత్తమమైన ప్రమాణాలను కొనసాగించినంత కాలం వినియోగదారుల రుణాల విభాగానికేమీ ఢోకా లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రిటైల్ రంగంలో జరగాల్సింది ఎంతో ఉందని, సాధించాల్సింది మరెంతో ఉందని చెప్పారు. జీడీపీలో రిటైల్ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలో (10 శాతం కంటే తక్కువగానే) ఉన్నాయని, మలేషియాలో 30-35 శాతంగా ఉండగా, వృద్ధి చెందిన దేశాల్లో ఇంకా అధికంగా ఉన్నాయని తెలియజేశారు. ఇక్కడ జరిగిన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో ఆమె మాట్లాడారు. మన దేశంలో యువత అధికంగా ఉందని, వారి ఆశయాల కోసం మరిన్ని రుణాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. -
నియంత్రణలు పాటిస్తేనే విదేశీ నిధులు!: భట్టాచార్య
కోల్‌కతా: విశ్వసనీయతను కొనసాగించడంతోపాటు విదేశీ నిధులను ఆకర్షించేందుకు బ్యాంకులు నియంత్రణ పరమైన నిబంధనలను అనుసరించాల్సిందేనని ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ‘‘లిక్విడిటీ కవరేజ్ రేషియో, సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రుణాల వర్గీకరణ వంటి విధానాలను బ్యాంకులు పాటించాలి. దేశంలో నిధుల కొరత లేదని చెప్పలేం. కాబట్టి బ్యాంకులు ఈ ప్రమాణాల్ని పాటించాలి. విశ్వసనీయతను కాపాడుకుంటూ విదేశీ నిధులను రాబట్టాలి ’’ అని ఫిక్కీ నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో అరుంధతి వ్యాఖ్యానించారు. ‘నేడు బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న అది పెద్ద సవాలు నిధుల లభ్యతే. అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ కుప్పకూలిపోవడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా పునరుద్ధరించిన రుణాలను ఒత్తిడితో కూడిన ఆస్తులుగా అభివర్ణిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం పునరుద్ధరించబడిన వాటిని స్టాండర్డ్ ఆస్తులుగా పరిగణిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. -
ఉద్యోగానికి, జీతానికి నో ఢోకా: అరుంధతీ
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియతో ఉద్యోగులు వేతనాలను, ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సినవసరం లేదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య హామీ ఇచ్చారు. ఉద్యోగాలకు, వేతనాలకు ఎలాంటి ఢోకా ఉండదని వెల్లడించారు.కేవలం కొన్ని బదిలీలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. దీనికి బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం బంద్ చేయాల్సినవసరం లేదని వ్యాఖ్యానించారు. బ్యాంకు ఉద్యోగులు ఈ విషయంపై బంద్ చేపట్టినప్పటికీ, వచ్చే మార్చికల్లా భారతీయ మహిళా బ్యాంకుతోపాటు, ఇతర ఐదు అనుబంధబ్యాంకుల విలీన ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. విలీనానికి ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు టైమ్‌లైన్ గా నిర్ణయించినట్టు ఆమె చెప్పారు.మార్పు అనివార్యతను వారు అర్థం చేసుకోవాలన్నారు. ఎస్బీఐలో ఐదు అనుబంధబ్యాంకుల విలీనాన్ని, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా శుక్రవారం రోజు 10లక్షల బ్యాంకు ఉద్యోగులు వన్ డే బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.బ్యాంకు విలీనాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ విలీనంతో ఎస్బీఐ దిగ్గజం రూ.37లక్షల కోట్ల అసెట్ బేస్‌గా ఆవిర్భవించబోతోంది. -
అనుబంధ బ్యాంకుల విలీనం..మార్చికల్లా పూర్తి చేస్తాం
♦ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ♦ మార్పు అనివార్యతను అర్థం చేసుకోవాలని అభ్యర్ధన.. న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో భారతీయ మహిళా బ్యాంక్‌సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా (మార్చి చివరికల్లా) పూర్తికానుంది. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకపక్క దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో భట్టాచార్య ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సమ్మెపై ఆమె మాట్లాడుతూ, ‘‘మార్పు అనివార్యతను వారు అర్థం చేసుకోవాలి. వారికి అవగాహన కల్పించడానికీ మేమూ ప్రయత్నిస్తాం. విలీన ప్రక్రియ పరిణామాలపై వారి అభిప్రాయాలకూ ప్రాధాన్యత ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు. సంపద నిర్వహణా సేవల ప్రారంభం కాగా అంతక్రితం ‘ఎస్బీఐ ఎక్స్క్లూసిఫ్’ పేరుతో బ్యాంక్ వెల్త్ మేనేజ్మెంట్ సేవలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. దేశంలో వేగంగా పెరుగుతున్న ధనవంతుల సంపద నిర్వహణకు తాజా సేవలను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా భట్టాచార్య తెలిపారు. తొలి దశలో ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లూ తెలిపారు. వ్యక్తిగతంగా, వీడియో కాన్ఫరెన్స్ వంటి ఈ-వెల్త్ చానెళ్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్స్ వంటి ఇతర డిజిటల్ మార్గాల ద్వారా ఇన్వెస్టర్‌కు వారి సంపద నిర్వహణ సేవలను నిపుణులు అందిస్తారని తెలిపారు. రిలేషన్షిప్ మేనేజర్లనూ బ్యాంక్ నియమిస్తుంది. మార్చి ముగిసే నాటికి 37 కేంద్రాలకు విస్తరించాలన్నది లక్ష్యం. రూ. 2 లక్షల నెల వేతనం లేదా రూ.30 లక్షల స్థిర డిపాజిట్లు లేదా రూ.కోటి గృహ రుణం కస్టమర్లు ఈ సేవలను వినియోగించుకునే వీలుంది. ఈ సేవలను మార్చికల్లా 6 వేల మంది వరకూ కస్టమర్ల బేస్‌కు విస్తరించాలని, రూ.55,000 కోట్ల ఆస్తులను (ఏయూఎం)లను నిర్వహించాలని ఎస్బీఐ భావిస్తోంది. -
ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి భారీ విరాళం
హైదరాబాద్: ఎస్బీఐ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని, ప్రస్తుతం బ్యాంక్ లాభాల్లో 1 శాతం కేటాయిస్తున్నామని, దాన్ని 2 శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నట్లు ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి రూ.1.15 కోట్ల విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్ గుళ్లపల్లి ఎన్రావుకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ విరాళం మొత్తాన్ని పేదల ఉచిత శస్త్ర చికిత్సలకు, ఉచిత ఔట్ పేషెంట్ సేవలకు వినియోగించాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత అందుబాటులోకి తేవడానికి దేశవ్యాప్తంగా 20 గ్రామాల్లో ‘డిజిటల్ విలేజ్ ’ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఒరాకిల్ కంపెనీతో కలిసి ‘డీ ఛేంజ్’ పేరుతో అగస్ట్ 6వ తేదీన హైదరాబాద్‌లో ఓపెన్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి 100 పాఠశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ సంస్ద అందిస్తున్న సేవలను అభినందించారు. అనుబంధ బ్యాంక్‌ల విలీనంపై అడిగిన ప్రశ్నకు స్పందించడానికి నిరాకరించారు. -
ఎస్బీఐకి తగిన ప్రతిభావంతులున్నారు!
వారసులపై అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్య ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్‌గా సెప్టెంబర్‌లో తన పదవీ బాధ్యతల కాలం పూర్తయిన తరువాత , ఆ పగ్గాలు చేపట్టేందుకు తగిన ప్రతిభావంతులు బ్యాంకు అధికార క్రమంలో ఉన్నారని చైర్మన్ అరుంధతీ భట్టాచార్య గురువారం పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో పదవీ కాలం పూర్తవుతుండడం, మరో సంవత్సరం పాటు ఆమె పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అరుంధతీ భట్టాచార్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎస్బీఐలో చైర్మన్ స్థాయిలో సమర్థంగా పనిచేయగలిగినవారు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో కొందరు ఎందుకు సందేహాలతో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. -
రూ.3,000 కోట్ల నాన్-కోర్ ఆస్తులు విక్రయిస్తాం
ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలకం కాని ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.3,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నది. మొండి బకాయిలు బాగా పెరిగిపోవడంతో మూలధనం పెంచుకోవడానికి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ఎస్బీఐ 2015-16 వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో పలు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, భవిష్యత్ షాక్‌లను తట్టుకునేలా, భవిష్యత్తులో వృద్ధి జోరు కొనసాగించడానికి తగిన మూలధన నిల్వలున్నాయని ఈ వార్షిక నివేదికలో బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య భరోసానిచ్చారు. ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేకపోవడం, రెండేళ్ల కరువు, కమోడిటీ ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో రుణ నాణ్యత ఒత్తిడులు మరింతగా పెరిగాయని పేర్కొన్నారు. త్వరలో ఎస్బీఐ సమగ్ర విలీన ప్రతిపాదన: భారత మహిళా బ్యాంకుతోపాటు ఐదు అనుబంధ బ్యాంకులను తనలో కలిపేసుకోవడానికి కేంద్ర కేబినెట్ అనుమతించిన నేపథ్యంలో ఎస్బీఐ తదుపరి ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. మొత్తం ఆరు బ్యాంకులతోనూ చర్చలు చేపట్టింది. సమగ్ర విలీన ప్రణాళికను సిద్ధం చేసి రానున్న కొన్ని వారాల్లో తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపనున్నట్టు బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. మొత్తం విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని వెల్లడించారు. -
అంతా మన మంచికే..!
అటు పరిపాలకుల నుంచి ఉన్నత అధికారుల వరకూ దాదాపు ఒకేఒక్క అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది. తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నా... దీర్ఘకాలంలో బ్రెగ్జిట్ భారత్‌కు లాభించే అంశమేనన్నది వీరి వాదన. వీటిని ఒక్కసారి పరిశీలిస్తే... స్థిరత్వం కొనసాగుతుంది పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. లిక్విడిటీ విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా భారత్ తగిన చర్యలను తీసుకుం టుంది. ప్రస్తుతం ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలోనే కొనసాగుతుందని మేం విశ్వసిస్తున్నాం. - జయంత్ సిన్హా, ఆర్థికశాఖ సహాయమంత్రి కలిసి వచ్చే అంశమే అనిశ్చితి సమయాల్లో పెట్టుబడుల అవకాశాలకు భారత్ వేదికగా మారబోతోంది. బ్రెగ్జిట్ భారత్‌కు పూర్తిగా సానుకూల అంశమే. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడం లాభిస్తుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచకపోవటమూ సానుకూలమే. - అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు భవిష్యత్ బాగుంటుంది బ్రెగ్జిట్ ప్రభావం తక్షణం ఇతర అన్ని దేశాల్లానే భారత్‌పైనా పడుతుంది. అయితే పెట్టుబడులకు చక్కటి ప్రాం తంగా భారత్ కొనసాగుతుంది. దీర్ఘకాలంలో వ్యూహాత్మకంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్లు భారత్‌కు చక్కటి మార్కెట్‌ను సృష్టించే అవకాశం ఉంది. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఎగుమతులకు దెబ్బే... భారత్ ఎగుమతులపై తాజా పరిణామాలు ప్రతికూలత చూపిస్తాయి. కరెన్సీ ఒడిదుడుకులు చాలా ముఖ్యాంశం. బ్రిటన్ పౌండ్, యూరోలు బలహీనపడతాయి. దీంతో ఆయా దేశాల ప్రొడక్టులతో విదేశాలకు విపరీతమైన పోటీ పెరుగుతుంది. అయితే ఆ రెండు ప్రాంతాలతో భారత్ వాణిజ్యంపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. - భారత ఎగుమతి సంఘాల సమాఖ్య భారత్-బ్రిటన్ బంధం పటిష్టం తాజా పరిణామం భారత్, బ్రిటన్ బంధం మరింత పటిష్టమవడానికి దారితీస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. తాజా బ్రిటన్ పరిణామాలు పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల దృష్టి వర్ధమాన దేశాలకు ప్రత్యేకించి భారత్‌వైపు మళ్లేట్లు చేస్తుంది. - జీపీ హిందూజా, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ -
రాజన్ తర్వాత ఎవరు?
న్యూఢిల్లీ: త్వరలో ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి రఘురాం రాజన్ తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన తర్వాత ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారని విషయం ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. తనకు మరోసారి ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదని, బోధనా రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు రాజన్ కూడా స్పష్టం చేసిన ఈ నేపథ్యంలో ఆ చర్చ మరింత వేడెక్కింది. అయితే, ఆ బాధ్యతలు అప్పగించే విషయంలో ప్రభుత్వం వద్ద పెద్ద జాబితానే ఉందంట. ముఖ్యంగా ఏడుగురు వ్యక్తులతో తదుపరి ఆర్బీఐ గవర్నర్ కోసం జాబితా సిద్ధం చేసినట్లు అధికార వర్గాల సమాచారం. అందులో ముఖ్యంగా విజయ్ కేల్కర్, రాకేశ్ మోహన్, అశోక్ లాహిరి, ఉర్జిత్ పటేల్, అరుంధతి భట్టాచార్య, సుబిర్ గోఖర్న్, అశోక్ చావ్లా పేర్లు ఈ పదవి కోసం సిద్ధం చేసినట్లు వినికిడి. అయితే, తొలిసారి ఆర్బీఐ గవర్నర్ పదవిని ఒక మహిళకు అందించాలని, ఆ నేపథ్యంలోనే అరుధతి భట్టాచార్యకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలకు తెరపడేందుకు మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఆ పవర్ ఫుల్ మహిళల్లో నలుగురు మనోళ్లే
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో మనవాళ్లు నలుగురు నిలిచారు. ప్రపంచంలో 100మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2016 ఎడిషన్ ను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య(25వ ర్యాంకు), ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్(40వ ర్యాంకు), బయోకాన్ చైర్మన్, ఎండీ కిరణ్ మజుందర్ షా(77వ ర్యాంకు), హెచ్ టీ మీడియా లిమిటెడ్ ఎడిటోరియల్ డైరెక్టర్, చైర్ పర్సన్ శోభనా భారతీయ(93వ ర్యాంకు)లు చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. వరుసగా ఆరోసారి ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మెర్కెల్ తర్వాత స్థానం అమెరికా అధ్యక్ష అభ్యర్థురాలు హిల్లరీ క్లింటన్ ను వరించింది. అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్ జానెట్ ఎల్లెన్ ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచారు. బిలీనియర్లు, బిజినెస్, ఫైనాన్స్, మీడియా, పాలిటిక్స్, ఫిలాంథ్రఫిక్ట్స్, ఎన్ జీవోస్, టెక్నాలజీ వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారినుంచి ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తివంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ కేటగిరీల్లో సంపద, మీడియా ఉనికి, ప్రతిభపాటవాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. -
ఎస్బీఐ చీఫ్ గా భట్టాచార్యనే కొనసాగింపు ?
కోల్ కత్తా : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ గా అరుంధతీ భట్టాచార్య పదవిని మరికొంతకాలం పొడిగించనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకు బోర్డు బ్యూరో, కేంద్రప్రభుత్వం ఆమె పదవి కొనసాగింపుపై సముఖంగా ఉన్నట్టు సమాచారం. భట్టాచార్య మూడేళ్ల పదవి కాలం ఈ సెప్టెంబర్ తో ముగుస్తోంది. ప్రస్తుతం బ్యాంకు కీలకమైన దశలో నడుస్తుందని, తన అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసుకోవాలనే ప్రతిపాదనతో ఎస్ బీఐ ముందుకు వెళ్తుందని, ఈ దశలో ఎస్ బీఐ చైర్మన్ ను మార్చారని అధికార ప్రతినిధులంటున్నారు. మరో కొన్ని నెలలపాటు ఆమెనే చైర్మన్ గా కొనసాగిస్తారని పేర్కొంటున్నారు. మరో రెండు నెలల అనంతరం బ్యాంకు పరిస్థితిని బట్టి దీనిపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు. అయితే బయటి వ్యక్తులు ఎవరిని బ్యాంకుకు అధినేతగా నియమించరని అధికార ప్రతినిధులంటున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటికే మొదటివిడత సంప్రదింపులు జరిగాయని, భట్టాచార్య కొనసాగింపును ఉద్యోగులు స్వాగతిస్తున్నారని, కానీ ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ఎస్ బీఐ చైర్మన్ గా భట్టాచార్య చాలా డైనమిక్ గా ఫర్ ఫార్మెన్స్ చేస్తున్నారని, కీలక సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి బ్యాంకుకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకునేవారని ఓ అధికార ప్రతినిధి చెప్పారు. ఎంతో బాధ్యతాయుతంగా ఆమె పదవిని కొనసాగిస్తున్నారని తెలిపారు. గత మూడేళ్లుగా భట్టాచార్య ఎస్ బీఐ కు చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. మొదటి మహిళా చీఫ్ గా భట్టాచార్య ఎస్ బీఐకు ఎంపికయ్యారు. -
ఎస్బీఐ గ్రూప్ విలీనానికి రెడీ
♦ అనుబంధ బ్యాంకులతో పాటు బీఎంబీ విలీనానికీ ఎస్బీఐ ప్రతిపాదన ♦ ప్రభుత్వ అనుమతి కోరుతూ బోర్డు తీర్మానం ♦ ప్రతిపాదనకు అనుబంధ బ్యాంక్ బోర్డులూ అంగీకారం ♦ కేంద్రం అనుమతిస్తే... వెంటనే చర్చల ప్రక్రియ ♦ నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది: అరుంధతీ భట్టాచార్య న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంగళవారం కీలక ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. తన ఐదు అనుబంధ బ్యాంకులు అలాగే భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)ని విలీనం చేసుకోడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్బీఐ బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే (2016-17) ఈ ప్రక్రియ పూర్తవ్వాలన్నది తన ఉద్దేశంగా తెలిపింది. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన దిశలో ఒక అడుగు ముందుకువేసింది. ఎస్బీఐ తన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపడానికి ముందు మంగళవారం ఉదయం ఎస్బీఐ ఐదు అనుబంధ బ్యాంకు బోర్డులు సైతం విలీనానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ ప్రతిపాదనను చేయడం గమనార్హం. దీనిప్రకారం ప్రభుత్వం నుంచి విలీనానికి సూత్రప్రాయ ఆమోదముద్ర పడితే- ఆయా బ్యాంకులు ఇందుకు సంబంధించి చర్చల ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇప్పటికి ప్రతిపాదనే.. కీలక అంశం ప్రస్తుతం ప్రతిపాదన స్థాయిలోనే ఉందని బ్యాంక్ ప్రకటన తెలిపింది. విలీనాల ప్రక్రియ ఎప్పుడు... ఎలా పూర్తవుతుందన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదనీ వివరించింది. చక్కటి కార్పొరేట్ గవర్నెన్స్, పూర్తి పారదర్శకతను నెలకొల్పడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు వివరించింది. ఒకవేళ ప్రభుత్వం కొన్ని బ్యాంకుల విలీనానికే అనుమతి ఇస్తే... ఏమి చేయాలన్న అంశం సైతం ఇప్పుడు పరిశీలనలో లేదని, ఒకవేళ ఇదే జరిగితే బ్యాంక్ బోర్డ్ ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. సత్వర చర్యనే కోరుకుంటున్నాం అరుంధతీ భట్టాచార్య తాజా పరిణామంపై ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ, ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ పరిమాణం రూ.28 లక్షల కోట్లని తెలిపారు. ఈ విలీనాలు పూర్తయితే ఈ పరిమాణం రూ.37 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. విలీన ప్రక్రియ సత్వరమే పూర్తవ్వాలని తాము కోరుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, వాటాదారుల ఆమోదంసహా సుదీర్ఘ ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంటుందని అన్నారు. విలీనం జరిగితే నిధుల సమీకరణ వ్యయం ఒక శాతం మేర తగ్గుతుందనీ ఆమె అభిప్రాయపడ్డారు. 2008లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను తొలిసారిగా విలీనం చేసుకుంది. రెండేళ్ల తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనమైంది. 2016-17లోనే బీఎంబీ విలీనం! భారతీయ మహిళా బ్యాంక్ 2013 సెప్టెంబర్ 25న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెసైన్స్ పొందింది. దాదాపు 100 బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మహిళా ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటు జరిగింది. ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారుల కథనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే ఎస్బీఐలో బీఎంబీ విలీనం జరిగే వీలుంది. 20న అనుబంధ బ్యాంకుల సమ్మె.. కాగా ఈ అనూహ్య పరిణామంపై కొన్ని ఉద్యోగ సంఘాలూ సత్వరం స్పందించాయి. ఈ విలీన ప్రతిపాదనకు నిరసనగా ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులూ మే 20వ తేదీన సమ్మె చేయాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటన చేశారు. పేరెంట్ బ్యాంక్ అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని ఉద్యోగ సంఘం విమర్శించింది. ఈ ప్రతిపాదనను వర్క్‌మన్ డెరైక్టర్లు, స్వతంత్ర డెరైక్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 23, ఏప్రిల్ 25వ తేదీల్లో సంఘం ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ, అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో కాకుండా, తమలో తాము ఒకటిగా విలీనం కావాలని పేర్కొన్నారని ప్రకటన తెలిపింది. అయితే తాజా ప్రతిపాదన ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఆర్థికమంత్రి అభిప్రాయాలను సైతం పట్టించుకోకుండా తనలో విలీనమయ్యేలా ఐదు అనుబంధ బ్యాంకులపై ఎస్బీఐ ఒత్తిడి తెచ్చినట్లు కనబడుతోందని విమర్శించింది. ఇది అసలు సాధ్యమవుతుందని ప్రశ్నించింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో కూడా ఇదే ధోరణి (ఏకపక్ష విలీనాలు) కొనసాగే అవకాశం కనబడుతోందని పేర్కొన్న సంఘం... దీనికి వ్యతిరేకంగా మరిన్ని ఆందోళనలు జరుపుతామని హెచ్చరించింది. షేర్ల కదలికలు ఇలా... ♦ తాజా పరిణామం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఆయా బ్యాంకుల షేర్ల ధరలు చూస్తే.. ♦ ఎస్బీఐ: 0.17% నష్టపోయి 177.10 వద్ద ముగిసింది. ♦ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: 13 శాతం ఎగబాకి రూ.426 వద్ద ముగిసింది. ♦ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్: 10 శాతం పెరుగుదలతో రూ.402.50 వద్దకు చేరింది. ♦ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్: 3 శాతం వృద్ధితో 505 వద్ద ముగిసింది. బ్యాంకులు ఇవీ... విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో భారతీయ మహిళా బ్యాంక్ కూడా ఉంది. దీనితోపాటు ఎస్బీఐకి చెందిన ఐదు అనుబంధ బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ఖ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు ఎన్‌బీఐ ప్రతిపాదనా పత్రంలో ఉన్నాయి. ఆయా బ్యాంకుల వ్యాపారం, అప్పులు-ఆస్తులు అన్నీ విలీనపర్చుకోవడమే ఈ ప్రతిపాదన ఉద్దేశం అని ఒక ప్రకటన తెలిపింది. విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు స్టాక్మార్కెట్లో లిస్టయ్యాయి. వ్యాపార విలీన ప్రక్రియపై చర్చలకు తమ బోర్డులు సూత్రప్రాయ ఆమోదముద్ర వేసినట్లు ఈ మూడు బ్యాంకులూ వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నాయి. -
మార్చి క్వార్టర్లోను లాభాలు తగ్గుతాయ్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) మరింత పెరుగుతాయని, ఫలితంగా లాభాలు తగ్గుతాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. మూడో త్రైమాసికంలోనూ ఎన్పీఏల పెరుగుదల వల్లే లాభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. జపాన్ ఇన్వెస్టర్ల కోసం ఏర్పాటు చేసిన డెస్క్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సమాచారాన్ని జపాన్ ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలకు తెలియజేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అక్కణ్ణుంచి నిధులు సమీకరించే భారతీయ వ్యాపారవేత్తలకు తోడ్పాటునిస్తుందని కూడా చెప్పారామె. -
ఎస్ బీఐకి ఎన్ పీఏల షాక్!
♦ క్యూ3లో నికర లాభం 67% డౌన్; రూ.1,259 కోట్లు ♦ మొండిబకాయిలపై అధిక కేటాయింపుల ప్రభావం ♦ 5.1%కి ఎగబాకిన స్థూల ఎన్పీఏలు; ♦ రూ. 72,791 కోట్లకు పెరుగుదల... ♦ 3 శాతం దిగజారిన షేరు ధర.... ఆర్బీఐ సమీక్ష ప్రభావంతో క్యూ3లో చాలా వరకూ పెద్ద ఖాతాలను ఎన్‌పీఏల్లోకి చేర్చాం. మిగిలిన బలహీన ఖాతాలపై సమీక్ష జరుపుతున్నాం. బహుశా ప్రస్తుత నాలుగో త్రైమాసికంలోనూ లాభాలపై ఈ ప్రభావం ఉండొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొంత భారం ఉంటుందని భావిస్తున్నాం. కాగా, బాండ్ల విక్రయం ద్వారా మార్చిలోపు రూ.6,000 కోట్లను సమీకరించడంపై దృష్టిపెట్టాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు మొండిబకాయిలు షాకిచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో బ్యాంక్ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలతో కలిపి) నికర లాభం 67 శాతం దిగజారి... రూ.1,259 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,828 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు అధిక పరిమాణంలో కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయడం లాభాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ మొత్తం ఆదాయం క్యూ3లో రూ.67,594 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ. 64,605 కోట్లతో పోలిస్తే... స్వల్పంగా 4.6 శాతం వృద్ధి చెందింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఇలా... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల(స్టాండెలోన్) ప్రకారం చూస్తే... ఈ డిసెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ నికర లాభం 61.6 శాతం క్షీణించి రూ.1,115 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం 2,910 కోట్లుగా నమోదైంది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం రూ.43,784 కోట్ల నుంచి రూ.46,731 కోట్లకు పెరిగింది. 6.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది. మార్కెట్ విశ్లేషకులు ఎస్బీఐ సగటున రూ.3,250 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. ఎన్పీఏలు పైపైకి... ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) మరింత ఎగబాకాయి. మొత్తం రుణాల్లో 5.1 శాతానికి(రూ.72,792 కోట్లు) చేరాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 4.9 శాతం(రూ.61,992 కోట్లు) కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 4.15 శాతం( రూ.56,834 కోట్లు) మాత్రమే. ఇక నికర ఎన్పీఏలు కూడా గత క్యూ3లో 2.8 శాతం(రూ.34,469 కోట్లు) నుంచి 2.89 శాతానికి(రూ.40,249 కోట్లు) పెరిగాయి. అయితే, క్రితం క్వార్టర్(సెప్టెంబర్ త్రైమాసికంలో 2.14 శాతం; రూ.28,592 కోట్లు)తో పోలిస్తే భారీగా పెరగడం గమనార్హం. ప్రధానంగా మొండిబకాయిల పరిష్కారం కోసం ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రభావంవల్లే ఎన్పీఏలను అధికంగా చూపించాల్సి వచ్చిందని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మొండిబకాయిల సమీక్షలో భాగంగా టాప్-150 బలహీన ఖాతాలను గుర్తించిన ఆర్బీఐ... వాటినీ ఎన్పీఏలుగా పరిగణించి మార్చిలోపు కేటాయింపులు జరపాలంటూ బ్యాంకులను ఆదేశించడం తెలిసిందే. కాగా, ఈ డిసెంబర్ క్వార్టర్లో బ్యాంక్ మొత్తం ప్రొవిజనింగ్ రూ. 7,645 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.4,810 కోట్లు మాత్రమే. క్యూ3లో కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాల విలువ రూ.20,692 కోట్లుగా నమోదైంది. ఇందులో రూ.5,900 కోట్లు మాత్రమే అసలు మొండిబకాయిలని, ఆర్బీఐ సమీక్ష ప్రభావంతో మిగిలిన మొత్తాన్ని కూడా ఈ జాబితాలోకి చేర్చినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇప్పటివరకూ సగం బలహీన ఖాతాలకు మాత్రమే కేటాయింపులు జరిపామని, క్యూ4 ఫలితాలపైనా ఈ ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ డిసెంబర్ త్రైమాసికంలో ఇతర ఆదాయం 18 శాతం ఎగబాకి రూ.6,178 కోట్లకు చేరింది. లాభాలు మరింత పడిపోకుండా ఇది కొంతవరకూ దోహదం చేసింది. ♦ ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 1.2% వృద్ధి చెంది రూ.13,777 కోట్ల నుంచి రూ.13,606 కోట్లకు చేరింది. ♦ రుణాలు 12.9 శాతం వృద్ధి చెందాయి. దీంతో డిసెంబర్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల పరిమాణం రూ.14.28 లక్షల కోట్లకు పెరిగింది. ♦ డిపాజిట్ల పరిమాణం 10.7 శాతం వృద్ధితో 16.71 లక్షల కోట్లకు ఎగబాకింది. ♦ ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ధర గురువారం బీఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 154 వద్ద ముగిసింది. -
'మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లు'
కోల్‌కతా: ఒక మహిళగా తోటి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే తలంపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ముందుకొచ్చారు. మహిళల కోసం ప్రత్యేక స్కీములు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కోల్కత్తా లిటరరీ ఫెస్టివల్‌కు హాజరైన ఆమె.. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగులందరకీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించలేదని, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దితే ఉపాధివకాశాలు సృష్టించవచ్చన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే కోటి మంది యువతలో 50 శాతం మంది అమ్మాయిలేనని ఆమె అన్నారు. కాబట్టి కచ్చితంగా మహిళలకు చేయూతగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓ మహిళా ఉద్యోగిగా ఎస్బీఐలో చేరినప్పుడు తాను వివక్షను ఎదుర్కొంటున్నట్టు కూడా తెలియలేదన్నారు. వివక్షను అధిగమించే లోపే, చాలా బాధ్యతలు నిర్వర్తించి ఈ స్థాయికి ఎదిగానని భట్టాచార్య తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మహిళలు చైర్‌పర్సన్‌గా ఎంపికవ్వడానికి తనకు లాగా చాలా సమయం పడుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో పనిచేసే చాలామంది మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని మంచి ఉద్యోగులుగా రాణిస్తున్నారని తెలిపారు. -
బేస్ రేటు ఇక తగ్గించం...
► నిధుల సమీకరణ ఈసారి ఉండదు ► ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బేస్ రేటును మరింతగా తగ్గించే యోచనేదీ లేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిశాక దీనిపై దృష్టి పెట్టే అవకాశాలు ఉండొచ్చని దక్షిణ ముంబైలోని కొలాబాలో ఇన్టచ్ శాఖను ప్రారంభించిన సందర్భంగా ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ గతేడాది సెప్టెంబర్‌లో కీలక పాలసీ రేట్లను తగ్గించిన తర్వాత ఎస్బీఐ అక్టోబర్‌లో 40 బేసిస్ పాయింట్ల మేర బేస్ రేటును తగ్గించింది. దీంతో ఇది 9.70 శాతం నుంచి 9.30 శాతానికి దిగి వచ్చింది. ఇటీవలే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కూడా 0.05 శాతం మేర బేస్ రేటు తగ్గించి ఎస్బీఐ తరహాలోనే 9.30 శాతం స్థాయికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే బేస్ రేటు అంశంపై భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక బేస్ రేటు లెక్కింపునకు కొత్తగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎఫ్) ఫార్ములాను అమల్లోకి తెచ్చినా పెద్దగా తేడా ఉండబోదని, అయితే వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను మరింత వేగంగా ఖాతాదారులకు బదలాయించేందుకు మాత్రం వెసులుబాటు లభించగలదని భట్టాచార్య వివరించారు. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తే బేస్ రేటును బ్యాంకులు కనీసం 80-160 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాల్సి రావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు, మార్చి నాటికి ఎస్బీఐ కొత్తగా మరో 500 శాఖలను ప్రారంభించనుందని, వీటిలో 100 హై టెక్ శాఖలు ఉంటాయని భట్టాచార్య చెప్పారు. ఇప్పట్లో నిధుల సమీకరణ ఉండకపోవచ్చు.. దాదాపు రూ. 12,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ప్రతిపాదనపై స్పందిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ నిధులను సమీకరించే అవకాశాలు లేవని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికలేమీ లేవని వివరించారు. బాసెల్ త్రీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే టియర్-టూ బాండ్లను ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన విక్రయించడం ద్వారా రూ. 12,000 కోట్లను సమీకరించేందుకు అనుమతులు లభించినట్లు గతేడాది డిసెంబర్ 21న స్టాక్ ఎక్స్చేంజీలకు ఎస్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డిసెంబర్ 24న ఈ మార్గంలో ఎస్బీఐ రూ. 4,000 కోట్లు సమీకరించింది. ఇక, 2017 మార్చి నాటికల్లా బ్యాంకులు తమ ఖాతాల్లో మొండిబకాయిల భారాన్ని తగ్గించుకోవాలన్న డెడ్‌లైన్‌పై ఆర్బీఐతో బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయని భట్టాచార్య చెప్పారు. అటు స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కొత్త చీఫ్‌గా తన పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వాస్తవం కాదన్నారు. ఇదంతా మీడియా సృష్టేనని చెప్పారు. -
సామాజిక స్కీమ్‌లు బ్యాంకులకు భారం
♦ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ♦ ప్రభుత్వ మద్దతులేకుంటే వీటి నిర్వహణ కష్టమని వ్యాఖ్య ముంబై : పేమెంట్ బ్యాంకులపై వివాదాస్పద వ్యాఖ్య లు చేసి, అటు తర్వాత వెనక్కు తగ్గిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) వంటి సామాజిక భద్రతా పథకాలు బ్యాంకులకు ఆర్థిక భారంగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి పథకాలు పటిష్టంగా కొనసాగి, బ్యాంకులకూ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా ఫలప్రదం కావాలంటే కేంద్రం మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఆయా పరిస్థితులను కేంద్రం ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.శుక్రవారం నాడు ఇక్కడ ఆమె బ్యాంక్ బ్రోకరేజ్ విభాగం- ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ కొత్త కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు... ► పీఎంజేడీవై పటిష్టరీతిలో అమలు కావాలని కేంద్రం కోరుకుంటోంది. అయితే బ్యాంకింగ్‌కు ఇది చాలా కష్టం. బ్యాంకింగ్ వ్యాపార ప్రయోజనాలకు సరిపడకపోవడమే దీనికి కారణం. అలాంటప్పుడు ఇది నీరుగారిపోక తప్పదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇలాంటి పథకాలు పటిష్టంకావడానికి కేంద్రం బ్యాంకులకు తగిన మద్దతు అందించే చర్యలు చేపట్టాలి. నిర్వహణా భారం తగ్గించాలి. ► పీఎంజేడీవై విజయవంతానికి ప్రభుత్వంతో ఇప్పటికే మేము కలిసి పనిచేస్తున్నాం. అయితే బ్యాంకులే ఈ పథకాన్ని నిర్వహించాలి తప్ప, మేము చేసేదేంలేదని ప్రభుత్వం భావిస్తోందని నేను అనుకోను. కాగా ప్రభుత్వం ఏమి చేయాలన్న అంశంపై మాత్రం మేము కసరత్తు చేస్తున్నాం. జన్ ధన్ యోజన ద్వారా రూ.22,000 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జన్‌ధన్ యోజన కింద 17.5 కోట్ల బ్యాంక్ అకౌంట్ల ద్వారా రూ.22,000 కోట్లు డిపాజిట్ అయ్యాయి. దేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌలభ్యం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 28న ఈ యోజనను ప్రారంభమైంది. ఈ యోజన ద్వారా ‘కుటుంబానికి ఒక అకౌంట్ ప్రారంభం’ లక్ష్యం నెరవేరినట్లు ఆర్థికశాఖ తెలిపింది. రెపో యథాతథం! సెప్టెంబర్ 29న జరిగే ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25 శాతం) రేటును యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. మార్కెట్ల అనిశ్చితి, రూపాయి ఒడిదుడుకులు దీనికి కారణమని తాను భావిస్తున్నానన్నారు. రేటు కోత పరిస్థితి ఉన్నా... సంబంధిత కారణాల వల్ల ఈ దిశలో నిర్ణయం తీసుకోకపోవచ్చునని విశ్లేషించారు. ఆగస్టు 31న వెలువడనున్న స్థూల దేశీయోత్పత్తి క్యూ1 ఫలితాల కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. డాయిష్ బ్యాంక్ ఇలా... కాగా సెప్టెంబర్ సమీక్ష సందర్భంగా రెపో కోత ఉండవచ్చని జర్మన్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ శుక్రవారం అంచనావేసింది. వృద్ధి-ద్రవ్యోల్బణం పరిస్థితులు ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఒడిదుడుకుల మార్కెట్లోనూ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే భారత్ పనితీరు బాగుందని విశ్లేషించింది. -
రిలయన్స్ పేమెంటు బ్యాంకుకు రిటైల్ ఊతం
న్యూఢిల్లీ : ప్రతిపాదిత పేమెంటు బ్యాంకుకు విస్తృత నెట్వర్క్ ఉన్న తమ టెలికం వ్యాపారం, రిటైల్ వ్యాపారం కూడా తోడ్పాటు అందివ్వగలవని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తెలిపింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు జియోమనీ పేరిట ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఎస్బీఐతో కలసి ఆర్ఐఎల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐతో భాగస్వామ్యం వల్ల పేమెంట్ బ్యాంకు మరింత సమర్ధంగా పనిచేయగలదని, విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోగలదని ఆర్ఐఎల్ సీఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు. సమర్థ, సరళమైన బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్ఐఎల్ డిజిటల్ సాంకే తికత తోడ్పడుతుందని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. -
పేమెంటు బ్యాంకులకు పోటీగా సీఎస్పీలు
ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య కోల్‌కతా : పేమెంట్ బ్యాంకులతో పోటీపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో.. తక్కువ వ్యయాలతో బ్యాంకింగ్ సేవలు అందించేందుకు తాము ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే మరింత మారుమూల ప్రాంతాలకు చొచ్చుకుపోగలగడం పేమెంట్ బ్యాంకులకు అనుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. గ్రామగ్రామాన పేమెంట్ బ్యాంకుల అసోసియేట్లు ఉండటం వల్ల వాటి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయని ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఈ నేపథ్యంలో వాటితో పోటీపడేందుకు బ్యాం కింగ్ సేవలు లేని పంచాయతీల్లో ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్లు (సీఎస్పీ) ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మొబైల్ ఫోన్, ప్రింటర్, స్కానర్‌ను ఉపయోగించగలిగేలా కనీస విద్యార్హతలున్న యువతకు శిక్షణనివ్వనున్నట్లు అరుంధతి భట్టాచార్య చెప్పారు. తాము ఇటీవల ప్రవేశపెట్టిన మొబైల్ వాలెట్ ‘బడీ’ కూడా పేమెంట్ బ్యాంకుల పరిధిలోనే పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణాలు ఇవ్వలేకపోవడం పేమెంట్ బ్యాంకులకు ప్రతికూలాంశమని అరుంధతి భట్టాచార్య వివరించారు. బ్యాంక్ యూనియన్ల వ్యతిరేకత.. వడోదర: పేమెంట్ బ్యాంకుల ఏర్పాటును ‘ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్’ (ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు ప్రభావం ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఉంటుందని పేర్కొంది. పేమెంట్ బ్యాంకుల వల్ల ప్రైవేట్ రంగ బ్యాంకుల ప్రాధాన్యం పెరుగుతుంది, ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా తగ్గే అవకాశం ఉందని వివరించింది. దాదాపు 41 సంస్థలు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే వాటిలో 11 సంస్థలకు ఆర్బీఐ ఇటీవల అనుమతినిచ్చింది. -
ఎస్బీఐ లాభం రూ.3,692 కోట్లు
క్యూ1లో 10% వృద్ధి... - మొత్తం ఆదాయం 10 శాతం అప్; రూ.44,731 కోట్లు - మొండిబకాయిలు తగ్గుముఖం... ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.3,692 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,349 కోట్లతో పోలిస్తే లాభం 10.2 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా 10 శాతం వృద్ధి చెంది రూ.44,731 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఇతర ఆదాయం జోరందుకోవడం, మొండిబకాయిల తగ్గుదలతో కేటాయింపులు కూడా దిగిరావడం వంటివి లాభాలు పుంజుకోవడానికి దోహదం చేశాయి. కాగా, జూన్ క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) స్వల్పంగా 3.6 శాతం మాత్రమే వృద్ధి చెంది రూ.13,732 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం(వడ్డీయేతర) మాత్రం 19.7 శాతం దూసుకెళ్లి రూ.5,088 కోట్లకు చేరింది. ఫీజుల ఆదాయం(రూ.3,202 కోట్లు; 13 శాతం అప్) భారీగా పెరగడమే దీనికి కారణం. అయితే, దేశీ కార్యకలాపాలపై నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) క్యూ1లో 3.29 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎన్ఐఎం 3.54 శాతంగా ఉంది. దీనికి ప్రధానంగా బేస్ రేటు 30 బేసిస్ పాయింట్లు తగ్గడమే కారణమని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, సీఎఫ్ఓ అన్షులా కాంత్ పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్‌గా చూస్తే...: ఇతర అనుబంధ సంస్థలన్నింటితో కలిపి(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ఎస్బీఐ నికర లాభం క్యూ1లో రూ.4,714 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ1లో లాభం రూ.4,448 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 4 శాతంం పెరిగి... రూ. 60,621 కోట్ల నుంచి రూ.62,927 కోట్లకు చేరింది. మొండిబకాయిల తగ్గాయ్...: జూన్ క్వార్టర్లో బ్యాంక్ మొండిబకాయిలు కాస్త శాంతించాయి. మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 4.29 శాతానికి(రూ.56,421 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది క్యూ1లో స్థూల ఎన్పీఏలు 4.9 శాతం(రూ.60,434 కోట్లు)గాా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా 2.66 శాతం(రూ.31,884 కోట్లు) నుంచి 2.24 శాతానికి(రూ.28,669 కోట్లు) దిగొచ్చాయి. దీంతో క్యూ1లో మొండిబకాయిలపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) రూ.3,359 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ మొత్తం రూ.3,903 కోట్లు. అయితే, గతేడాది మార్చి క్వార్టర్(క్యూ4)లో స్థూల ఎన్పీఏలు 4.25 శాతం, నికర ఎన్పీఏలు 2.12 శాతంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1లో మొండిబకాయిలు పెరగడం గమనార్హం. ‘మొండిబకాయిల సమస్యకు ఇక అడ్డుకట్టపడినట్లే. ఎన్పీఏల రికవరీ ఆశావహంగా కొనసాగుతోంది. దీంతో బ్యాంక్ రానున్నకాలంలో మరింత మెరుగైన పనితీరును నమోదుచేయగలదన్న విశ్వాసంతో ఉన్నాం. ఇక రుణ వృద్ధి పుంజుకుంటేనే మరింతగా వడ్డీరేట్లను తగ్గించేందుకు వీలవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,674 మంది బ్యాంక్ సిబ్బంది పదవీవిరమణ చేయనున్నారు. దీంతో కొత్తగా ఈ ఏడాదే 2,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకోవాలనేది మా ప్రణాళిక. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ -
లాభాల్లో ఉద్యోగులకు 3% వాటా
♦ ఆర్థిక శాఖ అనుమతి కోరిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ♦ ప్రతిభ గల ఉద్యోగులు వెళ్లకుండా ఉండేలా చూసేందుకే న్యూఢిల్లీ : ప్రతిభ గల ఉద్యోగులను ప్రోత్సహిం చేందుకు, సంస్థను వీడి వెళ్లిపోకుండా చూసేందుకు వార్షిక లాభాల్లో 3 శాతం దాకా వాటాను సిబ్బందికి పంచాలని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోరినట్లు బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఉద్యోగులు కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా ప్రోత్సహించేందుకు సంస్థ లాభాల్లో సుమారు ఒక్క శాతం దాకా సిబ్బందికి పంచేందుకు ప్రస్తుత నిబంధనలు అనుమతిస్తున్నాయని, అయితే దీన్ని 3 శాతానికి పెంచేందుకు అనుమతించాలని ఆర్థిక శాఖను తాము కోరుతున్నట్లు భట్టాచార్య చెప్పారు. కష్టపడి ఉన్నత స్థానాల్లోకి వచ్చిన ప్రతిభావంతులైన ఉద్యోగులను.. ప్రైవేట్ రంగ సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలతో ఎగరేసుకుపోతున్నాయని, కొత్త బ్యాంకులు వస్తే ఇది మరింత తీవ్రమవుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వ రంగంతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో ఆదాయం అధికంగా ఉంటున్నందున సీనియర్, మిడ్-లెవెల్ అధికారులు సంస్థను వీడకుండా ఉండేలా చూసుకునేందుకు ఈ స్థాయిలో పరిమితి పెంపు అవసరమని ఆమె పేర్కొన్నారు. మరోవైపు హోదాతో సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ షేర్ల కొనుగోలు పథకాన్ని వర్తింపచేసే అంశాన్ని కూడా బ్యాంకు పరిశీలిస్తోంది. దీని ద్వారా రూ. 800-1,200 కోట్లు సమీకరించవచ్చని అంచనా. బ్యాంకులో ప్రస్తుతం 2.3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ నికర లాభం 20 శాతం ఎగిసి రూ. 13,102 కోట్లుగా నమోదైంది. ఆగస్టులో రేట్ల కోత ఉండకపోవచ్చు.. రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగిన నేపథ్యంలో ఆగస్టు 4న జరిగే తదుపరి పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు భట్టాచార్య తెలి పారు. జూన్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం నెగటివ్‌లో ఉన్నప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్టమైన 5.4 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. -
ఈ ఏడాది మరింత బాగుంటుంది
ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య ముంబై : ఆర్థిక వ్యవస్థలో ఒక మోస్తరు రికవరీ ఇప్పటికే కనిపిస్తున్నందున క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మెరుగ్గా ఉండగలదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతి భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికోత్పత్తి క్రమంగా ఊపందుకుంటూ ఉండటంతో పాటు సంస్కరణలకు అనుకూల విధానాలు.. ఆశించిన ఫలితాలను సాధించేందుకు తోడ్పాటు అందించగలవని గురువారం సంస్థ షేర్హోల్డర్లకు ఆమె తెలిపారు. అటు ద్రవ్యోల్బణపరమైన ఒత్తిళ్లు తగ్గుతున్నందున దేశీయంగా డిమాండ్‌ను పెంచేందుకు మరింత ఉద్దీపన లభించే అవకాశాలు ఉన్నట్లు భట్టాచార్య పేర్కొన్నారు. జూన్‌లో వర్షాలు తగినంత స్థాయిలో ఉన్నందున వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు తగ్గొచ్చన్నారు. ఇక రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు రికవర్ అవుతున్నందున ఎగుమతులు పెరగడం, దేశీయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఏర్పడటం వంటివి అధిక వృద్ధికి దోహదపడే సానుకూల అంశాలని ఆమె చెప్పారు. 2013 అక్టోబర్‌లో ఎస్బీఐ చైర్మన్‌గా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు.. మొండిబకాయిలు తగ్గించడం, రిస్కు మేనేజ్మెంట్, వ్యయాల నియంత్రణ, మెరుగైన ప్రమాణాలు నెలకొల్పడం, అధిక వడ్డీయేతర ఆదాయ ఆర్జన, సమర్ధంగా టెక్నాలజీని వినియోగించుకోవడం అనే ఆరు లక్ష్యాలను నిర్దేశించుకోగా.. గణనీయమైన పురోగతే సాధించగలిగామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నికర మొండిబకాయిలు (ఎన్పీఏ) రూ. 3,505 కోట్ల మేర తగ్గి రూ. 27,591 కోట్లకు పరిమితమయ్యాయని భట్టాచార్య వివరించారు. ఎన్పీఏల నుంచి రికవరీలు 32.33 శాతం మేర పెరిగాయని ఆమె తెలిపారు. -
ఇక ఆన్‌లైన్‌లోనూ ఎస్బీఐ రుణ దరఖాస్తు
ముంబై: వినియోగదారులకు రుణ దరఖాస్తు ప్రక్రియను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరింత సరళతరం చేసింది. ఇకపై కస్టమర్లు ఎస్బీఐ రుణానికి దరఖాస్తును ఆన్లైన్ ద్వారా కూడా దాఖలు చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు ఒక అప్లికేషన్‌ను బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రారంభించారు. ఈ ఆన్లైన్ సొల్యూషన్ ద్వారా కస్టమర్లు గృహ, కారు, విద్యా, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫైలింగ్‌కు సంబంధించి అప్పటికప్పుడే ఈ-అప్రూవల్‌ను కూడా కస్టమర్లు పొందవచ్చని ఒక ప్రకటనలో ఎస్బీఐ పేర్కొంది. దరఖాస్తును పరిశీలించి, బ్యాంక్ అధికారులే కస్టమర్లను లోన్ విషయంపై సంప్రదింపులు జరుపుతారని, రుణ మంజూరు విధివిధానాలను పూర్తిచేస్తారని తెలిపింది. అవసరమైన అన్ని పత్రాలనూ ఆన్లైన్ ద్వారానే కస్టమర్లు అప్లోడ్ చేయవచ్చని పేర్కొంది. దీనివల్ల రుణ దరఖాస్తుకు సంబంధించి ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గనుందని బ్యాంక్ పేర్కొంది. మొబైల్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి త్వరలో ఇలాంటి అప్లికేషన్నే బ్యాంక్ ప్రారంభించనుంది. -
ఎస్బీఐ లాభం రయ్..
క్యూ4లో 23 శాతం జంప్; రూ. 3,742 కోట్లు - ఆదాయం రూ.48,616 కోట్లు; 15 శాతం పెరుగుదల - దిగొచ్చిన మొండి బకాయిలు... - షేరుకి రూ.3.5 చొప్పున డివిడెండ్... కోల్‌కతా: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మొండిబకాయిలు దిగిరావడం.. నికర వడ్డీ ఆదాయాల జోరుతో లాభాలు పుంజుకున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ.3,742 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.3,041 కోట్లతో పోలిస్తే లాభం 23% ఎగసింది. ఇక బ్యాంక్ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.42,443 కోట్ల నుంచి రూ.48,616 కోట్లకు పెరిగింది. 14.6% వృద్ధి నమోదైంది. మొండిబకాయిలు తగ్గాయ్... మార్చి క్వార్టర్ చివరినాటికి ఎస్బీఐ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 4.25 శాతానికి(రూ.56,725 కోట్లు) దిగొచ్చాయి. అంతక్రితం ఏడాది మార్చి చివరినాటికి ఈ నిష్పత్తి 4.95 శాతంగా(రూ.61,605 కోట్లు) ఉంది. నికర ఎన్పీఏలు 2.57 శాతం నుంచి 2.12 శాతానికి తగ్గాయి. కాగా, క్యూ4లో ఎన్పీఏలపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) రూ.5,884 కోట్ల నుంచి రూ.4,635 కోట్లకు తగ్గాయి. ఇక కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,769 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఈ పరిమాణం రూ.7,947 కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఏడాదిలో ఎస్బీఐ స్టాండెలోన్ నికర లాభం రూ.13,102 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.10,892 కోట్లతో పోలిస్తే 20% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 13% వృద్ధితో 1,54,904 కోట్ల నుంచి రూ.1,74,972 కోట్లకు ఎగసింది. ఎస్బీఐ గ్రూప్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలతో కలిపి) నికర లాభం 2014-15 ఏడాదిలో 20% ఎగబాకి రూ.16,994 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.14,174 కోట్లు. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. రూ.2,26,944 కోట్ల నుంచి రూ.2,57,290 కోట్లకు పెరిగింది. 13.4% వృద్ధి చెందింది. క్యూ4 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14 శాతం ఎగబాకి రూ.12,903 కోట్ల నుంచి రూ.14,712 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్ నాటికి నికర వడ్డీ మార్జిన్ 3.16 శాతంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 13.08 శాతం పెరిగి మార్చి చివరినాటికి రూ.15,76,793 కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం రుణాలు 7.25 శాతం వృద్ధితో రూ.13,35,424 కోట్లను తాకాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను వాటాదారులకు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఎస్బీఐ రూ.3.5(350%) డివిడెండ్‌ను ప్రకటించింది. రికవరీలపై మరింత దృష్టి... క్యూ4లో స్థూల, నికర ఎన్పీఏలు రెండూ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల రికవరీపై మరింత దృష్టిసారిస్తున్నాం. రానున్న 10 నెలల్లో రూ.15,000 కోట్ల మేర నిధుల సమీకరణకు బ్యాంక్ అనుమతులు పొందింది. ఎస్బీఐ లైఫ్‌లో 10 శాతం వాటా విక్రయంపై దృష్టిపెట్టాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ ఎగసిపడిన షేరు... ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు భారీగా ఎగసిపడింది. మెరుగైన లాభాలు, మొండిబకాయిల తగ్గుదల ప్రభావంతో శుక్రవారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 5.4% ఎగసి రూ.305 గరిష్టస్థాయిని తాకింది. అయితే, పైస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో చివరకు 2.38 శాతం దిగజారి రూ.282 వద్ద స్థిరపడింది. -
ఎక్కడిరేట్లు అక్కడే!
రేపు ఆర్బీఐ పాలసీ సమీక్ష పెరుగుతున్న ఆహార ధరలతో రేట్ల తగ్గింపునకు చాన్స్ లేనట్టే బ్యాంకర్లు, విశ్లేషకుల అభిప్రాయం... న్యూఢిల్లీ: ఎగబాకుతున్న ఆహారోత్పత్తుల ధరలు.. వడ్డీరేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఆర్బీఐ రేపు(మంగళ వారం) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని బ్యాంకర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని పలు చోట్ల ఇటీవలి అకాల వర్షాల కారణంగా ఆహార ధరలకు రెక్కలొస్తుండటమే దీనికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ధరల తగ్గుముఖ ధోరణి కనబడితేనే మళ్లీ ఆర్బీఐ భవిష్యత్తు రేట్ల కోత సంకేతాలిస్తుందనేది వారి వాదన. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గత రెండు సార్లు కూడా(జనవరి 15న, మార్చి 4న) పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకులు మాత్రం ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ఇంకా రుణ గ్రహీతలకు బదలాయించడానికి తటపటాయిస్తున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 7.5 శాతం, రివర్స్ రెపో 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం చొప్పున కొనసాగుతున్నాయి. సీఆర్ఆర్ తగ్గిస్తే మంచిది..: అరుంధతీ భట్టాచార్య ఆర్బీఐ సమీక్షలో సీఆర్ఆర్ను తగ్గించాలని కోరుకుంటున్నట్లు దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. దీనివల్ల బ్యాంకులకు నిధులపై వ్యయం తగ్గుముఖం పట్టి.. ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు(రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు) అవకాశం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల ఆర్బీఐ రేపో రేటు తగ్గింపు చర్యలను బ్యాంకులు కూడా అనుసరించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుత ధరల స్థితిని చూస్తుంటే... మంగళవారంనాటి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని యూనియన్ బ్యాంక్ సీఎండీ అరుణ్ తివారి పేర్కొన్నారు. సీఆర్ఆర్ను తగ్గిస్తే.. బ్యాంకుల రుణ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతుందని ఇండియన్ బ్యాంక్ సీఎండీ టీఎం భాసిన్ చెప్పారు. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. రుణ వితరణ చాలా మందకొడిగా ఉందని.. 2015-16 తొలి త్రైమాసికంలో కూడా ఇలాగే కొనసాగవచ్చని భాసిన్ పేర్కొన్నారు. మార్చి 20తో ముగిసిన పక్షం రోజులకు బ్యాంకుల రుణ వృద్ధి 9.5 శాతానికే పరిమితమైంది. రెండు దశాబ్దాల కాలంలో ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. ఆర్థిక వేత్తలు ఏమంటున్నారంటే... అకాల వర్షాల ప్రభావంతో రబీ సీజన్‌లోని గోధుమలు, నూనె గింజలు, పప్పులు తదితర పంటల దిగుబడులు 25-30% దెబ్బతినొచ్చని అసోచామ్ అంచనా వేస్తోంది. ఈ ప్రతికూల ప్రభావం కారణంగా ఆహారోత్పత్తుల ధరలు మరింత ఎగబాకే ప్రమాదం పొంచి ఉండటంతో ఆర్బీఐ వేచిచూసే ధోరణి అవలంభిస్తుందని.. రేపటి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త జ్యోతిందర్ కౌర్ అభిప్రాయపడ్డారు. అయితే, మరో పావు శాతం రెపో రేటు కోత గనుక ఈసారి సమీక్షలో ఉండకపోతే.. ఏప్రిల్‌లోనే పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా రాజన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. మార్చి నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడులైన తర్వాత ఈ చర్యలకు ఆస్కారం ఉందన్నారు. తయారీకి ఊతమివ్వలేదు: ఫిక్కీ సర్వే ఆర్బీఐ తాజా రేట్ల కోతలతో తయారీ రంగంలో పెట్టుబడులకు ఎలాంటి ఊతం లభించలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫిక్కీ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రేట్ల కోత కారణంగా తమ కంపెనీల పెట్టుబడులు భారీగా పెరిగిన దాఖలాలేవీ లేవని సర్వేలో పాల్గొన్నవారిలో 69 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. తయారీ రంగ సంస్థలు ప్రస్తుతం బ్యాంకులకు 9.5-14.75 శాతం స్థాయిలో వడ్డీరేట్లను చెల్లిస్తున్నాయి. ఆర్బీఐ రేట్లు తగ్గించినా.. బ్యాంకులు ఇంకా ఆ ప్రయోజనాన్ని బదలాయించని విషయం విదితమే. కాగా, ప్రస్తుతం తమకు సగటున 12 శాతం పైబడిన వడ్డీ రేటుకే రుణాలు లభిస్తున్నాయని 58 శాతం మంది తెలిపారు. వచ్చే మూడు నెలల కాలానికి తాము ఎలాంటి అదనపు నియామకాలూ చేపట్టలేదని 80 శాతం ప్రతినిధులు వెల్లడించారు. భూసేకరణ, నియంత్రణపరమైన ఇబ్బందులు, అధిక వడ్డీరేట్లు, అనుమతుల్లో జాప్యం వంటివి తయారీ రంగంలో విస్తరణ ప్రణాళికలకు ప్రధాన అడ్డంకులని సర్వే తెలిపింది. -
శక్తిమంతమైన భారత నారీమణులు వీరే..
భారత్‌లో అత్యంత శక్తివంతమైన మహిళా వాణిజ్యవేత్తగా ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యను ఫోర్బ్స్ మేగజీన్ మరోసారి ఎంపిక చేసింది. ప్రతియేటా ప్రపంచంలోని వివిద కార్పొరేట్ స్థాయి కంపెనీలకు చెందిన మేటి సీఈవోలను, ఎండీలను గుర్తించే పోర్బ్స్ మేగజిన్ తాజా జాబితాను విడుదల చేసింది. 50 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో ఆరుగురు భారతీమణులకు చోటుదక్కించుకున్నారు. ఈ ఆరుగురిలో తొలిస్థానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుందతి భట్టాచార్య దక్కించుకోగా, ఆ తరువాత వరుసగా ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్/ శ్రీరామ్ క్యాపిటల్ ఎండీ నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ ఫౌండర్ చైర్మన్ ఎండీ కిరణ్ మజుందార్, యాక్సిస్ బ్యాంక్ సీఈవో ఎండీ శిఖా శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఉషా సంగ్వాన్ ఉన్నారు. గతంలో కూడా అరుంధతీ భట్టాచార్య ఇందులో ప్రధమ స్థానం దక్కించుకున్నారు. -
ఎస్బీఐ లాభం రయ్...
దేశీ బ్యాంకింగ్ రంగం మొండి బకాయిల(ఎన్పీఏ) సెగతో అల్లాడుతున్న తరుణంలో... ఎడారిలో ఒయాసిస్సులా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ మెరుగైన పనితీరుతో ఆశ్చర్యపరిచింది. వడ్డీ ఆదాయాల జోరు, వ్యయ నియంత్రణ చర్యలతో బ్యాంక్ నికర లాభం భారీగా దూసుకెళ్లింది. మరోపక్క, ఎన్పీఏలు కూడా తగ్గుముఖం పట్టడంతో షేరు ధర రివ్వున ఎగసి ఇన్వెస్టర్లలో ఆనందం నింపింది. ⇒ క్యూ3లో లాభం 30 శాతం జంప్; రూ.2,910 కోట్లు ⇒9 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం ⇒వడ్డీయేతర ఆదాయంలో 24% వృద్ధి ⇒మొత్తం ఆదాయం రూ.43,784 కోట్లు; 12 శాతం అప్ ⇒మొండిబకాయిలు తగ్గుముఖం... ⇒8 శాతం పైగా ఎగబాకిన షేరు ధర... ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో ఎస్బీఐ బంపర్ ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా) నికర లాభం 30 శాతం ఎగబాకి రూ.2,910 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,234 కోట్లు మాత్రమే. కాగా, క్యూ3లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ.12,616 కోట్ల నుంచి రూ.13,777 కోట్లకు పెరిగింది. 9.2 శాతం వృద్ధి నమోదైంది. మరోపక్క, వడ్డీయేతర ఆదాయం మరింత మెరుగ్గా 24.27 శాతం పెరుగుదలతో రూ.5,235 కోట్లకు ఎగసింది. దీంతో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.43,784 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో రూ.39,068 కోట్లతో పోలిస్తే 12 శాతం మేర పుంజుకుంది. ఎన్పీఏలు తగ్గాయ్... డిసెంబర్ క్వార్టర్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల్లో మొండిబకాయిల పరిమాణం(స్థూల ఎన్పీఏలు) 4.9 శాతానికి తగ్గాయి. విలువ పరంగా రూ.61,991 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో స్థూల ఎన్పీఏలు 5.73 శాతంగా ఉన్నాయి. కాగా, ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 4.89 శాతంగా నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా వార్షిక ప్రాతిపదికన క్యూ3లో 3.24 శాతం నుంచి 2.8 శాతానికి దిగొచ్చాయి. క్యూ2లో కూడా ఈ పరిమాణం 2.73 శాతంగా ఉంది. ఎన్పీఏల తగ్గుముఖం పట్టినప్పటికీ.. వీటిపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) మాత్రం పెరిగాయి. క్యూ3లో రూ. 4,149 కోట్ల నుంచి రూ. 5,235 కోట్లకు చేరాయి. అంటే 26 శాతం పెరిగినట్లు లెక్క. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ అనుంబంధ బ్యాంకులు, సంస్థలన్నింటితో కలిపి క్యూ3లో ఎస్బీఐ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,828 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ3లో రూ.2,839 కోట్లతో పోలిస్తే 35 శాతం వృద్ధి నమోదైంది. ⇒ మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.58,649 కోట్ల నుంచి రూ.64,605 కోట్లకు ఎగసింది. 10 శాతం వృద్ధి సాధించింది. ⇒ క్యూ3లో ట్రెజరీ ఆదాయం రూ.238 కోట్ల నుంచి రూ.920 కోట్ల దూసుకెళ్లింది. ⇒ ఫీజుల రూపంలో బ్యాంక్ ఆదాయం 10 శాతం ఎగబాకింది. రూ.2,971 కోట్ల నుంచి రూ.3,291 కోట్లకు పెరిగింది. ⇒ నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.19 శాతం నుంచి 3.12 శాతానికి తగ్గింది. ⇒ డిసెంబర్ క్వార్టర్లో రూ.475 కోట్ల విలువైన రుణాలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)లకు విక్రయించింది. మార్చిలో మరో రూ.1,200 కోట్ల విలువైన రుణాలను వేలానికి పెట్టనుంది. ⇒ కాగా, క్యూ3లో రూ.4,092 కోట్ల సాధారణ రుణాలను, ఎన్పీఏలుగా మారిన రూ.1,454 కోట్ల విలువైన రుణాలను బ్యాంక్ పునర్వ్యవస్థీకరించింది. మరో రూ.5,500 కోట్ల రుణాలు ఈ బాటలో ఉన్నాయి. ⇒ డిసెంబర్ చివరి నాటికి ఎస్బీఐ మొత్తం డిపాజిట్లు రూ.15,10 లక్షల కోట్లకు ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.13.49 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందాయి. ⇒ ఇక మొత్తం రుణాలు 7 శాతం వృద్ధితో రూ.12.65 లక్షల కోట్లకు పెరిగాయి. ⇒ కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్సియల్ ప్రాతిపదికన రూ.2,970 కోట్ల విలువైన షేర్లను జారీ చేసేందుకు ఎస్బీఐ డెరైక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ ఆర్థిక సం వత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం సమకూర్చే చర్యల్లో భాగంగా ఈ మొత్తాన్ని ఇవ్వాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. షేరు దూకుడు... అనూహ్యంగా మొండిబకాయిల తగ్గుదల, లాభం భారీగా ఎగబాకడంతో ఎస్బీఐ షేరు పరుగులు తీసింది. శుక్రవారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 8.26 శాతం దూసుకెళ్లింది. చివరకు 7.96 శాతం లాభంతో రూ.307.05 వద్ద స్థిరపడింది. వెరసి ఒక్క రోజులోనే ఎస్బీఐ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.16,910 కోట్లు పెరిగింది. రూ.2,29,235 కోట్లకు ఎగబాకింది. అంతేకాదు శుక్రవారం ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో అత్యధికంగా లాభపడిన బ్లూచిప్ షేరు ఇదే కావడం గమనార్హం. ఎన్ఎస్ఈలో 7 కోట్లకు పైగా షేర్లు, బీఎస్ఈలో 85.7 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఎన్పీఏలు మరింత తగ్గుతాయ్... ఇతర ఆదాయాలతో పాటు నికర వడ్డీ ఆదాయం కూడా భారీగా పుంజుకోవడంతో క్యూ3 లాభాలు జోరందుకున్నాయి. దీనికితోడు వ్యయాలు తగ్గడం కూడా దీనికి దోహదం చేసింది. డిసెంబర్ క్వార్టర్లో రూ.7,043 కోట్లు కొత్తగా మొండిబకాయిల జాబితాలో చేరాయి. క్యూ2లో ఈ మొత్తం రూ.7,700 కోట్లుగా ఉన్నాయి. ప్రధానంగా స్టీల్, ఇన్ఫ్రా, టెక్స్టైల్స్, ట్రేడ్ అండ్ సర్వీసెస్ రంగాల కంపెనీల నుంచే అధికంగా మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటికి అడ్డుకట్టపై మరింత దృష్టిపెడుతున్నాం. అయితే, మొత్తంమీద చూస్తే ఎన్పీఏల పరిస్థితి కాస్త మెరుగుపడింది. రానున్న కాలంలో మరింత నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఏడాదికి రుణ వృద్ధి 10 శాతం స్థాయిలో ఉండొచ్చు. బీమా అనుంబంధ సంస్థల్లో(ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్) కొంత వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనిపై ఆయా సంస్థల్లోని భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నాం. అనుంబంధ బ్యాంకులపై ప్రస్తుతానికి దృష్టిపెట్టడం లేదు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ -
4 పెద్ద బ్యాంకులైనా ఉండాలి
పటిష్టమైన వాటినే విలీనం చేయాలి గృహ రుణాలకు మరిన్ని పన్ను ప్రయోజనాలు కావాలి ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్ జరగాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో 3, 4 పెద్ద బ్యాంకులు ఉండటం చాలా ముఖ్యమని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. పటిష్టమైన బ్యాంకులతో పటిష్టమైన వాటినే విలీనం చేయడం మంచిదని గురువారం ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. ‘భారత్‌లో 3-4 పెద్ద బ్యాంకులు ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం బ్యాంకులు పరస్పరం చర్చించుకోవాలి. సరైన భాగస్వాములుగా ఎవర్ని ఎంచుకోవాలో అవే నిర్ణయించుకోవడం ముఖ్యం. గతంలో ప్రభుత్వ ఒత్తిడితో కొన్ని బ్యాం కులు విలీనమయ్యాయి’ అని అరుంధతి పేర్కొన్నారు. విలీనాలనేవి బలహీన బ్యాంకును కాపాడేట్లు గాకుండా పరస్పరం బలాలను ఉపయోగించుకునేలా సమఉజ్జీల మధ్య ఉండటం శ్రేయస్కరం అన్నారు. ఈక్విటీ జారీ..: బాసెల్ 3 నిబంధనల అమలు కోసం బ్యాంకులు డిఫరెన్షియల్ వోటింగ్ హక్కులతో షేర్ల జారీ బాట పట్టక తప్పదని అరుంధతి చెప్పారు. తాము కూడా ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు. దశలవారీగా ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ల నుంచి రూ. 1.60 లక్షల కోట్లు సమీకరించుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకర్ల జీతాలు అంతంతమాత్రం.. మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల జీతభత్యాలు తీసికట్టుగా ఉంటున్నాయని అరుంధతి వ్యాఖ్యానించారు. సమర్ధులు, నిపుణులను ఆకర్షించాలంటే అందుకు తగ్గ పారితోషికమూ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మరోవైపు ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా గృహ, విద్యా రుణాలు తీసుకునేవారికి పన్నుపరంగా మరిన్ని ప్రయోజనాలను రాబోయే బడ్జెట్లో ప్రతిపాదించాలని అరుంధతి చెప్పారు. ప్రస్తుతం రూ. 15 లక్షల దాకా గృహ రుణాలపైనే వడ్డీ రాయితీ ప్రయోజనం వస్తోందని, ఈ పరిమితిని రూ. 25 లక్షలు పెంచాలని.. గృహ విలువను రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షలకు పెంచాలని ఆమె చెప్పారు. -
రుణ డిమాండ్ పెరిగితేనే వడ్డీ రేట్లు తగ్గుతాయ్
ముంబై: రుణాలకు డిమాండ్ పెరిగితేనే వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. రుణాలకు పెద్దగా డిమాండ్ లేనప్పుడు వడ్డీ రేట్లను ఎకాయెకీన తగ్గించేస్తే బ్యాంకులకు వచ్చే ఆదాయమూ తగ్గిపోతుందని ఆమె చెప్పారు. అలాంటప్పుడు డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లించగలిగేందుకు సరిపడేంత ఆదాయాన్ని పొందేందుకు ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుందన్నారు. అదే భారీ ఎత్తున రుణాలకు డిమాండ్ పెరిగితే, వడ్డీ ఆదాయ పరిమాణమూ పెరుగుతుంది కనుక దాని ఆధారంగా రేట్లను తగ్గించే అవకాశాలు ఉంటాయని అరుంధతి వివరించారు. తయారీ రంగ పురోగతిని సూచించే ఎస్బీఐ కాంపోజిట్ ఇండెక్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. డిపాజిట్ రేట్లు అధిక స్థాయిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం బ్యాంకులకు కష్టతరమవుతుందన్నారు. మరోవైపు సమస్యల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు తామెటువంటి రుణాలు ఇవ్వలేదని ఆమె చెప్పారు. -
రేటు కోత ఉండకపోవచ్చు: ఎస్బీఐ చీఫ్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్ 2 తన పరపతి విధాన సమీక్ష సందర్భంగా పాలసీ రేటును తగ్గించకపోవచ్చన్న అభిప్రాయాన్ని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య గురువారం పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఆర్బీఐ తన కఠిన పరపతి విధానాన్ని విడనాడే అవకాశం ఉందని కూడా అంచనావేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ విధానంపై ‘బేస్ ఎఫెక్ట్’ అంశం ప్రభావితం చూపే అవకాశం ఉంటుందని అన్నారు. డీఅండ్‌బీ అంచనా ఇదీ... నవంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 1.8 శాతం నుంచి 2 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ)ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. తగిన పరిశీలన చేశాకే ఎంవోయూ కుదుర్చుకున్నాం అదానీ గ్రూప్ రుణంపై వివరణ అదానీ గ్రూప్‌నకు రుణమిచ్చేందుకు కేవలం అవగాహనా ఒప్పందాన్ని(ఎంవో యూ) మాత్రమే కుదుర్చుకున్నామని, తగిన పరిశీలన చేశాకే నిధులను విడుదల చేస్తామని ఎస్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. ఆస్ట్రేలియాలోని కార్మైఖేల్ బొగ్గు మైనింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదానీ గ్రూప్‌నకు ఎస్బీఐ 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 6,200 కోట్లు) రుణంఇచేందుకు ఇటీవలే ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన ఈ అంశంపై ఇప్పటికే పలు విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఎస్బీఐ వివర ణకు ప్రాధాన్యత ఏర్పడింది. చైర్పర్సన్ అరుంధతీ కూడా ఇదే విధమైన వివరణ ఇచ్చారు. -
ఫార్చ్యూన్ శక్తివంత మహిళల్లో 8 మంది భారతీయులు
న్యూయార్క్: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన 25 మంది మహిళల్లో(వ్యాపార రంగం) ఈ ఏడాది ఎనిమిది మంది భారతీయులకు చోటుదక్కింది. అంతర్జాతీయ బిజినెస్ మేగజీన్ ఫార్చ్యూన్ ఈ జాబితాను రూపొం దించింది. టాప్-10లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ రెండో స్థానంలో నిలిచారు. దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య(4వ స్థానం), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవ(5వ స్థానం) తొలిసారి జాబితాలో చోటుదక్కించుకున్నారు. వాసుదేవ ఒక భారతీయ ఆయిల్ కంపెనీకి తొలి మహిళా సారథి కావడం గమనార్హం. యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ 10 ర్యాంక్‌లో నిలిచారు. ఆస్ట్రేలియా బ్యాంకింగ్ దిగ్గజం వెస్ట్‌ప్యాక్ సీఈఓ గెయిల్ కెల్లీ నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఇక టాప్-25లో భారత్ నుంచి బయోకాన్ సీఈఓ కిరణ్ మజుందార్ షా(19వ ర్యాంక్), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) సీఈఓ చిత్రా రామకృష్ణ(22), హెచ్ఎస్బీసీ ఇండియా హెడ్ నైనా లాల్ కిద్వాయ్(23), టఫే సీఈఓ మల్లికా శ్రీనివాసన్(25) ఉన్నారు. మహిళా వ్యాపారవేత్తలు అత్యంత కఠినమైన, భారీ సంస్థల్లో ఉన్నతమైన స్థానాలను అందుకుంటున్నారని.. ప్రపంచానికి మార్గనిర్ధేశం చేయడంలో తమ శక్తిసామర్థ్యాలను చాటిచెబుతున్నారని ఫార్చ్యూన్ పేర్కొంది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఎస్బీఐ చీఫ్
ముంబై: బ్లూమ్‌బర్గ్ మార్కెట్స్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు చోటు లభించింది. ఈ లిస్టులో స్థానం సాధించిన ఏకైక భారతీయ మహిళ ఈమే కావడం గమనార్హం. ఎస్బీఐ తొలి మహిళా చైర్పర్సన్ అయిన అరుంధతికి బ్యాంకర్ల కేటగిరీలో స్థానం కల్పించారు. వచ్చేనెలలో విడుదల కానున్న ప్రత్యేక సంచికలో వివరాలను ప్రచురించనున్నారు. భారత్‌లోని అతిపెద్ద బ్యాంకుకు ఆమె సారథ్యం వహిస్తున్నారని బ్లూమ్‌బర్గ్ మార్కెట్స్ ప్రశంసించింది. రుణాల మాఫీ యత్నాలను విడిచిపెట్టాల్సిందిగా రాజకీయ నాయకులపై ఆమె ఒత్తిడి తెస్తున్నారనీ, మాఫీ చేస్తే రుణాలు చెల్లించే సంస్కృతి భ్రష్టుపడుతుందని చెబుతున్నారనీ పేర్కొంది. -
మహిళలు.. మనీ రాణులు
మహిళలు వంటింటికే పరిమితమన్న మాటలకు కాలం చెల్లి చాలా రోజులయ్యింది. ఆర్థిక రంగం నుంచి అంతరిక్షం దాకా అన్నింటిలోనూ వారు దూసుకెళ్లిపోతున్నారు. ప్రపంచస్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో వన్ మ్యాన్ షో .. సారీ.. వన్ ఉమన్ షో నడిపించేస్తున్నారు. పురుషాధిక్య రంగాల్లో కూడా ఆధిపత్యాన్ని చాటుతున్నారు. దేశంలోనే అతి పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ (అరుంధతి భట్టాచార్య), ఐసీఐసీఐ బ్యాంకు (చందా కొచర్), యాక్సిస్ (శిఖా శర్మ) బ్యాంకులకు సారథ్యం వహిస్తున్నది మహిళలే. అంతర్జాతీయంగా సాఫ్ట్‌డ్రింక్స్ దిగ్గజం పెప్సీకి (ఇంద్రా నూయి), ఇంటర్నెట్ దిగ్గజం యాహూకి (మెరిస్సా మెయర్) నేతృత్వం వహిస్తున్నది వారే. వీరికి ఇంతటి విజయాలెలా సాధ్యమయ్యాయి.. వీటి వెనుక రహస్యాలేమిటి.. మనీ మ్యాటర్స్‌లో పురుషాధిక్యతను అధిగమించగలగడంలో మహిళల ప్రత్యేకతలేమిటీ? వీటిపైనే ఈ వారం ధనం కథనం. టైమ్ కావొచ్చు, మనీ కావొచ్చు.. మేనేజ్మెంట్ విషయంలో మహిళలే నంబర్‌వన్. అందుకే, మిగతా విషయాలెలా ఉన్నా ఇంటి ఖర్చుల మేనేజ్మెంటు బాధ్యతలు వారికి అప్పగిస్తుంటారు. పెద్దగా దృష్టి పెట్టం గానీ.. రిస్కులు తీసుకోవడం నుంచి లక్ష్యాలు సాధించడం దాకా మహిళల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని.. లక్ష్యం నిర్దేశించుకోవడం.. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, సాధించడంలో మహిళలు మేటి. అత్యధిక శాతం మహిళలు ఇంటిలోనైనా ఆఫీసులోనైనా.. ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంపైనా, సాధించడంపైనా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకే, స్కూలు స్థాయి నుంచి యూనివర్సిటీల దాకా టాపర్స్‌లో ఎక్కువశాతం వారే. లక్ష్య సాధనపై దృష్టి కారణంగానే కెరియర్లో కూడా మగవారి కన్నా కాస్త వేగంగా ముందుకెళ్లగలుగుతారు. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడమనేది విజయంతో పాటు కాస్త సమయం ఆదా చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. విద్య ఎంపికలో.. చదువుకు సంబంధించి కోర్సులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమకు అనుకూలమైనవి, తాము అన్ని విధాలా రాణించేందుకు అవకాశాలు ఉన్న రంగాలను ఎంచుకుంటూ ఉంటారు. మేనేజ్మెంట్, మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్సులు వారికి ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటుంటాయి. ఒక టి, రెండు మార్కులు పోయినా పర్లేదులే అని అబ్బాయిలు లైట్‌గా తీసుకున్నా.. అమ్మాయిలు మాత్రం ఆ ఒక్క మార్కు కూడా పోకూడదని సీరియస్‌గానే తీసుకుంటుంటారు. సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. సెల్ఫ్-హెల్ప్.. ఇంటి పనుల విషయంలో చూడండి. పిల్లల డైపర్లు మార్చడం నుంచి నిత్యావసరాలు కొనుక్కుని తెచ్చుకోవడం, బిల్లులు కట్టేసేయడం దాకా అన్ని విషయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వంతంగానే చక్కబెట్టుకుంటుంటారు మహిళలు. వారు సెల్ఫ్-హెల్ప్‌కి ప్రాధాన్యమిస్తారు. భర్తకో, కుటుంబ సభ్యులకో, స్నేహితులకో పని అప్పజెప్పి.. వారు చేసే దాకా ఎదురుచూస్తూ కూర్చుని సమయం వృదా చేసుకోవడం కన్నా సొంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇతరులకు అప్పజెబితే తమలాగా శ్రద్ధగా చేస్తారో లేదోనన్న సందేహం కూడా దీనికి కొంత కారణం. ఎందుకంటే..మహిళలు పర్ఫెక్షనిస్టులు కూడా. రోజువారీ రికార్డు.. ఆర్థిక విషయాలు ఇంటికి సంబంధించినవైనా.. ఆఫీసుకు సంబంధించినవైనా.. మహిళలు రికార్డు పాటించడంలో పక్కాగా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రతీ పైసాకి వారి దగ్గర లెక్క ఉంటుంది. ఇది మగవారికి కాస్త చాదస్తంగా అనిపించినా.. నెల తిరిగేసరికి జమాఖర్చుల పక్కా రికార్డు చూస్తే మరి మాట్లాడటానికి ఉండదు. నేర్చుకోవడానికి ప్రాధాన్యం.. మహిళలు సాధ్యమైనంత వరకూ తప్పులకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ చేసినా దాన్నుంచి నేర్చు కుంటారు. ఒకసారి చేసిన మిస్టేక్‌ను మరోసారి చేయరు. ఏదైనా డీల్‌తో లాభం వచ్చిందంటే.. మరింత అధిక టార్గెట్లతో మరోసారి ప్రయత్నిస్తారు. అదే నష్టం వస్తే.. దాన్ని పాఠంగా తీసుకుని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతారు. ప్లాన్ బీ.. ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే.. మరొకటి..ఇలా ప్రతిదానికీ మహిళల దగ్గర ప్లాన్ బి అంటూ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సరిగ్గా లేకపోయినా.. నచ్చినవి కొనేందుకు సరిపడేంత డబ్బు చేతిలో లేకపోయినా.. అప్పటికప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసేయగలరు వారు. సందర్భం ఏదైనా సరే వారి దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఆఖరు నిమిషంలో కూడా మార్పులు, చేర్పులను సమర్థంగా చేయగలరు. అప్పులు.. సాధ్యమైనంత వరకూ అప్పు ఊసే ఉండకుండా చూసుకోవడానికి మహిళలు మొగ్గు చూపుతుంటారు. కుటుంబసభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని కొనుక్కోవడం కన్నా.. చేతిలో ఉన్నప్పుడే కొనుక్కునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే మహిళలు అప్పుల బారిన పడటం కూడా చాలా తక్కువే. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేసేయగల పుష్కలమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ఆఖరు నిమిషంలో కూడా దేన్నయినా సెట్ రైట్ చేయగలిగే సామర్థ్యాలు ఉండటమే ఇందుకు కారణం. రిస్కుకి రెడీ.. మిగతావారు మనకి రిస్కు ఎందుకులే అనుకున్న వాటిని కూడా జంకకుండా చేపట్టగలిగే ధైర్యం మహిళల సొంతం. రిస్కు తీసుకున్నా.. విజయాలు సాధించిన వారి ఉదంతాలు కోకొల్లలు. నష్టపోవాల్సి వస్తుందన్న భయం కన్నా.. విజయంపై ఆశావహంగా ఉండగలగడం, నేర్పుగా వ్యవహరించగలగడం ఇందుకు కారణం. పైగా.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమర్థత కలిగి ఉండటం మరో కారణం. మనీ మేనేజ్మెంట్.. కీలకమైన డబ్బు సంగతికొస్తే.. ఎక్కడ, దేనిపై, ఎంత ఖర్చు చేయాలన్న దానిపై మహిళలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం కన్నా.. దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం కన్నా ఖర్చుల లిస్టు తక్కువగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి విషయంలోనైనా ఆఫీసు విషయంలోనైనా అవసరమనుకున్న వాటిపై తప్ప మిగతా వాటిపై ఖర్చు చేసేందుకు ఇష్టపడరు. మనీ మేనేజ్మెంట్లో వారి సామర్థ్యం ఇందుకు ఉపయోగపడుతుంది. -
ఎస్బీఐ లాభం 3,349 కోట్లు
ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) లాభాలు వృద్ధి బాటలోకి వచ్చాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2014-15, క్యూ1)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 3.3 శాతం పెరిగి రూ.3,349 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,241 కోట్లుగా ఉంది. గత ఆరు క్వార్టర్లలో బ్యాంక్ తొలిసారి లాభాల్లో వృద్ధిని నమోదు చేయడం విశేషం. కాగా, క్యూ1లో ఎస్బీఐ రూ.40,739 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.36,193 కోట్లతో పోల్చిచూస్తే 12.5 శాతం వృద్ధి చెందింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మొండి బకాయిలపై ప్రొవిజనింగ్ మొత్తం ఏకంగా 72 శాతం ఎగబాకి... రూ.3,903 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే వ్యవధికి ఈ మొత్తం రూ.2,266 కోట్లు మాత్రమే. అయినప్పటికీ లాభాలు పెరగడం గమనించదగిన అంశం. కాగా, మార్చి-జూన్ క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 15.12 శాతం వృద్ధి చెంది రూ.13,252 కోట్లుగా నమోదైంది. కన్సాలిడేటెడ్‌గా చూస్తే... అనుబంధ బ్యాంకులు, సంస్థలతో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ క్యూ1లో రూ.4,448 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో రూ.4,299 కోట్లతో పోలిస్తే 3.4 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 15.5 శాతం వృద్ధితో రూ.52,502 కోట్ల నుంచి రూ.60,621 కోట్లకు చేరింది. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ నికర లాభం 70 శాతం ఎగబాకి రూ.67 కోట్ల నుంచి రూ.114 కోట్లకు వృద్ధి చెందింది. మొండి బకాయిల విషయానికొస్తే... మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) ఈ ఏడాది జూన్ చివరినాటికి 4.9 శాతానికి(రూ.60,434 కోట్లు) తగ్గాయి. క్రితం జూన్ ఆఖరికి ఇవి 5.56 శాతంగా(రూ.60,891 కోట్లు) ఉన్నాయి. నికర ఎన్పీఏలు మాత్రం రూ.29,990 కోట్ల నుంచి రూ.31,884 కోట్లకు పెరిగాయి. అయితే, మొత్తం రుణాల్లో చూస్తే 2.83 శాతం నుంచి 2.66 శాతానికి తగ్గడం విశేషం. క్యూ1లో కొత్తగా ఎన్పీఏలుగా మారిన రుణాలు రూ.9,932 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,766 కోట్లతో పోలిస్తే 27 శాతం తగ్గాయి. రుణాల పునర్వ్యవస్థీకరణ కంపెనీ(ఏఆర్సీ)లకు క్యూ1లో ఎస్బీఐ రూ.5,556 కోట్ల ఎన్పీఏలను విక్రయించడం గమనార్హం. అయితే, జూన్ క్వార్టర్లో బ్యాంక్ రూ.3,185 కోట్ల రుణాలను రికవరీ చేసుకుంది. రూ.6,556 కోట్ల విలువైన రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఇక పునర్వ్యవస్థీకరించిన రుణాల విలువ రూ.5,700 కోట్లు కాగా, మరో రూ.3,500 కోట్ల రుణాలు ఈ బాటలో ఉన్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ... జూన్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల విలువ రూ.12,32,288 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలాఖరుకి ఈ మొత్తం రూ.10,95,145 కోట్లు. అంటే 12.52 శాతం పెరిగింది. ఇక మొత్తం డిపాజిట్ల విలువ జూన్ నాటికి 12.85శాతం వృద్ధితో రూ.12,57,389 కోట్ల నుంచి రూ.14.18,915 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) దేశీయ కార్యకలాపాలపై క్యూ1లో 3.44% నుంచి 3.54%కి పెరిగింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఎస్బీఐ షేరు ధర 0.9 శాతం నష్టంతో రూ.2,415 వద్ద స్థిరపడింది. -
ఎస్బీఐ ‘హోమ్ లోన్ ఆన్ వీల్స్’
చెన్నై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ‘హోమ్ లోన్ ఆన్ వీల్స్’ అనే పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య శనివారం చెన్నైలో రెండు ‘హోమ్ లోన్ ఆన్ వీల్స్’ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఎస్బీఐ చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె చెన్నై రావడం ఇదే ప్రథమం. బ్యాంక్ గృహ రుణాల గురించి వివరించడం ఈ కార్యక్రమం ధ్యేయం. హోమ్ లోన్‌కు సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ తక్షణ అనుమతి పత్రాలను ఈ వ్యాన్లలో ఇస్తారని ఎస్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను ఈ వ్యాన్లలో ప్రారంభించవచ్చని వివరించింది. వ్యాన్ల ప్రారంభోత్సవంలో ఎస్బీఐ డిప్యూటీ ఎండీ ఎం.జి.వైద్యన్, చీఫ్ జనరల్ మేనేజర్ (చెన్నై సర్కిల్) పి.ఎస్.ప్రకాశ్ రావు కూడా పాల్గొన్నారు. ఎస్బీఐలో ప్రభుత్వ వాటా తగ్గింపుపై ముసాయిదా నోట్ కాగా ఎస్బీఐలో ప్రభుత్వ వాటా తగ్గింపునకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే నెలలో మంత్రివర్గ ముసాయిదా నోట్‌ను రూపొందించే అవకాశం ఉందని ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సంధు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. ఎస్బీఐలో ప్రభుత్వానికి 58.60 శాతం వాటా ఉంది. -
డిజిటల్ శకానికి ఎస్బీఐ నాంది
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిజిటల్ యుగానికి శ్రీకారం చుట్టింది. కొత్త తరం బ్యాంకింగ్ సేవలను కల్పించేందుకు బ్యాంక్ డిజిటల్ బ్రాంచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ 60వ వ్యవస్థాపక దినోత్సవమైన మంగళవారంనాడు ఆరు నగరాల్లో ఈ ‘ఎస్బీఐ ఇన్టచ్’ శాఖలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌లలో బ్రాంచ్‌లు మొదలవగా... కోల్‌కతా శాఖ త్వరలోనే తెరచుకోనుంది. క్షణాల్లో(ఇన్‌స్టంట్‌గా) బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా(పర్సనలైజ్డ్) డెబిట్ కార్డుల జారీ వంటి సేవలు ఈ డిజిటల్ స్టోర్(బ్రాంచ్)లలో లభ్యమవుతాయి. వారానికి ఏడు రోజులూ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకూ ఇవి పనిచేస్తాయి. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం, కస్టమర్లకు మెరుగైన సేవలందించే ఫీచర్లతో భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో డిజిటల్ శకానికి ఎస్బీఐ బాటలువేసిందని జైట్లీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రానున్నకాలంలో బ్యాంకింగ్ వ్యయాలు బ్రాంచీల్లో కస్టమర్లు గడిపే సమాయాన్ని వీలైనంతవరకూ తగ్గించేందుకు ఈ కొత్తతరం శాఖలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులు కూడా ఇదేవిధమైన డిజిటల్ బ్రాంచ్‌ల దిశగా అడుగులు వేస్తాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. ఇన్‌స్టంట్‌గా పర్సనలైజ్డ్ డెబిట్‌కార్డుల జారీతోపాటు ఇక్కడున్న ఏటీఎం మెషీన్లలో క్యాష్ డిపాజిట్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. తమ గ్రూప్ కంపెనీలకు చెందిన బీమా, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డులు ఇతరత్రా ఉత్పత్తులు, సేవలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయని వెల్లడించారు. ఐటీ, కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ ఈ డిజిటల్ బ్రాంచ్‌లకు సాంకేతిక తోడ్పాటుతోపాటు ఉద్యోగులకు తగిన శిక్షణ కూడా అందించింది. మొండి బకాయిల తగ్గింపునకు మంత్ర దండం లేదు: అరుంధతీ మొండి బకాయిల బరువును తగ్గించడానికి తన వద్ద మంత్రదండం ఏదీ లేదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చి ముగిసే సరికి బ్యాంక్ మొండి బకాయిలు రూ.61,605 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆర్థికాభివృద్ధి ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేస్తూ, దీనివల్ల మొండి బకాయిల సమస్య పరిష్కారమవుతుందన్నారు. వడ్డీరేట్లు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని పేర్కొంటూ... మరికొంతకాలంపాటు పెద్దగా మార్పు ఉండకపోవచ్చని సూచించారు. నిధుల సమీకరణ ప్రణాళికల గురించి ఆమె వివరిస్తూ, ప్రస్తుతానికి ఈ అవసరం ఏదీ లేదన్నారు. ద్రవ్యలోటుపై అప్పుడే చెప్పలేం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) రూ. 2.4 లక్షల కోట్ల ద్రవ్యలోటు (ఫిబ్రవరి బడ్జెట్ అంచనాల్లో 45.6 శాతం) గణాంకాలను కూడా ఆమె ప్రస్తావించారు. స్వల్పకాలిక సమయం ప్రాతిపదికన దీనిపై ఒక అంచనాలకు రాలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.4 శాతంగా ఉంటుందని ఎస్బీఐ ఆర్థిక పరిశోధనా శాఖ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. 5,000కు పైగా ఎస్బీఐ కొత్త ఏటీఎంలు ముంబై: ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5,000 ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్బీఐ ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) ఏ. కృష్ణకుమార్ మంగళవారం ఇక్కడ చెప్పారు. వీటితో పాటు ఈ ఏడాది 1,000 కొత్త బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయనున్నామని, అలాగే పాయింట్ ఆఫ్ సేల్స్ మెషీన్ల నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టామనికూడా ఆయన పేర్కొన్నారు. -
అవమానంతో తలదించుకుంటున్నా: భట్టాచార్య
తిరువనంతపురం: దేశంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాల పట్ల భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనల గురించి చదివినప్పుడు అవమానంతో తలదించుకోవాల్సివస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, విద్యాపరమైన స్వావలంబనతోనే మహిళలపై నేరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. మహిళలపై పెరుగుతున్న నేరాలు అంతర్జాతీయ యవనికపై భారత సాంస్కృతిక ముఖచిత్రానికి నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలపై హింసను కేంద్రంలోని బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం నిరోధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తిరువనంతపురంలో ప్రభుత్వ పాఠశాల బాలికలకు గురువారం అరుంధతీ భట్టాచార్య కంప్యూటర్లు పంపిణీ చేశారు. -
లాభంలో 2 శాతం సామాజిక కార్యక్రమాలకే
ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి జైపూర్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలకు ప్రతి ఏటా నికర లాభంలో రెండు శాతానికి పైగా ఖర్చు చేయడమే స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఉద్దేశమని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. గతంలో లాభంలో ఒక శాతాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించామని చెప్పారు. సీఎస్ఆర్లో భాగంగా స్కూలు బస్సు, అంబులెన్సు, సోలార్ ప్యానెళ్లను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. సమాజ సేవకు నికర లాభంలో రెండు శాతానికిపైగా ఈ ఏడాది నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు. -
మొండిబకాయిలు నేరం కాదు
జంషెడ్పూర్: మొండిబకాయిలను నేరంగా పరిగణించనక్కర్లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సీఎండీ అరుంధతి భట్టాచార్య శనివారం జంషెడ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు. వాటిని సరైన సమయం లో గుర్తించి, నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎకానమీ మందగమనంలో ఉన్నప్పుడు ఎన్పీఏ సమస్య తప్పదని, ఆర్థిక పరిస్థితులు మెరుగైన కొద్దీ ఇవి అదుపులోకి రాగలవని తెలిపారు. -
ఎస్బీఐ రూ. 5,000 కోట్ల మొండిబకాయిల సేల్!
ముంబై: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్పీఏ) భారాన్ని తగ్గించుకునే దిశగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చకాచకా అడుగులు వేస్తోంది. రెండు వందల సంవత్సరాల చరిత్రలో మొదటిసారి దాదాపు రూ. 5,000 కోట్ల ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ సంస్థలకు (ఏఆర్సీ-ఆర్క్స్) విక్రయించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినెల మార్చిఆఖరునాటికే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఎస్బీఐ మొత్తం రూ. 11,39,326 కోట్ల అసెట్స్‌లో (బ్యాంకు ఇచ్చిన రుణాల్లో) స్థూల ఎన్పీఏలు 5.73 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. విలువ రూపంలో ఎన్పీఏల పరిమాణం దాదాపు రూ.67,799 కోట్లు. ఏప్రిల్ నుంచి ప్రొవిజనింగ్ నిబంధనల (నిర్వహణా లాభాల నుంచి ఎన్పీఏలకు జరిగే కేటాయింపు) కఠినతరం అవుతున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ రుణాలకు ప్రొవిజనింగ్ ప్రస్తుత 2 శాతం నుంచి 5 శాతానికి పెరగనుంది. ‘‘ప్రస్తుతం 14 ఏఆర్‌సీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మా మొండిబకాయిల మొత్తాల్లో దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ఎన్పీఏలను విక్రయించడానికి వీటిలో (ఏఆర్సీ) పలు సంస్థలను ఆహ్వానించాం. అధిక బిడ్డర్లకు ఎన్‌పీఏల్లో అధిక మొత్తాలను విక్రయించడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెలాఖరుకే ప్రక్రియను పూర్తిచేయాలన్న నిశ్చయంలో ఉన్నాం’’ అని సీనియర్ ఎస్బీఐ అధికారి వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయాన్ని బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య మార్చి 8వ తేదీనే ప్రకటించారు. అయితే నిర్దిష్టంగా ఎంతమొత్తమన్న విషయాన్ని వెల్లడించలేదు. కొనుగోలు చేస్తున్న మొండిబకాయిల్లో 5 నుంచి 10 శాతం వరకూ నగదు రూపంలో తక్షణం ఏఆర్‌సీలు చెల్లిస్తాయి. మిగిలిన మొత్తాలు సెక్యూరిటీ రిసిట్స్(ఎస్ఆర్) రూపంలో ఉంటాయని ఇంతక్రితం ఎస్బీఐ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. -
ఇక యూట్యూబ్‌లో ఎస్బీఐ
ముంబై: వీడియో షేరింగ్ వెబ్సైట్, యూట్యూబ్‌లో బ్యాంకింగ్ దిగ్గజం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తన చానల్‌ను గురువారం ప్రారంభించింది. త్వరలో మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో కూడా ప్రవేశిస్తామని తద్వారా సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు మరింతగా విస్తరిస్తామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ప్రారంభంలో ఈ యూట్యూబ్ చానెల్లో బ్యాంక్ సంబంధిత వివరాలు. అందిస్తున్న సర్వీసులు, ఇతర సమాచారాన్ని అందిస్తామని వివరించారు. ఆ తర్వాత బ్యాంక్ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలను కూడా పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఎస్బీఐ గతేడాది నవంబర్లోనే ఫేస్బుక్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఎస్బీఐ 15 వేల బ్రాంచీలతో 43 వేల ఏటీఎంలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
మళ్లీ ఏటీఎం చార్జీల బాదుడు!
ముంబై: బ్యాంకులు ఏటీఎం చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చింది. తమ ఏటీఎం కార్యకలాపాలు నష్టాల్లో నడుస్తున్నాయని... కస్టమర్ల నుంచి లావాదేవీల ఫీజును వసూలు చేయకతప్పదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. అదేవిధంగా ఏటీఎం నెట్వర్క్ విస్తరణకు వాణిజ్యపరమైన లాభదాయక విధానం చాలా అవసరమని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ‘మేం అందించే సేవలకుగాను వినియోగదారుల నుంచి కొంత ఫీజు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ఇరువురికీ ఆమోదయోగ్యమైన పరిస్థితి ఉండాలి. వాణిజ్యపరంగా లాభసాటి విధానం ఉండాలనేదే మా వాదన. ఈ కార్యకలాపాలపై నష్టాలు పెరుగుతూపోతే మావల్లకాదు’ అని ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఎస్బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. విస్తరించాలంటే చార్జీల విధింపే మార్గం... ఎస్బీఐకి దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ చివరినాటికి 32,777 ఏటీఎంలు ఎస్బీఐ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు అంచనా. వీటిని మరింత పెంచే ప్రణాళికల్లో బ్యాంక్ ఉంది. ‘ఎల్లకాలం ఏటీఎంపై మేం నష్టాలను భరించలేం. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా ఏటీఎంలను మూసేయక తప్పదు. అందుకు మేం సిద్ధమే. అయితే, దీనికి సరైన సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది’ అని ఆమె చెప్పారు. బెంగళూరులో ఒక ఏటీఎంలో మహిళపై దుండగుడు దాడిచేసిన ఘటన నేపథ్యంలో ఏటీఎంలలో భద్రత పెంపునకు వీలుగా సేవలపై చార్జీలు విధించాలంటూ బ్యాంకింగ్ వర్గాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎస్బీఐ చీఫ్ స్పందిస్తూ... తమ సొంత కస్టమర్లపైనా లావాదేవీల ఫీజు వసూలు చేసేందుకు తాము సుముఖమేనని పేర్కొన్నారు. ఏటీఎంల నెట్‌వర్క్‌ను విస్తరించాలంటే లాభదాయక విధానం చాలా అవసరమన్నారు. కాగా, ఈ ఏడాది మార్చిచివరికల్లా ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంక్ కూడా తమ బ్రాంచ్‌కు ఆనుకుని ఒక ఏటీఎంను తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విదితమే. ఆ ప్రతిపాదనతో 5 దాటితే షాకే...! ప్రస్తుతం బ్యాంకులు తమ ఖాతాదారులకు సొంత ఏటీఎంలలో అపరిమితంగా లావాదేవీలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికొస్తే... నెలకు ఐదుసార్లు మాత్రమే ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదికూడా గరిష్ట నగదు విత్‌డ్రా పరిమితి రూ.10 వేలు మాత్రమే. అయితే, ఈ సేవలకు గాను ఖాతాదారుడికి చెందిన బ్యాంక్... ఇతర బ్యాంక్‌కు ఒక్కో లావాదేవీకి రూ15 చొప్పున(పన్నులతో కలిపి దాదాపు రూ.17) చొప్పున చెల్లించాల్సి వస్తోంది. అయితే, పరిమితి దాటితే ఆ భారం నేరుగా ఖాతాదారుడిపైనే పడుతోంది. ఇప్పుడు ఐబీఏ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే... ఖాతాఉన్న బ్యాంక్, ఇతర బ్యాంకులనే తేడాలేకుండా ఐదు ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీపైనా చార్జీ పడుతుంది. గతేడాది మార్చి చివరినాటికి దేశవ్యాప్తంగా 1.4 లక్షల ఏటీఎంలు ఉన్నట్లు అంచనా. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 72,340. ప్రతి ఏటీఎం సెంటర్లో సీసీటీవీ కెమెరా, ఆయుధంతో కూడిన సెక్యూరిటీ గార్డును పెట్టాలంటే ఒక్కో ఏటీఎంకు దాదాపు రూ.40 వేల అధిక వ్యయం అవుతుందనేది ఐబీఏ అంచనా. ఉచిత లావాదేవీల తగ్గింపును పరిశీలిస్తున్నాం: ఆర్బీఐ ఏటీఎంలలో ఉచిత లావాదేవీల సంఖ్యను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. ఒక్కో ఖాతాదారుడికి నెలకు మొత్తం ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని(సొంత, ఇతర బ్యాంకులతోకలిపి) 5కు తగ్గించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఇటీవలే ఆర్బీఐకి విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ఉచిత పరిమితి దాటితే ఒక్కో లావాదేవీపై రూ.20 చొప్పున చార్జీ విధించేలా ఇప్పుడున్న నిబంధనలనే ఆర్బీఐ కొనసాగించాలని కూడా ఐబీఏ తన సూచనల్లో పేర్కొంది. తాజా భద్రత పెంపు చర్యలతో బ్యాంకులపై నెలకు రూ.400 కోట్ల భారం పడుతోందనేది ఐబీఏ వాదన. ‘ఏటీఎంల విషయంలో ఐబీఏ సూచనల(నెలకు మొత్తం ఉచిత లావాదేవీలను 5కు తగ్గించడం)ను మేం పరిశీలించనున్నాం. ఇతర ప్రతిపాదనలు కూడా మాకు అందాయి. ప్రధానంగా ప్రజలు నగదు రూపంలో మరీ ఎక్కువగా లావాదేవీలు జరుపుతున్నారు. దీనివల్ల నిర్వహణ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుంది. అంతేకాకుండా మనీలాండరింగ్ రిస్క్‌లు కూడా పెరుగుతున్నాయి. దీన్ని తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, ఐబీఏ డిమాండ్ చాలా తెలివితక్కువ, అసంబద్ధమైనదంటూ ఆర్బీఐ మరో డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. సొంత ఖాతాదారులపైనే ఏటీఎం చార్జీల విధింపు ఎక్కడా ఉండదని, బ్యాంకులు తమ పనితీరు మెరుగుదలపై దృష్టిసారించాలని సూచించారు కూడా. -
పిల్లల చదువుల కోసం ఎస్బీఐలో రెండేళ్ల లీవు
ముంబై: ఎస్బీఐ మహిళా సిబ్బందికి ఇకపై రెండేళ్ల విద్యాసంబంధ సెలవు సౌలభ్యం కలగనుంది. పిల్లల విద్య, తల్లిదండ్రులు, అత్తమామల యోగక్షేమాలను చూసుకోవడం వంటి ప్రయోజనాలకు ఈ సెలవు కాలాన్ని వినియోగించుకునే వీలుంటుంది. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. తల్లి సంరక్షణలో లేని పిల్లల విద్యా కార్యకలాపాలకు సంబంధించి పురుష ఉద్యోగులకు సైతం ఈ ప్రయోజనం విస్తరించే అవకాశం ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగం- ఎస్బీఐ క్యాప్స్ చీఫ్‌గా ఆ సంస్థలో మహిళలకు ఆరేళ్ల కాలానికి భట్టాచార్య ఈ తరహా సెలవు విధానాన్ని అమలుచేశారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో కేవలం రెండేళ్లే ఈ సెలవును మంజూరు చేయాల్సి ఉంటుందని అన్నారు. -
‘క్విప్’తో రెండేళ్లదాకా నిధుల కొరత ఉండదు: ఎస్బీఐ
ముంబై: త్వరలో చేపట్టనున్న క్విప్ ఇష్యూ తరువాత రెండేళ్ల వరకూ కొత్త పెట్టుబడుల అవసరం ఉండబోదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) ద్వారా రూ. 11,500 కోట్లను సమీకరించేందుకు బ్యాంకు ఇప్పటికే అనుమతులు పొందింది. క్విప్ తరువాత మాత్రమే నిధుల సమీకరణకు విదేశీ బాండ్ల జారీ వంటివి చేపట్టే అవకాశమున్నదని అరుంధతి తెలిపారు. క్విప్ తరువాత బ్యాంకులో ప్రభుత్వ వాటా 58%కు పరిమితం కానుంది. కాగా, ప్రభుత్వం రూ.2,000 కోట్ల పెట్టుబడుల ను అందించేందుకు గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేసింది. మార్చికల్లా క్విప్ ఇష్యూ పూర్తికానుంది.