
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షురాలు అరుంధతీ భట్టాచార్య బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా సేవలందించిన ఆమె త్వరలోనే మరో దిగ్గజ కంపెనీలో బోర్డులో చోటు దక్కించుకున్నారు. ఎస్‌బీ ఐఅత్యున్నత పదవినుంచి అక్టోబరు 6, 2017 పదవీ విరమణ చేసిన అరుంధతీ తొలుత క్రిస్ క్యాపిటల్, పిరమల్ ఎంటర్ప్రైసెస్‌లో ఆర్ధిక సేవల విభాగంలో ఆమె చేరనున్నారని వార్తలు వచ్చాయి. చివరకు ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా సంపాదించిన దాని కంటే 5 రెట్లు ఎక్కువ వేతనం ఆమెకు లభించనుందట.
ఎస్‌బీఐకి సారధ్యం వహించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పిన అరుంధతీ భట్టాచార్య తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. రిలయన్స్‌లో రెండో మహిళా డైరెక్టర్‌గా (ఇండిపెండెంట్ అడిషనల్) చేరడం ద్వారా ఇప్పటికే రిలయన్స్ లో మహిళా డైరెక్టర్‌గా నీతా అంబానీ సరసన చేరనున్నారు. 5 ఏళ్ళపాటు రిలయన్స్ బోర్డ్‌లో అరుంధతి కొనసాగుతారు. ఇందుకు గాను కంపెనీ బోర్డ్ , షేర్ హోల్డర్స్ ఆమోదం తెలిపారని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment