Reliance board
-
రిలయన్స్ ఇన్ఫ్రాకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: మౌలికసదుపాయాల కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారులు అనుమతించారు. షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు సెపె్టంబర్ 19న గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా 98 శాతం మంది వాటాదారుల నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. నిధుల్లో షేర్ల ప్రిఫరెన్సియల్ కేటాయింపుల ద్వారా రూ. 3,000 కోట్లు, మారి్పడికి వీలయ్యే వారంట్ల జారీ(క్విప్) ద్వారా మరో రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మారి్పడికి వీలయ్యే వారంట్లను ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేయనుంది. తద్వారా రూ. 3,014 కోట్లు అందుకోనుంది. వీటిలో 4.6 కోట్ల షేర్ల(రూ. 1,104 కోట్ల విలువ)లో ప్రమోటర్ సంస్థ రైజీ ఇనిఫినిటీ ప్రయివేట్ ఇన్వెస్ట్ చేయనుంది. -
రిలయన్స్ బోర్డులోకి మాజీ సీవీసీ
సాక్షి, ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారి కేవీ చౌదరి చేరారు. ఈ మేరకు రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం అందించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో చౌదరిని నాన్ ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్ గా నియమకానికి ఆమెదం లభించినట్టు తెలిపింది. అలాగే ఆయన బాధ్యతలు సంస్థలో ఏ డైరెక్టర్‌తోనూ సంబంధం లేదని పేర్కొంది. మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి . 1978-బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) బ్యాచ్‌కు చెందినవారు. కేవీ చౌదరి ఆగస్టు 2014 లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) ఛైర్మన్‌గా బాధ్యలను నిర్వహించారు. ఆ తరువాత, సమస్యలపై రెవెన్యూ శాఖకు సలహాదారుగాను, జూన్ 2015నుంచి 2019 జూన్ వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) గాను పనిచేశారు. కాగా సీవీసీగా అతని నాలుగేళ్ల పదవీకాలంలో, ముఖ్యంగా 2018 లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అంతర్గత పోరును పరిష్కరించే క్రమంలో కేవీ చౌదరి వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
అరుంధతీ భట్టాచార్యకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షురాలు అరుంధతీ భట్టాచార్య బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా సేవలందించిన ఆమె త్వరలోనే మరో దిగ్గజ కంపెనీలో బోర్డులో చోటు దక్కించుకున్నారు. ఎస్బీ ఐఅత్యున్నత పదవినుంచి అక్టోబరు 6, 2017 పదవీ విరమణ చేసిన అరుంధతీ తొలుత క్రిస్ క్యాపిటల్, పిరమల్ ఎంటర్ప్రైసెస్లో ఆర్ధిక సేవల విభాగంలో ఆమె చేరనున్నారని వార్తలు వచ్చాయి. చివరకు ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా సంపాదించిన దాని కంటే 5 రెట్లు ఎక్కువ వేతనం ఆమెకు లభించనుందట. ఎస్బీఐకి సారధ్యం వహించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పిన అరుంధతీ భట్టాచార్య తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. రిలయన్స్‌లో రెండో మహిళా డైరెక్టర్‌గా (ఇండిపెండెంట్ అడిషనల్) చేరడం ద్వారా ఇప్పటికే రిలయన్స్ లో మహిళా డైరెక్టర్‌గా నీతా అంబానీ సరసన చేరనున్నారు. 5 ఏళ్ళపాటు రిలయన్స్ బోర్డ్‌లో అరుంధతి కొనసాగుతారు. ఇందుకు గాను కంపెనీ బోర్డ్ , షేర్ హోల్డర్స్ ఆమోదం తెలిపారని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. -
రిలయన్స్ తొలి మహిళాడైరక్టర్గా నీతా అంబానీ
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఆ కంపెనీ డైరక్టర్‌గా నియమితులయ్యారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ అయిన రిలయన్స్‌లో డైరక్టర్ అయిన తొలి మహిళ నీతా అంబానీ కావడం విశేషం. బుధవారం జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ షేర్ హోల్డర్లు నీతా నియామకానికి ఆమోద ముద్ర వేశారు. 50 ఏళ్ల నీతా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యజమానిగా సుపరిచితురాలు.