నిధుల సమీకరణకు వాటాదారులు ఓకే
న్యూఢిల్లీ: మౌలికసదుపాయాల కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారులు అనుమతించారు. షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు సెపె్టంబర్ 19న గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమకూర్చుకోనుంది.
ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా 98 శాతం మంది వాటాదారుల నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. నిధుల్లో షేర్ల ప్రిఫరెన్సియల్ కేటాయింపుల ద్వారా రూ. 3,000 కోట్లు, మారి్పడికి వీలయ్యే వారంట్ల జారీ(క్విప్) ద్వారా మరో రూ. 3,000 కోట్లు సమీకరించనుంది.
తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మారి్పడికి వీలయ్యే వారంట్లను ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేయనుంది. తద్వారా రూ. 3,014 కోట్లు అందుకోనుంది. వీటిలో 4.6 కోట్ల షేర్ల(రూ. 1,104 కోట్ల విలువ)లో ప్రమోటర్ సంస్థ రైజీ ఇనిఫినిటీ ప్రయివేట్ ఇన్వెస్ట్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment