Reliance Infrastructure
-
రిలయన్స్ ఇన్ఫ్రాకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: మౌలికసదుపాయాల కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారులు అనుమతించారు. షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు సెపె్టంబర్ 19న గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా 98 శాతం మంది వాటాదారుల నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. నిధుల్లో షేర్ల ప్రిఫరెన్సియల్ కేటాయింపుల ద్వారా రూ. 3,000 కోట్లు, మారి్పడికి వీలయ్యే వారంట్ల జారీ(క్విప్) ద్వారా మరో రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మారి్పడికి వీలయ్యే వారంట్లను ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేయనుంది. తద్వారా రూ. 3,014 కోట్లు అందుకోనుంది. వీటిలో 4.6 కోట్ల షేర్ల(రూ. 1,104 కోట్ల విలువ)లో ప్రమోటర్ సంస్థ రైజీ ఇనిఫినిటీ ప్రయివేట్ ఇన్వెస్ట్ చేయనుంది. -
ఇక అనిల్ కంపెనీల జోరు
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వృద్ధి బాటలో సాగనున్నాయి. ఇటీవల ఉమ్మడిగా రూ. 17,600 కోట్ల పెట్టుబడులు సమీకరించే ప్రణాళికలకు తెరతీయడంతో వృద్ధి వ్యూహాలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు వారాలుగా ఇరు కంపెనీలు ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించడంతోపాటు.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వర్డే పార్ట్నర్స్ నుంచి రూ. 7,100 కోట్లు అందుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఈక్విటీ ఆధారిత దీర్ఘకాలిక ఎఫ్‌సీసీబీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. పదేళ్ల ఈ విదేశీ బాండ్లకు 5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నాయి. వీటికి జతగా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 3,000 కోట్లు చొప్పున సమీకరించనున్నట్లు ఇరు కంపెనీల అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బోర్డు ఆమోదించిన పలు తీర్మానాలపై ఈ నెలాఖరుకల్లా వాటాదారుల నుంచి అనుమతులు లభించగలవని తెలియజేశాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా గ్రూప్ కంపెనీల విస్తరణకు అనుగుణమైన పెట్టుబడులను వినియోగించనున్నట్లు వివరించాయి. -
అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!
అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్ హవర్స్ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్ హవర్స్‌కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు. -
ఈవీ రంగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఎలక్ట్రిక్ కార్లు (ఈవీ), బ్యాటరీల తయారీ విభాగంలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికలకు సంబంధించి వ్యయాలపరంగా సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసేందుకు చైనా దిగ్గజం బీవైడీ ఇండియా మాజీ హెడ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను కన్సల్టెంటుగా నియమించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇన్ఫ్రా ప్రాథమికంగా ఏటా 2,50,000 ఈవీలతో మొదలుపెట్టి 7,50,000 వాహనాలకు ఉత్పత్తిని పెంచుకోవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే 10 గిగావాట్ అవర్స్ (జీడబ్లూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీల తయారీ ప్లాంటు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రిలయన్స్ ఇన్ఫ్రా జూన్‌లోనే వాహన రంగానికి సంబంధించి కొత్తగా రెండు అనుబంధ సంస్థలను ప్రారంభించింది. రిలయన్స్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ వీటిలో ఒకటి. అధిక రుణభారం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కంపెనీ ఈ కొత్త ఈవీ ప్రాజెక్టులకు నిధులెలా సమకూర్చుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఆ రెండు కంపెనీల నుంచి అనిల్ అంబానీ ఔట్
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తాజాగా రెండు గ్రూప్ సంస్థల నుంచి వైదొలగారు. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. సెబీ ఆదేశాలమేరకు అనిల్ తప్పుకున్నారు. ఏ లిస్టెడ్ కంపెనీలోనూ అనిల్ పదవులు నిర్వహించకుండా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ డి.అంబానీ బోర్డు నుంచి వైదొలగినట్లు రిలయన్స్ పవర్ తాజాగా బీఎస్ఈకి వెల్లడించింది. రిలయన్స్ ఇన్ఫ్రా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. కంపెనీ నుంచి నిధులను అక్రమంగా తరలించిన ఆరోపణలతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌తోపాటు.. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురు వ్యక్తులను సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ ఈ ఫిబ్రవరిలో నిషేధించింది. అంతేకాకుండా ఈ నలుగురినీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీలు, లిస్టెడ్ కంపెనీలు, పబ్లిక్ నుంచి నిధులు సమీకరించే కంపెనీలు తదితరాలలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా సెబీ నిషేధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేసింది. -
అంబానీ కీలక నిర్ణయం: షేరు జంప్
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న అనిల్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని విక్రయించారు. ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు అప్పు తీర్చే పనిలో భాగంగా తన వేలకోట్ల ఆస్తిని అంబానీ విక్రయించారు. బ్యాంక్‌కి బకాయి పడిన కోట్ల రూపాయల అప్పుని తీర్చేందుకు ముంబైలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముంబై ప్రధాన కార్యాలయం ‘రిలయన్స్ సెంటర్‌ను ’ను విక్రయించారు.ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు దాదాపు 9.50శాతం ఎగియడం విశేషం. రిలయన్స్ ఇన్ఫ్రా మార్కెట్ సమాచారంలో ఈ విషయాన్ని వెల్లడించింది. యస్ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ లావాదేవీ విలువ రూ .1200 కోట్లు అని తెలిపింది. ఈ అమ్మకంతో బ్యాంక్ ఇదే ఆఫీస్‌ని తన కార్పోరేట్ హెడ్‌క్వార్డర్స్‌గా మార్చుకోనుంది. కాగా 2021 జనవరిలోనే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 3 ఆస్తులను విక్రయించింది. ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ (3,600 కోట్ల రూపాయలకు) పర్బతి కోల్డామ్ ట్రాన్స్మిషన్ (900 కోట్ల రూపాయల) అమ్మిన సంగతి తెలిసిందే. (పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు!) చదవండి : కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా? -
రిలయన్స్ ఇన్ఫ్రాకు యస్ బ్యాంక్ నోటీసులు
రుణాల రికవరీ బాటలో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీన పరచుకునేందుకు వీలుగా యస్ బ్యాంక్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని శాంతాక్రజ్‌లోగల ప్రధాన కార్యాలయంతోపాటు.. మరో ఇతర రెండు ఆఫీసులను దాఖలు పరచమంటూ నోటీసులు జారీ చేసినట్లు మీడియా పేర్కొంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇచ్చిన రూ. 2892 కోట్ల రుణాల రికవరీ కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు యస్ బ్యాంక్ నోటీసులో పేర్కొంది. వీటిలో భాగంగా నాగిన్ మహల్‌లోని రెండు ఫ్లోర్లను యస్ బ్యాంక్ సొంతం చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొండిబకాయిల సమస్యలతో కొద్ది రోజులక్రితం యస్ బ్యాంక్ దివాళా పరిస్థితికి చేరిన విషయం విదితమే. తదుపరి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఈక్విటీ పెట్టుబడుల ద్వారా యస్ బ్యాంకులో మెజారిటీ వాటాను పొందింది. తద్వారా యస్ బ్యాంక్ కార్యకలాపాలను ఎస్బీఐ తిరిగి గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. అనిల్ అంబానీ గ్రూప్‌నకు యస్ బ్యాంక్ సుమారు రూ. 12,000 కోట్ల రుణాలు అందించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాయి. బీఎస్ఈఎస్ నుంచి శాంతాక్రజ్‌లోని ప్రధాన కార్యాలయాన్ని బీఎస్ఈఎస్ నుంచి రెండు దశాబ్దాల క్రితం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొంతం చేసుకుంది. బీఎస్‌ఈఎస్‌ను అనిల్ గ్రూప్ కొనుగోలు చేశాక రిలయన్స్ ఎనర్జీగా మార్పుచేసి తదుపరి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో విలీనం చేసినట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. 2018లో ముంబైలోని ప్రధాన కార్యాలయానికి అనిల్ అంబానీ గ్రూప్ తరలివెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. గ్రూప్‌లోని ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించిన రిలయన్స్ క్యాపిటల్, హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. జనరల్ ఇన్సూరెన్స్ తదితర వివిధ విభాగాలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఇటీవల పలు కార్యాలయాలను ఏకంచేయడం ద్వారా కార్యకలాపాలను నార్త్ వింగ్‌లో కన్సాలిడేట్ చేసినట్లు మీడియా పేర్కొంది. కాగా.. మే 5న రుణాలను చెల్లించమంటూ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రెండు నెలల గడువుతో యస్ బ్యాంక్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ రుణ చెల్లింపులను చేపట్టకపోవడంతో ఆస్తులను సొంతం చేసుకునే సన్నాహాలు యస్ బ్యాంక్ చేస్తున్నట్లు మీడియా తెలియజేసింది. -
అడాగ్ షేర్ల ర్యాలీ పట్ల అప్రమత్తంగా ఉండండి
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని అడాగ్ షేర్లు చాలాకాలం తర్వాత చర్చనీయాంశంగా మారాయి. మార్చి కనిష్టం నుంచి అనేక రెట్లు లాభపడంతో దలాల్ స్ట్రీట్‌లో ఇప్పుడు ఈ షేర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. రిలయన్స్ పవర్ షేరు మార్చి 25 నుంచి జూలై1 మధ్యకాలంలో 357శాతం లాభపడింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 349శాతం, రిలయన్స్ క్యాపిటల్ షేర్లు 243 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో సెన్సెక్స్ మాత్రమే 35శాతం పెరిగింది. ర్యాలీలో సత్తా లేదు: మార్చి కనిష్టాల నుంచి అడాగ్ షేర్లు చేసిన ర్యాలీలో సత్తాలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అడాగ్ షేర్లు నిస్సందేహంగా ర్యాలీ చేశాయని, అయితే గడిచిన 10ఏళ్లలో ఈ షేర్ల నాశనం చేసిన 98శాతం సంపద విధ్వంసంతో తాజా ర్యాలీని సరిపోల్చడం మూర్ఖత్వం అవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడాగ్ షేర్లపై ఇప్పటికే పలు బ్రోకరేజ్‌లు, రేటింగ్ సంస్థలు ‘‘బేరిష్’’ రేటింగ్‌ను కేటాయించాయి. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఈ షేర్లలో మూమెంట్ ఉన్నప్పటికీ.., వీటికీ దూరంగా ఉండటం మంచిదని సలహానిస్తున్నాయి. ‘‘ మా ఫండమెంటల్ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో అడాగ్ షేర్లపై మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అయినప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు అనేక పెన్నీ స్టాక్లను కొనుగోలు చేస్తున్నారని మేము నమ్ముతున్నాము. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ఇలాంటి తప్పులు చేసిన మంచి పాఠాలు నేర్చుకుంటారు.’’ అని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ జీ.చొక్కా లింగం అభిప్రాయపడ్డారు. ఇటీవల అడాగ్ కంపెనీల్లో జరిగిన కొన్ని కార్పోరేట్ పరిణామాలు ఇన్వెసర్లను దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సంపూర్ణ రుణ రహిత కంపెనీగా మారుతుందని కంపెనీ ఛైర్మన్ అనిల్ అంబానీ పేర్కోన్నారు. ఈ కంపెనీకి సుమారు రూ.6వేల పైగా అప్పు ఉంది. ఈ రుణాన్ని తీర్చేందుకు కంపెనీ ఆస్తులను విక్రయప్రకియను మొదలుపెట్టింది. పెన్నీస్టాకులకు దూరంగా ఉండండి: తక్కువ ధరల్లో లభ్యమయ్యే పెన్నీ స్టాకులకు దూరంగా ఉండటం మంచదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అడాగ్ షేర్లు మాత్రమే కాకుండా బిర్లా టైర్స్, ఆప్టో సర్కూ్యట్స్, అలోక్ ఇండస్ట్రీస్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, జేఎంటీ అటో, అల్కేమిస్ట్, సింటెక్స్ ప్లాస్టిక్స్, ఆంధ్రా సిమెంట్స్, ఎమ్కోతో సుమారు 178 పెన్నీ స్టాకులు మార్చి కనిష్టం నుంచి 100శాతం నుంచి 1700శాతం ర్యాలీ చేశాయి. గత 7-8 ఏళ్లలో 1,000 కి పైగా షేర్లు స్టాక్స్ మార్కెట్ నుంచి వైదొలిగాయి. వాటిలో ఎక్కువ భాగం పెన్నీ స్టాక్స్ కావడం విశేషం. గడచిన ఆరేళ్లలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పెన్సీ స్టాక్‌ల ద్వారా రూ.1.5 - రూ.2లక్షల కోట్లను నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్లో బలమైన లిక్విడిటీ ఉన్న కారణంగా చాలా పెన్నీ స్టాక్ పెరిగాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ఎలాంటి ఫండమెంట్లను పట్టించుకోకుండా తక్కువ ధరలో లభ్యమయ్యే షేర్లను కొనుగోలు చేస్తున్నాయి. వారిని రాబిన్‌హుడ్ ఇన్వెసర్లు అని పిలవచ్చు. అడాగ్‌తో సహా అంలాంటి కౌంటర్లలో కొనుగోలు జరపకపోవడం మంచింది.’’ అని సామ్కో సెక్యూరిటీస్ హెడ్ ఉమేష్ మెహతా తెలిపారు. -
అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వ్యాపారంలో వరుస నష్టాలు, రుణభారం వెరసి అనిల్ అంబానీ వరుసగా ఆస్తులు, కంపెనీలలో షేర్లను అమ్మకానికి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆడిటర్ల రూపంలో మరో షాక్ తగిలింది. రిలయన్న్ గ్రూపునకు చెందిన అనుబంధ కంపెనీలైన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు చెందిన ఆడిటర్లు రాజీనామా చేశారు. గత మూడు నెలలుగా చట్టబద్దమైన ఆడిటర్లుగా తప్పు కోవడం పెద్ద దెబ్బే. తాజాగా మరో రెండు కంపెనీల ఆడిటర్లు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు నెలల్లోనే రిలయన్స్ గ్రూప్‌లోని నాలుగు కంపెనీల ఆడిటర్లు వైదొలిగినట్లు అయింది. కంపెనీకి చట్టబద్ధమైన ఆడిటర్లలో ఒకరైన బీఎస్ఆర్ అండ్ కం 2019 ఆగస్ట్ 9వ తేదీ నుంచి వై దొలిగిందని రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ సమాచారంలో వెల్లడించాయి. ఈ మేరకు ఆడిటర్లు కంపెనీలకు ఒక లేఖ రాసినట్టు తెలిపాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 14వ తేదీన రిలయన్స్ ఇన్ఫ్రా ఆడిట్ నివేదికలో ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ పైన ఆందోళన వ్యక్తం చేసిందని, తమకు వివిధ అంశాలపై సరైన సమాచారం లభించలేదని కంపెనీ పేర్కొంది. కాగా ఒకవైపు అనిల్ అంబానీ సోదరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పట్టిందల్లా బంగారంలా దూసుకుపోతున్నారు. పెట్రో కెమికల్ బిజినెస్‌లో 20 శాతం విదేశీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దుబాయ్ కంపెనీసౌదీ అరామ్కో ద్వారా మొత్తం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తన కంపెనీని అప్పుల్లేని కంపెనీగా తీర్చదిద్దుతామని కంపెనీ ఏజీఎం సందర్బంగా ప్రతిష్టాత్మకంగా వెల్లడించారు. మరోవైపు అనిల్ అంబానీ మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నారు -
లీజుకు రిలయన్స్ ఇన్ఫ్రా కార్యాలయం
న్యూఢిల్లీ: రుణభారం తగ్గించుకునే దిశగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ఇన్ఫ్రా) మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముంబైలోని శాంటాక్రూజ్ ఈస్ట్‌లో ఉన్న రిలయన్స్ సెంటర్ ఆఫీస్ కార్యాలయాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ డీల్ ద్వారా వచ్చే నిధులను పూర్తిగా రుణాల చెల్లింపునకు మాత్రమే వినియోగించనున్నట్లు పేర్కొంది. ‘కార్యాలయాన్ని దీర్ఘకాలిక లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకుంటాం. సదరు ఆవరణ మాత్రం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజమాన్యంలోనే ఉంటుంది‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు కంపెనీ తెలియజేసింది. 2020 నాటికి రుణ రహిత సంస్థగా మారాలని నిర్దేశించుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం రిలయన్స్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులను గ్రూప్ కంపెనీలకు ముంబైలో ఉన్న వివిధ కార్యాలయాలకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాకు సుమారు రూ. 6,000 కోట్ల రుణభారం ఉంది. మరో గ్రూప్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు రూ, 57,500 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటిలో రూ. 7,000 కోట్ల మొత్తాన్ని సొంత గ్రూప్ కంపెనీలకే ఆర్‌కామ్ చెల్లించాల్సి ఉంది. బ్లాక్‌స్టోన్‌తో చర్చలు.. అధికారికంగా రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడించనప్పటికీ.. లీజు ప్రతిపాదనలకు సంబంధించి బ్లాక్‌స్టోన్ సహా పేరొందిన పలు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థతో కం పెనీ చర్చలు జరుపుతోందని సమాచారం. 15,514 చ.మీ. ప్లాట్‌లో నిర్మించిన రిలయన్స్ సెంటర్ ఆఫీస్ భవంతి విస్తీర్ణం సుమారు 6.95 లక్షల చ.అ.లు ఉంటుంది. 425 కార్లకు పార్కింగ్ స్పేస్ ఉంది. సోమవారం బీఎస్ఈలో ఆర్ఇన్ఫ్రా షేరు 4.4 శాతం క్షీణించి రూ. 53.05 వద్ద క్లోజయ్యింది. -
కుప్పకూలుతున్న అడాగ్ షేర్లు
సాక్షి, ముంబై: అనిల్అంబానీ నేతృత్వంలోని అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ గ్రూపు షేర్లు మరోసారి భారీగా నష్టపోతున్నాయి. గ్రూపులోని కీలకమైన రిలయన్స్ఇన్ఫ్రా 2018-19 క్యు4 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఏకంగా రూ.3,301కోట్ల నష్టాలను సంస్థ ప్రకటించింది. దీంతో సోమవారం రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇన్ఫ్రా 11శాతం కుప్పకూలింది. ఇతర సంస్థలు రిలయన్స్ క్యాపిటల్ షేరు 7శాతం, రిలయన్స్ పవర్ కౌంటర్ 3 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5శాతానిపైగా నష్టపోతున్నాయి. మరోవైపు బిజినెస్ నిర్వహణలో కంపెనీ సామర్థ్యంపై తాజాగా ఆడిటర్లు సందేహాల నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతేకాదు అనుబంధ సంస్థ ముంబై మెట్రో.. గ్రూప్‌లోని మరో కంపెనీ రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్, తదితర అనుబంధ సంస్థలపైనా ఆడిటర్లు ఆందోళన వెలిబుచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాన సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు నమోదు చేస్తున్నందున కంపెనీ గ్యారంటర్‌గా ఉన్న రుణాల విషయంలోనూ సందేహాలున్నట్లు ఆడిటర్లు పేర్కొన్నారు. -
ఎన్డీటీవీపై రిలయన్స్ ఇన్ఫ్రా కేసు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతరులు కలిసి తమకు వ్యతిరేకంగా రూ.10 వేల కోట్లకు పరువు నష్టం దావాను దాఖలు చేసినట్లు ఎన్డీటీవీ వార్తా సంస్థ తెలియజేసింది. అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇది దాఖలైందని, ఈ మేరకు అక్కడి నుంచి తమకు ఈ నెల 18న నోటీసులు అందాయని ఈ సంస్థ తెలిపింది. కంపెనీతోపాటు, ఎగ్జిక్యూటివ్ కో చైర్పర్సన్, మేనేజింగ్ ఎడిటర్లను బాధ్యులను చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని కోర్టులో ఎదుర్కొంటామని పేర్కొంది. ‘‘ప్రతీ వారం నిర్వహించే ‘ట్రూత్ వర్సెస్ హైప్ (వాస్తవం/కల్పితం)’ షోలో భాగంగా సెప్టెంబర్ 29న ప్రసారం చేసిన ‘ఐడియల్ పార్ట్నర్ ఇన్ రఫేల్ డీల్ (రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో సరైన భాగస్వామి)’ కథనానికి సంబంధించి ఈ వ్యాజ్యం దాఖలైనట్టు ఎన్డీటీవీ తెలిపింది. ఆరోపణలను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని, ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తామని సంస్థ తెలిపింది. ఈ వ్యాజ్యం ఈ నెల 26న విచారణకు రానుంది. -
అదానీ, రిలయన్స్ ఇన్ఫ్రా డీల్: షేర్ల జోరు
సాక్షి, ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన పవర్ బిజినెస్ విక్రయించేందుకు అదానీ ట్రాన్స్‌మిషన్‌తో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమీకృత ముంబై పవర్ బిజినెస్‌లో 100 శాతం వాటాను అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించి రిలయన్స్ ఇన్ఫ్రా గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం డీల్ విలువ రూ. 18,800 కోట్లుకాగా... ముంబైలో రిలయన్స్ ఇన్ఫ్రా నిర్వహిస్తున్న విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ బిజినెస్‌లు అదానీ ట్రాన్స్మిషన్కు బదిలీకానున్నాయి. ముంబై పవర్ బిజినెస్‌కు 30 లక్షల మంది కస్టమర్లున్నారు. 1892 మెగావాట్ల విద్యుత్ పంపిణీ చేపడుతోంది. 500 మెగావాట్ల బొగ్గు ఆధారిత ప్లాంటును కలిగి ఉంది. ఈ డీల్ ద్వారా తమకు దక్కే మొత్తాన్ని రిలయన్స్ ఇన్ఫ్రా తన అప్పులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇన్ ఫ్రా సీఈవో అనిల్ జలాన్ మాట్లాడుతూ ఒప్పందం ద్వారా అప్పుల తర్వాత సుమారు రూ .3,000 కోట్ల మిగులు వుంటుందని, ఈ నిధులను ఇతర నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి తమకు సహాయపడుతుందన్నారు. తద్వారా రూ. 10,000 కోట్ల ఆర్డర్ బుక్‌తో దేశంలో రెండో అతిపెద్ద నిర్మాణ సంస్థగా ఉన్న తమకు చౌకైన నిధులకు సులభ ప్రాప్యతను కలిగి ఉంటామని చెప్పారు. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీ కొనుగోల్లకు మొగ్గు చూపడంతో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 5 శాతం ఎగసింది. ఒక దశలో రూ. 545 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు గురువారం ఆల్‌టైం హైని తాకిన అదానీ ట్రాన్స్మిషన్ 8.5 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
రిలయన్స్ ఇన్ఫ్రాకు భారీ ఆర్డర్
సాక్షి, ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ నష్టాలతో సంక్షోభంలో పడ్డ అనిల్ అంబానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. వేల కోట్ల రూపాయల భారీ కంట్రాక్ట్ లభించిందన్న వార్తలతో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాల్టి(బుదవారం) ప్రతికూల మార్కెట్లో లాభాలను ఆర్జిస్తోంది. రిలయన్స్ ఇన్ఫ్రా బంగ్లాదేశ్ నుంచి రెండుప్రాజెక్టులను సాధించింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బంగ్లాదేశ్‌నుంచి రూ. 5 వేల కోట్ల కాంట్రాక్టులను పొందింది. ఢాకాలో మేగానాఘాట్ వద్ద 750 మెగావాట్ల ఎల్ఎన్జీ ఆధారిత కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు ఈపీసీ కాంట్రాక్ట్ లభించినట్లు రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. అలాగే కుతుబ్దియా ఐలాండ్ వద్ద ఎల్ఎన్జీ టెర్మినల్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సైతం ఆర్డర్ దక్కినట్లు తెలియజేసింది. 2019 కల్లా వీటిని పూర్తిచేయాల్సి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఆర్డర్ల విలువ రూ. 5,000 కోట్లని ఒక ప్రకటనలో తెలిపింది. 250 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల రెండు లిగ్నైట్ ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 3,675 కోట్ల ఇపిసి ఆర్డర్ తరువాత ఈ భారీ ఆర్డర్ సాధించామని రియలన్స్ ఇన్ఫ్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ గుప్తా పేర్కొన్నారు. -
రిలయన్స్ ఇన్ఫ్రా చేతికి పిపావవ్ డిఫెన్స్
- రూ. 2,082 కోట్ల మేర డీల్ విలువ - తొలుత 18 శాతం వాటాల కొనుగోలు - తర్వాత మరో 26% వాటాలకు ఓపెన్ ఆఫర్ - లావాదేవీ పూర్తయ్యాక రిలయన్స్ డిఫెన్స్‌గా పేరు మార్పు - చైర్మన్‌గా అనిల్ అంబానీ న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా దేశీ రక్షణ రంగంలో అతి పెద్ద డీల్‌కు తెర తీసింది. పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 2,082.3 కోట్ల మేర ఉండనుంది. ఒప్పందం కింద పిపావవ్ డిఫెన్స్‌లో రిలయన్స్ ఇన్ఫ్రా ఒక్కో షేరుకు రూ. 63 వెచ్చించి 18 శాతం వాటాలు కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం సుమారు రూ. 819 కోట్లు అవుతుంది. ఇక, ఆ తర్వాత షేరుకి రూ. 66 చొప్పున అదనంగా 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తుంది. దీనికి రూ. 1,263.3 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓపెన్ ఆఫర్‌కి స్పందన లేకపోయిన పక్షంలో ప్రమోటర్ల దగ్గర్నుంచే అదనంగా 7.1 శాతం వాటాలను కొనుగోలు చేస్తుంది. తద్వారా మొత్తం మీద 25.10 శాతం వాటాలు దక్కించుకోనుంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ డీల్ పూర్తి కానుంది. ప్రస్తుతం రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఉన్న పిపావవ్ డిఫెన్స్‌లో ప్రమోటర్లకు 44.50 శాతం వాటాలు ఉన్నాయి. ఇక మైనారిటీ వాటాదార్లుగా ప్రమోటర్లు.. లావాదేవీ పూర్తయిన తర్వాత పిపావవ్ డిఫెన్స్ ప్రస్తుత ప్రమోటర్లు.. మైనారిటీ వాటాదార్లుగా ఉంటారు. ప్రమోటర్లకు సంబంధించి కంపెనీ బోర్డులో ఇద్దరు నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉంటారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యాక సంస్థ పేరు రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌గా మారుతుంది. సంస్థ చైర్మన్‌గా అనిల్ అంబానీ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములు అయ్యేందుకు ఈ కొనుగోలు ఉపకరించగలదని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. దాదాపు పదేళ్ల క్రితం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తాజా పరిణామం దోహదపడగలదని పిపావవ్ డిఫెన్స్ వ్యవస్థాపక ప్రమోటర్, చైర్మన్ నిఖిల్ గాంధీ చెప్పారు. రోడ్లు, మెట్రో రైలు, సిమెంటు తదితర రంగాల్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాలు ఉన్నాయి. -
‘పవర్’ పోరు షురూ!
సాక్షి, ముంబై: ముందుగా హెచ్చరించినట్లుగానే దక్షిణ ముంబై పార్లమెంట్ సభ్యుడు సంజయ్ నిరుపమ్ కాందీవలిలోని రిలయన్స్ ఎనర్జీ కార్యాలయం ముందు సోమవారం ఆందోళనకు దిగారు. ఆయనకు ఎంపీ ప్రియాదత్ కూడా మద్దతు పలికారు. విద్యుత్ టారిఫ్‌ను తగ్గించకపోతే ఆందోళనకు దిగుతామని వారంరోజుల క్రితం నిరుపమ్ హెచ్చరించిన విషయం తెలి సిందే. తగ్గించేవరకు కార్యాలయం ముందునుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్న ఈ ఆందోళనలో నిరుపమ్ ప్రసంగిస్తూ... ‘విద్యుత్ టారిఫ్‌ను తగ్గిస్తూ రిలయన్స్ కంపెనీ ప్రక టన చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదు. మొండికేస్తే మా పార్టీ ఎంపీలు నిరవధిక నిరాహార దీక్షకు దిగుతార’ని హెచ్చరించారు. రిలయన్స్ కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీని ‘దొంగ’ అంటూ నినాదాలు చేశారు. గతంలోనే ఈ విషయమై సంజయ్ నిరుపమ్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు లేఖ రాశారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ చార్జీలను తగ్గించినప్పుడు ముంబై లోకూడా ఎందుకు తగ్గించకూడదని లేఖలో ప్రశ్నించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి కూడా నిరుపమ్ లేఖ రాశారు. టారిఫ్ తగ్గించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఇరువురి నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో నిరుపమ్ ఆందోళనబాట పట్టారు. ఫిక్స్డ్ చార్జీలు, ఆస్తుల క్రమబద్ధీకరణ పేరుతో వసూలు చేస్తున్న చార్జీల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఎంపీ ప్రియాద త్ మాట్లాడుతూ... ముంబై, శివారు ప్రాంతాలకు ఏకీకృత టారిఫ్ విధానముండాలన్నారు. టారిఫ్‌ను తగ్గించకపోతే ఆందోళన మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. తమ పార్టీ నేతలందరు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటారని, అంతవరకు పోకుండా ముందుగానే టారిఫ్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా నారాయణ్ రాణే నేతృత్వంలోని కాంగ్రెస్ మంత్రుల బృందం కూడా ఈ విషయంపై స్పందించింది. 10 నుంచి 20 శాతం టారిఫ్‌ను తగ్గించాలంటూ మంత్రుల బృందం డిమాండ్ చేసింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న పేదలకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయని, చార్జీలు తగ్గించాలని గత వారం కిందట శివసేన నేత అనిల్ పరబ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది వినియోగదారుల బిల్లులు తగ్గించాలని రిలయన్స్ ఎనర్జీ కంపెనీని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ధర్నా, ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే బాట కాంగ్రెస్ నాయకులు పట్టారు. ఆప్‌ను అడ్డుకునేందుకే..! ఢిల్లీలో ప్రారంభించినట్లుగానే ముంబైలో కూడా విద్యుత్ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ప్రారంభిస్తుందోనన్న భయంతోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ ఆందోళనకు దిగినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై కన్నేసిన ఆప్ పుణే, ముంబైలలో ఇప్పటికే పార్టీ కార్యకలాపాలను వేగం చేసింది. దీంతో ఆ పార్టీ కంటే ఓ అడుగు ముందేసి విద్యుత్ చార్జీలను తగ్గించిన ఘనత తమ పార్టీకే దక్కాలని కాంగ్రెస్ నేతలు ఈ వ్యూహం అమలు చేసినట్లుగా చెబుతున్నారు. అందులోభాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులే పోరాట ం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఆందోళన తర్వాత ఆప్ ఉద్యమాన్ని ప్రారంభించినా ఆ పార్టీకి కీర్తి దక్కకుండా చేయడమే కాంగ్రెస్ నేతల వ్యూహంగా భావిస్తున్నారు. ఎంఆర్‌ఈసీ చట్టం-2003 ప్రకారమే.. రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్‌ను మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ చట్టం-2003 ప్రకారమే వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటించింది. టారిఫ్‌పై నిర్ణయాన్ని ఎంఆర్ఈసీకే వదిలేయాలని సుప్రీం కోర్టు కూడా ప్రకటించిందని, ఈ విషయంలో దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోలేవని ఆ కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.