
అరుంధతీ భట్టాచార్య పదవీ కాలం పొడిగింపు!
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె మూడేళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. భారతీయ మహిళా బ్యాంకుతోపాటు ఐదు అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతున్నందున భట్టాచార్యను కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్యాంకు బోర్డు బ్యూరో నుంచి ఈ విషయమై అభిప్రాయాలను స్వీకరించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే కొన్ని రోజుల్లోనే భట్టాచార్య కొనసాగింపునకు సంబంధించి ఆదేశాలు వెలువడనున్నట్టు సమాచారం.
అక్టోబర్ చివరి నుంచి విలీన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే.