భారత్‌లో అత్యంత శక్తివంతమైన మహిళా వాణిజ్యవేత్తగా ఎస్‌బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యను ఫోర్బ్స్ మేగజీన్ మరోసారి ఎంపిక చేసింది. ప్రతియేటా ప్రపంచంలోని వివిద కార్పొరేట్ స్థాయి కంపెనీలకు చెందిన మేటి సీఈవోలను, ఎండీలను గుర్తించే పోర్బ్స్ మేగజిన్ తాజా జాబితాను విడుదల చేసింది. 50 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో ఆరుగురు భారతీమణులకు చోటుదక్కించుకున్నారు.
ఈ ఆరుగురిలో తొలిస్థానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుందతి భట్టాచార్య దక్కించుకోగా, ఆ తరువాత వరుసగా ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్/ శ్రీరామ్ క్యాపిటల్ ఎండీ నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ ఫౌండర్ చైర్మన్ ఎండీ కిరణ్ మజుందార్, యాక్సిస్ బ్యాంక్ సీఈవో ఎండీ శిఖా శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఉషా సంగ్వాన్ ఉన్నారు. గతంలో కూడా అరుంధతీ భట్టాచార్య ఇందులో ప్రధమ స్థానం దక్కించుకున్నారు.