Chanda Kochchar
-
ఐసీఐసీఐ స్కాంలో కీలక పరిణామం: ఆ ముగ్గురికీ భారీ షాక్!
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కాం కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కుంభకోణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చందా కొచ్చర్ తోపాటు, ఆమె భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లపై చార్జిషీట్ దాఖలైంది. ముంబై సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. రూ.3,250 కోట్ల రుణం మోసం కేసులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు శనివారం తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ 2009 , 2011 మధ్య వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన ఆరు కంపెనీలకు రూ. 1,875 కోట్ల రూపాయల టర్మ్ రుణాన్ని మంజూరులో అవకతవకలు జరిగాయని సీబీఐ ప్రధాన ఆరోపణ. క్విడ్ ప్రో కింద వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరైనట్టు, ఇందులో ధూత్ అంతిమ లబ్ధిదారుడని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకుగాను దీపక్ కొచర్‌కు చెందిన నూపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్‌కు రూ. 64 కోట్లు, దక్షిణ ముంబైలోని ఫ్లాట్‌కు 2016లో రూ. 11 లక్షలు (విలువ రూ. 5.25 కోట్లు) లంచంగా ముట్టాయని సీబీఐ పేర్కొంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో చందాకొచ్చర్‌ను ఐసీఐసీఐ బ్యాంకు తొలగించింది. ఈ కేసులో సీబీఐ 2019లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019లో, చందా కొచ్చర్ బ్యాంక్ ఎండీగా ఉన్నప్పుడు కంపెనీలకు ఐసీఐసీఐ మంజూరు చేసిన రూ.1,800 కోట్లకు పైగా రుణానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. 2022 డిసెంబర్లో కొచ్చర్ దంపతులను, వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. అయితే, అరెస్టులు చట్టానికి లోబడి లేవని పేర్కొంటూ జనవరి 9న బాంబే హైకోర్టు కొచ్చర్లకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ధూత్‌కు బెయిల్ కూడా లభించిన సంగతి తెలిసిందే. -
Chanda Kochhar: చందా కొచ్చర్‌కు భారీ ఊరట
ముంబై: వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌కు భారీ ఊరట లభించింది. చందాతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సైతం రిలీజ్ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ చట్టానికి లోబడి జరగలేదని చందా కొచ్చర్ తరపు న్యాయవాదులు వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. వీడియోకాన్ సంస్థకు అక్రమరీతిలో రుణాలు మంజూరీ చేసిన కేసులో చందా కొచ్చార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చందా కొచ్చారోతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చార్‌ను డిసెంబర్ 23వ తేదీన సీబీఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూపు సంస్థకు 2012లో సుమారు రూ. 3,250 కోట్ల మొత్తాన్ని అక్రమరీతిలో లోన్ ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.కుటుంబ లబ్ధి కోసం కొచ్చార్ ఫ్యామిలీ చీటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియోకాన్ రుణాన్ని ఎన్పీఏగా భావించి, దాన్ని బ్యాంక్ ఫ్రాడ్‌గా ప్రకటించారు. బాంబే హైకోర్టులో జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చావన్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును ఇచ్చింది. క్రిమినల్ కోడ్‌లోని 41ఏ సెక్షన్‌ను ఉల్లంఘించి ఆ ఇద్దరి అరెస్టు చేసినట్లు కోర్టు తెలిపింది. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఇద్దరినీ.. లక్ష రూపాయాల బెయిల్ బాండ్‌పై విడిచిపెట్టనున్నారు. కొచ్చర్ల పేరుతో పాటు వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ పేరును సైతం సీబీఐ ఇందులో చేర్చింది. క్విడ్ ప్రోకోలో భాగంగా ఇదంతా జరిగిందని అభియోగాలు నమోదు చేసింది. -
ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్‌కు ఊరట
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ కొచర్‌కు భారీ ఊరట లభించింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్‌కు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలతో గత ఏడాది సెప్టెంబర్‌లో దీపక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే జైల్లో ఉండగానే కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న అర్జీని ముంబై ప్రత్యేక కోర్టు గతంలో పలుమార్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ స్కాం : చందా కొచర్‌కు ఊరట
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌కు ఊరట లభించింది. ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణా కుంభకోణంకేసులో ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు చందా కొచర్‌కు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆమెకు 5 లక్షల రూపాయల పూచీకత్తుతో కొచ్చర్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచర్,ఆమె భర్త దీపక్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఐసీఐసీఐ స్కాంలో చందా కొచర్ వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్ దంపతులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
చందా కొచర్‌కు మరోసారి నిరాశ
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసిన చందాకొచర్ భర్త దీపక్ కొచ్చర్ కు ఊరట కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ముంబైలోని తలోజా జైలులో ఉండగానే ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే కోలుకున్న తరువాత ఆందోళనలో ఉన్న కొచర్‌ను మరింత మెరుగైన వైద్యంకోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ పీ రాజవైద్యా తోసిపుచ్చారు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ క్విడ్ ప్రో కో కింద వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1875 కోట్ల రూపాయల రుణాలను అక్రమ మంజూరు ఆరోపణలు, వారి వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
19 వరకూ ఈడీ కస్టడీలో దీపక్ కొచ్చర్
ముంబై: అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద సోమవారం అరెస్టయిన దీపక్ కొచ్చర్ సెప్టెంబర్ 19వ తేదీ వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంటారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు జడ్జి మిలిద్ వీ కుర్తాదికర్ కస్టడీ ఆదేశాలు ఇచ్చారు. దీపక్ కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ భర్త అయిన సంగతి తెలిసిందే. చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్‌కు సీఈఓగా ఉన్న సమయంలో, వీడియోకాన్ సంస్థకు రుణాలు మంజూరు చేయడం ద్వారా తన భర్త సంస్థకు అక్రమ లబ్ది చేకూర్చారని, తద్వారా చందా కొచ్చర్ దంపతులు లాభపడ్డారన్నది దర్యాప్తు సంస్థ వాదన. ఈ ఏడాది మొదట్లో వీరికి చెందిన రూ.78 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. దీపక్ కొచ్చర్‌కు చెందిన కొన్ని కంపెనీలు, వాటాలు కూడా జప్తు అయిన వాటిలో ఉన్నాయి. వీడియోకాన్ గ్రూప్‌నకు బ్యాంక్ రుణాల విషయంలో కొచ్చర్ దంపతులను ఈడీ పూర్తి స్థాయిలో ప్రశ్నించింది. అయితే కొన్ని లావాదేవీల గురించి వివరించలేకపోవడంతో దీపక్ కొచ్చర్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ఏమి చెబుతోంది? రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టు ముందు ఉంచిన ఈడీ, కేసులో మరింత ప్రశ్నించడానికి దీపక్ కొచ్చర్ కస్టడీని కోరుతున్నట్లు తెలిపింది. ఈడీ కోర్టుకు తెలిపిన సమాచారం ప్రకారం, 2009 సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇన్టర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఈఎల్)కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.300 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ రుణ మంజూరు సమయంలో బ్యాంక్ మంజూరు కమిటీకి దీపక్ కొచ్చర్ భార్య చందా కొచ్చర్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ రుణం మంజూరు అయిన కేవలం ఒక్క రోజు తర్వాత రూ.64 కోట్లు వీఐఈఎల్ నుంచి నుపవర్ రిన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఆర్పీఎల్)కు బదిలీ అయ్యాయి. ఈ కంపెనీ దీపక్ కొచర్చర్కు చెందినది. దీపక్ కొచ్చర్ విచారణకు సహకరించడం లేదు. రూ.64 కోట్ల బదలాయింపు విషయమై ఆయనను మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉంది. అయితే ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలను దీపక్ కొచ్చర్ న్యాయవాది విజయ్ అగర్వాల్ తోసిపుచ్చారు. తన క్లైయింట్ 12 సార్లు ఈడీ విచారణకు హాజరై, అడిగిన పత్రాలన్నింటినీ సమర్పించినట్లు తెలిపారు. అయితే ఇరువురు వాదనలు ఉన్న జడ్జి, ‘‘దీపక్ కొచ్చర్ కస్డోడియన్ ఇంటరాగేషన్ తప్పనిసరి అని భావిస్తున్నట్లు’’ పేర్కొన్నారు. చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ దూత్ తదితరులపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ అధ్యయనం అనంతరం ఈడీ తన రిపోర్టును జడ్జి ముందు ఉంచింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు రుణ మంజూరీల ద్వారా కొచ్చర్ దంపతులు ప్రయోజనం పొందారన్నది ఆరోపణ -
ఈడీ కస్టడీలో దీపక్ కొచర్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణ కుంభకోణంలో కేసులో బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది.మనీలాండరింగ్ వ్యవహారాల కేసులను విచారించే ముంబై ప్రత్యేక కోర్టు ఇందుకు ఈడీకి అనుమతినిచ్చింది. (ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్ భర్త అరెస్టు) మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద దీపక్ కొచర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం అరెస్టు చేసింది.ఈ కేసులో సేకరించిన కొన్ని తాజా సాక్ష్యాల గురించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు అతన్ని కస్టోడియల్ విచారణను కోరినట్టు ఈడీ అధికారులు తెలిపారు. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1,875 కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా మంజూరు చేసిన ఆరోపణలతో ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. -
చందా కొచర్‌కు మరిన్ని చిక్కులు
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణంలో ఐసీఐసీఐ బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈస్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎండీ చందా కొచర్ నుంచి తామిచ్చిన బోనస్‌ను రికవరీ చేయాలని కోరింది. అలాగే తన తొలగింపు అక్రమమంటూ చందా కొచర్ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. తన తొలగింపు ద్వారా ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొనడం, బ్యాంకు విలువైన స్టాక్ ఆప్షన్‌ను పొందేందుకు, తప్పు దారి పట్టించే ప్రయత్నమని ఐసీఐసీఐ బ్యాంకు తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మేరకు జనవరి 10 న దావా వేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా పడింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా ఆమెను తొలగించిన తరువాత ఏప్రిల్ 2006- మార్చి 2018 వరకు ఆమెకిచ్చిన బోనస్ క్లాబ్యాక్ చేయాలని కోరుతోంది. (క్లాబ్యాక్ అంటే ఏదైనా దుష్ప్రవర్తన లేదా క్షీణించిన లాభాల విషయంలో ఒక ఉద్యోగి నుండి బోనస్ తదితర ప్రోత్సాహక-ఆధారిత వేతనాన్ని కంపెనీ తిరిగి తీసుకోవచ్చు) బ్యాంకు వ్యాపార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి బ్యాంకుతోపాటు వాటాదారులందరికీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించిందనీ, బ్యాంకుకు ప్రతిష్టకు తీరని నష్టం కలిగిందని ఆరోపించింది. తన భర్త దీపక్ కొచర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే వీడియోకాన్ గ్రూపునకు రూ .2,250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ పాత్ర ఉందని బ్యాంకు ఆరోపించింది. కాగా చందా కొచర్ తన పదవీకాంలో వీడియోకాన్‌కు క్విడ్ ప్రో కో ద్వారా చట్టవిరుద్ధంగా రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. అయితే మొదట్లో చందా కొచర్‌కు బాసటగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు జస్టిస్ (రిటైర్డ్) బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2019 జనవరిలో ఏర్పాటు చేసింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఆమెను పదవినుంచి తొలగించడంతోపాటు ఏప్రిల్ 2009- మార్చి 2018 మధ్య ఆమెకు చెల్లించిన అన్ని బోనస్, స్టాక్ ఆప్షన్లను తిరిగి తీసుకోవాలని బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు తన తొలగింపు చట్టవిరుద్ధమని పేర్కొంటూ బ్యాంకు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ (నవంబర్ 30, 2019న)చందా కొచర్ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
చందా కొచర్ ఖరీదైన ఫ్లాట్ గోవిందా!
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వీడియోకాన్ రుణాల జారీ విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్య తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) చందాకొచర్‌కు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఎటాచ్ చేసింది. ఇందులో ముంబైలోని ఖరీదైన ఆమె ఫ్లాట్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఐసీఐసీఐ- వీడియోకాన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్ తనపదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. వీడియోకాన్ గ్రూపునకు సుమారు 3,250 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అయితే తనను పదవినుంచి తొలగించడంపై చందా కొచర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. -
చందా కొచర్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల రుణాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జూన్ 10న ఉదయం 10.30 గం.లకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలో చందా కొచ్చర్ కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే అయిదు సార్లు విచారణ చేసింది. 2009–2011 మధ్య కాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో చందా కొచర్ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె చేసిన మేలుకు ప్రతిగా వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్.. చందా కొచర్ భర్తకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్లోకి కొంత పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూప్ తీసుకున్న రుణాలు మొండిబాకీలుగా మారడం గమనార్హం. మొత్తం మీద ఇదంతా చందా కొచర్ కుటుంబం, ధూత్లకు లబ్ధి చేకూర్చేలా క్విడ్ ప్రో కో వ్యవహారంగా జరిగిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. -
ఈడీ ఎదుట హాజరైన చందాకొచ్చర్
-
ఈడీ ముందుకు చందా కొచర్
సాక్షి, న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో మాజీ ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు చందా కొచర్‌ను ప్రశ్నిస్తున్నారు. మే 5న ఈడీ విచారణకు డుమ్మా కొట్టడంతో చందా కొచర్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్‌కు కూడా దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. కాగా చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన కంపెనీకి ప్రయోజనం చేకూర్చేందుకుగాను వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై బ్యాంకు అంతర్గత విచారణ అనంతరం బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులనుంచి తొలగిస్తూ ఐసీఐసీఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఇతర బెనిఫిట్ల చెల్లింపులను నిరాకరించడంతోపాటు, గతంలో చెల్లించిన వాటిని తిరిగి బ్యాంకుకు జమ చేయాలని కూడా బోర్డు ఆదేశించింది. -
చందాకొచర్ పాత్రపై ఆధారాలున్నాయి
సాక్షి,ముంబై : ఐసీఐసీఐ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచర్‌కు మరోసారి ఈడీ షాకిచ్చింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం కీలక ప్రకటన చేసింది. వరుసగా నాలుగవరోజు కూడా విచారించిన ఈడీ రుణాల కేటాయింపులో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డా రనేందుకు తమ వద్ద సాక్ష్యాలు న్నాయని పేర్కొంది. వీడియోకాన్ గ్రూప్‌నకు1875 కోట్ల రుణాలను మంజూరులో చందా కొచర్ అవకవతలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రశ్నిస్తున్న ఈడీ వరుసగా సోమవారం కూడా ప్రశ్నల పరంపరను కొనసాగించింది. వీడియోకాన్ నుండి షెల్ కంపెనీల క్లస్టర్ ద్వారా రూ .64 కోట్లు దీపక్ కొచర్ కంపెనీ కంపెనీకి రూ .64 కోట్లు అందాయని ఈడీ వర్గాలు తెలిపాయి. అదే సంవత్సరంలో ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ నుంచి రూ. 325 కోట్లు అందాయి. దీపక్ కొచర్ భార్య ఐసీఐసీఐ బ్యాంకునకు సీఎండీగా ఉన్న కాలంలోనే ఈ పరిణామాలు జరగడం అనుమానాలకు తావిచ్చిందనీ, దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామని తెలిపాయి. రుణాల మంజూరు విషయంలో చందా కొచర్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ ఐసీఐసీఐను మోసగించడం, క్రిమినల్ కుట్ర ఆరోపణల పై కేసు నమోదైన నేపథ్యంలో దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద చందా కొచర్‌తో పాటు వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ నివాసాల్లో మార్చి 1వ తేదీన తొలిసారిగా సోదాలు సోదాలు నిర్వహించిన కొన్ని వివరాలను ఆరా తీసింది. అనంతరం విచారణకు హాజరుకావల్సిందిగా చందాకొచర్, భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ మేనేజింగ్ డైరక్టర్ వేణుగోపాల్ ధూత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మూడ రోజైన ఆదివారం నూపవర్ రెన్యువబుల్స్‌లో మారిషస్ చెందిన ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ పెట్టుబడులకు సంబంధించి ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రుయాయా అల్లుడు , మాటిక్స్ గ్రూప్ చైర్మన్ నిషాన్ కనోడియాను కూడా ఈడీ విచారింది. కాగా 2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3250కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు క్విడ్‌ప్రోకో ప్రాతిపదికన సాయం చేసినట్లు చందాకొచర్‌పై ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఇప్పటికే కేసునమోదు చేసింది. అటు స్వతంత్ర దర్యాప్తును నివేదికను పూర్తిగా ఆమోదించిన ఐసీఐసీఐ బోర్డుకూడా ఆమెను పదవినుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చందా కొచర్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసు
సాక్షి, ముంబై: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీంఎడీ చందా కొచర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఐసీఐసీఐ- వీడియోకాన్ రుణ వివాదంలో చందా కొచర్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసు(ఎల్వోసీ) జారీ చేసింది. ఎకానమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం చందా కొచర్‌తోపాటు ఆమె భర్తదీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా సీబీఊ అధికారులు ఎల్వోసీ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పారిపోనున్నా రనేఅంచనాల నేపథ్యంలో సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ మేరకు సీబీఐ ఇమిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేసింది. అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా వీరు విమానాశ్రయాలను దాటిపోరాదని స్పష్టం చేసింది. కాగా 2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ. 3,250 కోట్ల రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. దీన్ని అప్పటివరకూ ఆమెను సమర్ధిస్తూ వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు కూడా పూర్తిగా ఆమోదించింది. అంతేకాదు చందా కొచర్ ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ, నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. అలాగే ఇంక్రిమెంట్లు, బోనస్‌లు, వైద్య చికిత్స పరమైన ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్స్ మొదలైనవి రద్దవుతాయని ప్రకటించింది. మరోవైపు ఈ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ఎండీ వేణుగోపాల్ ధూత్ తదితరులపై క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
చందాకొచర్ నుంచి రూ.9 కోట్లు వెనక్కి..!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాల జారీలో కొచర్ బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో, కొచర్‌ను తొలగించినట్టేనని, ఆమెకు గతంలో ఇచ్చిన బోనస్‌లు, పెండింగ్‌లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం రద్దు చేస్తామని బ్యాంకు బుధవారమే ప్రకటించింది. బోనస్‌లతోపాటు అన్‌ఎక్సర్‌సైజ్డ్ స్టాక్ ఆప్షన్లను కూడా వదులుకోవాల్సి ఉంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2009 మే నెలలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా నియమితులైన కొచర్, తనపై ఆరోపణల కారణంగా గతేడాది పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్లకు సంబంధించి కొచర్‌కు ఇవ్వదలిచిన పనితీరు ఆధారిత బోనస్‌లకు ఆర్బీఐ ఆమోదం తెలియజేయలేదని, దీంతో ఈ బోనస్‌లను కొచర్‌కు ఇచ్చినట్టు పరిగణించబోమని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, కొచర్‌కు ఇప్పటిదాకా బ్యాంకు 94 లక్షల షేర్లను(స్టాక్ ఆప్షన్స్) బ్యాంకు మంజూరు చేసింది. వీటిలో ఎన్ని ఆమె వినియోగించుకున్నారనే సమాచారం లేదు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చందాకొచర్‌కు ముట్టిన ఆర్థిక ప్రయోజనాలు రూ.340 కోట్ల మేర ఉంటాయని బ్యాంకు వర్గాల సమాచారం. -
ఐసీఐసీఐ-వీడియోకాన్ కేసు : సీబీఐ అధికారిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ రుణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి బదిలీ అయ్యారు. ఈనెల 22న చందా కొచర్ బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా మరుసటి రోజే ఈ కేసును పర్యవేక్షిస్తున్న సీబీఐలో బ్యాంకింగ్, సెక్యూరిటీ ఫ్రాడ్ విభాగానికి చెందిన ఎస్పీ సుధాంశు ధర్ మిశ్రాను జార్ఖండ్‌కు చెందిన సీబీఐ ఆర్థిక నేరాల బ్రాంచ్‌కు బదిలీ చేయడం గమనార్హం. కాగా చందా కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్‌గా ఉన్న సమయంలో వీడియోకాన్ గ్రూపునకు రూ 1875 కోట్ల విలువైన ఆరు రుణాలను మంజూరు చేయడంలో అవినీతి, మోసం జరిగిందని కొచర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్‌పై గురువారం సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీడియాకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో కొచర్ దంపతులు క్విడ్‌ప్రోకోకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. వీడియోకాన్‌కు రుణాలు మంజూరైన తర్వాత ఇదే గ్రూప్ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో పెట్టుబడులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని దర్యాప్తు సంస్ధ ఆరోపిస్తోంది. -
చందా కొచర్ షాకింగ్ నిర్ణయం
ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ పదవికి చందా కొచర్ హఠాత్తుగా రాజీనామా చేశారు. వీడియోకాన్ రుణ వివాద కేసులో స్వతంత్ర విచారణ జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఆమె తన రాజీనామా లేఖను బ్యాంక్ మేనేజ్మెంట్కు పంపించారు. ఆమె అభ్యర్థనను బ్యాంక్ సైతం అంగీకరించింది. వీడియోకాన్ రుణాల కేసుల్లో చందా కొచర్‌పై తీవ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ నుంచి రూ.3250 కోట్ల భారీ రుణాన్ని పొందిన వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్.. చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యువబుల్స్ కంపెనీకి అనుచిత లబ్థి చేకూరేలా వ్యవహరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కంపెనీకి భారీ ఎత్తున రుణాన్ని మంజూరు చేసిన దానికి ప్రతిగా.. చందాకొచర్ భర్త కంపెనీలో రూ.64 కోట్ల మొత్తాన్ని ధూత్ పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తోంది. దీన్ని క్విడ్ ప్రోగా సెబీ సైతం అభివర్ణిస్తోంది. ఈ ఉదంతంపై బోర్డు సైతం స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ విచారణ జరిగేంత వరకు ఆమెకు సెలవులు కూడా మంజూరు చేసింది. మరోవైపు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో అకస్మాత్తుగా చందా కొచరే ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చందా కొచర్ స్థానంలో సందీప్ భక్షిని సీఈవో, ఎండీగా ఐసీఐసీఐ బ్యాంక్ నియమించింది. ఆయన ఐదేళ్ల పాటు అంటే 2023 అక్టోబర్ 3 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ కొనసాగనున్నట్టు పేర్కొంది. అయితే కొచర్‌పై జరుగుతున్న ఈ విచారణకు ఈ రాజీనామా ప్రభావం చూపదని బ్యాంక్ పేర్కొంది. 1984లో కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో చేరారు. మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన కొచర్, సీఈవో స్థాయికి ఎదిగారు. ఐసీఐసీఐ బ్యాంక్ అంటే అందరికి తొలుత గుర్తొచేది చందా కొచర్ పేరే. ప్రైవేట్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆమె అగ్రస్థానంలో నిలబెట్టారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ స్టాక్ 5.23 శాతం పెరగడం విశేషం. -
ఐసీఐసీఐ బ్యాంక్ : తెరపైకి వచ్చిన మరో వివాదం
ముంబై : వీడియోకాన్ రుణ కేసుతో ఇప్పటికే తీవ్ర చిక్కుల్లో పడిన ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ మరో వివాదంలో కూరుకుపోతోంది. వీడియోకాన్ రుణ కేసు వివాదంతో ఈ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా రుణాల రైటాఫ్ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజ్మెంట్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.5000 కోట్ల నుంచి రూ.5600 కోట్ల వరకు అనుమానస్పద కార్పొరేట్ రుణాలను రైటాఫ్ చేసినట్టు వెల్లడైంది. టెక్నికల్‌గా ఈ రైటాఫ్‌లు, అకౌంటింగ్ పాలసీని మారడం వల్లనే సాధ్యపడుతుందని మింట్ రిపోర్టు చేసింది. రుణాలను రైటాఫ్ చేసేందుకు అకౌంటింగ్ పాలసీని మారుస్తూ కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చేందుకు బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని, అయితే ఆ విషయాన్ని బ్యాంక్ వాటాదారులకు, ప్రజలకు తెలుపలేదని మింట్ రిపోర్టు వెల్లడించింది. ఇది అకౌంటింగ్ స్టాండర్డ్(ఏఎస్) నిబంధనలకు తూట్లు పొడిచినట్టే అవుతుందని తెలిసింది. వీడియోకాన్ రుణ వివాద కేసులో సీఈవో చందా కొచర్‌పై జరుగుతున్న విచారణ నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఈవోపై విచారణతో పాటు బ్యాంక్ అంతకముందు జరిపిన డీలింగ్స్‌ను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ అకౌంటింగ్ పాలసీ మార్పు విషయం వెలుగులోకి వచ్చింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిల రేషియోను తక్కువగా చూపించేందుకు బ్యాంకు కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చిందని ఆ న్యూస్‌పేపర్ వివరించింది. 2017 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు 7.89 శాతంగా ఉన్నాయి. ఒకవేళ కొత్త అకౌంటింగ్ పాలసీ తీసుకురాకపోతే, ఆ ఎన్పీఏలు 8.5 శాతానికి పైన ఉండేవని పేర్కొంది. అయితే ఏ లిస్టెడ్ కంపెనీ అయినా.. బ్యాంక్ అయినా.. తన అకౌంటింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్(ఏఎస్) నిబంధనలను ఉల్లంఘించకుండా.. కచ్చితంగా అనుసరించాల్సి ఉంటుందని ఓ సీనియర్ రెగ్యులేటరీ అధికారి చెప్పారు. అకౌంటింగ్ పాలసీలో ఏదైనా మార్పులు చేపట్టాల్సి వస్తే, కచ్చితంగా ప్రజలకు, వాటాదారులకు ఈ నిర్ణయాన్ని తెలుపాల్సి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలన్నా, డిస్‌ఇన్వెస్టింగ్ చేయాలన్నా ప్రజలకు, వాటాదారులకు తెలుపాల్సిన బాధ్యత బ్యాంక్ బోర్డుపై ఉందన్నారు. కానీ ఐసీఐసీఐ బ్యాంక్ 2017 ఏప్రిల్ 7న ఆమోదించిన కొత్త అకౌంటింగ్ పాలసీపై ఎవరికి తెలుపలేదని వెల్లడించారు. అయితే అకౌంటింగ్ పాలసీ మార్చిన విషయాన్ని తెలుపకుండా.. చందా కొచ్చర్ కేవలం రైటాఫ్ విషయాన్ని మాత్రమే 2017 ఏప్రిల్ 7న జరిగిన బోర్డు మీటింగ్ నోట్లో పేర్కొన్నారు. -
తొలిసారి : ఐసీఐసీఐ బ్యాంక్‌కి భారీ నష్టాలు
ముంబై : వీడియోకాన్ రుణ వివాదం... ఏకంగా బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌పైనే పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు... ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. తాజాగా తొలి క్వార్టర్ ఫలితాల్లో కూడా ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఏకంగా బ్యాంక్ రూ.119.55 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. కనీసం ఏ మాత్రం లాభాలు లేకుండా.. నష్టాల్లో కూరుకుపోవడం, బ్యాంక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి ఇదే మొదటిసారి. 1998లో ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. గతేడాది ఇదే క్వార్టర్లో బ్యాంక్ లాభాలు రూ.2,049 కోట్లగా ఉన్నాయి. బ్యాంక్ ప్రొవిజన్లు ఏడాది ఏడాదికి రెండింతలు పైగా పెరిగాయి. క్వార్టర్ రివ్యూలో ప్రొవిజన్లు రూ.128.86 శాతం పెరిగి రూ.5,971 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. క్వార్టర్ క్వార్టర్‌కు మాత్రం ఈ ప్రొవిజన్లు 10 శాతం తగ్గాయి. అయితే బ్యాంక్ కేవలం లాభాలను మాత్రమే పోగొట్టుకుంటుందని, లాభాలను 31 శాతం తగ్గించుకుని రూ.1422 కోట్ల నికర లాభాలను నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. వీరి అంచనాలన్నింటిన్నీ ఐసీఐసీఐ బ్యాంక్ తలకిందులు చేసింది. ఏకంగా నష్టాలనే నమోదు చేసింది. అది పది, పదిహేను కోట్లు కాకుండా.. ఏకంగా రూ.120 కోట్ల మేర నికర నష్టాలను బ్యాంక్ ప్రకటించింది. అయితే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు తగ్గడంతో, ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. 2018 మార్చితో ముగిసిన క్వార్టర్లో బ్యాంక్ ఎన్పీఏలు 8.84 శాతం నుంచి 8.81 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 4.77 శాతం నుంచి 4.19 శాతానికి పడిపోయాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయాలు ఏడాది ఏడాదికి 9.16 శాతం పెరిగి రూ.6,102 కోట్లు పెరిగినట్టు తెలిసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఇవి రూ.5,590 కోట్లగా ఉన్నాయి. కాగ, సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ లేకుండా.... ప్రకటించిన తొలి ఫలితాలు ఇవి. ప్రస్తుతం ఆమె వీడియోకాన్ రుణ వివాదం వల్ల, బ్యాంక్ స్వతంత్ర విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సెలవులో ఉన్నారు. బ్యాంక్ కొత్త సీఓఓగా సందీప్ భక్షిని నియమించారు. -
ఐసీఐసీఐ వివాదంపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు రుణాల వివాదంపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల (ఎంసీఏ) శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివాదాస్పద న్యూపవర్ రెన్యూవబుల్స్‌తో పాటు సంబంధిత మరో అయిదు కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పి.పి.చౌదరి తెలిపారు. కంపెనీల చట్టం సెక్షన్ 206 (5) కింద ఐసీఐసీఐ బ్యాంకు రుణ వివాదంతో ముడిపడి ఉన్న ఆరు కంపెనీల తనిఖీలకు ఏప్రిల్ 23న ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎంసీఏ పరిధిలోని రీజనల్ డైరెక్టర్ (పశ్చిమ రీజియన్) వీటిని నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. సెక్షన్ 206 కింద అకౌంటు పుస్తకాల తనిఖీలు, ఎంక్వైరీలు, కీలక వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేసే ఇన్స్పెక్టర్కు అధికారాలు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు.. ఆర్బీఐ పరిధిలో ఉంటుంది కనుక తమ శాఖ ఆ బ్యాంకు వ్యవహారాలేమీ పరిశీలించడం లేదంటూ ఎంసీఏ సీనియర్ అధికారి ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన కుటుంబసభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ .. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ లావాదేవీకి ప్రతిగా చందా కొచర్ భర్త దీపక్ కొచర్ సంస్థలో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్, సీబీఐ, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే దీనిపై విచారణ జరుపుతున్నాయి. కొచర్‌తో పాటు బ్యాంకుకు కూడా సెబీ షోకాజ్ నోటీసులు పంపింది. ఐసీఐసీఐ బ్యాంకు .. అమెరికాలో కూడా లిస్టయి ఉన్నందున అక్కడి సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ కమిషన్ కూడా ఈ వివాదంపై దృష్టి సారించింది. -
చందా కొచర్: మరో భారీ కుంభకోణం
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ వివాదం ఉచ్చు బ్యాంకు సీఈఓ చందా కొచర్ చుట్టూ మరింత దృఢంగా బిగుస్తూ వుండగానే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ రుణ వివాదాన్ని వెలికి తీసిన అరవింద్ గుప్తానే చందా కొచర్ దంపతులపై మరోసారి తీవ్రమైన ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఈ మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ రాశారు. మారిషస్ కంపెనీల ద్వారా భారీగా చందా కొచర్ భర్త దీపక్ కొచర్ లబ్ది పొందినట్లు ఆరోపించారు. ఇందులో ఎస్సార్ గ్రూపు రుయా బ్రదర్స్ కీలక పాత్ర పోషించారనీ, తద్వారా సుమారు రూ. 453 కోట్లు దీపక్ కొచర్ కంపెనీ నూ పవర్ గ్రూప్‌నకు మళ్ళినట్లు ఆయన ఆరోపించారు. మొత్తం కంపెనీ రుణం 102 కోట్ల డాలర్లు కాగా... ఇందులో 25 శాతం పైగా రుణాలు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని అరవింద్ గుప్తా ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకే 35 కోట్ల డాలర్ల రుణం ఇచ్చిందన్నారు. ఈ లావాదేవీలు అన్నింటిపైనా దర్యాప్తు చేయాలనీ, ఈ నిధులు ఎలా బదిలీ అయ్యాయో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల పత్రాలను మే 11న ప్రధాని సహా, సంబంధిత మంత్రిత్వ శాఖ, రెగ్యులేటరీ సంస్థలకు పంపారు. రుయా సోదరుల్లో ఒకరైన రవి రుయా కుమార్తె స్మితి రుయా భర్త నిషాంత్ కనోడియాకు మారిషస్‌లో మాటిక్స్ అనే గ్రూప్ ఉంది. మారిషస్‌లోని ఎస్సార్ గ్రూప్ ప్రధాన కంపెనీ ఎస్సార్ క్యాపిటల్ హోల్డింగ్ కంపెనీ నిషాంత్ కనోడియాకు చెందిన మాటిక్స్ గ్రూప్ కంపెనీ మాటిక్స్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌లో రూ. 163.53 కోట్లు పెట్టుబడి పెట్టింది. మాటిక్స్ ఫర్టిలైజర్స్ షేర్లను భారీగా కొనుగోలు చేసింది. 2010 డిసెంబర్ నుంచి 2012 మార్చి 21వ తేదీ మధ్య కాలంలో చందా కొచర్ భర్తకు చెందిన నూ పవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో మాటిక్స్ గ్రూప్ రూ. 324.37 కోట్లు పెట్టుబడి పెట్టింది. తమ గ్రూప్‌నకు చెందిన ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ అనే కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టారు. ఇది మొదటి పెట్టుబడి కాగా రెండో పెట్టుబడి రుయాల మేనల్లుడైన అనిరుధ్ భూవల్కాకు చెందిన కంపెనీల ద్వారా చందా కొచర్ భర్త కంపెనీకి నిధులు వచ్చాయి. ఎస్సార్ గ్రూప్‌నకు చెందిన ఏషియా మోటార్ వర్క్స్ హోల్డింగ్స్ అనే కంపెనీ దీపక్ కొచర్‌కు చెందిన నూ పవర్ టెక్నాలజీస్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. నేరుగా పెట్టుబడులు పెట్టడం కాకుండా ఎఎండబ్ల్యూ మోటార్స్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా రూ. 197 కోట్ల పెట్టుబడి పెట్టడాన్ని ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నష్టాల్లో కూరుకుపోయిన నూ పవర్ టెక్నాలజీస్‌ని, కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న భారీ రుణాలకు గాను భర్త దీపక్ కొచర్ నుంచి భారీ మొత్తంలో కంపెనీ కొనుగోలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు. ఎస్సార్ స్టీల్ మినెసొటా (అమెరికా) అలగొమా స్టీల్ (కెనడా) కంపెనీల కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన విదేశీ శాఖలు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాయని తెలిపారు. సింగపూర్, బ్రిటన్, న్యూయార్క్‌లోని తమ శాఖల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రుణాలు ఇచ్చిందన్నారు. 2010లో ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు 53 కోట్ల డాలర్ల రుణాన్ని లీడ్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సార్ గ్రూప్‌కు ఇచ్చింది. అలాగే బ్రిటన్‌లోని స్లాన్ఫ్లో రిఫైనరీ కొనుగోలు కోసం మరో 35 కోట్ల డాలర్ల రుణాన్ని ఎస్సార్ ఆయిల్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని అరవింద్ గుప్తా ఆరోపించారు. చందా కొచర్ భర్తకు నూ పవర్ గ్రూప్ పేరుతో పలు కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే నూ పవర్ రెన్యూవల్ ఎనర్జీ కంపెనీలోకి వీడియోకాన్ నిధుల తరలింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. తాజాగా ఇదే కంపెనీలోకి మారిషస్ నుంచి ఎస్సార్ గ్రూప్ నిధులు వచ్చాయనేది అరవింద్ గుప్తా ఆరోపణ. ఎస్సార్ గ్రూప్ ఛైర్మన్ శశిరూయా అల్లుడు నిషాంత్ కనోడియా నుంచి రూ. 324.37 కోట్లు నూ పవర్ గ్రూప్‌లోకి రాగా, రుయాల మేనల్లుడు అనిరుధ్ భూవాల్కా కంపెనీల ద్వారా రూ. 197 కోట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఐసీఐ,ఎస్సార్ గ్రూపు ఖండన అయితే ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. ఎస్సార్ గ్రూప్‌కు తాము ఒక్కరమే రుణం ఇవ్వలేదని, ఏడు బ్యాంకుల కన్సార్టియం రుణాలనిచ్చినట్టు వాదించింది. అటు అరవింద్ గుప్తా ఆరోపణలపై ఎస్సార్ గ్రూప్ స్పందిస్తూ ఉద్దేశపూర్వక ఆరోపణలంటూ తీవ్రంగా ఖండించింది. నూ పవర్లో పెట్టుబడి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్‌తో తమ గ్రూప్‌నకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. త్వరలోనే తమ వైఖరిని బహిరంగంగా తెలియజేస్తామని పేర్కొంది. 1980 నుంచి తాము ఐసీఐసీఐతో లావాదేవీలు నిర్వహిస్తున్నామనీ, తమ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఎస్సార్ గ్రూప్ స్పష్టం చేసింది. అటు మాటిక్స్ గ్రూప్ కూడా తమకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధం లేదని,తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని వెల్లడించింది. ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్‌తో ఎస్సార్‌కు సంబంధం లేదని తెలిపింది. అలాగే కంపెనీ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్న రంగంలో ఉన్నందున నూ పవర్లో తాము పెట్టుబడులు పెట్టామని మాటిక్స్ పేర్కొంది. తరవాత ఆ కంపెనీ నుంచి వైదొలగామని వెల్లడించింది. కాగా వీడియోకాన్-ఐసీఐసీఐ రుణాల కుంభకోణాన్ని 2016 మార్చిలో అరవింద్‌గుప్తా వెలుగులోకి తెచ్చారు. -
చందాకొచ్చర్ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు
-
టాప్ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్‌కు నోటీసులు
న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంకు టాప్ ఉన్నతాధికారి చందాకొచ్చర్‌కు మార్కెట్ రెగ్యులేటరీ సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) నోటీసులు జారీచేసింది. రూ.3250 కోట్ల వీడియోకాన్ రుణ కేసులో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలపై సెబీ ఈ నోటీసులు పంపంది. ఈ విషయాన్ని బ్యాంకు శుక్రవారం తెలిపింది. గురువారమే ఐసీఐసీఐ బ్యాంకు ఈ నోటీసులు అందుకుందని, వీడియోకాన్ గ్రూప్ అండ్ న్యూపర్ రెన్యువబుల్స్ మధ్య డీలింగ్స్ విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుడటంతో పాటు, ఈ రుణ కేసులో సంబంధం ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై స్పందించాలని ఆమెను సెబీ కోరింది. చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు లబ్ది చేకూరేలా క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీచేసిట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. ఈ కేసు విషయంలో సరియైన వివరణను స్టాక్ మార్కెట్లకు బ్యాంకు ఇవ్వలేదని మార్కెట్ రెగ్యులేటరీ భావిస్తోంది. ఎస్సీఆర్ రూల్స్ 2005, రూల్ 4(1) కింద సెబీ ఈ నోటీసును జారీచేసినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. సెబీకి తాము సరియైన వివరణ ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2008లో వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు కలిసి న్యూపవర్ రెన్యువబుల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ నుంచి రూ.3250 కోట్ల రుణం అందుకున్నఆరు నెలలకే నూపవర్‌లోని రూ.64 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.9 లక్షలకే దీపక్‌కు ఇచ్చేసి, ఆయనకే అన్ని బాధ్యతలను అప్పగించేశారు. -
శక్తిమంతమైన భారత నారీమణులు వీరే..
భారత్‌లో అత్యంత శక్తివంతమైన మహిళా వాణిజ్యవేత్తగా ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యను ఫోర్బ్స్ మేగజీన్ మరోసారి ఎంపిక చేసింది. ప్రతియేటా ప్రపంచంలోని వివిద కార్పొరేట్ స్థాయి కంపెనీలకు చెందిన మేటి సీఈవోలను, ఎండీలను గుర్తించే పోర్బ్స్ మేగజిన్ తాజా జాబితాను విడుదల చేసింది. 50 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో ఆరుగురు భారతీమణులకు చోటుదక్కించుకున్నారు. ఈ ఆరుగురిలో తొలిస్థానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుందతి భట్టాచార్య దక్కించుకోగా, ఆ తరువాత వరుసగా ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్/ శ్రీరామ్ క్యాపిటల్ ఎండీ నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ ఫౌండర్ చైర్మన్ ఎండీ కిరణ్ మజుందార్, యాక్సిస్ బ్యాంక్ సీఈవో ఎండీ శిఖా శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఉషా సంగ్వాన్ ఉన్నారు. గతంలో కూడా అరుంధతీ భట్టాచార్య ఇందులో ప్రధమ స్థానం దక్కించుకున్నారు.