న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంకు టాప్ ఉన్నతాధికారి చందాకొచ్చర్‌కు మార్కెట్ రెగ్యులేటరీ సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) నోటీసులు జారీచేసింది. రూ.3250 కోట్ల వీడియోకాన్ రుణ కేసులో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలపై సెబీ ఈ నోటీసులు పంపంది. ఈ విషయాన్ని బ్యాంకు శుక్రవారం తెలిపింది. గురువారమే ఐసీఐసీఐ బ్యాంకు ఈ నోటీసులు అందుకుందని, వీడియోకాన్ గ్రూప్ అండ్ న్యూపర్ రెన్యువబుల్స్ మధ్య డీలింగ్స్ విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుడటంతో పాటు, ఈ రుణ కేసులో సంబంధం ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై స్పందించాలని ఆమెను సెబీ కోరింది.
చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు లబ్ది చేకూరేలా క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీచేసిట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. ఈ కేసు విషయంలో సరియైన వివరణను స్టాక్ మార్కెట్లకు బ్యాంకు ఇవ్వలేదని మార్కెట్ రెగ్యులేటరీ భావిస్తోంది. ఎస్‌సీఆర్ రూల్స్ 2005, రూల్ 4(1) కింద సెబీ ఈ నోటీసును జారీచేసినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. సెబీకి తాము సరియైన వివరణ ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2008లో వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు కలిసి న్యూపవర్ రెన్యువబుల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ నుంచి రూ.3250 కోట్ల రుణం అందుకున్నఆరు నెలలకే నూపవర్‌లోని రూ.64 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.9 లక్షలకే దీపక్‌కు ఇచ్చేసి, ఆయనకే అన్ని బాధ్యతలను అప్పగించేశారు.
Comments
Please login to add a commentAdd a comment