చందా కొచర్(ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వీడియోకాన్ రుణాల జారీ విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌పై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్య తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) చందాకొచర్‌కు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఎటాచ్ చేసింది. ఇందులో ముంబైలోని ఖరీదైన ఆమె ఫ్లాట్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
ఐసీఐసీఐ- వీడియోకాన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్ తనపదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. వీడియోకాన్ గ్రూపునకు సుమారు 3,250 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అయితే తనను పదవినుంచి తొలగించడంపై చందా కొచర్ న్యాయ పోరాటం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment